చండీగఢ్: శిరోమణి అకాలీదళ్ నాయకుడు సికందర్ సింగ్ మలుకా కోడలు, పంజాబ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి పరంపాల్ కౌర్ సిద్ధూ బీజేపీలో చేరవచ్చనే ఊహాగానాల మధ్య తన పదవికి రాజీనామా చేశారు.
2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన సిద్ధూ ఈ ఏడాది అక్టోబర్‌లో పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం ఆమె పంజాబ్ స్టేట్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. పరంపాల్ కౌర్ సిద్ధూ బీజేపీలో చేరి ప్రస్తుతం శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ ప్రాతినిధ్యం వహిస్తున్న బటిండా పార్లమెంటు స్థానం నుండి పోటీ చేయడానికి టికెట్‌ను పొందవచ్చని ఊహాగానాలు ఉన్నాయి.
సికందర్ సింగ్ మలుకా అకాలీ సీనియర్ నాయకుడు 2017 వరకు అకాలీ ప్రభుత్వంలో విద్యా మంత్రిగా ఉన్నారు. పంజాబ్‌లో మొత్తం 13 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. చివరి దశలో జూన్ 1న ఇక్కడ పోలింగ్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment