
'భూ సమీకరణ పేరుతో సర్కార్ కుంభకోణాలు'
భూ సమీకరణ పేరుతో సర్కార్ భూ కుంభకోణాలకు అవకాశం కల్పిస్తోందని ఈఏఎస్ శర్మ చెప్పారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ పేరుతో భూ కుంభకోణాలకు అవకాశం కల్పిస్తోందని మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2013 భూ సేకరణ చట్టానికి విరుద్ధంగా భూ సమీకరణ జరుగుతోందన్నారు.
రాజధానిలో సీఆర్‌డీఏ అధికారులు చట్టాలను, రాజ్యాంగాన్ని చదవాల్సిన అవసరముందన్నారు. అసైన్డ్ భూముల విషయంలో అధికారులు చట్టాలను ఉల్లంఘిస్తే ఇబ్బంది పడతారని ఈఏఎస్ శర్మ సూచించారు.