Fake officer
-
నేను ప్రత్యేకాధికారిని.. చెప్పినట్టు వినండి
సీటీఆర్ఐ: నేనే ప్రత్యేక అధికారిని.. నేను చెప్పినట్లు వినాలి.. లేదంటే మీ ఉద్యోగాలు ఊడిపోతాయంటూ కొన్ని రోజులుగా ఒక వ్యక్తి హల్చల్ చేస్తున్నాడు. అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లి అక్కడ ఉన్న సిబ్బందిని తనిఖీల పేరిట భయబ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే.. మూడు రోజులుగా కొవ్వూరులోని అరికిరేవులు, చాగల్లు, తాళ్లపూడిలోని 124 అంగన్వాడీ కేంద్రాలకు ఒక వ్యక్తి వచ్చి తాను ప్రత్యేక అధికారిని అని, రికార్డులు తనిఖీ చేయడానికి వచ్చానని సిబ్బందికి తెలిపాడు. అంతే కాకుండా తన మాట వినకపోతే ఉద్యోగాలు పోతాయని బెదిరించాడు. అక్కడున్న అంగన్వాడీ సిబ్బందితో సెలీ్ఫలు దిగమని బలవంతం చేశాడు. తనిఖీల్లో ఇదో భాగమని, సెల్ఫీలు దిగకపోతే తనిఖీలు పూర్తి కాదని బెదిరించాడు. దీంతో హడలిపోయిన అంగన్వాడీ సిబ్బంది ఇతను నిజంగానే ప్రభుత్వ అధికారి అనుకుని తనిఖీలకు అనుమతి ఇచ్చారు. కానీ ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కె.బేబీరాణి దృష్టికి తీసుకు రావడంతో ఆమె అంగన్వాడీ పీడీకి తెలిపారు. చివరికి అతను నకిలీ అధికారి అని గుర్తించారు. వారంతా కలసి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ప్రశాంతికి వినతిపత్రం ఇచ్చి సమస్యను వివరించారు. వెంటనే స్పందించిన కలెక్టర్ అతనెవరో తెలుసుకుని పోలీసు కేసు పెట్టాలని ఆదేశించారు. -
ఐఏఎస్‌నంటూ నమ్మించి వివాహం
నిజాంపేట్: ఐఏఎస్ అధికారినని నమ్మించి ఓ మహిళను వివాహం చేసుకోవడమే కాకుండా భారీ మొత్తంలో నగదును తీసుకుని మోసం చేసిన వ్యక్తిని బాచుపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిజాంపేట్ శ్రీనిత్య రెసిడెన్సీకి చెందిన నల్లమోతు సందీప్‌కుమార్(34) సివిల్స్ ఎగ్జామ్‌లో ట్రాపర్‌గా నిలిచి కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారిగా పోస్టింగ్ వచి్చన్నట్లు ఇరుగుపొరుగును నమ్మించాడు. అదే విధంగా ఎనీ్టఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి ఎండీ రేడియాలజీ పూర్తి చేసినట్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించాడు. ఇది నిజమని నమ్మిన కర్నూలు జిల్లాకు చెందిన అరిమిల్లి శ్రావణి అతన్ని వివాహం చేసుకుంది. పెళ్లైన తరువాత సైతం తీరు మార్చుకోని సందీప్‌కుమార్ తన బ్యాంక్ అకౌంట్లో రూ.40 కోట్లు ఉన్నాయని, ఇన్కమ్ టాక్స్ చెల్లించకపోవడంతో ఫ్రీజ్ అయ్యాయని, రూ.2 కోట్లు కడితే విడుదలవుతాయని భార్యను నమ్మించాడు. ఇది నిజమని నమ్మిన శ్రావణి తన బంధువులు, స్నేహితుల వద్ద రూ.2 కోట్లు అప్పుగా తీసుకుని ఆడపడుచులక్ష్మి సాహితి, అత్తమామలు మాలతి, విజయ్‌కుమార్‌ల బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయించింది. అంతే కాకుండా శ్రావణి నగలను సైతం సందీప్ కుదువ పెట్టి జల్సాలు చేశాడు. నకిలీ గుర్తింపుతో మోసం చేశారని గ్రహించిన బాధితురాలు భర్త, అత్తమామలు, ఆడపడచులపై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సందీప్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. నిందితుడిని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన సీఐ ఉపేందర్, ఎస్ఐ సత్యనారాయణ, సిబ్బందిలను అభినందిస్తూ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్‌రావు రివార్డులను ప్రకటించారు. -
TS: సీఎంవో కార్యాలయంలో కేటుగాడు.. ప్రోటోకాల్ ఆఫీసర్ పేరుతో..
సాక్షి, హైదరాబాద్: ల్యాండ్ సెటిల్మెంట్లు, అసైన్డ్ ల్యాండ్ రీ అసైన్డ్ చేస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ సీఎం పబ్లిసిటీ సెల్లో దొంగ ప్రోటోకాల్ ఆఫీసర్‌గా అవతారం ఎత్తిన ప్రవీణ్ సాయి.. పలువురికీ సీఎం ప్రోటో కాల్ నకిలీ స్టిక్కర్స్ ఇప్పించాడు. హోం మినిస్టర్, మినిస్టర్స్ లెటర్ హెడ్స్‌తో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసాలకు తెర తీశాడు. వనస్థలిపురంలో నివాసం ఉంటున్న అత్తిలి ప్రవీణ్ సాయి.. 6 నెలల క్రితం ప్రభుత్వ పైరవీలు చేస్తూ పలువురికి శఠగోపం పెట్టాడు. అతని అరెస్ట్ చేసిన ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు.. ఇన్నోవా కార్, సెల్ ఫోన్‌ను సీజ్ చేశారు. ఇదీ చదవండి: ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దు -
గుంటూరులో నకిలీ ఐటీ అధికారుల హల్ చుల్
-
నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ ఇంట్లో సోదాలు
-
ఢిల్లీ: సీబీఐ ఎదుట మంత్రి గంగుల, ఎంపీ రవిచంద్ర హాజరు
-
నకిలీ ఐపీఎస్ అధికారి శ్రీనివాస్ ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు
న్యూఢిల్లీ: నకిలీ ఐపీఎస్ అధికారి శ్రీనివాస్ సీబీఐ ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. గత ఐదు సంవత్సరాలుగా ఢిల్లీలో మకాం వేసిన శ్రీనివాస్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అంటూ మోసాలు చేస్తున్నట్లు సీబీఐ తన ఎఫ్ఐఆర్లో పేర్కొంది. సీబీఐ, ఈడీ కేసులను సెటిల్మెంట్లు చేయిస్తానని వసూళ్లు చేసినట్లు తెలిపింది. ఢిల్లీలోని తమిళనాడు, మధ్యప్రదేశ్ భవన్లను అడ్డగా చేసుకొని ఈ దందాలకు పాల్పడినట్లు వెల్లడించింది. తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల రాజకీయ నాయకులతో టచ్‌లో ఉన్నట్లు పేర్కొంది. ఢిల్లీలో పనులు చక్కబెట్టి కోట్లలో రూపాయలు వసూలు చేసినట్లు వెల్లడించింది. ఇప్పటికే నకిలీ అధికారిపై పలు కేసులు నమోదు కాగా.. ఏపీసీ 419, 420 కింద కేసులు నమోదు చేసింది. గత నెల 26న సీబీఐ ఏసీబీ వింగ్ శ్రీనివాస్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. చదవండి: సీబీఐ విచారణకు హాజరైన మంత్రి గంగుల సీబీఐ సీనియర్ ఆఫీసర్నని చెప్పి యూసుఫ్ గూడకు చెందిన మేలపాటి చెంచునాయుడిని మోసం చేసినట్లు తెలిపింది. అలాగే ఢిల్లీలో వినయ్ హాండా కుమారుడికి సీబీఐలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసినట్లు పేర్కొంది. మార్గానా వెంకటేశ్వర రావు, రవికి చెందిన 2000 వాహనాలను ఢిల్లీలో నో ఎంట్రీ స్థలంలోకీ అనుమతించేలా పోలీసులతో మాట్లాడాతానని పైసలు వసూలు చేసినట్లు వెల్లడించింది. పనులు చేయడానికి ప్రభుత్వ అధికారులకు ఖరీదైన బహుమతులు ఇవ్వాలంటూ బాధితుల వద్ద భారీ ఎత్తున డబ్బు దండుకున్నట్లు తెలిపింది. కాగా సీబీఐ అధికారిగా చలామణీ అవుతూ పనులు చేయిస్తానని చెప్పి అనేకమంది దగ్గర డబ్బులు దండుకుంటున్న శ్రీనివాస్‌ని మూడు రోజుల క్రితం సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విశాఖపట్నంలోని చినవాల్తేరు కిర్లంపూడికి కు చెందిన ఇతన్ని ఢిల్లీలోని తమిళనాడు భవన్ల్ సీబీఐ అధికారులు అతుపులోకి తీసుకున్నారు. ఐపీఎస్ అధికారినని, సీబీఐ ప్రధాన కార్యాలయంలో అదనపు డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నానని చెప్పుకొని అక్రమాలకు పాల్పడుతుండటంతో అధికారులు అతన్ని పట్టుకున్నారు. -
సీబీఐ విచారణకు హాజరైన మంత్రి గంగుల
న్యూఢిల్లీ: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ ఎంపీ గాయత్రి రవి గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ కేసులో వీరిద్దరూ సీబీఐ విచారణకు హాజరయ్యారు. శ్రీనివాస్ అరెస్ట్ వ్యవహారంలో సీఆర్పీసీ 160 ప్రకారం సాక్షులుగా హాజరవ్వాలని గంగుల, గాయత్రి రవికి సీబీఐ బుధవారం నోటీసులు జారీ చేసింది. కాగా కొవ్విరెడ్డి శ్రీనివాస్ గత మూడేళ్లుగా నకిలీ ఐపీఎస్‌గా చలామణి అవుతూ ఢిల్లీ స్థాయిలో రాయబారాలు సాగిస్తూ అనేకమందిని మోసం చేస్తున్నట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. దీంతో మూడు రోజుల క్రితం ఢిల్లీలోని తమిళనాడు భవన్లో శ్రీనివాస్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన మున్నురుకాపు ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి గంగుల, ఎంపీ గాయత్రి రవిని శ్రీనివాస్ ఫోటోలు దిగినట్లు సమాచారం. అలాగే ఓ గెట్ టూ గెదర్ కార్యక్రమంలోనూ వీరిని శ్రీనివాస్ కలిసినట్లు సీబీఐ చెబుతోంది. ఈ క్రమంలో వీరిద్దరికి శ్రీనివాస్‌తో ఉన్న సంబంధాలపై సీబీఐ ఆరా తీస్తోంది. నాకు నోటీసులు రాలేదు: బొంతు రామ్మోహన్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఫోన్స్ స్విచ్ఛాఫ్ వస్తుండటంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేగాక నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ కేసులో రామ్మోహన్‌ను సీబీఐ అదుపులోకి తీసుకుందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారంపై బొంతు రామ్మోహన్ స్పందించారు. హైదరాబాద్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎక్కడికీ వెళ్లలేదని అన్నారు. నకిలీ ఐపీఎస్ శ్రీనివాస్‌ను ఓ ఫంక్షన్లో కలిసినట్లు బొంతు రామ్మోహన్ తెలిపారు. తనకు సీబీఐ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని తెలిపారు. కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. సీబీఐ నోటీసులు వస్తే సమాధానం ఇస్తానన్నారు. చదవండి: Hyderabad: ఈ ప్రాంతాల్లో జనవరి 31 వరకు ట్రాఫిక్ ఆంక్షలు -
చదివింది ఏడో తరగతి.. వామ్మో ఈమె మామూలు లేడీ కాదు.. షిఫ్ట్ కారులో వచ్చి..
నల్లజర్ల(తూర్పుగోదావరి జిల్లా): ఆమె చదివింది ఏడో తరగతి. అయినా వివిధ శాఖల అధికారినంటూ ప్రజలను బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడింది. శనివారం దూబచర్లలో బేకరీ, భోజన హోటల్‌ను చెక్ చేసి వసూళ్లకు పాల్పడుతుండగా సివిల్ సప్లయిస్ డీటీ సుజాత, వారి సిబ్బంది ఈ ముఠాను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తాడేపల్లిగూడేనికి చెందిన కాళ్ల రమాదేవి నేషనల్ కన్సూ్యమర్ రైట్స్ కమిషన్ మహిళా చైర్‌పర్సన్‌గా ఐడీ కార్డుతో తన షిఫ్ట్ డిజైర్ కారులో వివిధ ప్రాంతాలలో సివిల్ సప్లయిస్ అధికారిగా, ఫుడ్ ఇన్స్పెక్టర్గా వ్యవహరిస్తూ హోటళ్లు, బేకరీలపై దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తామని బెదిరించి డబ్బులు దండుకుంటోంది. చదవండి: ఓయో గదుల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. జంటల వీడియోలు రికార్డ్ చేస్తూ.. ఈ విషయం సివిల్ సప్లయిస్ అధికారుల దృష్టికి రాగా కొంతకాలంగా ఆమె కోసం గాలిస్తున్నారు. శనివారం దూబచర్లలో బెంగళూరు బేకరీకి వెళ్లి గృహ వినియోగ గ్యాస్ వ్యాపారానికి వినియోగిస్తున్నారంటూ బెదిరించి రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా యజమాని ప్రదీప్ రూ.3 వేలు ఇచ్చాడు. అదే గ్రామంలో శివాలయం దగ్గర భోజన హోటల్‌కు వెళ్లి వంటకు వినియోగిస్తున్న రెండు గ్యాస్ సిలిండర్లు సీజ్ చేస్తానని బెదించింది. కేసు లేకుండా చేయాలంటే రూ.5 వేలు ఇవ్వాలంది. యజమాని ముగ్గాల సర్వేశ్వరరావు రూ.2 వేలు ఇచ్చాడు. ఈ వ్యవహారాన్ని గమనించిన ఆ గ్రామ వీఆర్ఏ రవి తమ సివిల్ సప్లయిస్ డీటీ సుజాతకు సమాచారం అందించి నిందితురాలిని పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్న ద్వారకా తిరుమలకు చెందిన చెల్లా ఏసు తప్పించుకుని పారిపోయాడు. పారిపోయిన చెల్లా ఏసుపై, ఆమె కారు డ్రైవరు దూబచర్ల గాంధీకాలనీకి చెందిన బోడిగడ్ల బాలరాజును, నకిలీ అధికారి రమాదేవిపై సీఐ లక్ష్మణరెడ్డి ఆధ్వర్యంలో ఏఎస్ఐ ఆదినారాయణ కేసు నమోదు చేశారు. -
ఘరానా మోసం.. ఐటీ అధికారినంటూ టోకరా
-
ఘరానా మోసం.. ఐటీ అధికారినంటూ టోకరా
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఘరానా మోసం జరిగింది. ఐటీ అధికారినంటూ జువెల్లరీ షాపు యజమానికి టోకరా వేశాడు. ఆన్లైన్లో మనీ సెండ్ చేశానంటూ నగలతో ఆ కేటుగాడు ఉడాయించాడు. దీంతో ఆ షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
సినిమా స్టోరీని తలపించే మోసాలు, ఆఖరికి తల్లిదండ్రులను కూడా
కోల్‌కతా: ఒంటిపై మడత నలగని సూటు, బూటు. ఐఏఎస్ అధికారిగా దర్పం. నీలి బుగ్గకారులో ప్రయాణం. ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో పరిచయాలు. ప్రజా సేవకుడిగా ఫోజులు. మున్సిపల్ కార్పొరేషన్లో కీలక అధికారినంటూ జనాన్ని మభ్యపెట్టడం. ప్రజల్లో ‘గుర్తింపు’కోసం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఓ మోసగాడు సాగించిన లీలలు ఇవీ. సొంత డబ్బులతో ఉత్తుత్తి కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలు నిర్వహించి, చివరికి పోలీసులకు దొరికిపోయాడు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడాడంటూ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. సదరు మాయగాడు ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు. పశ్చిమ బెంగాల్‌లోని సీల్దా ప్రాంతానికి చెందిన దేవాంజన్ దేవ్ వయసు కేవలం 28 సంవత్సరాలు. అయితేనేం మోసాల్లో ఆరితేరిపోయాడు. అతడి తండ్రి మనోరంజన్ దేవ్ బెంగాల్ ఎక్సైజ్ శాఖలో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేసి, పదవీ విరమణ పొందారు. దేవాంజన్ చారుచంద్ర కాలేజీలో జువాలజీ సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. కలకత్తా యూనివర్సిటీలో జెనటిక్స్లో పీజీ చదవడానికి ప్రవేశం పొందాడు. కానీ, చదువు మధ్యలోనే అటకెక్కింది. 2014లో సివిల్ సర్వీసెస్ పరీక్ష రాశాడు. ప్రిలిమినరీ పరీక్షలోనే విజయం సాధించలేకపోయాడు. అయినప్పటికీ పరీక్షల్లో నెగ్గానని తన తల్లిదండ్రులను నమ్మించాడు. ఐఏఎస్ అధికారిగా ట్రైనింగ్ కోసం ముస్సోరి వెళ్తున్నానని చెప్పాడు. కానీ, ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలో చేరాడు. ఆ సమయంలో కొన్ని పాటల ఆల్బమ్‌లు రూపొందించాడు. 2017లో ఇంటికి తిరిగివచ్చాడు. ట్రైనింగ్ పూర్తయ్యిందని చెప్పాడు. రాష్ట్ర సచివాలయంలో తనకు ఉద్యోగం వచ్చిందని బుకాయించాడు. అప్పటి నుంచి మోసాలే వృత్తిగా జీవనం సాగించాడు. కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ అధికారినంటూ నకిలీ లెటర్హెడ్లు, గుర్తింపు కార్డులు సృష్టించాడు. కార్పొరేషన్ ఈ–మెయిళ్లను పోలిన ఈ–మెయిళ్లు సైతం రూపొందించుకున్నాడు. పోర్జరీ పత్రాలతో బ్యాంకు ఖాతాలు తెరిచాడు. అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ పేరిట ఓ కంపెనీ స్థాపించాడు. కోల్‌కతాలోని కస్బా ప్రాంతంలో ఆఫీసు ప్రారంభించాడు. తాను పెద్ద అధికారినని, ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ జనానికి చెప్పేవాడు. దీంతో ఇరుగు పొరుగు, బంధుమిత్రులు గొప్పగా చూడసాగారు. దేవాంజన్కు అమితమైన గౌరవం ఇచ్చారు. మోసాన్ని పసిగట్టిన మిమీ చక్రవర్తి 2020లో కరోనా వైరస్ వ్యాప్తిని దేవాంజన్ దేవ్ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. శానిటైజర్లు, మాస్కులు, పీపీఈ కిట్లు, గ్లౌజ్‌లు సేకరించి, ప్రముఖుల చేతుల మీదుగా ప్రజలకు పంపిణీ చేశాడు. ఈ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశాడు. దీంతో అతడికి మరింత ప్రచారం లభించింది. దేవాంజన్ ఇటీవల సొంత డబ్బులతో కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలు నిర్వహించాడు. వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామంటూ ప్రచారం సాగించాడు. ఓ వ్యాక్సినేషన్ కేంద్రానికి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, సినీ నటి మిమీ చక్రవర్తిని ఆహ్వానించాడు. ఆమె నకిలీ టీకా తీసుకొని మోసపోయింది. అనారోగ్యానికి గురైంది కూడా. దాంతో ఆమెకు అనుమానం వచ్చింది. కోల్‌కతా మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసింది. అధికారులు రంగంలోకి దిగారు. దేవాంజన్ గుట్టును రట్టు చేశారు. అతడు నిర్వహించే వ్యాక్సినేషన్ కేంద్రాల్లో అసలైన కరోనా టీకాలకు బదులు అమికాసిన్ అనే యాంటీబయాటిక్ ఇస్తున్నట్లు గుర్తించారు. దాదాపు 2,000 మందికి ఈ ఇంజెక్షన్లు ఇచ్చినట్లు తేల్చారు. పోలీసులు అతడిపై హత్యాయత్నం కేసు పెట్టారు. -
ఫేక్ ఆఫీసర్..! రహస్యంగా తీసిన వీడియోలతో బ్లాక్మెయిల్
సాక్షి, చెన్నై: సామాజిక మాధ్యమాల ద్వారా తాను పోలీసు అధికారిగా పేర్కొంటూ మహిళలకు లైంగిక వేధింంపులు ఇస్తున్న ప్రబుద్ధుడి గట్టును భార్య బయటపెట్టింది. మంగళవారం మదురై కమిషనరేట్‌లో ఆధారాలతో సహా సమర్పించి పట్టించింది. గత ప్రభుత్వంలో ఓ మంత్రి వద్ద ముత్తు గన్‌మెన్‌గా పనిచేశాడు. అయితే తానో పోలీసు అధికారిగా నమ్మించి ఏడాది క్రితం సుభాషిణిని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వీరు మదురై రిజర్వ్ బ్యాంక్ కాలనీ పోలీసు క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. పెళ్లయిన తర్వాత భర్త గురించి తెలిసినా సర్దుకుపోయింది. అయితే ఓ రోజు భర్త సెల్ ఫోన్ తీసి చూడగా మహిళలకు ఇస్తున్న బెదిరింపులు వెలుగు చూశాయి. దీంతో భర్తతో గొడవ పడి పుట్టింటికి వెళ్లి పోయింది. మళ్లీ ఇలాంటి పనులు చేయనని లిఖిత పూర్వకంగా రాసి ఆమెను కాపురానికి తీసుకొచ్చాడు. కొద్ది రోజులు బాగున్న ముత్తు మళ్లీ పాత ఫందాను కొనసాగించాడు. మహిళలను హోటళ్లకు తీసుకెళ్లడం, వారితో గడిపిన దృశ్యాలను చిత్రీకరించి బెదిరించడం చేస్తుండేవాడు. మదురై కమిషనరేట్‌లో ఫిర్యాదు అధికారినని చెప్పి తనను మోసం చేయడమే కాకుండా మహిళల జీవితాలతో ఆడుకుంటున్న భర్తపై మదురై కమిషనరేట్‌లో భార్య సుభాషిణి మంగళవారం ఫిర్యాదు చేసింది. ఫేక్‌ఐడీలతో తన భర్త సాగిస్తున్న లైంగిక వేధింపులు, మహిళలతో చాటింగ్‌లు, బెదిరింపులు, వసూళ్లపై ఆధారాలతో సహా పోలీసు ఉన్నతాధికారులకు సమర్పించింది. మహిళలపై తన భర్త సాగిస్తున్న తీరుతో న్యాయం కోసం కమిషనరేట్‌ను ఆశ్రయించినట్టు సుభాషిణి తెలిపారు. గతంలో తాను ఇదే రకంగా ఓ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, మంత్రి గన్‌మెన్ కావడంతో అక్కడి సిబ్బంది వెనక్కు తగ్గారని, ఇక తన భర్త తప్పించుకోలేడని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదును ఉన్నతాధికారులకు పంపించి విచారణ చేస్తున్నారు. చదవండి: కన్నతల్లి కర్కశత్వం: బతికుండగానే బావిలోకి తోసేసింది -
కట్నం వద్దంటాడు, కోట్లు లాగేస్తాడు!
సాక్షి, హైదరాబాద్: చదివింది టెన్త్.. కానీ, అతడి మోసాల స్ట్రెన్త్ అంతాఇంతాకాదు. ఆర్మీ మేజర్‌నంటూ నమ్మబలుకుతాడు. దర్జాగా పెళ్లి చూపులకు వెళ్తూ కట్నానికి వ్యతిరేకినంటూ కలరింగ్ ఇస్తాడు. ఆపై అర్జంట్ అవసరం ఉందంటూ భారీ మొత్తంలో వసూలు చేసేవాడు. ఈవిధంగా దాదాపు 17 మంది నుంచి రూ.8.25 కోట్లు కాజేశాడు. ఇదీ ఎంఎస్ చౌహాన్‌గా చెప్పుకున్న నకిలీ ఆర్మీ మేజర్ ముదావత్ శ్రీను నాయక్ ఘరానా మోసం. విశ్వసనీయ సమాచారం మేరకు ఆ నిందితుడిని హైదరాబాద్ ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావుతో కలిసి శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్వాల్ అంజనీకుమార్ పూర్తి వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లాలోని పలుకురాళ్ల తండాకు చెందిన శ్రీను నాయక్ 2002లో అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ఆమె గుంటూరులోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో సూపరింటెండెంట్. శ్రీనుకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. కొన్ని రకాల వైద్య కోర్సులు చేస్తే తేలిగ్గా ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని, అందుకు అవసరమైన కోచింగ్ తీసుకోవాలని భార్య సూచించడంతో 2014లో నగరానికి వచ్చి ఉప్పల్‌లో ఓ రూమ్ అద్దెకు తీసుకున్నాడు. ఈ క్రమంలో విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డాడు. అందుకు అవసరమైన డబ్బు కోసం మోసాలబాట పట్టాడు. (చదవండి: మైనర్‌తో అసభ్య చాటింగ్) సోషల్‌మీడియా ద్వారా ప్రచారం... ఆర్మీలోని ఈఎంఈ విభాగంలో మేజర్‌గా పని చేస్తున్నానంటూ చెప్పుకున్న శ్రీను నాయక్ ఆ యూనిఫాంలో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి ప్రచారం చేసుకున్నాడు. ఆర్మీ మేజర్‌నంటూ ఎంఎస్ చౌహాన్ పేరిట నకిలీ గుర్తింపుకార్డును సృష్టించాడు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ చేశానని, ఐఐటీ చెన్నై పట్టభద్రుడినని చెప్పుకుంటూ తిరిగేవాడు. వివిధ మ్యాట్రిమోనియల్ సైట్స్, మ్యారేజ్‌బ్యూరోల ద్వారా తమ సామాజిక వర్గానికి చెందిన అవివాహిత యువతుల వివరాలు సేకరించేవాడు. ధనవంతులను టార్గెట్‌గా చేసుకుని ఖరీదైన కారులో పెళ్లిచూపులకు వెళ్లేవాడు. తనకు కట్నకానుకలు వద్దని నమ్మించేవాడు. ఆ తర్వాత అర్జంట్ అవసరం వచ్చిందని, ఆదాయపుపన్ను క్లియర్ చేయాలని అందినకాడికి దండుకుని వారికి చిక్కకుండా తప్పించుకునేవాడు. గుట్టురట్టు చేసిన ‘ఐఐటీ చెన్నై’... ఈ ఘరానా మోసగాడు తన భార్యకూ టోకరా వేశాడు. అర్జంటుగా ఐటీ కట్టాల్సి ఉందంటూ ఓసారి రూ.16 లక్షలు తీసుకున్నాడు. పెళ్లి పేరుతో ఎర వేసి ఓ ఎంబీబీఎస్ డాక్టర్ నుంచి రూ.56 లక్షలు, సచివాలయ ఉద్యోగిని నుంచి రూ.52 లక్షలు, పీజీ పూర్తి చేసిన యువతి నుంచి రూ.70 లక్షలు కాజేశాడు. ఇటీవల వరంగల్‌కు చెందిన ఓ ఎంబీఏ పూర్తి చేసిన యువతినీ ఇలానే నమ్మించాడు. ఆమె తండ్రి నుంచి రూ.2.01 కోట్లు కాజేశాడు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విద్యనభ్యసించిన యువతితో శ్రీను నాయక్‌కు ఇటీవల పరిచయం ఏర్పడింది. ఆమె చెన్నై ఐఐటీలో ఇతడి గురించి ఆరా తీయగా అతడు చెప్పేది అబద్ధం అని తేలింది. ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ఉప్పందడంతో ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వరరావు నేతృత్వంలో పోలీసులు వలపన్ని అతడిని శనివారం పట్టుకున్నారు. వరంగల్‌కు చెందిన యువతితో ఇతడికి ఆదివారం నిశ్చితార్థం జరగాల్సి ఉంది. శ్రీను నాయక్ ఖరీదు చేసిన సైనిక్‌పురిలోని ఓ విల్లా, మూడు లగ్జరీ కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతడిపై వరంగల్, రాచకొండల్లో రెండు కేసులు ఉన్నాయి. నిందితుడిని బొల్లారం పోలీసులకు అప్పగించారు. ‘ఇలా ఎవరైనా పెళ్లి సంబంధాల కోసం వస్తే వివిధ కోణాల్లో పూర్వాపరాలు పరిశీలించాలి. ఏమాత్రం అనుమానం వచ్చినా పోలీసుల సహాయం కోరండి’అని కొత్వాల్ అంజనీకుమార్ పేర్కొన్నారు. (చదవండి: టెన్త్ చదివి.. డాక్టర్‌నంటూ వైద్యం) -
రిటైర్డ్ ఐఏఎస్ పేరుతో జనానికి టోపీ; అరెస్టు
-
రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి అంటూ..
సాక్షి, హనుమాన్ జంక్షన్: రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి అంటూ వైద్యుల వద్ద నగదు వసూలు చేస్తున్న ఓ మహిళను కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నూజివీడు డిఎస్పీ శ్రీనివాసులు నిందితురాలిని మీడియా ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ గుంటూరు జిల్లాకు చెందిన పెమ్మడి విజయలక్ష్మి(65)అనే మహిళ రిటర్డ్ ఐఏఎస్ అధికారిణి సుజాత రావు పేరు చెప్పి తాను తిరుపతి వెంకన్న దర్శనానికి వెళుతున్నానని డాక్టర్ పేరు మీద తిరుపతిలో గరుడ పూజ చేయిస్తానని 3500 రూపాయిలు నగదు వసూలు చేస్తోంది. ఈ నెల 8వ తేదీన హనుమాన్ జంక్షన్‌లోని సీతా మహాలక్ష్మి నర్శింగ్ హోంకు వెళ్లి పూజ నిమిత్తం 3500 రూపాయిలు ఇవ్వాలని కోరింది. (చదవండి: అగ్నిప్రమాదం : రమేష్ ఆసుపత్రి నిర్లక్ష్యం వల్లే!) అయితే ఆ ఆస్పత్రి వైఎస్సార్ సీపీ రాష్ట్ర పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు డా: దుట్టా రామ చంద్రరావుది కావడంతో సిబ్బందికి అనుమానం వచ్చి దుట్టా తనయుడు రవి శంకర్‌కు సమాచారం అందించారు. ఐఏఎస్ అధికారిణి సుజాత రావుకు ఫోన్ చేయగా తాను హైదరాబాద్ లో ఉన్నానని చెప్పారు. ఆయన ఆసుపత్రికి వచ్చేసరికి మహిళ అక్కడ నుంచి ఉడాయించడంతో రవిశంకర్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విజయలక్ష్మి కోసం గాలింపు చేపట్టారు. గత రాత్రి నకిలీ ఐఏఎస్ ఆచూకీ కనుగొన్న పోలీసులు ఆమెను సోమవారం ఉదయం అరెస్టు చేశారు. కేసు నమోదు చేసిన గంటల వ్యవధిలోనే నిందితురాలిని అరెస్టు చేయడంతో హనుమాన్ జంక్షన్ సీఐ రమణ, ఎస్ఐ మదీనా భాష, ఇతర సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. విజయలక్ష్మి గతంలో ఐఏఎస్ అధికారిని సుజాత రావు పేరు చెప్పి నందిగామ, హైదరాబాద్, విజయవాడ, గన్నవరం ఏరియాల్లో నగదు వసూలు చేసినట్లు డిఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. (పోరాడి ఓడింది..!) -
నకిలీ ఏసీబీ అధికారి అరెస్టు
పాతపట్నం (శ్రీకాకుళం జిల్లా): నకిలీ ఏసీబీ అధికారిగా నగదు వసూళ్లకు పాల్పడుతున్న మండలంలోని పాశిగంగుపేటకు చెందిన గేదెల మురళీకృష్ణను, అతనికి సహకరించిన పాతపట్నం సీహెచ్‌సీ కాంట్రాక్టు ల్యాబ్ టెక్నీషియన్ వాడ తిరుపతిరావును పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఆదివారం స్థానిక పోలీసు స్టేషన్లో ఎస్ఐ టీ రాజేష్ వెల్లడించిన వివరాల ప్రకారం... ఫిబ్రవరి 27న పాతపట్నం సామాజిక ఆస్పత్రి (సీహెచ్‌సీ)లో ఏసీబీ సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో ఆస్పత్రి బ్లడ్‌బ్యాంక్ ఇన్చార్జి, ఎస్ఆర్ మెడికల్ ల్యాబ్ నిర్వాహకుడు బమ్మిడి అప్పలనాయుడు, కాంట్రాక్టు ల్యాబ్ టెక్నీషియన్, ఏఎంసీ ల్యాబ్ నిర్వాహకుడు వాడ తిరుపతిరావులపై కేసులు నమోదు చేశారు. ఈ కేసు విషయంలో ఈ నెల 1న ఇద్దరిని శ్రీకాకుళం ఏసీబీ కార్యాలయంలో విచారణ కోసం పిలిపించారు. ఈ నెల 2న ఉదయం అప్పలనాయుడుకు ఫోన్ చేసి రూ.2.50 లక్షలు ఇస్తే కేసు లేకుండా చేస్తానంటూ మురళీకృష్ణ డిమాండ్ చేశాడు. అదే రోజు సాయంత్రం మరలా ఫోన్ చేసి, అరెస్టు చేయాలా డబ్బులు తెస్తావా? అని ఫోన్లో బెదిరించాడు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు నిందితుడి ఫోన్ నంబర్‌ను ట్రాక్ చేశారు. ఈ నెల 4న మళ్లీ ఫోన్ చేసి డబ్బులు పట్టుకుని జలుమూరు మండలం చల్లవానిపేట కూడలికి రావాలని ఆదేశించాడు. వెంటనే పోలీసులు బాధితుడిని తొలుత పంపించి చాకచక్యంగా వెళ్లి పట్టుకుని పాతపట్నం పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. తమదైనశైలిలో రోజంతా విచారించగా వాడ తిరుపతిరావు ప్రోద్బలంతో చేసినట్లు ఒప్పుకున్నాడు. దాంతో నిందితుడి ఫోన్ కాల్ డేటా ఆధారంగా నిర్ధారణకు వచ్చి శనివారం రాత్రి అతడిని అదుపులోకి తీసుకున్నారు. పాతపట్నం సీహెచ్‌సీలో కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్ రిపోర్టులు రావడంతో కొటబొమ్మాళి కోర్టు జడ్జి కే ప్రకాష్‌బాబు ఎదుట హాజరు పరిచారు. 14 రోజులు రిమాండ్ విధించారు. పాతపట్నం సబ్‌జైలుకు నిందితులను తరలించామని ఎస్ఐ తెలిపారు. -
‘నేను స్పెషలాఫీసర్‌ని.. ఇది నా ఐడీ’
సాక్షి, సీటీఆర్ఐ(రాజమహేంద్రవరం) : సచివాలయాల పరిశీలనకు వచ్చిన ప్రత్యేక అధికారినంటూ ఓ వ్యక్తి స్థానిక అర్బన్ తహసీల్దార్ కార్యాలయం, వార్డు సచివాలయాల్లో సోమవారం హల్చల్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి రాజమహేంద్రవరం అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికి బాలాజీపేటకు చెందిన 40వ వార్డు సచివాలయ కార్యదర్శులను వెంటబెట్టుకుని ఓ వ్యక్తి వచ్చాడు. నేరుగా తహసీల్దార్ గదిలోకి వెళ్లి ఆయన సీట్లో కూర్చున్నాడు ‘‘నేను సీఎం కార్యాలయం నుంచి వచ్చిన స్పెషలాఫీసర్‌ను, ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా నియమించింది’’ ఇది నా ఐడీ అని చూపించాడు. తన పేరు ఉపేంద్ర రోషన్ అని తన సెల్ నంబర్: 6301814060గా చెప్పాడు. తహసీల్దార్ సుస్వాగతం అందుబాటులో లేకపోవడంతో అక్కడే ఉన్న డిప్యూటీ తహసీల్దార్ బాపిరాజును పిలిచి వివరాలు అడిగాడు. బుధవారం మళ్లీ వస్తానని అప్పటికి అన్ని రికార్డులు సిద్ధం చేసి ఉంచాలని చెప్పి వెళ్లిపోయాడు. (టార్గెట్ వైఎస్సార్సీపీ! ) సందేహం కలిగిన డిప్యూటీ తహసీల్దార్ బాపిరాజు ప్రభుత్వ కార్యాలయానికి ఫోన్ చేసి ఆరా తీయగా అటువంటి వ్యక్తి ఎవరూ లేరని చెప్పారు. దీంతో సాయంత్రం ఆ వ్యక్తికి ఫోన్ చేసి తహసీల్దార్ కార్యాలయానికి రావాలని కోరగా, తొలుత వీలుపడదని చెప్పాడు. అయితే డిప్యూటీ తహసీల్దార్ గట్టిగా చెప్పడంతో రాత్రి ఏడు గంటలకు కార్యాలయానికి వచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న టూటౌన్ పోలీసులు అతడిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇతడు రాజవొమ్మంగి మండలం లబ్బర్తి గ్రామానికి చెందిన వాడని, బీఎడ్ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడని టూటౌన్ సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. నాలుగురోజులుగా రాజమహేంద్రవరంలో పలు సచివాలయాలకు వెళ్లి, తాను సీఎం పేషీ నుంచి వచ్చానని అక్కడి సిబ్బందిపై హడావుడి చేస్తూ వస్తున్నాడని తెలిపారు. జిల్లాలోని రెవెన్యూ, కలెక్టర్ కార్యాలయానికి సంబంధించిన వారి ఫోన్ నంబర్లన్నీ అతడి ఫోన్లో ఉండడం కొసమెరుపు. నకిలీ అధికారిని అరెస్ట్ చేసిన పోలీసులు -
ఇన్కమ్ ట్యాక్స్ నకిలీ అధికారి అరెస్ట్
కైకలూరు(కృష్ణా): ఇన్కమ్ ట్యాక్స్ అధికారినంటూ ఓ చేపల చెరువు వ్యాపారిని బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కృష్ణా జిల్లా కైకలూరులో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని ఓ చేపల చెరువు వ్యాపారిని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం కోమరోలు గ్రామానికి చెందిన సురేశ్ కుమార్ ఆదాయపు పన్ను అధికారినంటూ భూమి విక్రయం విషయంలో బెదిరించాడు. దీంతో సదరు వ్యక్తి పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం బయపడింది. పోలీసులు సురేశ్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
నకిలీ అధికారి నయా వంచన
ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌నంటూ హల్చల్ అంగన్వాడీ కేంద్రాల్లో నకిలీ అధికారి హడావుడి అంగన్వాడీ టీచర్ నానుతాడు, మరో టీచర్ కుమారుడి బైక్‌తో పరార్ గుడివాడ : నేను ఫుడ్ ఇన్స్పెక్టర్ను.. హైదరాబాద్ నుంచి వచ్చాను.. అన్ని అంగన్వాడీ కేంద్రాలు తనిఖీ చేసి రిపోర్టు ఇవ్వాలి.. అం టూ ఓ వ్యక్తి శనివారం పెదపారుపూడి, పామ ర్రు మండలాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో హడావుడి చేశాడు. వానపాముల కేంద్రం టీచర్‌ను బైక్‌పై తన వెంట ఉదయం నుంచి తి ప్పాడు. ఆమె వద్ద ఉన్న బంగారు నానుతాడుతోపాటు జువ్వనపూడికి చెందిన మ రో టీచర్ కుమారుడి బైక్ తో పరారయ్యా డు. ఈ ఘటన పై బాధితురాలు కంకిపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నకిలీ అధికారి కంకిపాడు మండలం దావులూరు వాసిగా అనుమానిస్తున్నారు. బాధితుల కథ నం.. ‘సాక్షి’ సేకరించిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పెదపారుపూడి మండలం వానపాములలోని అంగన్వాడీ కేంద్రానికి శనివారం ఉద యం 11.30 గంటల సమయంలో ఓ వ్యక్తి మోటార్‌సైకిల్‌పై వచ్చాడు. తాను ఫుడ్ ఇన్స్పెక్టర్నని, హైదరాబాద్ నుంచి వచ్చానని అక్కడ ఉన్న టీచర్ పద్మలతకు చెప్పాడు. ఫుడ్ రికార్డులు తనిఖీ చేసి తేడాలున్నాయంటూ గద్దిం చాడు. దీనిపై రిపోర్టు రాస్తాను.. నీవు సూపర్వైజర్ టెస్ట్ రాశావు కదా.. నా రిపోర్టుతో నీకు ఉద్యోగం రాదు..’ అంటూ బెదిరించాడు. ఆమె కన్నీటిపర్యంతమై సర్దిచెప్పగా, మెత్తబడినట్లు నటించాడు. ఆమెను బైక్‌పై ఎక్కించుకుని స్థానిక దళితవాడలోని మరో కేంద్రానికి తీసుకెళ్లి అక్కడ కూ డా హడావుడి చేశాడు. మిగతా గ్రామాల్లో కేంద్రాల తనిఖీకి తనవెంట రావాలని చెప్పి బలవంతంగా తీసుకెళ్లాడు. ముందుగానే సెల్‌ఫోన్ లాగేసుకున్నాడు.. ‘మనం చెకింగ్‌కు వెళుతున్నాం. నీకు ఫోన్‌చేస్తే ముందుగానే సమాచారం ఇస్తావు. కాబట్టి నీ సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నాకు ఇవ్వు’ అని పద్మలత వద్ద సెల్‌ఫోన్ లాక్కున్నాడు. అక్కడ నుంచి మండలంలోని కొర్నిపాడు, రావులపాడు, నాగాపురం, దోసపా డు, వెంట్రప్రగడ, జువ్వనపూడి వెళ్లారు. జువ్వనపూడిలో తన బైక్ ఆగిపోయిందని చెప్పాడు. దీంతో అక్కడి అంగన్వాడీ టీచర్ తన కుమారుడి బైక్‌ను ఇచ్చారు. ఆ నకిలీ అధికారి తన బైక్‌ను జువ్వనపూడిలోనే వదిలేశాడు. టీచర్ కుమారుడి బైక్‌పై పద్మలతను ఎక్కించుకుని అప్పికట్ల, యలమర్రు, పామర్రు మండలంలోని ఉండ్రపూడి తీసుకెళ్లాడు. అక్కడినుంచి పామ ర్రు సెంటర్‌కు తీసుకువచ్చాడు. వివిధ కేంద్రాలకు వెళ్లిన ప్రతిసారీ ఎవరికో ఫోన్ చేసి సెంటర్ నంబరు చెప్పి, ఇక్కడి పరిస్థితి ఏమిటో నాకు మెసేజ్ వెంటనే ఇవ్వాలంటూ హడావుడి చేశా డు. చివరకు పామర్రులో ఆగినపుడు.. ‘సాయంత్రం ఆరుగంటలైంది.. వెళ్లిపోతాను’ అని ఆమె కోరగా, అడ్డు చెప్పా డు. తనతోపాటు కంకిపాడు రావాలని చెప్పి మంటాడ మీదుగా ఉయ్యూరు బైపాస్ నుంచి కాటూరు మీదుగా కుందేరు తీసు కెళ్లాడు. అక్కడ కోలవెన్ను రోడ్డులో జనసంచారం లేని చోటుకు తీసుకెళ్లాడు. ఇక్కడ దొంగల భయం ఉంటుందని చెప్పి, ఆమె మెడలోని బంగారు నానుతాడు ఇవ్వమని అడిగాడు. అందుకు ఆమె నిరాకరించగా, బలవంతం గా లా క్కుని బైక్‌పై పరారయ్యాడు. అతడు నకిలీ అధికారి అని అప్పటికి ఆమె తెలుసుకుంది. పోలీసులకు ఫిర్యాదు బాధితురాలు పద్మలత వాహనదారులను లిఫ్ట్ అడిగి అతి కష్టం మీద వానపాముల గ్రామం చేరుకుంది. గ్రామ సర్పంచ్ ఎలిసి డేవిడ్ రాజు సహకారంతో కంకిపాడు పోలీ స్‌స్టేషన్‌కు వచ్చి ఈ ఘటనపై ఫిర్యాదు చే సింది. స్టేషన్లో ఉన్న పాత నేరస్తుల ఫొటోలను సిబ్బంది చూపారు. అందులో ఉన్న ఒక వ్యక్తి ఫొటోను చూసి అతడి మాదిరిగానే ఉంటాడని, ఖచ్చితంగా చెప్ప లేక పోతు న్నానని పేర్కొంది. ఆమె అనుమానం వ్య క్తం చేసిన వ్యక్తి కంకిపాడు మండలం దావులూరు వాసి అని పోలీసులు చెప్పారు. జువ్వనపూడిలో మోసగాడు వదిలేసిన బైక్‌ను పెనమలూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగిలించిందేనని వారు తెలిపారు. దీనిపై అక్కడి పోలీస్‌స్టేషన్‌లో వారం రోజుల కిందట ఫిర్యాదు దాఖలైందన్నారు. పద్మలత ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు.