సీఎం పదవి నుంచి కేసీఆర్ తప్పుకోవాలి: నాగం
Published Wed, Jun 14 2017 2:38 PM | Last Updated on Fri, Oct 19 2018 7:27 PM
హైదరాబాద్: భూ కుంభకోణాలపై సీబీఐ విచారణ చేయించాలి.. లేదంటే సీఎం పదవి నుంచి కేసీఆర్ తప్పుకోవాలని బీజేపీ నాయకుడు నాగం జనార్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. భూ కుంభకోణాల నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. ' పొప్పలగూడలోని ప్రభుత్వ భూములను రక్షించాలి. ఒక్క గజం భూమి పోలేదు, ఒక్క పైసా వృథా కాలేదు అని ముఖ్యమంత్రి చెప్తున్న మాటలు పచ్చిఅబద్ధాలు. ఎలాంటి అవకతవకలు జరగకపోతే 72 మంది సబ్ రిజిస్టార్‌లను బదిలీ చేశారు. అవినీతిని నిరూపించే అధారాలు మా వద్ద ఉన్నాయి. సీబీఐ విచారణకు ఆదేశిస్తే.. తన కుటుంబ భాగోతం బయట పడుతుందని కేసీఆర్ భయపడుతున్నారు. కేసీఆర్ అబద్ధాలతో రాష్ట్ర ప్రజలను వంచిస్తున్నారు. కేకే కొన్న భూమి ప్రభుత్వానిదే.. ఆయన చీటింగ్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తున్నాచర్యలు ఎందుకు తీసుకోరు' అని అందులో పేర్కొన్నారు.
Advertisement
Advertisement