సాక్షి,హైదరాబాద్:ఐఏఎస్ అధికారి, మాజీ రంగారెడ్డి కలెక్టర్ అమోయ్ కుమార్ బాధితులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కార్యాలయానికి క్యూ కడుతున్నారు. రంగారెడ్డి జిల్లా తట్టిఅన్నారం లోని మధురానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ బాధితులు అమోయ్‌కుమార్‌పై ఇప్పటికే ఫిర్యాదు చేశారు. తాజాగా శనివారం(అక్టోబర్ 26) వట్టినాగులపల్లిలోని శంకర్ హిల్స్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ మరో ఫిర్యాదు చేశారు.
ధరణిని అడ్డం పెట్టుకొని అమోయ్‌కుమార్ అక్రమాలకు పాల్పడ్డారని, 200ఎకరాలకు అక్రమ రిజిస్ట్రేషన్‌లు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ఫ్లాట్లను ఎకరాల్లోకి మార్చి అడ్డగోలు రిజిస్ట్రేషన్లు చేశారని ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. 40 ఏళ్లుగా పొజిషన్లో ఉన్నా మందీ మార్బలంతో వచ్చి వెళ్లగొట్టే యత్నం చేశారన్నారు. తమ భూములపై హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నా పట్టించుకోలేదన్నారు. ఉదయం ఏడు గంటలకే రిజిస్ట్రేషన్ కానిచ్చి రాత్రికి రాత్రే పత్రాలు సృష్టించారన్నారు.
సర్వేనెంబర్ 111 నుంచి 179 వరకు ఉన్న 460 ఎకరాల భూమిని కాజేసి సమారు 30 వేల కోట్ల రూపాయల భూ కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. తమకు జరిగిన అన్యాయంపై ఈడీకి ఫిర్యాదు చేశామని శంకర్‌హిల్స్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో ఐఏఎస్ అమోయ్ కుమార్‌తో పాటు ఇతర అధికారులు,పెద్దల పాత్రపై దర్యాప్తు జరపాలని బాధితులు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: పదేళ్లలో అక్రమార్జన రూ.1000 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment