Wife case
-
'అసహజ శృంగారం కోసం వేధిస్తున్నాడు' ఐఏఎస్ అధికారిపై ఆమె ఫిర్యాదు!
ఛత్తీస్‌గఢ్: గృహ హింసకు పాల్పడుతున్నాడని ఓ ఐఏఎస్ అధికారిపై అతని భార్య పోలీసులను ఆశ్రయించింది. కట్నం తీసుకురావాలని, అసహజ శృంగారం చేయాలని వేధిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. 2014 తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సందీప్ ఘా. 2021లో బాధితురాలితో బిహార్‌లోని దర్భాంగ జిల్లాలో వివాహం జరిగింది. అయితే.. ఇటీవల తన భర్త వేధింపులకు పాల్పడుతున్నాడని ఆయన భార్య పోలీసులను ఆశ్రయించింది. అసహజ శృంగారం, కట్నం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపింది. ఆ అధికారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా కోర్టు ఆదేశాల మేరకు కోర్బా జిల్లాలో ఆయనపై గృహ హింస కేసు నమోదైంది. ఇదీ చదవండి: ఇతర మతస్థుడితో కుమార్తె పెళ్లి.. పిండ ప్రదానం చేసిన తల్లిదండ్రులు -
అత్తారింటికి రమ్మంటే .. భర్తపై వేధింపుల కేసు.. చివరకు..
సాక్షి, జడ్చర్ల(మహబూబ్‌నగర్): వరకట్నం, వేధింపుల కింద భార్య తనపై కేసు పెట్టడంతో మనస్తాపానికి గురైన భర్త రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన జడ్చర్లలో మంగళవారం చోటుచేసుకుంది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ కృష్ణ కథనం ప్రకారం.. జడ్చర్లలోని వెంకటరమణ కాలనీకి చెందిన ఉదయ్‌కుమార్(30)కు హైదరాబాద్‌లోని లింగంపల్లికి చెందిన అమ్మాయితో 11నెలల కిందట వివాహమైంది. అయితే హైదరాబాద్‌లో ఉన్న తన భార్యను జడ్చర్లకు రావాల్సిందిగా కోరడంతో ఆమె నిరాకరించింది. దీంతో భార్యతో గొడవపడ్డాడు. జడ్చర్లకు వచ్చేసిన అనంతరం భార్య హైదరాబాద్‌లోని పోలీస్‌స్టేషన్‌లో వరకట్నం, తదితర వేధింపులకు సంబందించి భర్తపై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు ఉదయ్‌కుమార్‌ను అక్కడికి పిలిపించి విచారించారు. మంగళవారం మరోసారి స్టేషన్‌కు రావాలని, కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుందని పోలీసులు చెప్పి పంపారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఉదయ్‌కుమార్ హైదరాబాద్ నుంచి జడ్చర్లకు వచ్చి, పట్టణ సమీపంలో రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి పెద్దఅంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ తెలిపారు. -
భార్య కేసు పెట్టిందని ఆత్మహత్య...
ఉప్పల్ : భార్య కేసు పెట్టడంతో మనస్తాపం చెంది ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఉప్పల్ పోలీసుల కథనం ప్రకారం... రామంతాపూర్ రాంరెడ్డినగర్‌కు చెందిన దుర్గా వినోద్(25) ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మూడేళ్ల క్రితం సౌజన్యతో అతనికి వివాహమైంది. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో భార్య పుట్టింటికి వెళ్లి నల్లకుంట పోలీస్ స్టేషన్లో భర్త వే ధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరికీ ఈనెల 17న కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. ఇదిలాఉండగా.. వినోద్ బుధవారం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడు. మృతుడు రాసిన సూసైడ్ నోట్ దొరికింది. అందులో డబ్బు లేదని అత్తింటివారు నన్ను చిన్న చూపు చూసేవారు. నా భార్యతో వేధింపుల కేసు పెట్టించారు. అంతేకాకుండా వేరేవారితో నాకు వివాహేతర సంబంధం అంటకట్టారు’. దీంతో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నా’... అని రాసి ఉంది. అత్తింటి వారి వేధింపులతోనే తమ కుమారుడు చనిపోయాడని వినోద్ తల్లి బాలమణి ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.