మహిళ వద్ద భారీగా నగదు కాజేసిన ఘనుడు
నిజాంపేట్: ఐఏఎస్ అధికారినని నమ్మించి ఓ మహిళను వివాహం చేసుకోవడమే కాకుండా భారీ మొత్తంలో నగదును తీసుకుని మోసం చేసిన వ్యక్తిని బాచుపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిజాంపేట్ శ్రీనిత్య రెసిడెన్సీకి చెందిన నల్లమోతు సందీప్‌కుమార్(34) సివిల్స్ ఎగ్జామ్‌లో ట్రాపర్‌గా నిలిచి కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారిగా పోస్టింగ్ వచి్చన్నట్లు ఇరుగుపొరుగును నమ్మించాడు. అదే విధంగా ఎనీ్టఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి ఎండీ రేడియాలజీ పూర్తి చేసినట్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించాడు.
ఇది నిజమని నమ్మిన కర్నూలు జిల్లాకు చెందిన అరిమిల్లి శ్రావణి అతన్ని వివాహం చేసుకుంది. పెళ్‌లైన తరువాత సైతం తీరు మార్చుకోని సందీప్‌కుమార్ తన బ్యాంక్ అకౌంట్‌లో రూ.40 కోట్లు ఉన్నాయని, ఇన్‌కమ్ టాక్స్ చెల్లించకపోవడంతో ఫ్రీజ్ అయ్యాయని, రూ.2 కోట్లు కడితే విడుదలవుతాయని భార్యను నమ్మించాడు. ఇది నిజమని నమ్మిన శ్రావణి తన బంధువులు, స్నేహితుల వద్ద రూ.2 కోట్లు అప్పుగా తీసుకుని ఆడపడుచులక్ష్మి సాహితి, అత్తమామలు మాలతి, విజయ్‌కుమార్‌ల బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేయించింది. అంతే కాకుండా శ్రావణి నగలను సైతం సందీప్ కుదువ పెట్టి జల్సాలు చేశాడు.
నకిలీ గుర్తింపుతో మోసం చేశారని గ్రహించిన బాధితురాలు భర్త, అత్తమామలు, ఆడపడచులపై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సందీప్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. నిందితుడిని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన సీఐ ఉపేందర్, ఎస్‌ఐ సత్యనారాయణ, సిబ్బందిలను అభినందిస్తూ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్‌రావు రివార్డులను ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment