ప్రతీకాత్మక చిత్రం
ఛత్తీస్‌గఢ్: గృహ హింసకు పాల్పడుతున్నాడని ఓ ఐఏఎస్ అధికారిపై అతని భార్య పోలీసులను ఆశ్రయించింది. కట్నం తీసుకురావాలని, అసహజ శృంగారం చేయాలని వేధిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది.
2014 తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సందీప్ ఘా. 2021లో బాధితురాలితో బిహార్‌లోని దర్భాంగ జిల్లాలో వివాహం జరిగింది. అయితే.. ఇటీవల తన భర్త వేధింపులకు పాల్పడుతున్నాడని ఆయన భార్య పోలీసులను ఆశ్రయించింది. అసహజ శృంగారం, కట్నం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపింది. ఆ అధికారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిందిగా కోర్టు ఆదేశాల మేరకు కోర్బా జిల్లాలో ఆయనపై గృహ హింస కేసు నమోదైంది.
ఇదీ చదవండి: ఇతర మతస్థుడితో కుమార్తె పెళ్లి.. పిండ ప్రదానం చేసిన తల్లిదండ్రులు
Comments
Please login to add a commentAdd a comment