Land scams
-
TG: అమోయ్‌కుమార్‌పై ఈడీకి ఫిర్యాదుల వెల్లువ
సాక్షి,హైదరాబాద్:ఐఏఎస్ అధికారి, మాజీ రంగారెడ్డి కలెక్టర్ అమోయ్ కుమార్ బాధితులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కార్యాలయానికి క్యూ కడుతున్నారు. రంగారెడ్డి జిల్లా తట్టిఅన్నారం లోని మధురానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ బాధితులు అమోయ్‌కుమార్‌పై ఇప్పటికే ఫిర్యాదు చేశారు. తాజాగా శనివారం(అక్టోబర్ 26) వట్టినాగులపల్లిలోని శంకర్ హిల్స్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ మరో ఫిర్యాదు చేశారు.ధరణిని అడ్డం పెట్టుకొని అమోయ్‌కుమార్ అక్రమాలకు పాల్పడ్డారని, 200ఎకరాలకు అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ఫ్లాట్లను ఎకరాల్లోకి మార్చి అడ్డగోలు రిజిస్ట్రేషన్లు చేశారని ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. 40 ఏళ్లుగా పొజిషన్లో ఉన్నా మందీ మార్బలంతో వచ్చి వెళ్లగొట్టే యత్నం చేశారన్నారు. తమ భూములపై హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నా పట్టించుకోలేదన్నారు. ఉదయం ఏడు గంటలకే రిజిస్ట్రేషన్ కానిచ్చి రాత్రికి రాత్రే పత్రాలు సృష్టించారన్నారు.సర్వేనెంబర్ 111 నుంచి 179 వరకు ఉన్న 460 ఎకరాల భూమిని కాజేసి సమారు 30 వేల కోట్ల రూపాయల భూ కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. తమకు జరిగిన అన్యాయంపై ఈడీకి ఫిర్యాదు చేశామని శంకర్‌హిల్స్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో ఐఏఎస్ అమోయ్ కుమార్‌తో పాటు ఇతర అధికారులు,పెద్దల పాత్రపై దర్యాప్తు జరపాలని బాధితులు డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: పదేళ్లలో అక్రమార్జన రూ.1000 కోట్లు -
‘భూ’కాయింపు! శ్వేతపత్రం పేరుతో సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలు
సాక్షి, అమరావతి: ప్రజలకు మోసపూరిత హామీలిచ్చి వాటిని అమలు చేయలేక కాలయాపన చేస్తున్న సీఎం చంద్రబాబు దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు శ్వేతపత్రాల పేరుతో అభూత కల్పనలు, అడ్డగోలుగా వక్రీకరణలకు దిగారు. పేదలకు మంచి జరిగేలా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలను దోపిడీగా చిత్రీకరిస్తూ తన కడుపుమంటను మరోసారి బయట పెట్టుకున్నారు. ఖజానాకు రాబడి పెంచిన ప్రభుత్వాన్ని నిందిస్తూ.. ఆదాయానికి తూట్లు పొడుస్తున్న తన సర్కారు గురించి జబ్బలు చరుచుకోవడంపై రాజకీయ పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచమే విస్తుపోయేలా నాడు అమరావతి, విశాఖలో తన హయాంలో జరిగిన భూ కుంభకోణాలను నిస్సిగ్గుగా కప్పిపుచ్చుతూ బురద చల్లేందుకు సీఎం చంద్రబాబు యత్నించారు. అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం ద్వారా దళితులు, పేదల జీవితకాల కోరికను నెరవేర్చడాన్ని తప్పుబట్టి ఆయా వర్గాలను దారుణంగా అవమానించారు. ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు వేల కోట్లు దోచుకోగా, వైఎస్సార్సీపీ హయాంలో ఒక క్రమపద్ధతి ప్రకారం జరిగిన విక్రయాలను తప్పుబడుతున్నారు. ధరల బోర్డు ఏర్పాటు చేసి మరీ ఇసుకను విక్రయిస్తూ పైకి మాత్రం ఉచితమంటూ బుకాయిస్తున్నారు. పారదర్శకంగా ఇసుక అందచేసి ఏటా రూ.750 కోట్లకుపైగా ఆదాయాన్ని, ఐదేళ్లలో రూ.4 వేల కోట్ల రాబడిని గత ప్రభుత్వం ఖజానాకు జమ చేయడం అక్రమమా? ప్రభుత్వానికి రూపాయి రాబడి లేకుండా చేసి ఉచిత ఇసుక పేరుతో పచ్చముఠాల జేబులు నింపడం ఓ గొప్ప పథకమా? భూముల సమగ్ర రీ సర్వే (జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష చట్టం) ద్వారా అమ్మేవారికి, కొనేవారికి పూర్తి భరోసా లభిస్తుంది. వివాదరహితంగా భూములపై హక్కులు కల్పించడంతోపాటు ఏదైనా సమస్య ఉత్పన్నమైతే ప్రభుత్వమే గ్యారెంటీ ఇస్తుంది కాబట్టి నిశ్చింతగా ఉండవచ్చు. దేశ చరిత్రలో తొలిసారిగా ఆంగ్లేయుల తరువాత భూముల సమగ్ర సర్వే బృహత్తర కార్యక్రమాన్ని వైఎస్సార్ సీపీ హయాంలో చేపట్టింది. రైతులపై పైసా భారం పడకుండా ఉచితంగా సర్వే చేయడంతోపాటు సరిహద్దు రాళ్లను కూడా ఉచితంగానే పాతేలా చర్యలు తీసుకుంది. 15,000 మంది సర్వేయర్లను నియమించింది. చంద్రబాబు ఆరోపిస్తున్నట్లుగా కబ్జాలే నిజమైతే తమ భూములు లాక్కున్నారని ఏ ఒక్క రైతైనా ఫిర్యాదు చేశారా? గత సర్కారు ఎర్ర చందనం స్మగ్లింగ్‌ను సమర్థంగా అరికడితే దానిపైనా అడ్డగోలు వాదనకు దిగారు. సహజ వనరులను దోపిడీ చేశారని, భూములను దోచుకున్నారని కళ్లార్పకుండా బుకాయించారు. వాస్తవానికి వైఎస్ జగన్ తెచ్చినవి సంస్కరణలైతే చంద్రబాబు హయాంలో చోటు చేసుకున్నవన్నీ స్కామ్‌లే!!పేదలకు భూమి పంచడం నేరమా?వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిరుపేదలకు భూమిని పంచడాన్ని అక్రమంగా చంద్రబాబు అభివర్ణించారు. 46 వేల ఎకరాలను 40 వేల మందికిపైగా రైతులకు పంపిణీ చేయడాన్ని తçప్పుబడుతూ అందులో 8 వేల ఎకరాలను వైఎస్సార్సీపీ వారికి పంచారంటూ గగ్గోలు పెట్టారు. నిరుపేదలైన వారికి భూములు ఇవ్వడాన్ని వక్రీకరిస్తూ అందులో రూ.1,300 కోట్ల అవినీతి జరిగిందని పేదలపై తనకున్న ద్వేషాన్ని చంద్రబాబు చాటుకున్నారు. చంద్రబాబు తన హయాంలో భూ పంపిణీయే చేయలేదు. ఏనాడూ పేదల గోడు పట్టించుకున్న పాపాన పోలేదు. అసైన్డ్ భూములపై అడ్డగోలు వాదనఅసైన్డ్ భూముల రైతులకు చారిత్రక రీతిలో వైఎస్సార్సీపీ హయాంలో దక్కిన యాజమాన్య హక్కులను చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. వారి భూములపై వారికి హక్కులు కల్పించడం తప్పన్నట్లు చిత్రీకరించారు. అనేక సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములపై హక్కులు లేక అసైన్డ్ రైతులు అవస్థలు పడ్డా పట్టించుకోని చంద్రబాబు, వారికి హక్కులు ఇవ్వడాన్ని వక్రీకరిస్తూ వైఎస్సార్సీపీ నేతలు ఆ భూములను కొట్టేశారంటూ నిరాధార ఆరోపణలు చేశారు. అసైన్డ్ రైతులకు వారి భూములపై సంపూర్ణ అధికారాలు దక్కడం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదని దీన్నిబట్టి స్పష్టమవుతోంది. తమ భూములపై ఆంక్షలు లేకపోవడం, మంచి ధర రావడంతో కొంతమంది రైతులు హక్కులు వచ్చాక వాటిని విక్రయించారు. 27 లక్షల ఎకరాల అసైన్డ్ భూములకుగానూ తొలి విడతలో పది లక్షల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించి వారికి హక్కులు కల్పించారు. అందులో కొంతమంది అమ్ముకోవడం ముఖ్యమంత్రికి నేరంగా కనిపిస్తోంది. చంద్రబాబు హయాంలో 22 ఏలో చేర్చిన 2 లక్షల ఎకరాల నిషేధిత భూములు, 34 వేల ఎకరాల షరతుగల పట్టా భూములు, 50 వేల ఎకరాల అనాధీనం భూములపై వైఎస్సార్పీ హయాంలో ఆంక్షలు తొలిగాయి. 1.79 లక్షల ఎకరాల సర్వీస్ ఈనాం భూములను 22ఏ నుంచి తొలిగించి వారికి మేలు చేశారు. రైతుల సాగులో ఉన్న 9,064 ఎకరాల లంక భూములను 17,768 మంది లబ్ధిదారులకు హక్కులతో అందచేసింది. ఎస్సీలకు శ్మశాన వాటికల కోసం 1,543 గ్రామాలలో 933 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి పంచాయతీలకు అప్పగించింది. ఇవన్నీ చంద్రబాబుకు అక్రమాలు, అన్యాయాలుగా కనిపించడాన్ని ఏమనాలి?రీ సర్వేపై తప్పుడు భాష్యాలు.. గత వందేళ్లలో ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన భూముల రీ సర్వేను ఒక అనాలోచిత చర్యగా చంద్రబాబు అభివర్ణించటాన్ని బట్టి రెవెన్యూ వ్యవస్థపై సీఎం చంద్రబాబుకు ఉన్న అవగాహన ఏపాటిదో స్పష్టమైంది. అనేక చిక్కుముళ్లు, ఆటంకాలు, వ్యయ ప్రయాసలను అధిగమించి 6 వేల గ్రామాల్లో పూర్తయిన రీ సర్వేను రద్దు చేస్తానని ఆయన చెప్పడం రాష్ట్రానికి తీరని ద్రోహం చేయడమే. వివాదాలు లేని భూముల వ్యవస్థ తేవటాన్ని వ్యతిరేకించడమంటే వివాదాలు కోరుకోవడమే. తద్వారా డ్రోన్లు, విమానాలతో మొత్తం 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని సర్వే చేయడం, ప్రతి గ్రామానికి ఆధునిక డిజిటల్ రెవెన్యూ రికార్డులను అందుబాటులోకి రావడం, ప్రతి రైతుకి భూహక్కు పత్రం, భూములకు జియో ట్యాగింగ్ హద్దులు లాంటివన్నీ వృథా అయినట్లే! ఇప్పటివరకూ సర్వే పూర్తయిన గ్రామాల్లో 10 లక్షల పట్టా సబ్ డివిజన్లు, 8 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. అవి కూడా చంద్రబాబుకు తప్పుగానే కనిపించాయి. అన్నిటికీ మించి సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు చేసే ప్రక్రియ కూడా ఆగిపోతుంది. వివాదాస్పదమైన పాత భూముల వ్యవస్థనే మళ్లీ తేవాలని చంద్రబాబు నిర్ణయించడంపై రెవెన్యూ యంత్రాంగం విస్తుపోతోంది. భూ హక్కులకు భరోసా కల్పించేలా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏపీలో తెచ్చిన ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి రాజకీయ మకిలి అంటించి దాన్ని చంద్రబాబు చెత్తబుట్టలో వేసేశారు. ఏపీలో ఎప్పుడూ జరగని విధంగా చేపట్టిన ఈ భూసంస్కరణలన్నింటిపైనా తప్పుడు ముద్ర వేసి తొలగించాలనుకోవడం మూర్ఖత్వానికి పరాకాష్టగా నిలుస్తోంది.ఇదేం విచిత్రం?2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి మైన్స్ ద్వారా ప్రభుత్వానికి రాబడి ఏటా రూ.2 వేల కోట్లు ఉంటే 2024లో ఏటా దాదాపు రూ.4 వేల కోట్లకు చేరింది. మరి ఖజానాకు ఆదాయం రెట్టింపు అయినప్పుడు రూ.19 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపణ చేయడం విచిత్రం కాదా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావ్ చంద్రబాబూ! గనుల కేటాయింపుల్లో పారదర్శక విధానాలు తెచ్చి ఆదాయం పెంచిన గత ప్రభుత్వం పారదర్శకంగా పని చేసినట్లా? లేక ఆదాయం తక్కువ చేసి, పారదర్శక విధానాలు లేకుండా చేసిన చంద్రబాబు ప్రభుత్వం కుంభకోణాలకు పాల్పడినట్లా? చిన్నపిల్లలను అడిగినా ఈ విషయం సులభంగా చెప్పేస్తారు కదా! ఇసుకపైనా అసత్యాలేఅధికారంలోకి వచ్చిన నెలన్నర వ్యవధిలోనే 40 లక్షల టన్నుల ఇసుకను బొక్కేసిన చంద్రబాబు వైఎస్సార్సీపీ హయాంలో ఇసుక దోపిడీ జరిగిపోయిందంటూ గుండెలు బాదుకోవడం గజ దొంగల్ని సైతం విస్మయానికి గురిచేస్తోంది. ఇసుక ఫ్రీ అని మభ్యపుచ్చి ప్రభుత్వానికి ఎలాంటి రాబడి లేకుండా చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2019 నుంచి ఖజానాకు ఏటా రూ.780 కోట్లు రాబడి తెచ్చే విధానాన్ని తీసుకొచ్చి టెండర్లు పిలిచి ఇసుక అప్పగించింది. ఐదేళ్లలో రూ. 4 వేల కోట్లు ఇసుక ద్వారా ప్రభుత్వానికి రాబడి వచ్చింది. 2014–19 మధ్య ఇసుక ఫ్రీగా ఇచ్చానని బుకాయించిన చంద్రబాబు ఎంత దోపిడీకి తెర తీశారో ఇప్పుడెంత కొల్లగొట్టనున్నారో ఆయనకే తెలియాలి మరి!!ఒక్క ఇల్లూ కట్టని చంద్రబాబు.. 31 లక్షల ఇళ్లు ఇచ్చిన జగన్‌పై విమర్శలా?దేశ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో 31 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇచ్చి గృహ నిర్మాణాలను సైతం చేపట్టిన పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై చంద్రబాబు బురద చల్లేందుకు సాహసించారు. పేదలకు ఒక్క సెంటు భూమి ఇవ్వని చంద్రబాబు, 72 వేల ఎకరాల్లో 17 వేల కాలనీలు నిర్మించి పేదలకు పంచడాన్ని కుంభకోణంగా అభివర్ణించడం అంటే ఆకాశంపై ఉమ్మి వేయడమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాలనీల కోసం 28 వేల ఎకరాలను సేకరించగా, మరో 25 వేల ఎకరాల ప్రైవేటు భూములను కొనుగోలు చేసి కాలనీలు కట్టించారు. అమరావతిలో పేదలకు 50 వేల ఇళ్ల పట్టాలు ఇస్తే కోర్టుకెళ్లి అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుది కాదా? పేదల సొంతింటి కలను నెరవేర్చే ఇళ్ల యజ్ఞాన్ని అడ్డుకుని ఇప్పుడు నీతి సూక్తులు చెప్పడం విస్మయపరుస్తోంది. కనీస ఆధారాలు లేకుండా భూసేకరణలో వేల కోట్ల అవినీతి జరిగిందని సీఎం స్థాయి వ్యక్తి దిగజారుడు ఆరోపణలు చేయడం తగునా? 31 లక్షల మంది పేదలకు మంచి జరిగిన విషయాన్ని కప్పిపుచ్చుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి పది వేల ఎకరాలను బలవంతంగా లాక్కున్నారంటూ తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటు కాక మరేమిటి?‘గీతం’ కబ్జాలు గుర్తులేవా?సాక్షి, విశాఖపట్నం: శ్వేతపత్రం పేరుతో తనకు నచ్చిన అబద్ధాలను ముద్రించేసిన సీఎం చంద్రబాబు విశాఖలో భూములు మింగేసిన అనకొండలు టీడీపీకి చెందినవేనన్న విషయాన్ని కప్పిపుచ్చేందుకు విఫలయత్నం చేశారు. ప్రభుత్వ జీవో ప్రకారం లీజుకిచ్చినా తప్పేనంటూ అసత్యాలు వల్లెవేశారు. టీడీపీ అనకొండల నుంచి మార్కెట్ ధర ప్రకారం రూ.5 వేల కోట్ల విలువైన 430 ఎకరాల భూమిని గత ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. గీతం పేరుతో రూ.500 కోట్ల విలువైన 42.51 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే వైఎస్సార్సీపీ హయాంలో 40.51 ఎకరాలను స్వాధీనం చేసుకోవడం గమనార్హం.విశాఖపట్నంలో గీతం విద్యాసంస్థలు ఆక్రమించిన ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటున్న అధికారులు(ఫైల్) స్టూడియో భూములపై అవగాహన ఉందా? రామానాయుడు స్టూడియోను ప్లాట్ల పేరుతో ఆక్రమించి విక్రయించేందుకు వైఎస్సార్సీపీ నేతలు యత్నించారంటూ సీఎం చంద్రబాబు ఆరోపించారు. నిజానికి స్టూడియో యజమానులే రెసిడెన్షియల్ లేఅవుట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై సమగ్ర విచారణతో పాటు నిబంధనలు పరిశీలించిన తర్వాతే గత ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. స్టూడియో యజమానులు దరఖాస్తు చేసుకుంటే వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై బురద చల్లేందుకు చంద్రబాబు యత్నించారు. నిజంగానే కబ్జా జరిగితే స్టూడియో అధినేతలు ఎందుకు ఉపేక్షిస్తారనే కనీస అవగాహన లేకుండా అర్థం పర్థం లేని విమర్శలు చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. పీఠానికి లీజుకే.. వేద పాఠశాల నిర్మాణం కోసం విశాఖ శారదా పీఠానికి 2022 ఫిబ్రవరి 8న 15 ఎకరాల భూమిని తక్కువ ధరకే అప్పగించేశారని, దీని వెనుక కుట్ర ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. వాస్తవానికి శారదా పీఠానికి భూమిని కేవలం లీజుకు మాత్రమే అప్పగిస్తున్నట్లు జీవో 64లో స్పష్టంగా ఉంది. గత ప్రభుత్వాలు జారీ చేసిన జీవోలను అనుసరించి ఎకరా రూ.లక్ష చొప్పున లీజుకు ఇస్తే శారదా పీఠానికి భూములు రాసిచ్చేసినట్లు చంద్రబాబు మభ్యపుచ్చేందుకు ప్రయత్నించారు. మరి లీజు, సేల్ రెండూ ఒకటి కాదనే విషయం ఆయనకు కచ్చితంగా తెలిసే ఉంటుంది కదా? హయగ్రీవపైనా అబద్ధాలు.. ఓల్డేజ్ హోమ్ కోసం హయగ్రీవ ల్యాండ్స్ 12.51 ఎకరాలను ఇస్తే వైఎస్సార్సీపీ నేతలు కొట్టెయ్యాలని చూస్తున్నారంటూ చంద్రబాబు ఆరోపించారు. 2008 డిసెంబర్ 6న ప్రివిలైజ్డ్ మార్కెట్ వ్యాల్యూ ప్రకారం ఎకరం రూ.45 లక్షలు చొప్పున (ఆ సమయంలో ఎస్ఆర్వో విలువ ఎకరం రూ.28.40 లక్షలు) 12.51 ఎకరాలను కేటాయిస్తూ జీవో నం.1447 జారీ అయింది. ప్రభుత్వ ఉత్తర్వులు, కన్వేయన్స్ డీడ్ షరతుల ప్రకారం మొత్తం భూభాగంలో 10% కాటేజీల నిర్మాణానికి, 30% రోడ్లు, డ్రెయిన్లు, ఇతర నిర్మాణాలు, సౌకర్యాల కోసం వినియోగించాలి. సదరు సంస్థ జీవీఎంసీకి 2012 ఫిబ్రవరి 24న (బీఏ నం.10900/2014/డీసీపీ–1/జీ1) దరఖాస్తు చేసుకుంది. ప్లాన్లను ఆమోదించకపోవడంతో కలెక్టర్ ఉత్తర్వుల్ని సవాలు చేస్తూ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారంపై జీవీఎంసీ, వుడాకు లేఖ రాసే హక్కు కలెక్టర్‌కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. సమస్య పరిష్కరించేంత వరకూ భూమి లాక్కోకూడదని, బలవంతపు చర్యలు వద్దని, చట్ట ప్రకారం వ్యవహరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. తక్షణమే పిటిషనర్‌కు ఎన్వోసీ జారీ చేయాలని కలెక్టర్‌ను 2017లో ఆదేశించింది. నిబంధనలను పాటిస్తూ భూ కేటాయింపు సమయంలో విధించిన షరతులకు లోబడే కన్వేయన్స్ డీడ్, ప్లాన్‌ను ఆమోదిస్తే చంద్రబాబు అబద్ధాలతో మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారు.ఖనిజ వనరులను దోచుకుంది ఎవరు?ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) ఆదాయం జగన్ హయాంలో అనూహ్యంగా పెరిగింది.2020–21లో రూ.502 కోట్లు ఉన్న ఆ సంస్థ ఆదాయం 2022–23 సంవత్సరానికి రూ.1,806 కోట్లకు చేరింది. 2023–24 నాటికి రూ.4 వేల కోట్లకు చేరడాన్ని బట్టి మైనింగ్ ఆదాయాన్ని జగన్ ప్రభుత్వంలో ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు హయాంలో గనుల ఆదాయం తగ్గిపోయి అప్పట్లో గనుల దోపిడీ యధేచ్చగా జరిగిపోయిందని స్పష్టమవుతోంది. గనుల్ని ఇష్టానుసారంగా దోచుకు తిన్నది టీడీపీ నేతలే. ప్రస్తుతం స్పీకర్‌గా ఉన్న అయ్యన్నపాత్రుడు లేటరేట్ కొండల్ని తొలిచేశారు! రోడ్డు మెటల్ తవ్వకాలతో నర్సీపట్నం పరిసర ప్రాంతాలను లోయలుగా మార్చేసిన ఘనత అయ్యన్నదే! మంత్రి అచ్చెన్నాయుడు టెక్కలిలో చేసిన గనుల దోపిడీ అంతా ఇంతా కాదు. ప్రకాశం జిల్లాలోనూ టీడీపీ నేతలు గ్రానైట్ మాఫియాగా మారి దోచుకున్నారు. 2019లో వైఎస్ జగన్ అధికారం చేపట్టాక కొత్త గనుల విధానం ద్వారా ఆదాయం పెరిగేలా చేశారు. రాయల్టీ వసూళ్లలోనూ కొత్త మార్గదర్శకాలు ప్రవేశపెట్టారు. అరకొరగా ఉన్న మైనింగ్ సిబ్బంది వల్ల సీనరేజీ వసూళ్లు సరిగా జరగడంలేదని గుర్తించి ప్రైవేటు సంస్థలకు పారదర్శకంగా కాంట్రాక్టులు ఇచ్చారు. లీజుల జారీ విధానాన్ని అందరికీ అనుకూలంగా ఉండేలా మార్చారు. వీటన్నింటి ఫలితంగానే ఆదాయం పెరిగింది. -
వైఎస్ఆర్ ఇచ్చిన భూములు తిరిగిచ్చేయ్...రామోజీకి డెడ్ లైన్..
-
Chandrababu: మలుపు తిప్పిన ముఠా! పవన్ కల్యాణ్‌కూ వాటా
సాక్షి, అమరావతి: అమరావతి ముసుగులో నారా చంద్రబాబునాయుడు సాగించిన భూదందాలో ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ అంశం ఓ అవినీతి అధ్యాయమేనని వెల్లడైంది. అలైన్మెంట్ ప్రతి మెలికలోనూ పచ్చ గ్యాంగ్ అవినీతి గుట్టు రట్టవుతోంది. టీడీపీ హయాంలో సీఆర్డీఏ చైర్మన్‌గా ఉన్న చంద్రబాబు, వైస్ చైర్మన్ పొంగూరు నారాయణ అవినీతి బాగోతాలు విస్తుపోయే రీతిలో ఉన్నాయి. చంద్రబాబు సన్నిహితుడైన లింగమనేని రమేష్ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్ల నుంచి వెంటనే రూ.877.50 కోట్లకు... రాజధాని నిర్మాణం అనంతరం ఏకంగా రూ.2,130 కోట్లకు చేరేలా ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను ఖరారు చేయడం ఎల్లో గ్యాంగ్ బరి తెగింపు వ్యవహారాలకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ అవినీతి పాపంలో చంద్రబాబు తన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్‌కు కూడా పిడికెడు వాటా ఇవ్వడం కొసమెరుపు. అవినీతికి బాటలు వేసిన ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ వెనుక సాగిన గూడుపుఠాణీ దశలవారీగా ఇదిగో ఇలా సాగింది..! అలైన్మెంట్ –1 సీఆర్డీఏ తొలుత రూపొందించింది అమరావతి ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ నిర్ణయించేందుకు టెండర్ల ద్వారా కన్సల్టెన్సీతో నిమిత్తం లేకుండా పని ముగించాలని చంద్రబాబు, నారాయణ నిర్ణయించారు. దీంతో సీఆర్డీఏ అధికారులు 94 కి.మీ. పొడవుతో అమరావతి ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను రూపొందించారు. దీన్ని చూసి చంద్రబాబు, నారాయణ మండిపడ్డారు. ఎందుకంటే దాని ప్రకారం ఇన్నర్‌రింగ్ రోడ్డు పెదపరిమి, నిడమర్రు, చినవడ్లపూడి, పెదవడ్లపూడి మీదుగా వెళ్తుంది. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని కుటుంబానికి చెందిన భూములకు 3 కి.మీ. దూరం నుంచి ఇన్నర్‌రింగ్ రోడ్డు నిర్మించాల్సి వస్తుంది. దీంతో తమ భూముల విలువ అమాంతం పెంచుకునేందుకు ఆ అలైన్‌మెంట్‌ను మార్చాలని ఆదేశించారు. అలైన్మెంట్ – 2 చంద్రబాబు ఆదేశాలతో రూపొందించారు గత సర్కారు పెద్దల ఆదేశాలతో సీఆర్డీఏ అధికారులు ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్లో కీలక మార్పులు చేశారు. చంద్రబాబు, లింగమనేని కుటుంబానికి చెందిన వందలాది ఎకరాలున్న తాడికొండ, కంతేరు, కాజా ప్రాంతాలను పరిగణలోకి తీసుకుంటూ ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను 3 కి.మీ. దక్షిణానికి జరిపారు. హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని కుటుంబానికి కంతేరు, కాజాలో ఉన్న భూములను ఆనుకుని మరీ ఇన్నర్‌రింగ్ రోడ్డు నిర్మించేలా 97.50 కి.మీ. మేర అలైన్‌మెంట్‌ను రూపొందించారు. ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అలైన్మెంట్–3 కన్సల్టెన్సీ ద్వారా ఆమోదించింది సింగపూర్‌కు చెందిన సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీ ద్వారా రూపొందించిన అమరావతి మాస్టర్‌ప్లాన్‌లోనే ప్రతిపాదిత ఇన్నర్‌రింగ్ రోడ్ డిజైన్‌ను చంద్రబాబు ప్రభుత్వం ముందుగానే చేర్చింది. అంటే అప్పటికే ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్మెంట్ ఎలా ఉండాలన్నది నిర్ధారణ అయిపోయింది. అనంతరం ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను రూపొందించేందుకు ఎస్టీయూపీ అనే ఓ కన్సల్టెన్సీని నియమించారు. మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచిన అలైన్‌మెంట్‌కు అనుగుణంగానే అది ఉండాలని నిర్దేశించారు. అప్పటికే సీఆర్డీఏ ద్వారా తాము ఖరారు చేసిన అలైన్‌మెంట్‌నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ద్వారా తెరపైకి తెచ్చి ఆమోదించారు. తాడికొండ, కంతేరు, కాజాలో హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని భూములను ఆనుకునే అలైన్‌మెంట్‌ను ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ఖరారు చేసింది. అలైన్‌మెంట్‌ను ఆనుకుని భూములు ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మెలికలు తిప్పడం ద్వారా హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని రమేశ్ కుటుంబానికి చెందిన భూముల విలువ భారీగా పెరిగింది. కంతేరు, కాజాలో లింగమనేని కుటుంబానికి 355 ఎకరాలున్నాయి. మొదట రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం ఆ భూములకు 3 కి.మీ. దూరంగా ఇన్నర్‌రింగ్ రోడ్డు నిర్మించాలి. అలైన్మెంట్ మార్పుతో ఆ భూములను ఆనుకుని ఉండేలా ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారు చేశారు. ఆ ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను ఆనుకునే హెరిటేజ్ ఫుడ్స్‌కు చెందిన 9 ఎకరాలు ఒకచోట, ఒప్పందం చేసుకున్న నాలుగు ఎకరాలు మరో చోట ఉండటం గమనార్హం. అమాంతం పెరిగిన విలువ ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారుకు ముందు లింగమనేని కుటుంబం ఆ ప్రాంతంలో ఎకరా భూమి రూ.8 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించింది. మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.50 లక్షలు ఉంది. అంటే ఆ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్లు. ఇక ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారు తరువాత ఎకరం రూ.36 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించింది. అంటే రిజిస్టర్ విలువే నాలుగున్నర రెట్లకుపైగా పెరిగింది. మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. అంటే 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతంగా రూ.887.50 కోట్లకు పెరిగింది. అమరావతి నిర్మాణం పూర్తయితే సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో ఎకరా విలువ రూ.4 కోట్లకు చేరుతుందని నాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే ప్రకటించారు. ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. అంటే అమరావతి నిర్మాణం పూర్తయితే ఆ 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా. ఆ ప్రకారం మార్కెట్ ధరను బట్టి హెరిటేజ్ ఫుడ్స్ 9 ఎకరాల విలువ రూ.4.50 కోట్ల నుంచి రూ.22.50 కోట్లకు పెరిగింది. అమరావతి నిర్మాణం పూర్తయితే రూ.54 కోట్లకు చేరుతుందని తేలింది. హెరిటేజ్ ఫుడ్స్ ఒప్పందం చేసుకున్న మరో నాలుగు ఎకరాల విలువ కూడా రూ.24 కోట్లకు చేరుతుంది. అక్కడే పవన్ కల్యాణ్‌కు 2.40 ఎకరాలు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కూడా ఈ ఇన్నర్‌రింగ్ రోడ్డు అవినీతి పాపంలో చంద్రబాబు పిడికెడు వాటా ఇచ్చారు. కాజాకు సమీపంలో ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌కు సమీపంలోనే పవన్‌కల్యాణ్‌కు 2.4 ఎకరాలున్నాయి. లింగమనేని కుటుంబం నుంచి ఆ భూములను ప్రభుత్వ ధర ప్రకారం ఎకరా రూ.8 లక్షలు చొప్పున కొనుగోలు చేసినట్లు చూపించారు. ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు కల్పించిన భూమినే పవన్ కల్యాణ్‌కు ఇవ్వడం గమనార్హం. కృష్ణా ఇవతలా అవినీతి మెలికలే అమరావతి పరిధిలో ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ ద్వారా చంద్రబాబు, లింగమనేని కుటుంబాల భూముల విలువ అమాంతం పెంచుకోగా కృష్ణానదికి ఇవతల విజయవాడ శివారులో నారాయణ తమ ఆస్తుల విలువ భారీగా పెంచుకున్నారు. సీఆర్డీఏ అధికారులు మొదట రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం ఇన్నర్‌రింగ్ రోడ్డును గుంటూరు జిల్లాలోని అమరావతి నుంచి కృష్ణా జిల్లాలోని నున్న మీదుగా నిర్మించాల్సి ఉంది. అందుకోసం కృష్ణా నదిపై వంతెన నిర్మిస్తారు. గుంటూరు జిల్లాలోని నూతక్కి – కృష్ణా జిల్లా పెద్దపులిపర్రు మధ్య కృష్ణా నదిపై వంతెన నిర్మించి అక్కడ నుంచి తాడిగడప నుంచి ఎనికేపాడు మీదుగా నున్న వరకు ఇన్నర్‌రింగ్ రోడ్డు కొనసాగుతుంది. అయితే అలా నిర్మిస్తే నారాయణ విద్యా సంస్థల భవనాలను భూసేకరణ కింద తొలగించాల్సి వస్తుంది. ఈ అలైన్‌మెంట్‌పై నారాయణ నాడు సీఆర్డీఏ అధికారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. సీఆర్డీఏ సమావేశంలో అధికారులను పరుష పదజాలంతో దూషిస్తూ అలైన్‌మెంట్‌ను మార్చాలని ఆదేశించారు. దాంతో ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను 3 కి.మీ. తూర్పు దిశగా మార్చారు. ఆ ప్రకారం గుంటూరు జిల్లాలో రామచంద్రాపురం – కృష్ణా జిల్లా చోడవరం మధ్య వంతెన నిర్మించాలని ప్రతిపాదించారు. అక్కడ నుంచి పెనమలూరు మీదుగా నిడమానూరు నుంచి నున్న వరకు ఇన్నర్‌రింగ్ రోడ్డును నిర్మిస్తారు. నారాయణ కుటుంబానికి చెందిన 9 విద్యా సంస్థల భవనాలను ఆనుకుని ఉండేలా ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. తన విద్యా సంస్థల భూముల విలువ అమాంతం పెరిగేలా నారాయణ చక్రం తిప్పారు. అటూ ఇటూ భారీగా కొనుగోలు ఇన్నర్‌రింగ్ రోడ్డును ఎలా నిర్మించనున్నారో ముందుగానే తెలిసిన చంద్రబాబు, నారాయణ తమ కుటుంబ సంస్థలు హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్‌లతోపాటు తమ బినామీ లింగమనేని రమేష్ తన సంస్థల పేరిట భారీగా భూములు కొన్నారు. అవన్నీ ప్రతిపాదిత ఇన్నర్‌రింగ్ రోడ్డుకు అటూ ఇటూ ఉండటం గమనార్హం. సీఐడీ అధికారులు మంగళగిరి, పెదకాకాని, తాడికొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లను పరిశీలించగా ఈ విషయం స్పష్టమైంది. -
విశాఖపై విద్వేషాల కబ్జా.. రామోజీ టక్కు టమారం.. ‘ఈనాడు’ విషపు రాతలు
రామోజీరావుకు విశాఖపట్నమంటే ప్రేమో, ద్వేషమో, మరేదో తెలియని భావసంభోగం ఉన్నదనే చెప్పాలి. ఎందుకంటే అక్కడే ఆయన 47 ఏళ్ల కిందట అక్షర ఫ్యాక్షనిజానికి అంకురార్పణ చేశారు. లీజు పేరిట స్థలాలు తీసుకుని న్యాయ పోరాటాలతో కాజేయటమనే టక్కు టమారానికీ ఇక్కడే శ్రీకారం చుట్టారు. ఇతరుల స్థలాలను కబ్జా చేయటానికి ఎన్ని 420 పనులైనా చేయొచ్చునని... ఎన్ని ఫోర్జరీలైనా చేయొచ్చునని ఇక్కడి నుంచే నిరూపించబోయారు. అందుకే ఆయనది విశాఖతో విడదీయలేని బంధం. కాకుంటే న్యాయం గెలుపు ఆలస్యం కావచ్చేమో గానీ... గెలవటం మాత్రం పక్కా అనేది రామోజీ సైతం నమ్మక తప్పలేదు. లీజు పోరాటం ఒక్కో న్యాయస్థానాన్నీ దాటుకుంటూ సుప్రీంకోర్టుకు కూడా చేరాక తల వంచారు. లీజు ముగిసిన ఏడేళ్ల తరవాత స్థలాన్ని అప్పగించాల్సి వచ్చింది కూడా. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే... కొద్దిరోజులుగా ఆయన విశాఖపై ప్రేమ ముసుగులో విద్వేషం కక్కుతున్నారు. ప్రభుత్వంపై విషం చిమ్మటానికి ప్రతిరోజూ విశాఖలో భూ కబ్జాలంటూ అడ్డగోలు రాతలు రాస్తున్నారు. దానికి సాక్ష్యంగా ఊరూపేరూ లేని వ్యక్తులను తెరపైకి తీసుకొచ్చి... ఉత్తరాంధ్రకు, విశాఖకు, రాష్ట్రానికి పరిరక్షణ సమితుల పేర్లతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై, నాయకులపై పక్కా స్కెచ్ ప్రకారం నానా అభాండాలూ వేస్తున్నారు. ప్రతిరోజూ చెబితే అవి ఎంత పచ్చి అబద్ధాలైనా జనాన్ని నమ్మించవచ్చనేది ‘ఈనాడు’ పుట్టిన దగ్గర్నుంచీ రామోజీరావు అనుసరిస్తున్న వ్యూహం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తరాంధ్ర బాగుపడకూడదన్న దురుద్దేశంతో... ఇపుడదే వ్యూహాన్ని విశాఖ విషయంలో అమలు చేస్తున్నారు. అసలు విశాఖలో భూ కబ్జాలు చేసిందెవరు? ఆ భూముల్ని కబ్జా దారుల నుంచి కాపాడిందెవరు? భూములకు సంబంధించి రామోజీ చేస్తున్న రచ్చలో నిజమెంత? ఒకసారి చూద్దాం... గ‘లీజు’ పనులకు రామోజీ అంకురార్పణ రామోజీరావు తన కబ్జాలు, కుట్రలు మొదలుపెట్టింది ఇక్కడేనని చెప్పాలి. ఎందుకంటే ‘ఈనాడు’ అక్షర వ్యాపారాన్ని ఆరంభించింది విశాఖ సీతమ్మ ధారలోనే!. ఇక్కడి సర్వే నెంబరు 50/4లో 2.78 ఎకరాల భూమిని రామోజీ 1974 మార్చి 30న స్థల యజమాని మంతెన ఆదిత్య వర్మ నుంచి 33 సంవత్సరాల లీజుకు తీసుకున్నారు. మొదటి 14 ఏళ్లూ నెలకు చెల్లించే అద్దె రూ.2,500. తరవాత నెలకు రూ.3వేలు. లీజు గడువు ముగిశాక భూమిని తిరిగి అప్పగించి వెళ్లిపోవాలి. కానీ వెళ్లిపోతే రామోజీ గొప్పేముంది? లీజు స్థలాన్ని కాజేయాలనే దుర్బుద్ధి 1989లోనే పుట్టింది రామోజీకి. అక్కడ రోడ్డు వెడల్పు చేయడానికి 618 గజాలను ప్రభుత్వం తీసుకుంది. ప్రతిఫలంగా సీతమ్మధారలోనే సర్వే నెంబర్ 52లో 872 గజాల స్థలాన్ని కేటాయించారు. మరి ఆ భూమి ఆదిత్య వర్మది కదా? దాన్ని రామోజీ తీసుకున్నది లీజుకు కదా? ప్రభుత్వానికిచ్చే అధికారం ఎవరిది? ప్రభుత్వం పరిహారంగా ఇచ్చే భూమిని తీసుకోవాల్సింది ఎవరు? వీటన్నిటికీ మనం చెప్పే జవాబులు తప్పని నిరూపించారు రామోజీ. ఆదిత్య వర్మకు విషయం చెప్పకుండా... ప్రభుత్వానికి భూములిచ్చి, పరిహారంగా ఇచ్చిన భూమిని తన కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారు. అలా... విశాఖలో మోసాలు మొదలెట్టారు!!. రామోజీ మోసాన్ని ఆలస్యంగా గుర్తించారు ఆదిత్య వర్మ. 2007 సెపె్టంబరు 19న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ రామోజీరావు ‘ఈనాడు’కు చీఫ్ ఎడిటర్ మరి. పోలీసులను అంత తేలిగ్గా విచారణ చేయనిస్తారా? తన మనుషుల ద్వారా ఒత్తిడి తెచ్చారు. పోలీసులు ఊరుకున్నారు. దీంతో ఆదిత్య వర్మ న్యాయపోరాటం మొదలెట్టారు. చివరకు న్యాయమూర్తి స్పందించి... పోలీసులకు అక్షింతలు వేయటంతో విచారణ మొదలైంది. కోర్టులో మరో డ్రామా!! ఈ 420 కేసు కోర్టులో విచారణకు వచ్చాక రామోజీ మరో కుట్రకు తెరలేపారు. రోడ్డు కోసం తాను ప్రభుత్వానికి స్థలమివ్వటం, ప్రతిగా ప్రభుత్వం స్థలాన్ని తన కుమారుడి పేరిట ఇవ్వటం వంటివేవీ తనకు తెలియవంటూ... తాను స్థలం ఇవ్వకముందే అక్కడ రోడ్డు ఉందని వాదించారు. అలాంటపుడు తాను స్థలమెందుకు ఇస్తానని ఎదురు తిరిగారు. దీనికోసం ఏకంగా విశాఖ జోనల్ డెవలప్మెంట్ ప్లాన్‌నే ఫోర్జరీ చేసేశారన్నది అప్పట్లో పిటిషనర్ ఆరోపణ. ఫోర్జరీ మ్యాప్‌లను వారు కోర్టుకు కూడా సమర్పించారు. దీంతో రామోజీపై ఫోర్జరీ, కుట్ర కేసులు కూడా నమోదయ్యాయి. లీజు ముగిసినా ఖాళీ చేయకుండా.. నిజానికి లీజు గడువు 2007తో ముగిసింది. కానీ రామోజీ ఆ స్థలాన్ని ఖాళీ చేయలేదు. అప్పటిదాకా నెలకు ఇస్తున్న రూ.3వేలును రూ.10వేలు చేస్తానని, మరో 33 ఏళ్లు లీజు పొడిగించాలని కోరారు. అప్పటికే అక్కడ స్థలం విలువ దాదాపు రూ.40 కోట్లు ఉండటంతో... కుదరదన్నారు యజమాని వర్మ. కానీ రామోజీ కోర్టుకెళ్లారు. మేజి్రస్టేటు కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా 2014 వరకూ లాగారు. అద్దె కూడా పెంచలేదు. లీజు గడువు ముగిసిన 2007 నుంచీ నెలకు రూ. 3వేల చొప్పున కూడా సక్రమంగా చెల్లించలేదు. దీనిపై స్థల యజమాని రెంట్ కంట్రోల్ కోర్టుకు వెళ్లటంతో... రామోజీ స్టే తెచ్చారు. ఈ స్టేతో చాన్నాళ్లు నెట్టుకొచ్చారు. దీన్ని హైకోర్టులో వర్మ సవాలు చేయగా... రామోజీకి ఎదురుదెబ్బ తగిలింది. దిగువ కోర్టు ఇచ్చిన స్టేను కొనసాగించాలంటే.. తుది తీర్పు వెలువడేదాకా అప్పటి విలువల ప్రకారం నెలకు రూ.17 లక్షల చొప్పున ఈనాడు కార్యాలయానికి అద్దె చెల్లించాలని , అది కూడా ప్రతి నెలా 10వ తేదీలోపు చెల్లించాలని, అప్పటిదాకా బకాయిలుగా ఉన్న అద్దె రూ.2.57 కోట్లను తక్షణం ఇచ్చేయాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. రామోజీ సుప్రీంకు వెళ్లారు. అక్కడా చుక్కెదురు కావటంతో అద్దె చెల్లించాల్సి వచ్చింది. తరవాత చెల్లించటం ఇష్టం లేక స్థలాన్ని ఖాళీ చేశారు. అన్ని వ్యూహాలూ విఫలమవటంతో.. నాలుగేళ్ల తరవాత స్థల యజమానితో రాజీపడి కుట్ర, మోసం, ఫోర్జరీ కేసులనుంచి బయటపడ్డారు. ఇదీ... ఈ నీతుల కొండ బాగోతం. తెల్లారి లేస్తే పేపర్లో అందరికీ సుద్దులు చెప్పే ఈ అనకొండ బాగోతాల్లో ఇది కేవలం విశాఖ పార్ట్ మాత్రమే. హైదరాబాద్‌లో సాగించిన అరాచకాలు గానీ, విజయవాడలో బంధువుల్ని మోసం చేసిన తీరుగానీ, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో జరిపిన అక్రమాలు గానీ రాస్తే.. ఎన్ని పార్ట్‌లైనా సరిపోవేమో!! తెలుగుదేశం కబ్జాల అడ్డా... విశాఖ విచిత్రమేంటంటే కబ్జాలకు కేరాఫ్‌గా మారిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పనిగట్టుకుని వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తుండటం. వాటికి బాకా ఊదుతూ... అవన్నీ నిజమనేట్లుగా రామోజీరావు దరువేయటం. అందరూ కలిసి విశాఖ ప్రజలకు ఓ ఎల్లో చిత్రాన్ని చూపిస్తుండటం!!. నిజానికి అందినకాడికల్లా తెలుగుదేశం నేతలు కబ్జాలు చేస్తే... సిట్ల పేరిట కాలయాపన చేస్తూ... చర్యలకు మాత్రం దూరంగా ఉంటే... గడిచిన మూడేళ్లలో ఏకంగా 430 ఎకరాల భూమిని తిరిగి స్వాదీనం చేసుకున్నది ఈ ప్రభుత్వమేనన్న విషయం ‘ఈనాడు’ ఎప్పుడూ చెప్పదు. ఎందుకంటే ఈ కబ్జాదారుల్లో తెలుగుదేశం మాజీ ఎంపీ, చంద్రబాబు బంధువైన ఎంవీవీఎస్ మూర్తి సహా టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సోదరుడు, అయ్యన్న, బండారుల పుత్రరత్నాలు... ఇలా చాలా మందే ఉన్నారు. వీళ్లని వెనకేసుకు రావటమే తమ బాధ్యతగా భావించే చంద్రబాబు మీడియా మిత్రులెవరూ వీటి విలువ దాదాపు రూ.5వేల కోట్లకుపైనే ఉంటుందని గానీ, ఇంతటి విలువైన భూముల్ని ప్రభుత్వం కాపాడిందని గానీ చెప్పరు. ఆఖరికి దసపల్లా భూముల్లో పాగా వేసి తెలుగుదేశం పార్టీ కార్యాలయం కట్టేసుకున్న చంద్రబాబునూ మహాత్ముడిగానే చెబుతుంటుంది ‘ఈనాడు’. అదీ కథ. లేటరైట్ మాఫియా కేరాఫ్ అయ్యన్న? నోటికొచ్చినట్లు తూలటం, తూగటంలో అయ్యన్నపాత్రుడిని మించిన తెలుగుదేశం నాయకుడు లేడనే చెప్పాలి. విశాఖలో లేటరైట్ తవ్వకాలకు సంబంధించి ఆయన కుటుంబంపై వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ఎందుకంటే విశాఖ మన్యంలో బాక్సైట్ తరవాత అత్యంత విలువైనది లేటరైటే. నాతవరం మండలంలోని పలు గ్రామాల్లో వేల హెక్టార్లలో లేటరైట్ నిక్షేపాలున్నాయి. కాకపోతే వీటిని తవ్వే హక్కు గిరిజనులకే ఉండటంతో 2009 జులైలో సింగం భవాని అసనగిరిలో 5 హెక్టార్లకు, సుందరకోటలో 35.5 హెక్టార్లకు తవ్వకం అనుమతులు పొందారు. బమిడికలొద్దిలో 110 హెక్టార్లకు జర్తా లక్ష్మణ్‌రావు అనుమతి పొందారు. 5 హెక్టార్లు మించితే పర్యావరణ అనుమతులు తప్పనిసరి కావటం... వీటికి అనుమతులు రాకపోవటంతో వారు తవ్వకాలు చేపట్టలేకపోయారు. కానీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక అయ్యన్న కుటుంబీకుల కన్ను లేటరైట్ గనులపై పడింది. తొలుత అధికారాన్ని ఉపయోగించి సింగం భవానీకి చెందిన 5 హెక్టార్లను చెరబట్టారు. వేరొక ఎంపీ కుమారుడితో కలిపి తవ్వకాలు చేపట్టి ... 11 నెలల వ్యవధిలో రూ.20 కోట్లకుపైగా విలువైన ఖనిజాన్ని స్వాహా చేశారు. ఆ తరవాత 110 హెక్టార్లపై కన్నేశారు. లక్ష్మణ్‌రావును, అతని దగ్గర సబ్లీజుకు తీసుకున్న వారిని తొలుత 80 శాతం వాటా అడిగి... ఇవ్వననటంతో కేసులు పెట్టి వేధింపులకు దిగారు. సహకరించని సర్పంచ్‌ను సైతం చెక్‌పవర్ రద్దుచేసి మరీ వేధించారు. చివరకు అక్కడ తవ్వకాలు జరపకుండా కలెక్టర్ ద్వారా నిషేధం ఉత్తర్వులు కూడా జారీ చేయించారు. ఆ ప్రాంతం మొత్తానికి నిషేధం ఉత్తర్వులు వర్తించినా.. తన చేతుల్లో ఉన్న 5 హెక్టార్లను మాత్రం ఆయన గారి పుత్రరత్నం అడ్డూఅదుపూ లేకుండా తవ్వేశాడు. ‘గీత’o దాటి కబ్జాలు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి రుషికొండ ప్రాంతంలో ఏకంగా 42.51 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. బీచ్‌ను ఆనుకుని ఉండే అత్యంత విలువైన ఈ స్థలం... గీతం యూనివర్సిటీకి సమీపంలోనే ఉంది. దీన్ని ఆక్రమించుకుని రెండెకరాల్లో కళాశాల భవన నిర్మాణాలు కూడా చేపట్టారు. మిగిలిన స్థలానికి కాంపౌండ్ వాల్ కట్టేశారు. సుమారు రూ.500 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని దశాబ్దాల పాటు కబ్జా చేసినా... మనోడే కదా అని టీడీపీ సర్కారు పట్టించుకోలేదు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక ఈ కబ్జాలపై దృష్టిపెట్టింది. ప్రహరీని తొలగించి కబ్జాలో ఉన్న 40.51 ఎకరాలను స్వాదీనం చేసుకుంది. అప్పట్లో నానా యాగీ చేయబోయిన పచ్చ బ్యాచ్... ప్రభుత్వం స్థిరంగా నిలబడటంతో తోక ముడుచుకుంది. పల్లా సోదరుడి భూ ఫలహారం.. అధికారులు స్వాదీనం చేసుకున్న భూముల్లో సింహభాగం టీడీపీ నేతల కబంధ హస్తాల్లో ఉన్నవే. గయాలు, పోరంబోకు, గోర్జి, కొండ పోరంబోకు, వాగులు, కాలువలు, గెడ్డలు, రాస్తాలు, గుట్టలు, ఇనాం, జిరాయితీ, గ్రామకంఠాలు, చెరువులు.. ఇలా కాదేదీ కబ్జాకు అనర్హం అన్నట్లుగా కాజేశారు. కొద్దిరోజుల క్రితం గాజువాక నియోజకవర్గం తుంగ్లాం గ్రామ సర్వే నంబరు 33–2లో గుడితో పాటు ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించేందుకు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సోదరుడు పల్లా శంకర్రావు ప్రయత్నించాడు. అడ్డువచ్చిన స్థానిక యువతపై దాడికి యత్నించాడు. ప్రభుత్వ జోక్యంతో వెనక్కి తగ్గాడు. బినామీ పేర్లతో.. లెక్కేలేదు ఇవన్నీ ఒకెత్తయితే టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఆ పార్టీ నేతలు బినామీ పేర్లతో చేసిన కబ్జాలకు లెక్కేలేదు. దీంతో వైసీపీ ప్రభుత్వం గడిచిన మూడేళ్లుగా విశాఖ, దాని చుట్టుపక్కల మండలాల్లో ఆక్రమణలకు గురైన విలువైన ప్రభుత్వ భూములను కాపాడేందుకు చర్యలు తీసుకుంటూ వస్తోంది. ప్రభుత్వ ఆదేశాలతో ప్రత్యేక దర్యాప్తు బృందాలు క్షేత్రస్థాయి పరిశీలనతో భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నాయి. ఫలితంగా మొత్తం 270 ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైన 430.81 ఎకరాల ప్రభుత్వ భూములను తిరిగి స్వాదీనం చేసుకున్నారు. ప్రభుత్వ ధరల ప్రకారం వీటి రిజిస్ట్రేషన్ విలువ రూ.2,638 కోట్లు కాగా మార్కెట్ విలువ రూ.5 వేల కోట్లకుపైనే ఉంటుందని అంచనా. ఆక్రమణలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులూ నమోదు చేస్తున్నారు. ‘బండార’o బయటపడి... పరాజయం ► పెందుర్తి మండలం గుర్రమ్మపాలెంలో గతంలో ఏపీఐఐసీ 110 ఎకరాలు సేకరించి... ఎకరాకు రూ. 23 లక్షల చొప్పున రైతులకు నష్ట పరిహారం చెల్లించింది. అక్కడే బండారు చక్రం తిప్పాడు. ప్రభుత్వానికి చెందిన 20 ఎకరాలకు బినామీలను సృష్టించి... ఆ పరిహారాన్ని తన ఖాతాలో వేసుకున్నాడని అప్పట్లోనే ఆరోపణలొచ్చాయి. అక్కడితో ఆగకుండా... భూమికి పరిహారం పొందిన ప్రతి రైతు నుంచీ ఎకరాకు రూ.5 లక్షల చొప్పున తనకు కట్టాల్సిన పరిహారంగా నిర్ణయించి మరీ లాక్కున్నాడని అప్పట్లో రైతులు బహిరంగంగానే వాపోయారు. కాకపోతే ఇలా ఎన్ని కోట్లు మింగేసినా... అధికారంలో ఉన్నది మిత్రపక్ష తెలుగుదేశం కాబట్టి రామోజీకి ఇలాంటివేవీ కనిపించలేదు. ► ఆ మధ్య దుమారం రేపిన పెందుర్తి మండలం లక్ష్మీపురం భూ వివాదంలోనూ బండారు తనయుడిదే కీలకపాత్ర. అసలు వారసులకు– నకిలీలకు తగవు పెట్టింది అస్మదీయులైతే, ఈ వివాదాన్ని సెటిల్ చేసేందుకు ఈయన భారీగా రూ.10 కోట్ల వరకూ డిమాండ్ చేశాడని, తాము ఇవ్వనందుకు కేసులతో వేధిస్తున్నారని వారసులు అప్పట్లో వాపోయారు కూడా. ► ఇక వేపగుంట, పెందుర్తి ప్రాంతంలో బీఆర్టీఎస్ రహదారిలో భవనాలు కోల్పోయిన వారికి టీడీఆర్ రూపంలో నష్టపరిహారం చెల్లించారు. ఇందులో దాదాపు 300 టీడీఆర్‌లు ఇప్పించినందుకు ఈ పుత్ర రత్నం దాదాపు 5 కోట్లు కొట్టేశారన్నది అప్పట్లో బహిరంగంగానే వినవచ్చింది ► ఇవన్నీ ఈ పుత్రరత్నం భూములకు సంబంధించిన దందాలు. ఇక ఉద్యోగాలిప్పిస్తామంటూ వసూళ్లు, వ్యక్తిగత సెటిల్మెంట్లు వంటివన్నీ లెక్కలోకి తీసుకుంటే ఎన్ని పేజీలైనా చాలవు మరి. -
Varadapuram Suri: భూ కుంభకోణాల 'వరద'.. రంగంలోకి ఏసీబీ
సాక్షి, పుట్టపర్తి: భారీ భూ కుంభకోణాల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత వరదాపురం సూరిపై ఏసీబీ విచారణ మొదలైంది. అనంతపురం జిల్లాలో భారీగా భూ అక్రమాలకు పాల్పడటంతో పాటు టీడీపీ హయాంలో అధికార బలంతో ప్రభుత్వ భూములను అక్రమంగా కొనుగోలు చేశారు. 2014–19 మధ్య కాలంలో ధర్మవరం ఎమ్మెల్యేగా ఉన్న వరదాపురం సూరి...ఆ సమయంలోనే రూ.కోట్లు విలువైన భూములను అక్రమంగా తీసుకున్నట్టు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం ముక్తాపురం పంచాయతీ పరిధిలోని చండ్రాయునిపల్లి గ్రామంలో 155 ఎకరాల ప్రభుత్వ భూములు అక్రమంగా కొనుగోలు చేశారని పలువురు ఫిర్యాదు చేశారు. గ్రామం చుట్టూ వరదాపురం సూరి భూములు కొనుగోలు చేయడం వల్ల చండ్రాయునిపల్లి గ్రామ వాసులు దారిలేక ఊరు వదిలి వెళ్లిపోయారు. ఈ ఆక్రమణలపై ఆర్డీఓ, తహసీల్దార్లకు గ్రామస్తులు పలుసార్లు మొరపెట్టుకున్నారు. చివరకు డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ వేసి విచారణ చేయగా, సూరి అక్రమంగా భూములు కొనుగోలు చేశారని, వాటిని రద్దు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అంతేకాకుండా క్రిమినల్ కేసు కూడా నమోదు చేయాలని ఆదేశాలిచ్చారు. కారుచౌకగా రూ.130 కోట్ల భూమిని కొట్టేసిన వైనం అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వంద గజాల సమీపంలోనే రూ.130 కోట్ల విలువైన భూమిని వరదాపురం సూరి అక్రమంగా కొనుగోలు చేశారు. అన్‌రిజిస్టర్డ్ డాక్యుమెంటు సృష్టించి కారుచౌకగా తన కుమారుడు గోనుగుంట్ల నితిన్ సాయితో పాటు అతని అనుచరుడి పేరుతో కొనుగోలు చేశారు. దీనిపై కూడా బాధితులు జిల్లా రిజిస్ట్రార్, సబ్‌రిజిస్ట్రార్, కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. సూరి భూ కుంభకోణాలపై పలువురు కలెక్టర్‌కు, ఎస్పీకి, ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) రంగంలోకి దిగింది. చదవండి: (బూతు రాజకీయాలు మానుకో సూరీ: ఎమ్మెల్యే కేతిరెడ్డి) సూరి కొనుగోలు చేసిన భూములు, అప్పట్లో జరిపిన లావాదేవీలు, ఆ సొమ్ములు ఎక్కడనుంచి వచ్చాయి తదితర వాటిని ఆరా తీస్తున్నారు. వరదాపురం సూరితో పాటు ఇందులో ఇంకా ఎవరైనా పాత్రధారులు ఉన్నారా... అన్న కోణంలోనూ ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. భూముల కొనుగోళ్లకు సంబంధించిన డాక్యుమెంట్లు పరిశీలించడంతో పాటు అధికారుల స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నారు. మరోవైపు సివిల్ పోలీసులు కూడా తమకు అందిన ఫిర్యాదుల మేరకు వరదాపురం సూరి అక్రమాలపై దర్యాప్తు చేయనున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నప్పుడు ఫిర్యాదులు వచ్చాయి కాబట్టి అనంతపురం జిల్లా పోలీసులే దర్యాప్తు చేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా అనంతపురం జిల్లాలో భూఆక్రమణలపై ఇప్పటికే సబ్ రిజిస్ట్రార్‌ను సస్పెండ్ కూడా చేశారు. ఫిర్యాదుల మేరకే దర్యాప్తు వరదాపురం సూరి భూ ఆక్రమణలపై పలు ఫిర్యాదులు వచ్చాయి. ఆ మేరకే దర్యాప్తు చేస్తున్నాం. ఏసీబీ దర్యాప్తు మొదలైంది. ఏసీబీ తర్వాత మాకు వచ్చిన ఫిర్యాదులపై కూడా పూర్తిస్తాయిలో విచారణ చేస్తాం. అక్రమాలున్నట్టు తేలితే ఎంత పెద్ద వారున్నా చర్యలు తీసుకుంటాం. – డా.ఫక్కీరప్ప కాగినెల్లి, ఎస్పీ, అనంతపురం -
అతడి అవినీతికి 2,320 ఎకరాలు హాంఫట్
సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లాలో భారీ భూ కుంభకోణాన్ని సీఐడీ పోలీసులు ఛేదించారు. నకిలీ పత్రాలతో 2,320 ఎకరాల ప్రభుత్వ భూములను తన తండ్రి పేరుతో ఆన్లైన్ చేయించిన మాజీ వీఆర్వో బాగోతాన్ని బట్టబయలు చేశారు. 13 మండలాల్లోని 18 గ్రామాల్లో భూములను దర్జాగా స్వాహా చేసిన వైనాన్ని బయటపెట్టారు. అక్రమాలకు పాల్పడిన 184 గొల్లపల్లికి చెందిన మాజీ వీఆర్వో మోహన్ గణేష్ పిళ్లైని, మరో నలుగురిని అరెస్టు చేశారు. సీఐడీ డీఎస్పీ జి.రవికుమార్ ఆదివారం తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన మేరకు.. యాదమరి మండలం 184 గొల్లపల్లికి చెందిన మోహన్ గణేష్ పిళ్లై వారసత్వ రీత్యా 1977లో 184 గొల్లపల్లి కరణంగా విధుల్లో చేరాడు. 1984లో గ్రామాధికారుల వ్యవస్థ రద్దు కావడంతో ఉద్యోగం కోల్పోయాడు. తిరిగి 1992లో అదే గ్రామంలో వీఏవోగా ఉద్యోగం సంపాదించిన ఆయన అక్కడే 2010లో వీఆర్వోగా ఉద్యోగ విరమణ చేశాడు. ఎన్నెన్ని నకిలీ పత్రాలో.. ఈ భూముల స్వాహాకు మోహన్ గణేష్ పిళ్లై ఎన్నో నకిలీ పత్రాలు సృష్టించాడు. పుంగనూరు, బంగారుపాళెం, గుర్రంకొండ, సత్యవేడు, ఏర్పేడు, చంద్రగిరి, చిత్తూరు, సోమల, పెద్దపంజాణి, యాదమరి, కేవీపల్లె, రామచంద్రాపురం, తంబళ్లపల్లి మండలాల పరిధిలోని 18 గ్రామాల్లో 2,320 ఎకరాల ప్రభుత్వ భూములకు నకిలీ పత్రాలను సృష్టించి కాజేశాడు. నిందితులు అక్రమంగా తయారు చేసిన రబ్బరు స్టాంప్, నకిలీ దస్తావేజులు ► తన తల్లి అమృతవల్లి యావదాస్తిని మరణానంతరం మనుమలు, మనమరాళ్లకు చెందేలా 1985 ఆగస్టు 16న వీలునామా రాసి చనిపోయినట్లు బంగారుపాళెం సబ్ రిజిస్ట్రారు ఆఫీసులో రిజిస్టర్ చేయించాడు. ► 2005 నుంచి 2010 వరకు గ్రామ అడంగళ్లను కంప్యూటరీకరణ చేసే సమయంలో చిత్తూరు కలెక్టరేట్ ఎన్ఐసీ (నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్) ద్వారా 18 గ్రామాలకు సంబంధించిన అడంగళ్లలోని భూముల వివరాలను ఎల్‌ఆర్‌ఎంఐఎస్ (ల్యాండ్ రికార్డ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్)లో నమోదు చేయించాడు. 13 మండలాల్లోని 18 గ్రామాల పరిధిలో తన తండ్రి శ్రీనివాస పిళ్లైకి 2,320 ఎకరాల భూములు ఉన్నట్లు తన కుమారుడు మధుసూదన్ సహకారంతో 2009 జూలై 1న ఆన్లైన్ చేయించాడు. ► ఆ భూ హక్కులను ఆయన తల్లి అమృతవల్లి పేరిట 1981లో బదిలీ చేస్తున్నట్లుగా ఒక హక్కు విడుదల పత్రం సృష్టించాడు. ► ఆ పత్రం అసలైనదేనని నమ్మించేందుకు పుంగనూరు జమీందారు నుంచి ఖాళీగా ఉన్న పట్టా కాగితాన్ని సేకరించి అందులో తమ పూర్వీకుల పేర్లు నమోదు చేశాడు. ► ఆ భూములకు పన్ను చెల్లించినట్లు నకిలీ రసీదులు తయారు చేయించాడు. మండల రెవెన్యూ కార్యాలయంలో ఖాళీ రసీదులను సేకరించి, వాటిపై పన్ను చెల్లించినట్లు సృష్టించాడు. ► చిత్తూరు కలెక్టరేట్లోని రెవెన్యూ రికార్డులు (అడంగల్) తెప్పించి కంప్యూటరీకరణ చేయించుకున్నాడు. ► కొట్టేసిన భూములను విక్రయించేందుకు టీడీపీ నాయకుడు అడవి రమణ సహకారం తీసుకున్నాడు. ► మీ సేవ ద్వారా 1బి, అడంగల్‌ను తీసుకుని ఆయన పిల్లలు రాజన్, ధరణి, మధుసూదన్ సోమల తహసీల్దార్ శ్యాంప్రసాద్‌రెడ్డిని కలిశారు. సోమల మండలం పెద్ద ఉప్పరపల్లి గ్రామ సర్వే నంబరు 459లో తమకు ఉన్న 160.09 ఎకరాలకు పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వాలని దరఖాస్తు చేశారు. ► రికార్డులు పరిశీలించిన రెవెన్యూ అధికారులు 459 సర్వే నంబర్లో 45.42 ఎకరాల ప్రభుత్వ భూమి మాత్రమే ఉందని గుర్తించారు. 160.09 ఎకరాల భూమి ఆన్‌లైన్‌లోకి ఎలా వచ్చిందని కూలంకషంగా పరిశీలించడంతో అడ్డగోలు రికార్డులు బయటపడ్డాయి. ► దీనిపై దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులు గత ఏడాది మే 29న సోమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో కొత్త విషయాలు వెలుగు చూస్తుండటంతో కేసును సీఐడీకి అప్పగించారు. రంగంలోకి దిగిన సీఐడీ డీఎస్పీ జి.రవికుమార్ విచారణ కోసం ఎస్ఐ అన్సర్ బాషా, ప్రభాకర్, పుష్పలత, రవిచంద్రలను నియమించారు. సీఐడీ దర్యాప్తులో మాజీ వీఆర్వో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో నిందితులైన మోహన్ గణేశ్ పిళ్లై, మధుసూదన్, రాజన్, కోమల, అడవి రమణలను అరెస్టు చేశారు. -
‘ఈటలను బలి పశువుని చేస్తున్న కేసీఆర్’
సాక్షి, హైదరాబాద్: మంత్రి ఈటల రాజేందర్ కబ్జాలకు పాల్పడితే తప్పకుండా శిక్షించాలని, కానీ అంతకంటే ముందు టీఆర్ఎస్ పార్టీలో శిక్షపడాల్సిన వారు చాలా మందే ఉన్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. కాకపోతే కేసీఆర్ తనపై ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకత నుంచి తప్పించుకునేందుకు ఈటలను బలిపశువుని చేసే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈటలను తప్పించాలనేది కేసీఆర్ పన్నాగమని ఆరోపించారు. అలాగే, భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు మల్లారెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, శ్రీనివాస్ గౌడ్లపై ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిపై బండి సంజయ్ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. మంత్రులు మల్లారెడ్డితో పాటు కేటీఆర్ పై కూడా అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఎందుకు విచారణ జరిపించలేదని ప్రశ్నించారు. సీఎం వ్యతిరేక వర్గంపై ఆరోపణలు వస్తే విచారణకు ఆదేశించడం, అనుకూల వర్గాన్ని వదిలేయడం కాకుండా మంత్రి ఈటల రాజేందర్ కోరినట్లు అవినీతి ఆరోపణలున్న మంత్రులు, ఎమ్మెల్యేలందరిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం రాత్రి ఆయన జూమ్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ...ప్రస్తుతం కరోనాతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నాకనీసం స్పందించని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. చదవండి: ఈటల కథ క్లైమాక్స్‌కు.. ఏం జరగబోతోంది..? -
ఈటల కథ క్లైమాక్స్‌కు.. ఏం జరగబోతోంది..?
-
ఈటల కథ క్లైమాక్స్‌కు.. ఏం జరగబోతోంది..?
కొంత కాలంగా పార్టీలో ధిక్కార స్వరం వినిపిస్తున్న రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం క్లైమాక్స్‌కు చేరిందా..? మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేటలో అసైన్డ్ భూముల ఆక్రమణ అంశంలో ఈటలపై వచ్చిన ఆరోపణలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు..? తనకు ఆత్మగౌరవం కన్నా.. ఏ పదవి ముఖ్యం కాదని ఈటల చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న మర్మమేంటి..? ఈటల భవిష్యత్ అడుగులు ఎటువైపు పడబోతున్నాయి..? రాజకీయ వర్గాలతోపాటు కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజల్లో ఆద్యంతం నెలకొన్న ప్రశ్నలివి. సాక్షి, కరీంనగర్ : ఈటల రాజేందర్.. 2004 నుంచి ఎమ్మెల్యేగా, ఫ్లోర్ లీడర్‌గా, మంత్రిగా టీఆర్ఎస్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సన్నిహితుల్లో కీలక నేత ఈటల. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పార్టీ, అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్న ఆయన పలుమార్లు తన అభిప్రాయాన్ని నర్మగర్భంగా చెపుతూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేశారు. అయితే.. ప్రజల పక్షాన మాట్లాడుతున్నానంటూ... కొన్ని సార్లు ప్రభుత్వంపై వాగ్బాణాలు సంధించేందుకూ వెనుకాడలేదు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఇటీవల చురుకైన పాత్ర పోషిస్తున్న ఈటల తన సమర్ధతను చాటుకున్నారు. వ్యాక్సిన్ కొరత విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అంతా సర్దుకుంటుందనుకునే లోపే శుక్రవారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చిన మాసాయిపేట మండలంలోని అసైన్డ్ భూముల వివాదం కొత్త చర్చకు దారితీసింది. రాష్ట్ర రాజకీయాల్లో కరీంనగర్లో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. ఏం జరగబోతోంది..? మెదక్ జిల్లా భూముల వ్యవహారంలో 100 ఎకరాల అసైన్డ్ భూములు కబ్జా చేశారని కొన్ని ఛానెళ్లలో ప్రసారం కావడాన్ని మంత్రి ఈటల తప్పు పట్టారు. అసైన్డ్ భూములను కొనుగోలు చేసేందుకు న్యాయంగా తాను సాగించిన ప్రయత్నాలను వివరిస్తూనే ముఖ్యమంత్రి కేసీఆర్, సీఎంవోలో ముఖ్యుడైన నర్సింగారావుకు కూడా అసైన్డ్ భూముల గురించి చెప్పానని, ఎక్కడా ఎకరం కూడా తాను కబ్జా చేయలేదని చెప్పుకొచ్చారు. అసైన్డ్ భూముల వ్యవహారంలో ముఖ్యమంత్రి విచారణకు ఆహ్వానించడాన్ని స్వాగతిస్తూనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, తాను తప్పు చేసినట్లు తేలితే దేనికైనా సిద్ధమన్నారు. తాను తప్పు చేసినట్లు తేలే వరకు మంత్రిగా రాజీనామా చేసే అంశమే ప్రస్తావనకు రాదన్న రీతిలో వివరణ ఇచ్చారు. అయితే.. ముఖ్యమంత్రి సీరియస్ అయి వెంటనే ప్రాథమిక నివేదిక ఇవ్వాలని మెదక్ కలెక్టర్‌ను ఆదేశించడం.. టీఆర్ఎస్ నేతలెవరూ మంత్రికి అనుకూల వ్యాఖ్యలు చేయకపోవడం.. ఈటల ధిక్కార స్వరం.. వెరసి కథ క్లైమాక్స్‌కు చేరిందనే సంకేతాలు వెలువడుతున్నాయి. రెండోసారి గెలిచిన నాటి నుంచి దూరంగా... 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల మరోసారి విజయదుందుబి మోగించారు. అయితే.. మంత్రివర్గ కూర్పులో ఆయనకు స్థానం లేదనే సంకేతాలు వెలువడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల్లో చొప్పదండి టికెట్టు విషయంలో ఈటల అధిష్టానానికి వ్యతిరేకంగా వెళ్లాడనేది అప్పటి ప్రచారం. అయితే.. చివరి నిమిషంలో కేసీఆర్‌కు సన్నిహితుడైన జిల్లాకు చెందిన ఓ నాయకుడు రంగ ప్రవేశం చేశారని, దాంతో ఆరోగ్యశాఖ మంత్రిగా అవకాశం లభించిందని అప్పట్లో వినిపించింది. కాగా.. ఈటల తనకు మంత్రి పదవి లభించినా.. తెలంగాణ ఉద్యమ నాయకుడైన తనకు పార్టీలో తగిన ప్రాధాన్యత లభించలేదనే అభిప్రాయంలోనే ఉండేవారు. తరువాత జిల్లాకు చెందిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా తన ప్రాధాన్యత తగ్గించారని ఆయన భావించినట్లు సన్నిహితులు చెపుతారు. ఈ క్రమంలోనే పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మంత్రి పదవి భిక్ష కాదు.. గులాబీ జెండాకు ఓనర్లం.. పార్టీ, పదవి ఉన్నా లేకున్నా నేనుంటా..’ వంటి వ్యాఖ్యలతో అందరి దృష్టిని ఆకర్షించారు. గత ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో సాగిన పోరాటానికి బాహాటంగా మద్దతు తెలిపారు. ఈ క్రమంలో పార్టీ విధానాలను కూడా తోసిరాజన్నారు. రైతుల కోసం తానుంటానని, ధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్యత నుంచి ప్రభుత్వాలు తప్పించుకోకూడదని అప్పట్లో వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో కూడా రాజకీయాల్లో నైతికత గురించి, ఆత్మగౌరవం గురించి వ్యాఖ్యలు చేస్తూ తనదైన శైలిని కొనసాగించారు. అసెంబ్లీ సమావేశాల ముగింపు రోజు మంత్రి కేటీఆర్ తన కారులో ఈటలను ప్రగతిభవన్‌కు తీసుకెళ్లారు. ఆ తరువాత ఈటల వాయిస్‌లో మార్పు వస్తుందని అంతా భావించారు. అయితే.. తనదైన నర్మగర్భపు వ్యాఖ్యలతో ఆయన వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. కేసీఆర్‌కు సన్నిహితుడిగా.. కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్లో చేరిన నాటి నుంచి ఈటల రాజేందర్ అధినేతకు సన్నిహితుడిగానే వ్యవహరించారు. బీసీ నాయకుడిగా, తెలంగాణ ఉద్యమంలో ముందున్న నాయకుడిగా పార్టీలో పట్టు సాధించారు. తొలుత 2004లో కరీంనగర్ జిల్లా కమలాపూర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఈటల.. 2009 నుంచి హుజూరాబాద్‌ను అడ్డాగా మార్చుకున్నారు. ఇప్పటివరకు ఉప ఎన్నికలతో కలిపి ఆరు సార్లు ఇక్కడి నుంచి విజయం సాధించారు. టీఆర్ఎస్ అధికారంలో లేనప్పుడు ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో పార్టీ ఫ్లోర్ లీడర్‌గా, అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కేసీఆర్ అంతరంగికులైన సన్నిహిత వ్యక్తుల్లో ఈటల రాజేందర్ ఒకరుగా నిలిచారు. అలాంటి ఈటల కొంతకాలంగా పార్టీలో, ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారాలపై తన అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు. ‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు.. ప్రజలకు అనుకూలంగా మాట్లాడుతున్నానని’ అసైన్డ్ బూముల ఆక్రమణ ఆరోపణలపై హైదరాబాద్ శివారు శామీర్ పేటలోని తన నివాసంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పిన మాటల అంతరార్థం కూడా ఇదే. చదవండి: ఈటలపై ఆరోపణలు.. కేసీఆర్ సంచలన నిర్ణయం అంతా తప్పుడు ప్రచారం.. విచారణ చేస్కోండి: ఈటల సవాల్ టీఆర్ఎస్ సర్కార్‌లో 'భూ'కంపం -
అమరావతిలో భారీ మోసం
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అమరావతిలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. రమేష్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి రూ.12 కోట్లు విలువైన భూమిని బలవంతంగా ఓ వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. రాజధాని ప్రాంతంలో భూములకు భారీ డిమాండ్‌తో అతను ఇలాంటి చర్యలకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. అమరావతికి చెందిన చేకూరి వెంకటేశ్వరరావు చౌదరి అనే భూ వ్యాపారి రమేష్‌కు చెందిన 6.33 ఎకరాల పంట భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తన భూమిని వెంటనే తనకు తిరిగి ఇచ్చేయాలని రమేష్ డిమాండ్ చేయగా హత్యా బెదిరింపులకు పాల్పడ్డారని.. విషయం ఎవరికైనా చెప్తే పిల్లలను చంపేస్తానని వెంకటేశ్వరరావు బెదిరించారని అతను వాపోయాడు. రమేష్ ఇంటిపక్కనే నివశిస్తూ వెంకటేశ్వరరావు ఈ మోసానికి పాల్పడ్డారని, దైవ కార్యక్రమాలతో ఉండే రమేష్ అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఇలా మోసం చేశాడని స్థానికులు బెబుతున్నారు. స్థానికుల అండతో రమేష్ పోలీసులను ఆశ్రయించాడు. ఆయన ఫిర్యాదు మేరకు ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కాగా గత ప్రభుత్వంలో అనేక భూకుంభకోణాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. స్థానికులను బెదిరించి పెద్ద మొత్తంలో భూములను స్వాధీనం చేసుకున్న అనేక ఘటనలు గతంలో వెలుగులోకి వచ్చాయి. -
అమరావతి బకాసురులు
-
భూ కుంభకోణాల గుట్టువిప్పుతాం
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అడ్డగోలు కేటాయింపులు.. భూ కుంభకోణాల గుట్టువిప్పుతాం... అవినీతి, అక్రమాలను వెలుగులోకి తెస్తాం.. ఇందు కోసం ప్రత్యేక కమిటీని నియమిస్తాం.. గత పాలకుల భూ కుంభకోణాల వల్ల జిల్లాకు చెడ్డ పేరు వచ్చింది.. దాన్ని రూపు మాపి జిల్లాను అగ్రపథాన నిలపడానికి మీరు...మేము కలసి పని చేద్దామని అధికారులకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు సూచించారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన అందిద్దామని చెప్పారు. స్థానిక గవర్నర్ బంగ్లాలో జీవీఎంసీ, వీఎంఆర్డీఏ అధికారులతో శనివారం పలు ప్రాజెక్టుల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ గతంలో జరిగిన పనులు, కేటాంపుల్లో అవకతవకలు ఉంటే వెలుగులోకి తేవాలని ఆదేశించారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. సమష్టిగా పని చేసి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువచేద్దా మన్నారు. ఈ క్రమంలో బాగా పని చేసిన అధికారులకు సీఎం జగన్మోహన్రెడ్డితో సన్మానం చేయిస్తానని చెప్పారు. అన్ని ప్రాంతాల్లో మౌలిక వసతులైన తాగునీటి, రోడ్లు, పారిశుధ్యం, విద్యుత్తు సరఫరా తదితర వసతులను మెరుగుపర్చాలని ఆదేశించారు. ఎన్ఏడీ ట్రాఫిక్ సమస్యపై దృష్టి పెట్టండి ఎన్ఏడీ వద్ద ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని, ఆ జంక్షన్లో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పనులు సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. వీఎంఆర్డీఏ మాస్టర్‌ప్లాన్ ప్రకారం రోడ్డు నిర్మాణాలు జరిగేలా చూడాలన్నారు. వీఎంఆర్డీఏ, పర్యాటక శాఖ సమన్వయంతో పనిచేస్తూ పర్యాటక ప్రాజెక్టు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, పర్యాటకులకు దివ్యదామంగా విశాఖను తీర్చిదిద్దాలన్నారు. రాష్ట్రాన్నికి పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు వీసా ఆన్ ఎరైవల్ విధానాన్ని అములు పర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీని కోసం ప్రత్యేకంగా ఒక అంబాసిడర్‌ను నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నెల 2న0న ఎమ్మెల్యేలతో కలిసి శాఖల వారీగా సమీక్ష సమావేశం నిర్వహిస్తామని, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు. ప్రత్యేకంగా జీవిఎంసీ ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షించేందుకు 21న సమావేశం నిర్వహిస్తాననని మంత్రి చెప్పారు. భీమిలి నియోజకవర్గంపై సమీక్ష భీమిలి బీచ్ రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్లను సాధ్యమైనంత త్వరగా ఖరారు చేసి పనులను ప్రారంభించాలని సూచించారు.మత్స్యకారుల రక్షణకు తీసుకోవాల్సిన అంశాలపై దృష్టిసారంచాలని, అందుకు అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించాలని సూచించారు.చిట్లివలస శ్మశానవాటిక అభివృద్ధికి గతంలో మంజూరు చేసిన నిధులు దుర్వినియోగం అయినట్టు ఆరోపణలు ఉన్నాయని.. దానిపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గోస్తనీనదిపై కాజ్వే నిర్మాణానికి ప్రతిపాదించిన పనులను వేగవంతం చేసి జూలై 15 నాటికి శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని ఇరిగేషన్ శాఖ ఎస్ఈను ఆదేశించారు. అదేవిధంగా మధురవాడ, పరదేశిపాలెం బోయిపాలెం తదితర ప్రాంతాల్లో భవన సముదాయాల నిర్మాణానికి నియమ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేశారని జీవిఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జోన్–1 పరిధిలోని పలు వార్డుల్లో డ్రైన్లు, రోడ్ల నిర్మాణం, పారిశుధ్య నిర్వహణను మెరుగుపర్చాలని జీవీఎంసీ అధికారులకు మంత్రి సూచించారు. జేఎన్ఎన్యూఆర్ఎం గృహాల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, వాటిపై సమగ్ర నివేదిక అందజేయాలని జీవీఎంసీ కమిషనర్‌ను ఆదేశించారు. నివాసయోగ్యమైన భవన సముదాయాల్లో ప్రైవేటు పాఠశాలల ఏర్పాటును ఎలా అనుమతిస్తారని, ఆయా పాఠశాలను వెంటనే అక్కడి నుంచి తరలించే చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ వి.వనయ్చంద్, జీవీఎంసీ కమిషనర్ ఎం. హరినారాయణన్, వీఎంఆర్డీఏ కమిషనర్ బసంత్‌కుమార్, కార్యదర్శి శ్రీనివాస్, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
ఉత్తుత్తి ‘సిట్’!
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విశాఖ భూకుంభకోణం దర్యాప్తు పెద్ద ఫార్సుగా ముగిసింది. ప్రతిపక్షం సహా అన్ని వర్గాల నుంచి ఈ భూదందాపై తీవ్ర విమర్శలు మూటగట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. వాటి నుంచి గట్టెక్కేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుచేయడం మొక్కుబడి తంతేనని తేలిపోయింది. పూర్తిస్థాయిలో విచారణ జరిగితే తమ పునాదులు ఎక్కడ కదులుతాయనే భయంతో ‘సిట్’కు ఎలాంటి న్యాయపరమైన అధికారాలు ఇవ్వలేదని స్పష్టమైంది. తమకు పరిమితులు విధించారని ప్రత్యేక దర్యాప్తు బృందమే ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొనడం ఇప్పుడు అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. విశాఖ జిల్లాలో వేల ఎకరాల ప్రభుత్వ భూములను రాష్ట్ర కేబినెట్లో ఓ మంత్రి దోచేశారని, ప్రభుత్వ రికార్డులను తారుమారు చేశారని, వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయిపోయిందని కేబినెట్లోని మరో మంత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాకుండా.. ప్రభుత్వ భూములను అధికార పార్టీకి చెందిన పెద్దలు వేల ఎకరాలను కాజేశారన్న వార్తలు పతాక శీర్షికలెక్కాయి. ఈ నేపథ్యంలో డిప్యూటి ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్వయంగా గత ఏడాది జూన్ 15న ప్రజా విచారణను చేపట్టారు. అయితే, ఇది కొనసాగితే తమతో పాటు కేబినెట్లో సదరు మంత్రి భూ దాహం, ఆక్రమణలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో ప్రభుత్వం ఆఘమేఘాలపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటుచేసింది. ఇది 2017 జూన్ నుంచి జనవరి 2018 వరకు విచారణ చేపట్టి ఈ ఏడాది జనవరిలో తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అయితే, ‘సిట్’కు న్యాయపరమైన ఎటువంటి అధికారాలు ఇవ్వలేదని, క్రిమినల్ ప్రొసీడింగ్స్ కోడ్ ప్రకారం ఏ ప్రాంతాన్నైనా తనిఖీలు చేసే అధికారంగానీ, రికార్డులను స్వాధీనం చేసుకోవడంగానీ.. ప్రైవేట్ వ్యక్తులను విచారణకు పిలిచే అధికారాలు కానీ ఇవ్వలేదని.. కొన్ని పరిమితులను విధించారని ‘సిట్’ ఆ నివేదికలోనే స్పష్టం చేసింది. దీన్నిబట్టి చూస్తే విశాఖ భూకుంభకోణంపై ‘సిట్’ విచారణ ఓ పెద్ద ఫార్సుగా మారిందని అధికార వర్గాలే పేర్కొన్నాయి. కేబినెట్ మంత్రిపై మరో కేబినెట్ మంత్రి చేసిన ఆరోపణలను వదిలేసి, ‘ముఖ్య’నేత సూచనలతో గతంలోనే భూ కుంభకోణం జరిగిందనే రీతిలోను ‘సిట్’ నివేదికను రూపొందించింది. 2015లో 18 ఎంట్రీలు ట్యాంపరింగ్ 2015లోనే విశాఖ రూరల్ పరిధిలోని ప్రభుత్వ రికార్డుల్లో 18 ఎంట్రీలు టాంపరింగ్ అయినట్లు గుర్తించినప్పటికీ 2017 వరకు జిల్లా కలెక్టర్ ఎటువంటి చర్యలను తీసుకోలేదని ‘సిట్’ తన నివేదికలో పేర్కొంది. అలాగే, 1995, 2005, 2007, 2013, 2015 సంవత్సరాల్లో ప్రభుత్వ రికార్డులు టాంపరింగ్ జరిగినట్లు ‘సిట్’ దర్యాప్తుల్లో తేలినట్లు పేర్కొన్నారు. అయితే, జిల్లా అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవడంలో విఫలమైందని అందులో ప్రస్తావించారు. ప్రైవేట్ భూమి టైటిల్ నుంచి 1బి రిజిస్టర్లోను, వెబ్ ల్యాండ్లోను ఇతర ప్రైవేట్ వ్యక్తుల పేర్ల మీద మార్చేసినట్లు ‘సిట్’ తన నివేదికలో స్పష్టంచేసింది. అయితే, ఇలా ఎవరు చేశారనే దానికి ఆధారాల్లేవని తెలిపింది. అలాగే, ప్రభుత్వ భూముల టైటిల్‌ను ప్రైవేట్ వ్యక్తుల పేర్ల మీదకు మార్చేశారని, అలాంటి వారిపై క్రిమినల్, క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు ఆ భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ‘సిట్’ సిఫార్సు చేసింది. ఐఏఎస్‌లు, కలెక్టర్లు, జేసీల పాత్రపై అనుమానాలు ఇదిలా ఉంటే.. ఈ భూబాగోతం వ్యవహారంలో పలువురు ఐఏఎస్‌లు, జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, గ్రామ రెవెన్యూ ఆఫీసర్లు, డిప్యూటీ తహసీల్దార్లు, డిప్యూటీ కలెక్టర్లు, సబ్ రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్ పాత్ర ఉన్నట్లు అనుమానాలున్నాయని ‘సిట్’ పేర్కొంది. భూ ఆక్రమణలు, రికార్డుల ట్యాంపరింగ్‌కు సంబంధించి మొత్తం 2,875 దరఖాస్తులు వచ్చాయని.. ఇందులో ప్రజల నుంచి వచ్చినవి 333. 113 అంశాలపై వివిధ రాజకీయ పార్టీలు ఇచ్చిన 11 దరఖాస్తులు ‘సిట్’ పరిధిలోకి రాగా.. మిగతా 2,531 దరఖాస్తులు ‘సిట్’ పరిధిలోకి రాలేదని, వీటిని జిల్లా కలెక్టర్ పరిధిలో ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. మాజీ సైనికులు, రాజకీయ బాధితులకు ఇచ్చిన భూములను విక్రయించేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు జారీచేసిన 68 కేసులను కూడా ‘సిట్’ గుర్తించింది. ప్రైవేట్ వ్యక్తులకు ప్రభుత్వోద్యోగుల దాసోహం విశాఖ జిల్లాల్లోని 40 మండలాలకు చెందిన 1,494 కేసులు రెండు ప్రైవేట్ పార్టీల మధ్య భూ వివాదాలకు సంబంధించినవని, వీటిలోని 763 కేసుల్లో పరిపాలనపరమైన వైఫల్యాలున్నాయని, ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు పక్కదారి పట్టించి ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులకు ప్రయోజనం కలిగించారని, 618 కేసులు ప్రభుత్వ భూముల్లో ప్రైవేట్ వ్యక్తుల జోక్యం ఉందని గుర్తించినట్లు ‘సిట్’ తన నివేదికలో స్పష్టంచేసింది. చాలా కేసుల్లో రికార్డులు లభ్యం కాకపోవడం, అధికారులు బదిలీ కావడం, రికార్డులను ఒక ఆఫీస్ నుంచి మరో ఆఫీస్‌కు తరలింపులో ఆ రికార్డులు మాయం కావడం, లింక్‌లు మిస్ కావడంతో ‘సిట్’ ఏమీ చేయలేకపోయిందని నివేదికలో వివరించారు. 1,225.92 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు 4,318 చదరపు మీటర్లు, 7,136 చదరపు అడుగుల స్థలాలు ఆక్రమణకు గురయ్యాయని.. 751.19 ఎకరాల అసైన్డ్ భూమి అన్యాక్రాంతమైందని, అలాగే.. 109 కేసుల్లో పట్టాదారు పుస్తకాల్లో అక్రమాలు జరిగాయని ‘సిట్’ స్పష్టం చేసింది. ఇవీ ‘సిట్’ సిఫార్సులు.. – భూ ఆక్రమణలు, అక్రమాలకు సంబంధించి విశాఖ జిల్లాలో గతంలో పనిచేసిన ముగ్గురు జిల్లా కలెక్టర్లు, అలాగే.. గతంలో పనిచేసిన నలుగురు జిల్లా జాయింట్ కలెక్టర్లు, ముగ్గురు జిల్లా రెవెన్యూ ఆఫీసర్లు, పది మంది ఆర్డీవోలు, జిల్లా రిజిస్ట్రార్, పలువురు తహసీల్దార్లపైన, అలాగే ఓ మాజీ మంత్రితో పాటు అతని నలుగురు అనుచరులపైన క్రిమినల్, క్రమశిక్షణ చర్యలను తీసుకోవాలి. – 50 కేసులకు సంబంధించిన ప్రైవేట్ వ్యక్తులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. – 49 కేసులకు సంబంధించిన ప్రభుత్వ అధికారులపైనా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. – 134 కేసులకు సంబంధించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. – 20 కేసులకు సంబంధించి ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా పేర్కొన్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. – వెబ్‌ల్యాండ్‌లో 34 కేసులకు సంబంధించి ప్రభుత్వ భూమిగా ఉంటే రికార్డుల్లో ప్రైవేట్ వ్యక్తుల పేర్లుగా పేర్కొన్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. – 29 కేసులకు చెందిన రిజిస్ట్రేషన్ డీడ్స్‌ను రద్దు చేయాలి. – గతంలో మూసివేసిన క్రిమినల్ కేసులను పునరుద్ధరించాలి. – విశాఖ జిల్లాలో రెవెన్యూ, సర్వే రికార్డులు మాయమైన తరహాలోనే ఇతర జిల్లాల్లో పరిస్థితులు కూడా ఇలాగే ఉండి ఉంటాయని.. వీటిని సరిచేయడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. -
ఎయిర్‌పోర్టుల పేరుతో భూములు దోచుకుంటున్నారు
-
విజయవాడలో మరో భూ బాగోతం
-
సర్కారీ భూములన్నీ స్వాహా!
సాక్షి, అమరావతి : మొన్న రాజధాని భూముల కుంభకోణం.. నిన్న విశాఖ భూముల మాయాజాలం.. మధ్యలో సదావర్తి గుడి భూముల స్కామ్... రాష్ట్రంలో వీట న్నింటినీ తలదన్నే రీతిలో మరో భారీ భూ కుంభకోణం జరుగుతోంది. శతకోటి సమస్యలకు అనంతకోటి ఉపాయాలన్నది నానుడి. అయితే అధికారపార్టీ నేతలు మాత్రం సర్కారు భూములను కైంకర్యం చేయడానికి సవాలక్ష ఎత్తులు వేస్తున్నారు. ‘డీమ్డ్ మ్యుటేషన్ల’ ముసుగులో భారీగా భూములు కొల్లగొడుతున్నారు. ఇందుకు సూత్రధారులు అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు కాగా పాత్రధారులు క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారులు. సామదాన భేద దండోపాయాలతో కొంతమంది అధికారులను లొంగదీసుకుంటున్న నాయకులు ప్రభుత్వ భూములను సొంతం చేసుకుంటున్నారు. నాలుగునెలల వ్యవధిలో 1.17 లక్షల డీమ్డ్ మ్యుటేషన్లు జరిగాయంటే రాష్ట్రంలో సర్కారీ భూములను ఏ స్థాయిలో కైంకర్యం చేసుకుంటున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇంతకీ డీమ్డ్ మ్యుటేషన్లంటే ఏమిటి? అధికారపార్టీ నాయకులు వీటిని వరంలా ఎలా మార్చుకున్నారో వివరంగా చూద్దాం.. మ్యుటేషన్.. డీమ్డ్ మ్యుటేషన్... తాజా మార్పులకు అనుగుణంగా భూ యాజమాన్య రికార్డులను సవరించడాన్ని ‘మ్యుటేషన్’ అంటారు. వంశపారంపర్యంగా, లేదా కొనుగోలు ద్వారా వచ్చిన భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డుల్లో తన పేరు నమోదు చేసి యాజమాన్య హక్కులు కల్పించాలంటూ రెవెన్యూ శాఖకు మీసేవ కేంద్రాల ద్వారా పెద్ద సంఖ్యలో అర్జీలు వస్తుంటాయి. కొంతమంది తప్పుడు రికార్డులు సృష్టించి ప్రభుత్వ భూములు తమవంటూ రికార్డుల సవరణ కోసం దరఖాస్తులు చేస్తుంటారు. భూ యాజమాన్య హక్కుల ప్రత్రం (1–బి), భూ అనుభవ పుస్తకం (అడంగల్) తదితర రెవెన్యూ రికార్డుల్లో యజమాని పేరును, లేదా విస్తీర్ణాన్ని మార్చడాన్ని, అదనంగా సర్వే నంబర్లను చేర్చుతూ సవరణలు చేయడాన్ని రెవెన్యూ పరిభాషలో మ్యుటేషన్ అని అంటారు. ఉదాహరణకు కృష్ణా జిల్లా నందిగామ మండలం పరిటాల గ్రామంలోని 120 సర్వే నంబరులో పది ఎకరాల భూమి ప్రభుత్వానిది అని రెవెన్యూ రికార్డుల్లో ఉందనుకుందాం. ఈ భూమి వంశపారంపర్యంగా తనదని, అందువల్ల రికార్డులను సరిచేసి ఈ భూమి యజమానిగా తన పేరు నమోదు చేయాలంటూ నారాయణ అనే వ్యక్తి మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేశారనుకుందాం. ఇలా వచ్చిన అర్జీని తహశీల్దారు పరిశీలించి రికార్డులను సరిచూసి వాస్తవాలు నిర్ధారించి 21 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలి. అర్జీలోని వివరాలు తప్పయితే తిరస్కరించాలి. వాస్తవమైతే తదనుగుణంగా మార్పు చేర్పులు (మ్యుటేషన్) చేయాలి. ఇలా తహసీల్దారు పరిశీలించి అన్నీ సక్రమంగా ఉన్నాయని ఆమోదించి సంతకంతో చేసిన మ్యుటేషన్ల విషయంలో ఏమైనా తప్పులు జరిగినట్లు భవిష్యత్తు విచారణల్లో తేలితే వారిపై చర్యలు తీసుకోవచ్చు. అర్జీ వచ్చిన నెల రోజుల్లోగా పరిష్కరించని పక్షంలో డీమ్డ్ (ఆటోమేటిక్) మ్యుటేషన్ అయిపోతుందని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇలాంటి మ్యుటేషన్లకు తహసీల్దార్ల బాధ్యత ఉండదని అధికారులు అంటున్నారు. అందుకే చాలామంది నాయకులు తహసీల్దార్లను నయానో భయానో లొంగదీసుకుని సర్కారు భూములను ఆటోమేటిక్ మ్యుటేషన్ల ఖాతాలో వేసేలా చేస్తున్నారు. ఆ లొసుగే వారికి ఆసరా.. ‘నెల రోజులు దాటి పెండింగులో ఉన్న దరఖాస్తులు ఆటోమేటిగ్గా ఆమోదం పొందినట్లే. ఆ మేరకు రెవెన్యూ రికార్డుల్లో మార్పులు (మ్యుటేషన్) చేయాలి..’ అనే ఉత్తర్వులను కొందరు నాయకులు వరంగా మార్చుకుని ప్రభుత్వ భూములను తమ పేర్లతో రికార్డుల్లో నమోదు చేయించుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారమంతా అధికారపార్టీ నాయకుల మోసపూరిత వైఖరితో పక్కా స్కెచ్‌తో సాగుతోంది. ‘డీమ్డ్’ ఉత్తర్వుల్లోని ఈ లొసుగును అనుకూలంగా మార్చుకుని అడ్డగోలుగా ప్రభుత్వ భూములను సంపన్నులు, అధికార పార్టీకి చెందిన బడా, చోటా మోటా నాయకులు తమ పేరుతో రాయించుకుంటున్నారు. నాలుగునెలల్లో 1.17 డీమ్డ్ మ్యుటేషన్లు.. డీమ్డ్ మ్యుటేషన్ల కుంభకోణం ఇటీవల బయటపడిన విశాఖ జిల్లా భూ కుంభకోణాన్ని మించిపోయేలా ఉందని రెవెన్యూవర్గాలు ఆందోళన చెందుతున్నాయి. కేవలం మూడు, నాలుగు నెలల స్వల్ప కాలంలో ఏకంగా 1.17 లక్షల మ్యుటేషన్లు డీమ్డ్ ఖాతాలో జరిగిపోయాయి. తాజాగా తహసీల్దార్లతో రాష్ట్ర రెవెన్యూ ఉన్నతాధికారులు జరిపిన సమీక్షలో డీమ్డ్ మ్యుటేషన్ల అంశం తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైంది. ‘ ఇలా మీరు పరిశీలించి, ఆమోదించకుండా.. కావాలనే జాప్యం చేసి.. దరఖాస్తును పక్కన పెట్టి.. జీవోను అడ్డం పెట్టుకుని.. డీమ్డ్ మ్యుటేషన్లు చేయడం దారుణం. ఇక నుంచి కచ్చితంగా ఇలా జరగకుండా చూడండి. మాచేతికి మకిలి అంటదనే చందంగా మీరు (తహశీల్దార్లు) వ్యవహరిస్తున్నారు. ఇది ఏమాత్రం మంచి విధానం కాదు...’ అని ఉన్నతాధికారులు హెచ్చరించారు. అధికారికంగా బయటకు చెప్పకపోయినా ఇందులో భారీ అక్రమాలు (సరిదిద్దుకోలేని తప్పులు) జరిగిపోయాయని రెవెన్యూ శాఖలో వినిపిస్తోంది. తహశీల్దార్లపై తీవ్ర స్థాయిలో వత్తిళ్లు.. రకరకాలుగా ప్రలోభపెట్టి, అనేక రకాలుగా బెదిరించి తహశీల్దార్లపై తీవ్ర స్థాయిలో వత్తిడి తెచ్చి అధికారపార్టీ నేతలు తామనుకున్నది సాధించుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులోని ఒక తహశీల్దారును అధికార పార్టీ మండల నాయకుడు కలిసి ‘నీకు ఇవ్వాల్సింది ఇస్తాను. నీకూ ప్రొటోకాల్, ఇతర ఖర్చులు ఉంటాయి కదా. ఆ పది ఎకరాలు నాపేరుతో ఎక్కించు ఏమీ కాకుండా చూసుకుంటా...’ అని చెప్పారు. ‘ప్రభుత్వ భూమి మాదంటూ మీరు తప్పుడు పత్రాలతో దరఖాస్తు చేస్తే దానిని మేము ఆమోదించడం సరికాదు.. రేపు విచారణ జరిగితే దొరికిపోతాం.’ అని ఆ అధికారి తెలిపారు. ‘ఎందుకు ఆందోళన? మా దరఖాస్తు ఆమోదించకుండా గడువు ముగిసే (నెల రోజులు దాటే) వరకూ పెండింగులో పెట్టు. తర్వాత డీమ్డ్ (ఆటోమేటిక్) మ్యుటేషన్ కింద రెవెన్యూ రికార్డుల్లో ఆ భూ యాజమాన్య హక్కులు మాకు దక్కేలా నమోదు చేయి..’ అని తహశీల్దారుపై సదరు నాయకుడు వత్తిడితెచ్చారు. ఆ నాయకుడిని ఎదిరించలేక.. ఏమీ చేయలేక ఆ తహశీల్దారు ఆయన చెప్పినట్లే చేశారు. ఈ విషయాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్లోని ఓ సీనియర్ అధికారి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా ‘‘చాలా చోట్ల ఇదే తంతు సాగుతోంది. దీంతో ఏమి చేయాలో దిక్కుతోచడం లేదు. బయటకు చెప్పలేకపోతున్నాం గానీ ఈ వ్యవహారంలో భారీ భూకుంభకోణం సాగుతున్నట్లు స్పష్టమవుతోంది ’’ అన్నారు. ‘‘వాస్తవంగా ఇలాంటి జీవో జారీ చేయడమే తప్పు.. మ్యూటేషన్ దరఖాస్తులు నిర్దిష్ట గడువులోగా పరిశీలించి.. పరిష్కరించాలని జీవో ఉండాలి. కానీ దీనికి భిన్నమైన స్ఫూర్తితో జీవో ఇచ్చారు.’’ అని ఆ అధికారి వివరించారు. అన్ని జిల్లాల్లో అదే తీరు... నెల్లూరు జిల్లాలో ఇద్దరు టీడీపీ నేతలు భారీగా ప్రభుత్వ భూములను అనుచరుల పేర్లతో సొంతం చేసుకున్నారు. ఇతర నాయకులు, వారి అనుచరులు కూడా ఇదే బాటలో సర్కారు భూములను మాయం చేశారు. ప్రకాశం, కర్నూలు, చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో కూడా భారీ భూ అక్రమాలు జరిగాయి. విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలంలో ఒక టీడీపీ నాయకుడు బినామీ పేర్లతో 50 ఎకరాల ప్రభుత్వ భూమిని కొట్టేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. విజయనగరం జిల్లాలో భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం రానున్న నేపథ్యంలో భూముల ధరలు పెరిగాయి. విశాఖపట్నానికి సమీపంలో విమానాశ్రయానికి దగ్గరలోని భూమిని ఒక మంత్రి బినామీ పేర్లతో భారీగా కైవసం చేసుకున్నారని అధికారులు అంటున్నారు. నెల్లూరు జిల్లాలో కూడా ఇలాంటి మోసాలు అధికంగా జరిగాయి. ఈ జిల్లాలో మొత్తం మ్యుటేషన్లలో 29.53 శాతం డీమ్డ్ ఖాతాలోనివే కావడాన్ని అధికారులు ఎత్తిచూపుతున్నారు. అక్రమాలు ఎక్కువగా జరిగాయనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని చెబుతున్నారు. ప్రకాశం జిల్లాలో కూడా అక్రమాలు అధికంగానే సాగాయి. ఈ జిల్లాలో 25.74 శాతం డీమ్డ్ మ్యుటేషన్లు జరిగాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో సుమారు 19 శాతం మ్యుటేషన్లు అధికారుల అనుమతితో సంబంధం లేకుండా జరిగిపోయాయి. ‘భూమి ఎవరిది? ఏమిటి? ఆధారాలున్నాయా? అనే అంశాలతో సంబంధం లేకుండా గత మూడు, నాలుగు నెలల్లో 1.17 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. అంటే ఎన్ని లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు ఇందులో ప్రయివేటు వ్యక్తుల ఖాతాల్లో చేరిపోయాయో లెక్కకు అందడం లేదని, ఒకవేళ విచారణ జరిపినా ఆధారాలు లేకుండా చేసేసి ఉంటారు....’ అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. -
విశాఖకు మచ్చ తెచ్చిందెవరు?
♦ జిల్లాను చెరబట్టిన పచ్చ నేతలు ♦ మూడేళ్లలో రూ. వేల కోట్ల భూకుంభకోణాలు ♦ పరువు తీసేసిన మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు ♦ మంత్రి అయ్యన్న వ్యాఖ్యలు, సిట్‌కు ఇచ్చిన ఆధారాలే సాక్ష్యం ♦ భూ దందాలే కాదు.. మద్యం, ఇసుక, మైనింగ్ మాఫియాగా మారిన దేశం నేతలు ♦ ఎక్కడ చూసినా టీడీపీ నేతల సెటిల్మెంట్లే ♦ మూడేళ్ల కిందట ఎన్నికల వేళ వైఎస్సార్సీపీపై కుట్రలు ♦ కడప నేతలొస్తే భూ దందాలు పెచ్చుమీరుతాయని విషప్రచారం ♦ మరి ఇప్పుడు టీడీపీ పాలనలో జరిగిందేమిటి? ♦ అన్ని వర్గాల్లోనూ ప్రస్తుతం ఇదే చర్చ 2014 ఎన్నికల వేళ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులపై ఓ పథకం ప్రకారం విష ప్రచారం.. ప్రత్యేకించి ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పోటీ చేస్తున్న విశాఖలో అడ్డూఅదుపూ లేకుండా తప్పుడు ప్రచారాలు.. కడప నేతలొస్తే.. బయట జిల్లాల నాయకులొస్తే విశాఖ తీరం కలుషితమైపోతుందని.. భూకబ్జాలకు నిలయమైపోతుందని విషపు రాతలు, విపరీత వాదనలు, దుష్ప్రచారాలతో టీడీపీ ఎన్నికల ప్రచారం మోతెక్కిపోయింది. ఎక్కడ చూసినా ఇదే రీతిలో విష ప్రచారానికి తెగబడ్డారు. వలస నేతలతో విశాఖ ప్రతిష్టకు మచ్చ వస్తుందని లేని భయం నటించారు.. టీడీపీ నేతలతో అంటకాగిన బీజేపీ నేతలూ ఇలాంటి భయాలే రేపారు. మరి వర్తమానంలో ఏం జరుగుతోంది.. చూద్దాం రండి.. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖలో ఏం జరుగుతోంది?.. మూడేళ్లుగా ఏం ఒరిగింది??.. తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడే స్వయంగా విస్పష్టంగా ప్రకటించేశారు. 2014 నుంచే విశాఖ భూ కబ్జాలకు, కుంభకోణాలకు కేంద్రంగా మారిందని కుండ బద్ధలుకొట్టారు. భూ కుంభకోణాలపై విచారణకు నియమించిన సిట్‌కు స్వయంగా ఓ ప్రజాప్రతినిధి.. అందునా సీనియర్ మంత్రి అయ్యన్న వెళ్లడమే ఓ సంచలమైతే.. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలే భూ కుంభకోణాలకు తెగబడ్డారని సాక్ష్యాలతో సహా ఫిర్యాదు చేయడం విశాఖలో జరిగిన.. జరుగుతున్న దారుణాలకు అద్దం పట్టింది. ఆధారాలతో సహా.. వివిధ ప్రాజెక్టుల పేరిట చేసిన భూసేకరణల్లో సైతం పరిహారాల సాకుతో టీడీపీ నేతలు కోట్లు మింగేశారని స్వయంగా మంత్రే మీడియాకు వెల్లడించారు. మెడ్‌టెక్ భూ పరిహారం చెల్లింపుల్లో జరిగిన అవకతవకలకు సంబంధించి పక్కా ఆధారాలను కూడా సిట్‌కు అందించారు. ప్రభుత్వ భూములను ప్రభుత్వానికే అమ్మిన దురాగతాలను సిట్ దృష్టికి తీసుకువెళ్లారు. మరో దఫా సిట్‌ను కలిసి మరిన్ని భూ కుంభకోణాలను బయటపెడతాననీ ప్రకటించారు. ఇక టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు సైతం ఇదే తరహా విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. ఈనెల 18న సిట్‌ను కలిసి తన వద్దనున్న ఆధారాలను సమర్పిస్తామని ఆయన చెప్పారు. బహిరంగంగా చెప్పకపోయినా విష్ణుకుమార్‌రాజు కూడా ఇద్దరు టీడీపీ ప్రజాప్రతినిధుల ఆగడాలపైనే సిట్‌కు ఫిర్యాదు చేయనున్నారనేది బహిరంగ రహస్యం. ఆరోపణల ఉచ్చులో జిల్లా టీడీపీ ప్రజాప్రతినిధులు యాధృచ్ఛికమే కావొచ్చు గానీ.. మునుపెన్నడూ లేని విధంగా జిల్లాలోని టీడీపీ ప్రజాప్రతినిధులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సహజంగా అధికార పార్టీ నేతలపై విపక్షాలు ఆరోపణలు చేయడం, విమర్శలకు దిగడం సహజమే. కానీ ఇంత తీవ్రస్థాయిలో అవినీతి, అక్రమాల్లో టీడీపీ నేతలు కూరుకుపోవడంపై ప్రజల్లో ఏవగింపు మొదలైంది. భూ కుంభకోణాల్లో ప్రధానంగా వినిపిస్తున్నది భీమిలి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు పేరే. గంటా అండ్ కోపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు స్వయంగా ఆ పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నవే. వుడా ల్యాండ్ పూలింగ్ కుంభకోణం, భూదందాలు, ప్రభుత్వ భూములు తనఖాపెట్టి కోట్ల రుణం తీసుకుని బ్యాంకులకు ఎగనామం పెట్టడం.. ఇలా ఆరోపణల ఊబిలో గంటా గ్యాంగ్ కూరుకుపోయిందనే చెప్పాలి. ♦ మంత్రి అయ్యన్నపాత్రుడిపై భూ దందా ఆరోపణలు లేనప్పటికీ.. లేటరైట్ గనుల అక్రమ తవ్వకాలు, ఆర్ అండ్ బీ కాంట్రాక్టులను బినామీల పేరిట చేజిక్కించుకోవడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ♦ నోరు తెరిస్తే తాను నిజాయితీకి మారుపేరని చెప్పుకునే మాజీ మంత్రి, పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మునుపెన్నడూ లేనివిధంగా ఈ మూడేళ్లలో అవినీతి ఆరోపణలు మూటకట్టుకున్నారు. ముదపాక భూముల మాయాజాలంతో పాటు ఆయన తనయుడి వసూళ్లు, క్వారీలు, ఇసుక మాఫియా నుంచి మామూళ్లు, సెటిల్మెంట్లతో అప్రతిష్ట పాలయ్యారు. పైగా నోరు తెరిస్తే పచ్చి బూతులు మాట్లాడుతూ బండ బూతల బండారుగా పేరు తెచ్చుకున్నారు. ♦ గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మెడ్‌టెక్ భూముల పరిహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తన అనుచరుల పేరిట కోట్లు నొక్కేశారన్న విమర్శలు న్నాయి. ♦ అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవిందు వక్ఫ్ భూములను కాజేశారన్న ఆరోపణలతో పాటు లెక్కకు మించిన దందాలతో అప్రతిష్ట మూటకట్టుకున్నారు. ♦ విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే పీవీజీఆర్ గణబాబుపైనా ఘనంగానే ఆరోపణలు ఉన్నాయి. గణబాబు అండతో ఆయన అనుచరులు ప్రభుత్వ భూములను కబ్జా చేసి ప్లాట్లుగా మార్చి విక్రయించేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ♦ విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మద్యం మాఫియాలో కీలకంగా ఉండటంతో పాటు నియోజకవర్గంలో మితిమీరిన ఆగడాలు, పంచాయితీలతో నిత్యం అంటకాగుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ♦ విశాఖ దక్షిణ ఎమ్మెల్యే, నగర టీడీపీ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్ దందాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. భారీఎత్తున సెటిల్మెంట్లు చేయడం, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టడం, ఎవరైనా అడ్డుకుంటే రౌడీయిజానికి పాల్పడం ఆయన ఇలాకాలో నిత్యకృత్యాలే. ♦ యలమంచిలి ఎమ్మెల్యే, టీడీపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబు కూడా తక్కువేమీ తినలేదు. నియోజకవర్గంలో ఇసుక మాఫియాతో చేతులు కలపడంతో పాటు భూ వివాదాల్లో కీలకంగా ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ♦ చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్రాజుపై అక్రమ మైనింగ్ ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో అడ్డగోలు మైనింగ్ కింగ్ అంటే ఎవరైనా ఆయన పేరే చెబుతారు. ♦ అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అక్రమ మైనింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అక్రమ మైనింగ్ కోసమే ఆయన పార్టీ ఫిరాయించారన్న ఆరోపణలు ఉన్నాయి. –ఇక పాయకరావుపేట ఎమ్మెల్యే అనితపై లెక్కకు మించిన ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధులే ఇలా ఆరోపణలు ఎదుర్కొంటుంటే.. వీరి అండతో అనుచరులు, జిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఏ స్థాయిలో దోపిడీలకు పాల్పడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. ♦ మూడేళ్లలో వీరంతా కలిసి జిల్లాకు ఏం చేశారంటే ఒక్కరూ సమాధానం చెప్పలేని పరిస్థితి.. కానీ జిల్లా ప్రతిష్టను దెబ్బతీసే విషయంలో మాత్రం ఒకరికొకరు పోటీ పడ్డారనే చెప్పాలి. -
భూస్కాంపై ఎట్టకేలకు కదిలిన కాంగ్రెస్
► గవర్నరుకు ఫిర్యాదు... అనంతరం సీఎల్పీ భేటీ సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూముల స్కాంపై ప్రధానప్రతిపక్షమైన కాంగ్రెస్‌పార్టీ ఎట్టకేలకు కదిలింది. దాదాపు 20 రోజులుగా రోజుకో కొత్త సంచలనంతో రాజకీయ ప్రకంపనలకు కారణమవుతున్న భూముల కుంభకోణంపై ప్రధాన ప్రతిపక్షపార్టీగా స్పందించడంలేదని స్వంతపార్టీలోనే అసంతృప్తి వ్యక్తమైంది. ఏఐసీసీ స్థాయిలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతలతో భూకుంభకోణంలో కీలక పాత్రధారులకు సన్నిహిత సంబంధాలు ఉండటం వల్లనే టీపీసీసీ కొంత ఉదాసీనంగా వ్యవహరించినట్టుగా కాంగ్రెస్‌పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే రాష్ట్రంలో మిగిలిన రాజకీయపార్టీలు టీపీసీసీ కన్నా వేగంగా, చురుకుగా వ్యవహరిస్తున్న సమయంలో టీపీసీసీ కూడా కదలాల్సి వచ్చినట్టుగా పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రధానప్రతిపక్షపార్టీగా ఈ కుంభకోణంపై మొక్కుబడి ప్రకటనలకే పరిమితమై, ఇంకా తాత్సారం చేస్తే పార్టీపై అనుమానాలు పెరుగుతాయనే పార్టీ నేతల హెచ్చరికలతో టీపీసీసీ కదలాల్సి వచ్చిందని చెబుతున్నారు. అయితే ఈ భూకుంభకోణంపై జాతీయస్థాయి నేతల జోక్యంతోనే టీపీసీసీ కొంత నెమ్మదిగా, చూసీచూడనట్టుగా వ్యవహరించిందనే వాదనను టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొట్టి పారేస్తున్నారు. ఏఐసీసీ ప్రధానకార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ జూన్ 1న మాట్లాడిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. ఈ కుంభకోణంలో రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ముఖ్యులు ఉన్నారని తాము ఇచ్చిన సమాచారంతోనే దిగ్విజయ్‌సింగ్ మాట్లాడినట్టుగా చెబుతున్నారు. అయితే ఆ తరువాత కాలంలో అదే వేగాన్ని కొనసాగించడంలో ఎందుకు వెనుకబడ్డారనే పార్టీ నేతల ప్రశ్నకు బదులు ఇవ్వడంలేదు. అయితే ఏదేమైనా ఈ భూకుంభకోణంపై టీపీసీసీ ఎట్టకేలకు ప్రత్యక్ష కార్యాచరణకు దిగింది. దీనిపై భవిష్యత్ కార్యాచరణకు దిగాలని భావిస్తోంది. గవర్నరుతో భేటీ... అనంతరం సీఎల్పీ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మియాపూర్ భూములపై సీబీఐ విచారణ కోరాలనే డిమాండుతో రాష్ట్ర గవర్నరును టీపీసీసీ బృందం గురువారం భేటీ కానుంది. దీనికోసం గవర్నరు సమయాన్ని కూడా తీసుకున్నారు. గవర్నరుకు ఫిర్యాదు చేసిన అనంతరం కాంగ్రెస్‌పార్టీ శాసనసభాపక్షం సమావేశం కానుంది. భూముల కుంభకోణంపై అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. భూములను దోచుకుంటున్న సీఎం తెలంగాణలోని ప్రభుత్వ భూములను సీఎం కేసీఆర్ దోచుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం మియాపూర్‌లోని సర్వే నెంబర్ 100 ను పరిశీలించి అక్కడే విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మియాపూర్‌లోని భూముల కుంభకోణం జరిగిన సర్వే నెంబర్లలోని 760 ఎకరాల స్థలాన్ని డబుల్ బెడ్ రూం పథకానికి కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వాతంత్య్ర భారతదేశంలో అతిపెద్ద భూకుంభకోణంగా ఆయన అభివర్ణించారు. వేలాది కోట్ల విలువైన భూములను కేవలం అధికారులే అక్రమ రిజిస్ట్రేషన్లు చేయలేదని, ప్రభుత్వ పెద్దల హస్తం ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద భూకుంభకోణం జరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ స్థలాలు అన్యాక్రాంతం కాలేదని చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు. టీఆర్ఎస్ పార్టీలో కీలక పదవులలో ఉన్న నాయకులు ఖజానాను కాజేస్తున్నారని ఆయన ఆరోపించారు. సీఎం సన్నిహితుడు దామోదార్రావు అల్లుడు ప్రభుత్వ భూములను అక్రమించిన గోల్డ్ స్టోన్ ప్రసాద్ వారి కార్యాలయంలో పనిచేస్తున్నారన్నారు. సీఎం కార్యాలయంలో పనిచేసే వారు, ఆత్మీయులు, బంధువుల పాత్ర భూకుంభకోణంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉన్నా ఏమి జరగలేదనడం సిగ్గు చేటన్నారు. కూకట్‌పల్లిలో 80 డి సర్వే నెంబర్లోని నాలుగు ఎకరాలు రెడ్డినాయక్ కూతురు ఎన్.కవితకు రిజిస్ట్రేషన్ చేయించడం నిజం కాదా ..? కూకట్పల్లి సర్వే నెంబర్ 1లో గోల్డ్ స్టోన్ ప్రసాద్ అక్రమించిన భూములను మాధవరం కృష్ణారావు ముఖ్య అనుచరులు పి.వి. రాజు అండ్ బ్రదర్స్ డెవలఫ్మెంట్కు తీసుకోవడం నిజం కాదా...? కేశవరావు కూతురు, కోడలు పేరిట 38 ఎకరాలు భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవడం నిజం కాదా...? కూకట్‌పల్లిలోని 163 సర్వే నెంబర్లోని భూములను సీఎం కుటుంబీకులు, బీనామీల పేర్ల మీద నాలుగు ఎకరాలు ఉండడం నిజం కాదా..? టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాన్ని భ్రష్టుపట్టిస్తోందన్నారు. సీఎం కుటుంబ సభ్యులకు, మంత్రులకు, ఐఏఎస్ అధికారుల పేర్ల మీద భూములను రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. ఎస్.కె. సింహా భూముల విషయంలో రిపోర్ట్‌ను ప్రభుత్వానికి అందజేశారు. దీనిని ప్రభుత్వ వెబ్సైట్లో ఉంచాలని డిమాండ్ చేశారు. ఇంత పెద్ద భూకుంభకోణం జరిగిన టీఆర్ఎస్ పార్టీ నుంచి అధికారులు పరిశీలనకు రాకపోవడం హాస్యాస్పదం. నూతన రాష్ట్రంలో పరిపాలనలో పారదర్శకత,, నిజాయితీ ఉంటుందని ప్రజలు ఆశపడ్డారు. కానీ మూల్యమైన భూములను పాలించేవారే దోచుకుంటున్నారని విమర్శించారు. ఏం మతులబు జరిగిందో కానీ సీఎం స్వయంగా ఏం జరగలేదని చెప్పడంతో ప్రజలు వింతగా చూస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం పారదర్శకత కోసం, అనుమానాలను నివృత్తి చేయడానికి ప్రజల కోసం సీబీఐ ద్వారా విచారణ చేసి విషయాలను వెల్లడి చేస్తే గౌరవప్రదంగా ఉంటుందని శాసన సభాపక్ష నేత జానారెడ్డి అభిప్రాయపడ్డారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించకపోతే ఇకముందు ప్రజలే తగిన సమయంలో బుద్ది చెబుతారన్నారు. సీఎం వచ్చాక ఎన్నో సీఐడీ విచారణలు జరిపారని ఎన్ని ఫలితాలు వచ్చాయని శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు షబ్బీర్ అలీ ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్లు, నహీమ్ కేసు, ఎంసెట్ లీకేజీ ఇలాంటివి ఎన్నో ఉన్నావని మరల సీఎం కేసీఆర్ యూ టర్న్ తీసుకోవడం అలవాటేనన్నారు. ఒక్క గజం కూడా పోలేదని, ఏ సంస్థ చెప్పిందని ప్రశ్నించారు. అన్ని పార్టీలు సీబీఐ విచారణ జరపాలని అడుగుతున్నారని, దీని పై సీబీఐ విచారణ చేపడితే మంచిదని మాజీ రాజ్యసభ సభ్యుడు హన్మంత్‌రావు అన్నారు. మాటల గారడీలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, గడ్డం ప్రసాద్‌కుమార్, అధికార ప్రతినిధి మల్లు రవి, మాజీ ఎమ్మెల్యేలు ఎం. భిక్షపతియాదవ్, సుధీర్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. రవికుమార్‌యాదవ్, కాంగ్రెస్ మహిళ విభాగం అధ్యక్షురాలు నీరల శారదా, అధికార ప్రతినిధి రమ్యరాయ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు క్యామ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం పదవి నుంచి కేసీఆర్ తప్పుకోవాలి: నాగం
హైదరాబాద్: భూ కుంభకోణాలపై సీబీఐ విచారణ చేయించాలి.. లేదంటే సీఎం పదవి నుంచి కేసీఆర్ తప్పుకోవాలని బీజేపీ నాయకుడు నాగం జనార్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. భూ కుంభకోణాల నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. ' పొప్పలగూడలోని ప్రభుత్వ భూములను రక్షించాలి. ఒక్క గజం భూమి పోలేదు, ఒక్క పైసా వృథా కాలేదు అని ముఖ్యమంత్రి చెప్తున్న మాటలు పచ్చిఅబద్ధాలు. ఎలాంటి అవకతవకలు జరగకపోతే 72 మంది సబ్ రిజిస్టార్లను బదిలీ చేశారు. అవినీతిని నిరూపించే అధారాలు మా వద్ద ఉన్నాయి. సీబీఐ విచారణకు ఆదేశిస్తే.. తన కుటుంబ భాగోతం బయట పడుతుందని కేసీఆర్ భయపడుతున్నారు. కేసీఆర్ అబద్ధాలతో రాష్ట్ర ప్రజలను వంచిస్తున్నారు. కేకే కొన్న భూమి ప్రభుత్వానిదే.. ఆయన చీటింగ్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తున్నాచర్యలు ఎందుకు తీసుకోరు' అని అందులో పేర్కొన్నారు. -
ఏం ప్రవీణ్... ఏమిటీ రచ్చ!
►జిల్లా కలెక్టర్‌కు చంద్రబాబు క్లాసు ►భూ కుంభకోణాలపై ఆరా వాటిపై మాట్లాడవద్దని హుకుం ►సాక్షి కథనాలపై చర్చ.. క్లిప్పింగుల పరిశీలన ►బహిరంగ విచారణ రద్దు.. సిట్ ఏర్పాటు విశాఖపట్నం : విశాఖలో పుంఖానుపుంఖాలుగా బయటపడుతున్న భూ కుంభకోణాలు ప్రభుత్వ పెద్దలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దేశం నేతల అండ చూసుకొని అక్రమార్కులు సాగిస్తున్న భూదందాలపై ఆధారాలతో ప్రధాని, రాష్ట్రపతిలకు ఫిర్యాదు చేస్తామన్న అఖిలపక్షం హెచ్చరికలతో ప్రభుత్వ పెద్దలకు వణుకు పుట్టింది. ఈ పరిస్థితుల్లో బహిరంగ విచారణ జరిపితే మరింత రచ్చ అవుతుందన్న భయంతో దాన్ని రద్దు చేసి సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. సోమవారం జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌ను అమరావతిలోని తన కార్యాలయానికి రావాలని సీఎం ఆదేశించారు. ఉదయం పదిన్నరకే అక్కడికి చేరుకున్న కలెక్టర్.. సాయంత్రం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ‘ఏం ప్రవీణ్.. విశాఖలో అసలేం జరుగుతోంది.. ఏమిటా రచ్చ.. ట్యాంపరింగ్ జరిగిందని ఎందుకు బహిరంగంగా ప్రకటించావ్.. ఆ తర్వాత మళ్లీ సద్దుమణిగే ప్రకటనలు ఎందుకు చేయాల్సి వచ్చింది.. భూములు దోచేసిన వారంతా,. మన పార్టీ వాళ్లేనా.. బయటి వాళ్లు ఎవరూ లేరా... ఇదంతా ఎటుపోతోంది’.. అని చంద్రబాబు కలెక్టర్‌కు క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. దానికి కలెక్టర్ మౌనం దాల్చారు. భూ కుంభకోణాలపై తన వద్దనున్న పక్కా సమాచారం, ఆయా అక్రమాల్లో టీడీపీ నేతల ప్రమేయంపై ఆధారాలన్నింటినీ బాబుకు అందించినట్టు తెలిసింది. అదేవిధంగా భూ దందాలపై ఇటీవల సాక్షిలో వచ్చిన వరుస కథనాల క్లిప్పింగ్‌లను కూడా కలెక్టర్ బాబుకు అందించినట్టు తెలిసింది. కలెక్టర్ ఇచ్చిన ఫైళ్లు, సాక్షి కథనాల క్లిప్పింగ్‌లను నిశితంగా పరిశీలించిన బాబు..‘మన వాళ్ల సంగతి నేను చూస్తా... ముందు అక్కడ రచ్చ కాకుండా చూడండి.. పదే పదే భూ కుంభకోణాలపై మాట్లాడకండి.. మీరు కమిట్ అయిన ట్యాంపరింగ్‌పై మాత్రం పక్కాగా విచారణ చేపట్టినట్టు ప్రచారం కల్పించండి.. ఇందుకు ప్రత్యేక విచారణ బృందం (సిట్) ఏర్పాటు చేస్తాను’.. అని బాబు సూచించినట్టు సమాచారం. కలెక్టర్‌తో చంద్రబాబు సుదీర్ఘ భేటీ అనంతరం.. విశాఖ రూరల్ మండలంలోని కొమ్మాది, మధురవాడ ప్రాంతాల్లో చోటుచేసుకున్న భూ వివాదాలు, రికార్డుల ట్యాంపరింగ్‌లపై సిట్‌తో దర్యాప్తు చేయనున్నట్టు ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చింది. సిట్‌లో సభ్యుల పేర్లను ఇంకా ఖరారు చేయని ప్రభుత్వం.. ఆ బృందంలో రెవెన్యూ, పోలీసు,. న్యాయాధికారులు ఉంటారని పేర్కొంది. -
భూ స్కామ్‌లపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి
వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇటీవల భూ స్కామ్‌లు మితిమీరి పోయాయని వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల్లో జరిగే భూ దందాల్లో పాలక ప్రభుత్వ పెద్దలే సూత్రధారులు, పాత్రధారులని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఇద్దరు సీఎంలు చంద్రబాబు, కేసీఆర్‌లు భూములపై వచ్చే ఆరోపణలపై విచా రణ కోరే అవకాశం లేదన్నారు. అందుకే కేంద్రం జోక్యం చేసు కొని సమగ్ర విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని అన్నారు. విశాఖ భూముల కుంభకోణంలో ఏపీలో సీఎం కుమా రుడు లోకేష్, ఆయన పార్టీ వారే పాత్రధారులని తెలిపారు. తెలంగాణలోని మియాపూర్ భూ కుంభకోణంలో ఏపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి పాత్ర బయటకు వచ్చిందన్నారు. కానీ ఇంతవరకు ఆయనపై ఏపీ సీఎం బాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మిగతా సమయాల్లో నీతులు వల్లె వేసే బాబు తమ పార్టీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి గురించి ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. అలవిగాని విషయాలపై మీడియా ముందుకు వచ్చి అవాకులు చెవాకులు పేలే జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్‌రెడ్డిలు ఇప్పుడేమీ మాట్లాడటం లేదేమని నిలదీశారు. హైదరాబాద్ నగరంలోని చాలా భూ కుంభకోణాల్లో సీఎం కేసీఆర్ దగ్గరి వారి పాత్ర ఉందన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తు న్నారని, సరైన సమయంలో బుద్ధి చెబుతారని అన్నారు. -
భూ ఆక్రమణలు ఎక్కువైపోయాయి
-
'భూ సమీకరణ పేరుతో సర్కార్ కుంభకోణాలు'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ పేరుతో భూ కుంభకోణాలకు అవకాశం కల్పిస్తోందని మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2013 భూ సేకరణ చట్టానికి విరుద్ధంగా భూ సమీకరణ జరుగుతోందన్నారు. రాజధానిలో సీఆర్డీఏ అధికారులు చట్టాలను, రాజ్యాంగాన్ని చదవాల్సిన అవసరముందన్నారు. అసైన్డ్ భూముల విషయంలో అధికారులు చట్టాలను ఉల్లంఘిస్తే ఇబ్బంది పడతారని ఈఏఎస్ శర్మ సూచించారు. -
'హామీలను నెరవేర్చడంలో బాబు విఫలం'
అనంతపురం: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విఫలమయ్యారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ... రాజధాని ప్రాంతంలో జరిగిన భూ కుంభకోణంపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా డిమాండ్‌తో ఈ నెల 15న అసెంబ్లీని ముట్టడిస్తామని తెలిపారు. -
టీడీపీ ఎమ్మెల్యే అనుచరుల వీరంగం
తూర్పుగోదావరి: కాకినాడ టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు అనుచరులు అర్ధరాత్రి వీరంగం సృష్టంచారు. స్థానిక ఆండాలమ్మ కాలేజీ ప్రహారీ గోడను ప్రొక్లెయిన్ సాయంతో కూల్చివేశారు. దీంతో కాలేజీ యాజమాన్యం వీరి ఆగడాలను అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. ఘటనపై ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించడం లేదని యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఎమ్మెల్యే అనుచరులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.