సాక్షి,హైదరాబాద్: తాము పని చేస్తున్న రాష్ట్రంలో ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని, అదే సమయంలో డీఓపీటీ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ కోరుతూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్(క్యాట్)ను ఆశ్రయించిన ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, ఆమ్రపాలి, వాణీప్రసాద్, రొనాల్డ్‌రాస్, సృజనలకు బిగ్ షాక్ తగిలింది. డీవోపీటీ ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. ఏ రాష్ట్రంలో రిపోర్ట్ చేయాల్సిన వారు అక్కడే రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. డీఓపీటీ ఆదేశాలను పాటించాల్సిందేనని క్యాట్ వెల్లడించింది.
5:12pm
క్యాట్ తీర్పులో ముఖ్యాంశాలు..
సుపరిపాలన కోసం అధికారులను బ్యాలెన్స్ చేసేందుకు కేంద్రానికి ఎప్పుడైనా సరే నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది
ఒక రాష్ట్రంలో ఎక్సెస్‌గా అధికారులు ఉన్నప్పుడు పక్క రాష్ట్రానికి కేటాయింపులు జరిపే అధికారం డీవోపీటీకి ఉంటుంది
ఐదుగురు ఐఏఎస్‌ల కేటాయింపుల్లో ఒక్కొక్కరికి ఒక్కొ కారణం ఉన్నప్పటికీ డీవోపీటీదే తుది నిర్ణయం
హైకోర్టు గత ఆదేశాలలో వన్ మాన్ కమిటీని ఏర్పాటు చేయమని చెప్పకపోయినా, కమిటీని నియమించే అధికారం డీవోపీటీకి ఉంటుంది
డీవోపీటీ ఆర్డర్స్ ప్రకారం రిపోర్ట్ చేయాలి. ఎక్కడి వాళ్లు అక్కడే రిపోర్ట్ చేయాలంటూ క్యాట్ ఆదేశాలు జారీచేసింది. రేపు యథావిధిగా రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది
5:02pm
ఐదుగురు ఐఏఎస్‌లకు బిగ్ షాక్
క్యాట్‌లో ఐఏఎస్ అధికారులకు చుక్కెదురు
డీవోపీటీ ఆర్డర్స్ ప్రకారం రిపోర్ట్ చేయాల్సిందే
నవంబర్ మొదటి వారంలో డీవోపీటీ కౌంటర్ వేయాలి
4:48pm
ఐఏఎస్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు
తీర్పు చదువుతున్న క్యాట్ ధర్మాసనం
4:32pm
ముగిసిన అయిదుగురు ఐఏఎస్‌ల తరపు న్యాయవాదుల వాదనలు
డీవోపీటీ తరుపున వాదనలు ప్రారంభం
4:25pm
క్యాట్ఐఏఎస్ల స్థిర నివాసాల పైనే కౌన్సిల్ వాదనలు
స్థిర నివాసాల ఆధారంగా జరగాల్సిన కేటాయింపులు సక్రమంగా జరగలేదని కౌన్సిల్ వాదనలు
ఐఏఎస్ స్థిర నివాసాల (Domicile) ఐదు రకాలుగా పరిగణలోకి తీసుకోవాలి
(first posting, place of birth, address of metriculation, home town , 371(d)
ఐఏఎస్ వాకాటి కరుణ, వాణి ప్రసాద్, శ్రీజన విషయంలో స్థిరనివాసం ఆధారంగా కేటాయింపులు చేయాలని ప్రత్యూష్ సిన్హా అడ్వైజరీ కమిటీ సిఫార్స్ చేసినా డీవోపీటీ పరిగణలోకి తీసుకోలేదు.
ఐఏఎస్ ఆమ్రపాలి, రోనాల్డ్ రాస్ విషయంలో స్వాపింగ్ ద్వారా మ్యుచువల్‌గా కేటాయింపులు కోరారు
కానీ డీవోపీటీ వాటిని పరిగణలోకి తీసుకోలేదు
3:58pm
అమ్రపాలి తరుపున కౌన్సిల్స్థానికత విశాఖపట్నం ఉన్నపటికీ స్వాపింగ్ ద్వారా తెలంగాణలో ఉన్నారు
స్వాపింగ్ చేసుకోవచ్చని గైడ్ లైన్స్‌లో ఉందా - క్యాట్
1986 బ్యాచ్ అధికారితో స్వాపింగ్ ఎలా చేసుకుంటారు - క్యాట్
గైడ్ లైన్స్‌లో సీనియర్,జూనియర్‌తో సంబంధం లేకుండా స్వాపింగ్ చేసుకోవచ్చు - ఆమ్రపాలి కౌన్సిల్
3:41pm
ముగిసిన ఐదుగురు ఐఏఎస్‌ల తరపు న్యాయ వాదుల వాదనలు
డీవోపీటీ తరపున వాదనలు ప్రారంభం.
3:41pm
క్యాట్ఏపీలోని విజయవాడ ప్రాంతాల్లో వరదలతో ప్రజలు ఇబ్బంది పడటం చూశాం
అలాంటి ప్రాంతాలకు వెళ్లి ప్రజాలకు సేవ చేయాలని లేదా - క్యాట్
బోర్డర్‌లో సమస్యలు వస్తే వెళ్ళారా
ఇంట్లో కూర్చొని సేవ చేస్తాం అంటే ఎలా ?? - క్యాట్
అమ్రపాలి తరుపున కౌన్సిల్
స్థానికత విశాఖపట్నం ఉన్నపటికీ స్వాపింగ్ ద్వారా తెలంగాణలో ఉన్నారు
స్వాపింగ్ చేసుకోవచ్చని గైడ్ లైన్స్‌లో ఉందా - క్యాట్
1986 బ్యాచ్ అధికారితో స్వాపింగ్ ఎలా చేసుకుంటారు - క్యాట్
గైడ్ లైన్స్‌లో సీనియర్,జూనియర్‌తో సంబంధం లేకుండా స్వాపింగ్ చేసుకోవచ్చు - ఆమ్రపాలి కౌన్సిల్
3:30pm
వాకాటి కరుణ కౌన్సిల్వన్ మ్యాన్ కమిటీ డీవోపీటీకి ఇచ్చిన నివేదికను మాకు ఇవ్వలేదు - వాకాటి కరుణ కౌన్సిల్
వన్ మ్యాన్ కమిటీ రిపోర్ట్ మాకు ఇవ్వకుండానే డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది
ఐదుగురు ఐఏఎస్‌లకు వన్ మ్యాన్ కమిటీ రిపోర్ట్‌ను చూపలేదు
Domicile (స్థిర నివాసం)ఆధారంగా ఐఏఎస్ వాకాటి కరుణ హైదరాబాద్ చెందిన వారని ఏపీ రాష్ట్ర విభజన సందర్భంగా ఆలిండియా సర్వీస్ (ఏఐఎస్) అధికారుల కేటాయింపునకు ఏర్పాటుచేసిన ప్రత్యూష్ సిన్హా అడ్వైజరీ కమిటీ చెప్పింది - వాకాటి కరుణ కౌన్సిల్
కానీ కమిటీ చేసిన సిఫార్సులను డీవోపీటీ పట్టించుకోలేదు
అసలు స్థిర నివాసానికి సరైన అర్థం ఏమిటో చెప్పాలని క్యాట్ ప్రశ్న
డీవోపీటీ జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతున్నాం
ముగిసిన వాకాటి కరుణ కౌన్సిల్ వాదనలు
3:23pm
వాకాటి కరుణ కౌన్సిల్
హై కోర్టు గత ఆదేశాల ప్రకారం ఐఏఎస్‌ల అభ్యర్థనను డీవోపీటీ పరిగణలోకి తీసుకోవాలి
కానీ డీవోపీటీ నేరుగా నిర్ణయం తీసుకోకుండా వన్ మ్యాన్ కమిటీని నియమించింది
వన్ మ్యాన్ కమిటీని నియమించి నిర్ణయం తీసుకోమని హై కోర్ట్ ఆదేశించలేదు
ఐఏఎస్‌ల కేటాయింపుపై డీవోపీటీకే నిర్ణయం తీసుకునే అధికారం ఉంది కానీ వన్ మ్యాన్ కమిటీ సిఫార్సును డీవోపీటీ ఎలా అమలు చేస్తుంది
క్యాట్ ప్రశ్న
వన్ కమిటీ ఏర్పాటు చేసినప్పుడే ఎందుకు హై కోర్టుకు వెళ్ళలేదు
వన్ కమిటీనీ ఎప్పుడు ఏర్పాటు చేశారు
మార్చ్ 21, 2024న వన్ మ్యాన్ కమిటీ ఏర్పాటు చేశారు
3:00pmఐదుగురు ఐఏఎస్‌ల తరఫున హాజరైన ఐదుగురు న్యాయవాదులు
ఒక్కొ పిటిషన్‌పై వేర్వేరుగా వాదనలు వింటున్న క్యాట్ ధర్మాసనం
ఐఏఎస్ వాకాటి కరుణ పిటిషన్‌పై వాదనలు ప్రారంభం
వాకాటి కరుణ తరుపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది లక్ష్మి నరసింహ
2.40PM
ఐఏఎస్ అధికారుల పిటిషన్‌పై మధ్యాహ్నం గం. 2.35ని.లకు విచారణ తిరిగి ప్రారంభం
ఐఏఎస్ అధికారుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు.
12.10PM
మధ్యాహ్నానికి విచారణ వాయిదా
క్యాట్‌ను ఆశ్రయించిన ఐదుగురు ఐఏఎస్‌లు
మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ వేర్వేరు పిటిషన్లు దాఖలు
11.20AM
హైదరాబాద్: కాసేపట్లో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్(CAT)లో ఐదుగురు ఐఏఎస్‌లు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరగనుంది. కేంద్ర పరిపాలన ట్రిబ్యూనల్‌ను ఐదుగురు ఐఏఎస్‌లు ఆశ్రయించిన విషయం తెలిసిందే. డీఓపీటీ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు.
తెలంగాణలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఐఏఎస్‌లు వాకాటి కరుణ, వాణి ప్రసాద్, ఆమ్రపాలి, రోనాల్డ్ రోస్ పిటిషన్లలో విజ్ఞప్తి చేశారు. ఏపీలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని తన పిటిషన్‌లో ఐఏఎస్ సృజన గుమ్మాల కోరారు. ఐఏఎస్‌లు వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment