Women MLA
-
మళ్లీ అట్టుడికిన అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గురువారం కూడా శాసనసభ అట్టుడికింది. బీఆర్ఎస్ సభ్యులు సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. పదేపదే స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. అక్కడే బైఠాయించారు. మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ఇద్దరూ అసెంబ్లీ కొనసాగినంత సేపూ తమ సీట్ల వద్ద నిలబడే ఉండి నిరసన వ్యక్తం చేశారు.తమకు మాట్లాడే అవకాశమివ్వాలని స్పీకర్‌ను కోరారు. ప్రతిపక్షం నిరసనను అధికార పక్షం పట్టించుకోలేదు. గందరగోళం మధ్యే కీలకమైన స్కిల్ వర్సిటీ బిల్లును ప్రవేశపెట్టి, చర్చ చేపట్టారు. సభా వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్ బాబు సభ నిర్వహణకు సహకరించాలంటూ పలుమార్లు బీఆర్ఎస్ సభ్యులను కోరారు. నల్లబ్యాడ్జీలతో వచి్చ..గురువారం బీఆర్ఎస్ సభ్యులంతా నల్లబ్యాడ్జీ లతో శాసనసభకు వచ్చారు. సభ ప్రారంభం కాగానే సబితను ఉద్దేశించి సీఎం చేసిన వ్యాఖ్యలపై చర్చకు పట్టుబట్టారు. సబితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని వారు కోరి నా స్పీకర్ అనుమతించలేదు.అదే సమయంలో స్కిల్స్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టాలని మంత్రికి స్పీకర్ సూచించారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ.. స్పీకర్ పోడి యం వద్దకు దూసుకెళ్లారు. ‘సీఎం డౌన్ డౌన్.. సీఎం అహంకార పూరిత వైఖరి నశించాలి’ అంటూ నినాదాలు చేశారు. సభ గందరగోళంగా ఉండగానే.. సీఎం రేవంత్ ఎస్సీ, ఎస్టీ ఉపకులాల వర్గీకరణపై ప్రకటన చేశారు. ఆ సమయంలో కాసేపు శాంతించిన విపక్ష సభ్యులు తర్వాత మళ్లీ నిరసన మొదలుపెట్టారు. గందరగోళం మధ్య చర్చ ఎలా?: అక్బరుద్దీన్ సభలో గందరగోళం కొనసాగుతున్న సమయంలో ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ జోక్యం చేసుకున్నారు. సభలో ఎవరిపై అయినా వ్యాఖ్యలు చేసినప్పుడు.. స్పష్టత ఇచ్చే హక్కు వారికి ఉంటుందని రూల్ పొజిషన్ లేవనెత్తారు. విపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశమైనా ఇవ్వాలని, లేదా వారిని సస్పెండైనా చేయాలని సూచించారు.ఇంత గందరగోళం మధ్య కీలకమైన అంశాలపై చర్చ సరికాదని స్పష్టం చేశారు. సభను దారిలో పెట్టాల్సిన బాధ్యత సభాపతికి, సభా నాయకుడికి ఉంటుందన్నారు. సభను వాయిదా వేసి విపక్ష, అధికారపక్ష సభ్యులతో మాట్లాడటం సాంప్రదాయమని.. కానీ ఇలాంటి పరిస్థితుల్లో సభ కొనసాగించడం సరికాదని పేర్కొన్నారు. దీనికి స్పీకర్ బదులిస్తూ.. సభను అదుపులో పెట్టేందుకు తాను ఉదయం నుంచీ ప్రయతి్నస్తూనే ఉన్నానని చెప్పారు. తర్వాత కూడా నిరసనలు, నినాదాల మధ్యే సభ కొనసాగింది. తనిఖీల నుంచి తరలింపు దాకా.. గురువారం ఉదయం అసెంబ్లీకి వచి్చన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాహనాలను పోలీసులు విస్తృతంగా తనిఖీ చేశారు. ప్లకార్డులు ఏవైనా తెస్తున్నారా అని ఆరా తీశారు. దీనిపై ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక సభ ప్రారంభానికి పది నిముషాల ముందే నల్లబ్యాడ్జీలు ధరించి అసెంబ్లీలోకి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. సుమారు మూడు గంటల పాటు ఆందోళన చేశారు. సభ ముగిశాక అసెంబ్లీలోని సీఎం చాంబర్ ముందు ధర్నాకు దిగారు.సుమారు అరగంట పాటు ఆందోళన చేయగా.. మార్షల్స్ రంగప్రవేశం చేసి ఎమ్మెల్యేలను అసెంబ్లీ భవనం బయటికి తరలించారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలో బైఠాయించి ఆందోళన కొనసాగించారు. పోలీసులు కలి్పంచుకుని.. కేటీఆర్, హరీశ్‌రావు, పద్మారావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, కేపీ వివేకానంద, డాక్టర్ సంజయ్, విజయుడు, మాణిక్‌రావు, మర్రి రాజశేఖర్‌రెడ్డి తదితరులను వాహనంలోకి ఎక్కించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. చివరికి అందరినీ బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్‌కు తరలించారు. నేడు కూడా ఆందోళనకు నిర్ణయం శాసనసభ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ముగియనున్న నేపథ్యంలో.. తమ మహిళా సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ పట్టుబట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్టు తెలిసింది. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రశ్నిస్తామని.. ఇందుకోసం మాట్లాడే చాన్స్ ఇవ్వాలని పట్టుబడతామని సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. తాను సీఎం నుంచి క్షమాపణ కోరుకోవడం లేదని.. మాట్లాడే అవకాశం ఇవ్వాలని మాత్రమే కోరుతున్నానని పేర్కొన్నారు. స్పీకర్‌కు తమ హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. -
Nagaland election: ఆకాశంలో సగమైనా... నాగాలాండ్‌లో మాత్రం శూన్యం
ఎస్.రాజమహేంద్రారెడ్డి: ఆమె. ఎందులోనూ తక్కువ కాదు. ఆకాశంలో సగం. అన్నింటా కూడా సగం. ఇంటికే పరిమితమనేది గతించిన మాట. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ పురుషులకు దీటుగా, ధాటిగా తనను తాను నిరూపించుకుంటోంది. మహిళలు అన్ని రంగాల్లోనూ గణనీయమైన పురోగతి సాధిస్తున్నారు. కానీ నాగాలాండ్‌లో మాత్రం మహిళలు ఒక విషయంలో మరీ వెనకబడ్డారు. ఇక్కడా తప్పు వారిది కాదు... అక్కడి పురుషాధిక్య సమాజానిది. ఆ రాష్ట్రంలో చదువులో, ఉద్యోగాల్లో లేని కట్టుబాటు రాజకీయాలకు వచ్చేసరికి మాత్రం పెద్ద అడ్డుకట్టగా మారింది. నాగాలాండ్ శాసనసభకు ఇప్పటిదాకా ఒక్క మహిళ కూడా ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు! నాగాలాండ్ 1963లో రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత ఇప్పటిదాకా శాసనసభకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ 13 సభల్లోనూ మహిళలకు అసలే ప్రాతినిధ్యం దక్కలేదు. 13 ఎన్నికల్లోనూ బరిలో దిగిన మహిళల సంఖ్య కేవలం 20 మాత్రమే. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా ఐదుగురు మహిళలు పోటీ చేశారు. కానీ వీరిలో ముగ్గురికి డిపాజిట్ కూడా దక్కలేదు. ఓవరాల్‌గా ఇప్పటిదాకా బరిలో దిగిన 20 మందిలో చాలామంది మహిళలకూ అదే ఫలితం దక్కింది! మహిళలు ప్రధాని అవడమే గాక ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టిన మన దేశంలో ఒక్క నాగాలాండ్‌లోనే ఎందుకీ దుస్థితి? అక్కడేమన్నా అక్షరాస్యత తక్కువగా ఉందా అంటే, ఆ సమస్యే లేదు. రాష్ట్రంలో మహిళల్లో కూడా అక్షరాస్యత ఏకంగా 76.11 శాతం. ఇది దేశ సగటు అక్షరాస్యత (64.6 శాతం) కన్నా ఎక్కువ. ఇంత అక్షరాస్యత ఉన్నా నాగా మహిళలు సాటి మహిళలకు ఓటేసేందుకు సుముఖంగా లేరు! రాష్ట్ర మొత్తం ఓటర్ల సంఖ్య 13.17 లక్షలు. వీరిలో మహిళా ఓటర్ల సంఖ్య దాదాపు సగం, అంటే 6.56 లక్షలు. అయినా ఎందుకీ చిన్నచూపు? ఎందుకీ వివక్ష? స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2017లో నాగాలాండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమై నిరసనలు, ఆందోళనల దాకా వెళ్లింది! అక్కడ మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యంపై ఎంత వ్యతిరేక భావన ఉందో దీన్నిబట్టే అర్థమవుతోంది. ఈ రిజర్వేషన్లను నిరసిస్తూ పెద్ద ఎత్తున చెలరేగిన హింసలో ఇద్దరు ప్రాణాలు కూడా కోల్పోయారు! రాజ్యాంగంలోని 371 (ఎ) ఆర్టికల్‌లో పేర్కొన్న ప్రత్యేక హక్కులకు ఇది విరుద్ధమన్నది నిరసనకారుల వాదన. నిర్ణయాధికారాల్లో మహిళలకు ప్రాతినిధ్యం ఉండకూడదన్నది వారి డిమాండ్. నాగాలాండ్‌లో అత్యధిక శాతం ప్రజలు దీన్ని బలంగా విశ్వసిస్తారు. దీన్ని మార్చేందుకు మహిళల సాధికారత కోసం గళమెత్తే పలు స్వచ్ఛంద సంస్థలు ఎంత కృషి చేసినా లాభం లేకపోయింది. మహిళలకు సమాన హక్కులు కల్పించాలని ముఖ్యమంత్రి నిపూ రియో పదేపదే విజ్ఞప్తి చేస్తూనే ఉన్నా పెద్దగా ఫలితమైతే లేదు. ఆయన తన నేషనల్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ తరఫున ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు మహిళలకు టికెటిచ్చారు. కానీ మొత్తం 60 సీట్ల శాసనసభలో రెండే టికెట్లివ్వడం ఏ మేరకు సమన్యాయం చేసినట్టవుతుందో! కాంగ్రెస్, బీజేపీ అయితే మహిళలకు ఒక్కో టికెట్‌తోనే సరిపెట్టాయి. ప్రజలతో పాటు పార్టీలు కూడా మహిళల రాజకీయ ప్రాతినిధ్యానికి సరైన ప్రాధాన్యమివ్వడం లేదని ఈ సీట్ల కేటాయింపు చెప్పకనే చెబుతోంది. పార్లమెంటులో కూడా నాగాలాండ్ మహిళలకు దక్కిన ప్రాతినిధ్యం స్వల్పాతిస్వల్పం. అప్పుడెప్పుడో 1977లో రానో షైజా లోక్‌సభకు ఎన్నికవగా, తాజాగా 2022లో ఫంగ్నోన్ కొన్యాక్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రజలతో పాటు పార్టీల వైఖరి కూడా మారినప్పుడు మాత్రమే నాగాలాండ్ అసెంబ్లీలో మహిళలకు సరైన ప్రాతినిధ్యం దక్కుతుంది. నాగాలాండ్ అసెంబ్లీకి మేఘాలయ, త్రిపురలతో పాటు ఈ నెలాఖర్లోగా పోలింగ్ పూర్తవుతుంది. త్రిపురకు ఫిబ్రవరి 16న, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీలకు 27న పోలింగ్ జరగనుంది. కేవలం ఆరుగురు మహిళలు మాత్రమే నామినేషన్ వేశారు. వారిలో ఇద్దరు అధికార ఎన్డీపీపీ అభ్యర్థులు, బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఒక్కో అభ్యర్థి మిగలగా మరో ఇద్దరు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఆ నలుగురిలో ఒక్కరైనా నెగ్గి చరిత్ర సృష్టిస్తారో లేదో చూడాలి. కనీసం సగం మందైనా గెలిస్తే మహి ళల రాజకీయ ప్రాతినిధ్యంపై నాగాలాండ్ ప్రజ ల్లో ఉన్న విముఖత మెల్లమెల్లగా తొలగిపోతున్నట్టు భావించవచ్చు. ఈ ప్రశ్నకు సమాధానం మార్చి 2న వెలువడే ఫలితాల్లో లభిస్తుంది. -
వైరల్ : ట్రాక్టర్‌పై అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే
జైపూర్ : కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు నెలలకు పైగా తమ నిరసన తెలియజేస్తున్న రైతులకు దేశవ్యాప్తంగా మద్దతు వెల్లువెత్తుతోంది. తాజాగా రాజస్తాన్ కాంగ్రెస్‌కు చెందిన మీనా అనే మహిళా ఎమ్మెల్యే వినూత్న రీతిలో తన మద్దతు ప్రకటించారు. స్వయంగా తనే ట్రాక్టర్ నడుపుతూ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రైతుల పోరాటానికి మద్దతు తెలిపేందుకు తాను ట్రాక్టర్‌పై వచ్చినట్లు ఎమ్మెల్యే మీనా తెలిపారు. కాగా రైతు నిరసనలకు కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీలు తమ మద్దతును ప్రకటించాయి. (ఐటీ శాఖ వ్యాఖ్యలు : ముదురుతున్న ట్విటర్ వివాదం) #WATCH| Congress MLA Indira Meena reaches Rajasthan Assembly on a tractor "to show support for farmers", she says pic.twitter.com/0RHsGEAF8Q — ANI (@ANI) February 10, 2021 రాజస్థాన్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కేంద్ర సాగు చట్టాలను తిరస్కరిస్తూ అసెంబ్లీలో బిల్లు కూడా ఆమోదించింన సంగతి తెలిసిందే. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని గడిచిన రెండు నెలలకు పైగానే రైతులు ఉద్యమిస్తున్నా కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ అంశంపై ఇప్పటికే రైతులు కేంద్రం మధ్య పలుమార్లు చర్చలు జరిగినా అవి సఫలం కాలేదు. రైతుల కనీస మద్దతు ధరకు సంబంధించి ఖచ్చితమైన హామీని కోరుతున్నారు. సాగు చట్టాలు రద్దయ్యేవరకు తమ ఉద్యమం కొనసాగుతుందని.. అప్పటివరకు ఢిల్లీ సరిహద్దుల్లోనే నిరసన కొనసాగిస్తామని. ఇళ్లకు వెళ్లబోమని రైతులు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ( ‘40 లక్షల ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహిస్తాం’) -
దళిత మహిళా ఎమ్మెల్యేకు తీవ్ర అవమానం
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: రాజధాని ప్రాంతంలో తాడికొండ వైఎస్సార్సీపీ మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కులం పేరుతో దూషించి, దాడికి దిగిన టీడీపీ నేతల ఉదంతం కలకలం రేపింది. సోమవారం వైఎస్సార్ వర్థంతి సందర్భంగా శ్రీదేవి తుళ్లూరు మండల పరిధిలోని అనంతవరం గ్రామానికి వెళ్లారు. అక్కడ వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ గ్రామ అధ్యక్షుడు పోలు రమేశ్ ఆహ్వానం మేరకు వినాయకుడి విగ్రహం వద్దకు కుటుంబంతో కలిసి వెళ్లి పూజ చేస్తుండగా టీడీపీ నేత కొమ్మినేని శివయ్యతోపాటు మరికొందరు పెద్దగా అరుస్తూ.. దళిత మహిళ పూజ చేస్తే వినాయకుడు మైల పడతాడని, పూజ చేయొద్దని ఆమె వైపునకు దూసుకెళ్లారు. అంతటితో ఆగకుండా తీవ్ర పదజాలంతో కులం పేరుతో ఆమెను దూషించారు. ఇదేమిటని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడటమే కాకుండా అడ్డుకోబోయిన పోలీసులను సైతం నెట్టిపడేశారు. తనను దారుణమైన పదజాలంతో దూషించడంతో ఎమ్మెల్యే శ్రీదేవి తీవ్ర మనస్తాపానికి లోనై కంటతడి పెట్టి అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీనిపై తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ వట్టికూటి గౌతమి కేసు నమోదు చేశారు. మంగళవారం సాయంత్రం నిందితుల్లో కొమ్మినేని శివయ్య, ఒక మైనర్‌ను అదుపులోకి తీసుకుని వారిని తుళ్లూరు డీఎస్పీ మీడియా ముందు ప్రవేశపెట్టారు. మరో ఇద్దరు కొమ్మినేని రామకృష్ణ, బుజ్జి పరారీలో ఉన్నారు. భగ్గుమన్న దళిత సంఘాలు ఎమ్మెల్యే శ్రీదేవి పట్ల టీడీపీ నేతలు వ్యవహరించిన తీరును వైఎస్సార్సీపీ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా తీవ్రంగా ఖండించారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోరుగడ్డ అనిల్‌కుమార్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ) ఏపీ శాఖ అధ్యక్షుడు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి, గిరిజన ప్రజా సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు వడిత్యా శంకర్ నాయక్, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అ«ధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు, ఏపీ నాయీ బ్రాహ్మణ జేఏసీ కన్వీనర్ తాటికొండ నరసింహారావు, మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆకుమర్తి చిన్న మాదిగ టీడీపీ నేతల కుల దురహంకారంపై మండిపడ్డారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు వైఎస్సార్సీపీ లీగల్ సెల్ స్టేట్ సెక్రటరీ బర్రె శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. రాజధాని కుంభకోణాలను ప్రశ్నిస్తున్నాననే: ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి దేశంలో ఎక్కడా లేని కులవివక్ష రాష్ట్ర రాజధానిలోనే కనిపిస్తోందని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తన నియోజకవర్గంలోని తుళ్లూరు మండలం అనంతవరం గ్రామానికి పార్టీ కార్యకర్తలు, అభిమానుల ఆహ్వానం మేరకు వెళ్లి వినాయకచవితి వేడుకల్లో పాల్గొన్నానని తెలిపారు. కొందరు టీడీపీ నేతలు తాను మండపంలోకి వెళితే వినాయకుడు మైలపడతాడంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. అంతటితో ఆగకుండా పెద్ద పెద్ద అరుపులతో అసభ్యకరంగా మాట్లాడారని వాపోయారు. బూతు పదజాలంతో తనను తీవ్రంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు అనుసరించిన దళిత వ్యతిరేక వైఖరే దీనికి ప్రధాన కారణమన్నారు. గతంలోనూ చంద్రబాబుతోపాటు ఆదినారాయణరెడ్డి, చింతమనేని వంటివారు దళితులను అవమానిస్తూ మాట్లాడారన్నారు. తనను దూషించిన నలుగురితోపాటు వారికి కులపిచ్చి తలకెక్కించిన చంద్రబాబును కూడా తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాజధానిలో టీడీపీ నేతల అవినీతి, అక్రమాలను, కుంభకోణాలను ఆధారాలతో సహా ప్రశ్నిస్తున్నాననే ఈ దారుణానికి తెగించారన్నారు. వారి బెదిరింపులకు భయపడనని, కుంభకోణాలను ప్రశ్నిస్తూనే ఉంటానని, టీడీపీ నేతలకు శిక్ష పడేవరకు పోరాటం ఆగదని తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలి – మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కులం పేరుతో దూషించిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పోలీసులను కోరారు. ఈ విషయంపై గుంటూరు రూరల్ ఎస్పీ జయలక్ష్మితో ఫోన్లో మాట్లాడినట్టు తెలిపారు. ఈ మేరకు మంగళవారం పద్మ ప్రకటన విడుదల చేశారు. మహిళా ఎమ్మెల్యేని కించపరుస్తూ దూషిస్తూ దేవుడి దగ్గరకు వస్తే మైలపడిపోతారని మాట్లాడటం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అవమానించడమేనని పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే ఎమ్మెల్యే శ్రీదేవిని పరామర్శించానని, మహిళా ప్రజాప్రతినిధులకు మహిళా కమిషన్ పూర్తి స్థాయి అండదండలు అందిస్తుందని స్పష్టం చేశారు. -
జనఘోషతో హోరెత్తిన కలెక్టరేట్లు
ప్రజా సమస్యలే ఎజెండాగా వైఎస్సార్సీపీ ధర్నాలు ♦ పోటెత్తిన ప్రజలు... సర్కారు తీరుపై మండిపాటు ♦ పాలకపక్షం కళ్లు తెరిపించేలా సాగిన ఆందోళనలు ♦ విజయనగరంలో జాతీయ రహదారి దిగ్బంధం ♦ విశాఖలో మహిళా ఎమ్మెల్యేపై ఏసీపీ దౌర్జన్యం సాక్షి, విజయవాడ బ్యూరో: ప్రజా సమస్యలను పట్టించుకోని పాలకపక్షం కళ్లు తెరిపించేలా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్నెర్రజేసింది. రాష్ట్రంలో రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజల సమస్యలపై పోరుబాట పట్టింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు రాష్ట్రంలో కలెక్టరేట్ల వద్ద గురువారం నిర్వహించిన ధర్నాలు జనఘోషతో దద్దరిల్లాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా టీడీపీ సర్కారు తమను మోసం చేసిందని ప్రజలు తీవ్రంగా మండిపడ్డారు. పార్టీ జిలా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ సర్కారు వైఫల్యాలను ఎండగట్టారు. చంద్రబాబు ఏరుదాటి తెప్ప తగలేసినట్టుగా వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబుపై కూడా ఏ1గా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఎడ్లబండ్ల ర్యాలీ చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ టీడీపీ నేతలు జగన్‌పై బురద జల్లితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తూర్పుగోదావరిజిల్లా కాకినాడ కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో భారీ ఎత్తున జనం హాజరయ్యారు. శ్రీకాకుళంలో జరిగిన ధర్నాలో పార్టీ నేతలు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం ప్రసంగించారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించిన వైఎస్సార్సీపీ నేతలు జాతీయ రహదారిని దిగ్బంధనం చేశారు. విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయ పరిసరాలు ధర్నాతో హోరె త్తాయి. గుంటూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతపురంలో కడప కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ఆందోళనకు భారీగా ప్రజలు తరలివచ్చారు. కృష్ణా ట్రిబ్యునల్వద్ద తమ వాదన విన్పించడంలో విఫలమవ్వడంతో రాయలసీమ రైతులకు నష్టం వాటిల్లుతుందని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా జరిగింది. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై పోలీసు దౌర్జన్యం విశాఖ కలెక్టరేట్ వద్ద వైఎస్సార్సీపీ ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ధర్నా నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలను ఏసీపీ ఆర్.రమణ అడ్డుకున్నారు. కలెక్టర్ లేకపోవడంతో వినతిపత్రాన్ని గోడకు అంటించే యత్నం చేసిన నేతలను గెంటివేశారు. ఈ సందర్భంగా జరిగిన వాగ్వాదంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. ఇంతలో అక్కడికి వచ్చిన డీఆర్వో కె.నాగేశ్వరరావు ముఖ్యనాయకులు తన గదిలోకి రావాలని కోరారు. అయినప్పటికీ ఏసీపీ వారిని డీఆర్వో దగ్గరకు పంపేందుకు నిరాకరించి అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి చేయిపట్టుకుని బయటకు నెట్టి వేశారు. మహిళా ఎమ్మెల్యేనైన తనకు జరిగిన అవమానంపై అసెంబ్లీలో ప్రివిలైజ్ మోషన్ రైజ్ చేస్తామని ఆమె చెప్పారు. -
మంత్రివర్గంలో మహిళలకు చోటేదీ!
* ప్రభుత్వానికి వారి సంక్షేమం పట్టదా! * డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి నర్సాపూర్ రూరల్: మంత్రివర్గంలో మహిళలకు చోటు కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం కించపరుస్తోందని మాజీ మంత్రి, డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి ఆరోపించారు. బుధవారం నర్సాపూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఒక్క మహిళా ఎమ్మెల్యేకు మంత్రిపదవి ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టారు. మంగళవారం నాటి విస్తరణలో మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తారని ఆశించామన్నారు. మహిళా శిశుసంక్షేమశాఖను మహిళలకు కేటాయించకుండా మగవారికి ఇవ్వడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో మహిళల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన అభయహస్తం, బంగారుతల్లి, జీరోవడ్డీ రుణాలు తదితర పథకాలను ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు పేర్లు మార్చారని ఆమె దుయ్యబట్టారు. నిరాశ మిగిల్చిన ఆసరా గతంలో పెన్షన్లు తీసుకున్న అనేకమంది ప్రస్తుతం పెన్షన్లు కోల్పోయారని సునీతారెడ్డి పేర్కొన్నారు. 50 శాతం వైకల్యం పేరుతో వికలాంగులకు, మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్ పేరుతో మెలికపెట్టి వితంతువుల పెన్షన్లు తొలగించారన్నారు. అలాగే వైఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయహస్తం పెన్షన్లు నిలిపివేశారన్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2లక్షల 70 వేల అభయహస్తం పెన్షన్లు నిలిపివేసిందన్నారు. గతంలోనే ప్రతిపాదనలు చేశాం గతంలోనే ఘణపురం ఆయకట్టు ఎత్తుపెంచేందుకు ప్రతిపాదనలు తయారు చేశామని సునీతారెడ్డి పేర్కొన్నారు. కేవలం 0.5 పెంచితే సరిపోతుందని అప్పట్లో నిపుణులు చెప్పారన్నారు. ప్రస్తుతం 1.5 పెంచబోతున్నట్లు ప్రకటించడం విచారకరమన్నారు. అప్పుడు సీఈఓ గా ఉన్న మురళీధర్ ఇప్పుడు కూడా ఉన్నారన్నారు. 1.5 పెంచితే అనేక గ్రామాలకు ముప్పు ఉంటుందన్నారు. సమావేశంలో ఎంపీపీ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, ఎంపీపీ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌గుప్తా, స్థానిక సర్పంచ్ వెంకటరమణరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యంగౌడ్ పాల్గొన్నారు.