నకిలీ అధికారి నయా వంచన | The hypocrisy of the neo-fake officer | Sakshi
Sakshi News home page

నకిలీ అధికారి నయా వంచన

Published Mon, Aug 11 2014 3:38 AM | Last Updated on Thu, Oct 4 2018 5:10 PM

The hypocrisy of the neo-fake officer

  • ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌నంటూ హల్‌చల్
  •   అంగన్‌వాడీ కేంద్రాల్లో నకిలీ అధికారి హడావుడి
  •   అంగన్‌వాడీ టీచర్ నానుతాడు,  మరో టీచర్ కుమారుడి బైక్‌తో పరార్
  • గుడివాడ : నేను ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌ను.. హైదరాబాద్ నుంచి వచ్చాను.. అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు తనిఖీ చేసి రిపోర్టు ఇవ్వాలి.. అం టూ ఓ వ్యక్తి శనివారం పెదపారుపూడి, పామ ర్రు మండలాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో హడావుడి చేశాడు. వానపాముల కేంద్రం టీచర్‌ను బైక్‌పై తన వెంట ఉదయం నుంచి తి ప్పాడు. ఆమె వద్ద ఉన్న బంగారు నానుతాడుతోపాటు జువ్వనపూడికి చెందిన మ రో టీచర్ కుమారుడి బైక్ తో పరారయ్యా డు. ఈ ఘటన పై బాధితురాలు కంకిపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నకిలీ అధికారి కంకిపాడు మండలం దావులూరు వాసిగా అనుమానిస్తున్నారు. బాధితుల కథ నం.. ‘సాక్షి’ సేకరించిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
     
    పెదపారుపూడి మండలం వానపాములలోని అంగన్‌వాడీ కేంద్రానికి శనివారం ఉద యం 11.30 గంటల సమయంలో ఓ వ్యక్తి మోటార్‌సైకిల్‌పై వచ్చాడు. తాను ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌నని, హైదరాబాద్ నుంచి వచ్చానని అక్కడ ఉన్న టీచర్ పద్మలతకు చెప్పాడు. ఫుడ్ రికార్డులు తనిఖీ చేసి తేడాలున్నాయంటూ గద్దిం చాడు. దీనిపై రిపోర్టు రాస్తాను.. నీవు సూపర్‌వైజర్ టెస్ట్ రాశావు కదా.. నా రిపోర్టుతో నీకు ఉద్యోగం రాదు..’ అంటూ బెదిరించాడు. ఆమె కన్నీటిపర్యంతమై సర్దిచెప్పగా, మెత్తబడినట్లు నటించాడు. ఆమెను బైక్‌పై ఎక్కించుకుని స్థానిక దళితవాడలోని మరో కేంద్రానికి తీసుకెళ్లి అక్కడ కూ డా హడావుడి చేశాడు. మిగతా గ్రామాల్లో కేంద్రాల తనిఖీకి తనవెంట రావాలని చెప్పి బలవంతంగా తీసుకెళ్లాడు.
     
    ముందుగానే సెల్‌ఫోన్ లాగేసుకున్నాడు..
     
    ‘మనం చెకింగ్‌కు వెళుతున్నాం. నీకు ఫోన్‌చేస్తే ముందుగానే సమాచారం ఇస్తావు. కాబట్టి నీ సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నాకు ఇవ్వు’ అని పద్మలత వద్ద సెల్‌ఫోన్ లాక్కున్నాడు. అక్కడ నుంచి మండలంలోని కొర్నిపాడు, రావులపాడు, నాగాపురం, దోసపా డు, వెంట్రప్రగడ, జువ్వనపూడి వెళ్లారు. జువ్వనపూడిలో తన బైక్ ఆగిపోయిందని చెప్పాడు. దీంతో అక్కడి అంగన్‌వాడీ టీచర్   తన కుమారుడి బైక్‌ను ఇచ్చారు. ఆ నకిలీ అధికారి తన బైక్‌ను జువ్వనపూడిలోనే వదిలేశాడు. టీచర్ కుమారుడి బైక్‌పై పద్మలతను ఎక్కించుకుని అప్పికట్ల, యలమర్రు, పామర్రు మండలంలోని ఉండ్రపూడి తీసుకెళ్లాడు. అక్కడినుంచి పామ ర్రు సెంటర్‌కు తీసుకువచ్చాడు. వివిధ కేంద్రాలకు వెళ్లిన ప్రతిసారీ ఎవరికో ఫోన్ చేసి సెంటర్ నంబరు చెప్పి, ఇక్కడి పరిస్థితి ఏమిటో నాకు మెసేజ్ వెంటనే ఇవ్వాలంటూ హడావుడి చేశా డు. చివరకు పామర్రులో ఆగినపుడు.. ‘సాయంత్రం ఆరుగంటలైంది.. వెళ్లిపోతాను’ అని ఆమె కోరగా, అడ్డు చెప్పా డు. తనతోపాటు కంకిపాడు రావాలని చెప్పి మంటాడ మీదుగా ఉయ్యూరు బైపాస్ నుంచి కాటూరు మీదుగా కుందేరు తీసు కెళ్లాడు. అక్కడ కోలవెన్ను రోడ్డులో జనసంచారం లేని చోటుకు తీసుకెళ్లాడు. ఇక్కడ దొంగల భయం ఉంటుందని చెప్పి, ఆమె మెడలోని బంగారు నానుతాడు ఇవ్వమని అడిగాడు. అందుకు ఆమె నిరాకరించగా, బలవంతం గా లా క్కుని బైక్‌పై పరారయ్యాడు. అతడు నకిలీ అధికారి అని అప్పటికి ఆమె తెలుసుకుంది.
     
    పోలీసులకు ఫిర్యాదు
     
    బాధితురాలు పద్మలత వాహనదారులను లిఫ్ట్ అడిగి అతి కష్టం మీద వానపాముల గ్రామం చేరుకుంది. గ్రామ సర్పంచ్ ఎలిసి డేవిడ్ రాజు సహకారంతో కంకిపాడు పోలీ స్‌స్టేషన్‌కు వచ్చి ఈ ఘటనపై ఫిర్యాదు చే సింది. స్టేషన్‌లో ఉన్న పాత నేరస్తుల ఫొటోలను సిబ్బంది చూపారు. అందులో ఉన్న ఒక వ్యక్తి ఫొటోను చూసి అతడి మాదిరిగానే ఉంటాడని, ఖచ్చితంగా చెప్ప లేక పోతు న్నానని పేర్కొంది. ఆమె అనుమానం వ్య క్తం చేసిన వ్యక్తి కంకిపాడు మండలం దావులూరు వాసి అని పోలీసులు చెప్పారు. జువ్వనపూడిలో మోసగాడు వదిలేసిన బైక్‌ను పెనమలూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగిలించిందేనని వారు తెలిపారు. దీనిపై అక్కడి పోలీస్‌స్టేషన్‌లో వారం రోజుల కిందట ఫిర్యాదు దాఖలైందన్నారు. పద్మలత ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement