
'హామీలను నెరవేర్చడంలో బాబు విఫలం'
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విఫలమయ్యారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు.
అనంతపురం: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విఫలమయ్యారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ... రాజధాని ప్రాంతంలో జరిగిన భూ కుంభకోణంపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా డిమాండ్తో ఈ నెల 15న అసెంబ్లీని ముట్టడిస్తామని తెలిపారు.