Himalayan Mountains
-
70 ఏళ్ల వయసులో బుగ్గల్ శిఖరంపైకి సాహస యాత్ర
ఆయన వయసు 70 ఏళ్లు.. సాధారణంగా ఈ వయసు వాళ్లు మహా అయితే తీర్థయాత్రలు చేస్తుంటారు. లేదంటే ఇంటికే పరిమితమై మనుమలు, మనుమరాళ్లతో కాలక్షేపం చేస్తుంటారు. కానీ డాక్టర్ ఏబీఆర్పీ రెడ్డి (Dr ABRP Reddy) మాత్రం తీవ్ర చలికి తట్టుకుని హిమాలయాల్లో సాహసోపేతమైన ట్రెక్కింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు.. అనుకోవడమే కాదు..ఆ యాత్రను పూర్తిచేసి వయసుతో పనిలేకుండా ఎలాంటి సాహసాన్ని అయినా చేయవచ్చని నిరూపించాడు. ఐటీ, యానిమేషన్ రంగంలో సీఈఓగా 25 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉంది. 60 ఏళ్ల వయసులో ట్రైనింగ్ ప్రారంభించి మారథాన్ రన్నర్‌గా ఎదిగారు. హైదరాబాద్ వంటి వెచ్చని ప్రాంతంలో నివసిస్తున్నప్పటికీ చల్లని వాతావరణం ఏబీఆర్పీ రెడ్డికి కొత్తేమీ కాదు. గతంలో ఢిల్లీ, ఇంగ్లండ్‌లో కూడా నివసించారు. ఇప్పటికే ఐదుసార్లు హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేసిన ఆయన కుమార్తె సింధు కూడా వెంట ఉంది. ట్రెక్కింగ్ చేయడానికి కూతురే తనకు ప్రేరణ అని ఏబీఆర్పీ రెడ్డి పేర్కొన్నారు. ఏటా 20 వేల మందికి పైగా ట్రెక్కింగ్ చేసేవారికి మార్గనిర్దేశం చేసే ఇండియా హైక్స్ బైక్ గ్రూప్‌లో ఆయన చేరారు. వారు గరిష్ట వయో పరిమితి 62 ఏళ్లుగా నిర్దేశించినప్పటికీ, ఏబీఆర్పీ రెడ్డి గుండె సంబంధిత అంశాలతో సహా ఇతర ఫిట్నెస్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండడంతో ట్రెక్కింగ్ పూర్తి చేశారు. నెల రోజుల పాటు శిక్షణ.. ట్రెక్కింగ్ కోసం నెల రోజుల పాటు జిమ్‌లో శిక్షణ పొందాను. ఇందు కోసం రోజుకు 60 అంతస్తులు వేగంగా ఎక్కేవాడిని. ట్రెక్కింగ్ సమయంలో రాత్రి పూట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీ సెంటీగ్రేడ్‌కు చేరుకుంటాయి. దీంతో తీవ్రమైన చలిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదే అత్యంత క్లిష్టమైన భాగం. తీవ్ర చలిని తట్టుకునేందుకు గూడారాల లోపల ఉండాలి. స్లీపింగ్ బ్యాగులను ఉపయోగించాలి. ఎత్తుకు చేరుకున్నప్పుడు వాతావరణ పీడనాన్ని ఎదుర్కోవాలి. తక్కు వ ఆక్సిజన్ కారణంగా ఆల్టిట్యూడ్ సిక్నెస్ రావచ్చు. ఈ స్ఫూర్తితో మరిన్ని సాహసాలునా కుమార్తె సింధు టెక్కింగ్ గ్రూపులో ఉండడం వల్ల అధిరోహణ, దిగే సమయంలో ఎన్నో సూచనలు చేసింది. మూడు రోజుల్లో మా బృందంలోని మొత్తం 24 మంది ట్రెక్కర్లు దయారా బుగ్గల్ అనే 12,000 అడుగుల ఎత్తు శిఖరాన్ని చేరుకున్నాం. శిఖరాన్ని చేరుకున్నప్పుడు ట్రెక్కింగ్‌లో ఎదుర్కొన్న కష్టాలను పూర్తిగా మరిచిపోయి సంబరాలు చేసుకున్నాం. అక్కడి నుంచి కిందికి దిగడం మొదలై నాల్గో రోజు సాయంత్రం బేస్ క్యాంప్‌కు చేరుకున్నాం. బేస్ క్యాంప్ డెహ్రాడూన్ నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. మొత్తం 12,000 అడుగుల ట్రెక్కింగ్ ఇచ్చిన స్ఫూర్తితో 2025లో 18,000 అడుగుల ఎత్తు ట్రెక్కింగ్‌కు సిద్ధం అవుతున్నాను. – డాక్టర్ ఏబీఆర్పీ రెడ్డి -
పర్వత పుత్రి సాహు శ్రద్ధాంజలి సాహు...
ఒడిశాలో పుట్టి, హైదరాబాద్‌లో పెరిగిన పంతొమ్మిదేళ్ల అమ్మాయి. బీటెక్ ఫైనలియర్. చదివేది సాఫ్ట్వేర్ కోర్సే అయినా తన పరిజ్ఞానాన్ని దేశ రక్షణరంగం కోసం అంకితం చేయాలనుకుంటోంది. ‘ఆ కల కోసమే ఎన్సీసీలో చేరాను, ఆ కల నెరవేర్చుకునే క్రమంలో నన్ను నేను నిరూపించుకోవడం కోసమే పర్వతాన్ని అధిరోహించాను’ అంటోంది. గత జూన్ నెల 21వ తేదీన కాంగ్ యాత్సే 2 పర్వతాన్ని అధిరోహించి, శిఖరం మీద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించింది. ‘నా కల చాలా పెద్దదని నాకు తెలుసు. ఆ కలను సాకారం చేసుకోవడానికి శ్రద్ధగా ఒక్కో అడుగు వేస్తున్నాను’ అంటూ ‘సాక్షి ఫ్యామిలీ’తో తన పర్వతారోహణ అనుభవాల్ని పంచుకుంది శ్రద్ధాంజలి సాహు. కాంగ్ యాత్సే పర్వతశ్రేణి హిమాలయాల్లో లధాక్ రీజియన్‌లో ఉంది. కాంగ్ యాత్సే పర్వత శిఖరం ఎత్తు 6,250 మీటర్లు. నా మౌంటెనీరింగ్ జర్నీ చాలా తమాషాగా జరిగి΄ోయింది. ఎయిత్‌లోనో, నైన్త్ క్లాస్‌లోనో గుర్తులేదు. హిందీలో ‘ఎవరెస్ట్ మేరీ శిఖర్’ అనే ΄ాఠం ఉండేది. మా హిందీ టీచర్ ఆ ΄ాఠాన్ని ఎంత అద్భుతంగా చె΄్పారంటే... బచేంద్రి΄ాల్‌లాగ నేను కూడా పర్వతారోహణ చేయాలనుకున్నాను. పర్వతాల గురించి తెలుసుకోవడం కూడా అప్పటి నుంచే మొదలైంది. గత ఏడాది ఏప్రిల్‌లో ఎన్సీసీ, హైదరాబాద్ కమాండర్ కల్నల్ అనిల్ ఆధ్వర్యంలో మౌంటెనీరింగ్ అవకాశం రాగానే మరేమీ ఆలోచించకుండా ట్రైనింగ్‌కి వెళ్లాను. హెచ్ఎమ్ఐ (హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇన్స్టిట్యూట్) ఆధ్వర్యంలో డార్జిలింగ్‌లో నెల రోజులు బేసిక్ ట్రైనింగ్, ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో అడ్వాన్స్డ్ ట్రైనింగ్, సెర్చ్ అండ్ రెస్యూ్క మెథడ్స్ ట్రైనింగ్ ఉత్తరాఖండ్‌లో పూర్తి చేసుకుని ఎక్స్‌పెడిషన్‌కు సిద్ధమయ్యాను. అమ్మకు దూరంగా యాభై రోజులుఢిల్లీలో మే 28న ఫ్లాగ్ ఆఫ్, జూన్ 29న ఫ్లాగ్ ఆన్ జరిగింది. ముందు, వెనుక ప్రయాణాలన్నీ కలిపి యాభై రోజులు ఇంటికి దూరంగా ఉండడం అదే మొదటిసారి. అమ్మానాన్నల దగ్గర ఉన్నప్పుడు వాళ్ల ప్రేమను ఆస్వాదిస్తూ ఉంటాం. వాళ్లకు దూరంగా ఉండడం ఎంత కష్టమో దూరంగా ఉన్నప్పుడే తెలుస్తుంది. అమ్మానాన్నల ప్రేమ ఎంత అమూల్యమైనదో తెలిసి వచ్చిన క్షణాలవి. ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగానికి వెళ్లాలనుకున్నప్పుడు అమ్మ ఒప్పుకోలేదు. మౌంటెనీరింగ్‌కీ ఒప్పుకోలేదు. అమ్మను ఒప్పిస్తే నాన్న ఆటోమేటిగ్గా ఒప్పుకుంటాడని, అమ్మను బాగా కన్విన్స్ చేశాను. ఈ టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేశాను. ఇక రక్షణరంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవడం గురించి ఒప్పించి, నాకున్న డిఫెన్స్ యూనిఫామ్ కల నెరవేర్చుకోవాలి. ఇప్పుడు ఒప్పుకుంటారనే నమ్మకం ఉంది. ఆరోహణలో అవరోధాలు కాంగ్ యాత్సే 2 పర్వతారోహణ మర్ఖా వ్యాలీ దగ్గర మొదలవుతుంది. మౌంటెనీరింగ్ బూట్స్, క్రాంపన్స్‌లలో ఐదు కేజీల బరువులుంటాయి. అవసరమైన వస్తువులతో ఇరవై కేజీల బ్యాగ్ మోస్తూ నడక మొదలవుతుంది. ఐదువేల మీటర్లు దాటిన తర్వాత బేస్‌క్యాంప్ ఉంటుంది. అక్కడి వరకు మన అన్నం, పప్పు ఉంటాయి. ఆంతకు పైకి వెళ్లే కొద్దీ అన్నం ఉడకదు, చ΄ాతీలు కాల్చడం కుదరదు. డ్రై రేషన్... అంటే డ్రై ఫ్రూట్స్, నట్స్, చాక్లెట్లు, న్యూట్రిషన్ బిస్కట్లు, ఓఆర్ఎస్ ΄్యాకెట్‌లతో ప్రయాణం కొనసాగుతుంది. నడక... నడక... ధ్యానంలాగ తదేక దీక్షతో సాగుతుంది. అడుగు పడిన చోట గట్టిగా ఉందా జారుతోందా అని మన ముందు వాళ్ల అడుగులను గమనిస్తూ వెళ్లాలి. ఈ నడక సమయంలో అనేక ఆలోచనలు వస్తాయి. ముందుకెళ్లి ఏం సాధిస్తాం, వెనక్కి వెళ్తే నష్ట΄ోయేదేముంది... అని కూడా అనిపిస్తుంది. ఆరోహణ పూర్తయ్యేటప్పటికి ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా మారుతాం. పరస్పరం సహకరించుకోవడంతో΄ాటు ఉద్వేగాలకు లోనుకాకుండా ప్రశాంతంగా ఉండడం, ఎదుటి వారు చెప్పేది శ్రద్ధగా వినే లక్షణం కూడా అలవడుతుంది. శిఖరాన్ని చేరినప్పుడు సమయం ఉదయం ఏడున్నర. సూర్యోదయం అయింది. చుట్టూ తెల్లని వలయం ఆవరించినట్లు ఉంది. వైట్ అవుట్ అంటారు. మేఘాలు ఆవరించి ఉంటాయి. పది మీటర్ల దూరాన ఉన్న మనిషి కూడా కనిపించడు. శిఖరాన్ని అధిరోహించినప్పుడు కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించగలిగినంత సాహిత్యాన్ని చదవలేదు’’ అని నవ్వుతూ ముగించింది శ్రద్ధాంజలి సాహు. మౌంటెనీరింగ్‌లో వచ్చే ఏడాది జరిగే మౌంట్ ఎవరెస్ట్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పెడిషన్‌కు ఆమెకు ఆహ్వానం వచ్చింది. ఎంపిక ప్రక్రియ మొదలు కావాల్సి ఉంది. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
Lok Sabha Election 2024: ఆ ఊరి కోసం 3 రోజుల ట్రెక్కింగ్!
అది హిమాలయ పర్వత శ్రేణుల్లోని ఓ గ్రామం. పేరు బారా – భంగల్. సముద్ర మట్టానికి 2,575 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దాన్ని ఆనుకునే రావి నదీ ప్రవాహం సాగిపోతుంటుంది.ఆ ఊరికి రోడ్డు మార్గం లేదు. చేరుకోవాలంటే ట్రెక్కింగ్ ద్వారానే సాధ్యం. పైగా అందుకు మూడు నాలుగు రోజులు పాటు సాహసయాత్ర చేయాల్సిందే! హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రా జిల్లా బైజంత్ సబ్‌డివిజన్ పరిధిలో ఉన్న ఈ కుగ్రామంలో 468 మంది ఓటర్లున్నారు. హిమాలయాల్లో ఎక్కడో మూలన విసిరేసినట్టుండే ఈ గ్రామం ఏడాదిలో ఆర్నెల్ల పాటు పూర్తిగా మంచుమయంగా మారుతుంది. దాంతో నవంబర్ నుంచి ఏప్రిల్ దాకా స్థానికులు కూడా సమీపంలోని బిర్కు వలస పోతారు. ఈ గ్రామాన్ని సందర్శించాలంటే మే నెల నుంచి అక్టోబర్ మధ్యే సాధ్యం! అయినా 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ గ్రామంలో అందరూ ఓటేయడం విశేషం! ప్రతికూల వాతావరణం వల్ల ఆ ఎన్నికలప్పుడు హెలికాప్టర్‌ను వాడటం కుదర్లేదు. దాంతో 18 మందితో కూడిన ఎన్నికల బృందం 40 కిలోమీటర్లు ట్రెక్ చేసి మరీ గ్రామానికి చేరుకుంది! ఈసారి కూడా ఎన్నికల సిబ్బంది ట్రెక్కింగ్నే నమ్ముకుంటున్నారు. ‘‘వారు పోలింగ్‌కు కొన్ని రోజుల ముందే బయల్దేరతారు. రోడ్డు మార్గంలో రాజ్గుండ్ దాకా చేరుకుంటారు. అక్కడి నుంచి మూడు రోజులు ట్రెక్ చేసి బారా భంగల్ చేరతారు’’ అని కాంగ్రా జిల్లా ఎన్నికల అధికారి హేమ్రాజ్ బైర్వా వివరించారు. ఈవీఎం తదితర పోలింగ్ సామగ్రి తరలింపు కోసం హెలికాప్టర్ సమకూర్చాలని కోరనున్నామన్నారు. ‘‘గ్రామస్తుల్లో బారా భంగల్లో ఎవరున్నారు, బిర్‌లో ఎవరున్నారో ఎన్నికల ముందు సర్వే చేసి తెలుసుకుంటాం. తదనుగుణంగా ఓటర్ల జాబితాను వేరు చేసి పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం’’ అని ఆయన తెలిపారు. అన్నట్టూ, ఈ ఊళ్లో సెల్ నెట్వర్క్ కూడా ఉండదు. దాంతో ఎన్నికల సిబ్బంది శాటిలైట్ ఫోన్లు వాడతారు. ఇక్కడ జూన్ 1న చివరిదైన ఏడో విడతలో పోలింగ్ జరగనుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అందుబాటులోకి అటల్ టన్నెల్
రోహ్తాంగ్: హిమాలయ పర్వత సానువుల్లో ఎంతో వ్యయప్రయాసలకోర్చి నిర్మించిన, ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే సొరంగ మార్గా(టన్నెల్)న్ని ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి, లేహ్ మధ్య 46 కి.మీ. దూరాన్ని ఈ సొరంగ మార్గం తగ్గిస్తుంది. 9.02 కి.మీ.ల పొడవైన ఈ టన్నెల్ వల్ల ప్రయాణ సమయం 5 గంటలకు తగ్గిపో తుంది. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య, ఎన్నో సవాళ్లనెదుర్కొని ఈ సొరంగ మార్గాన్ని నిర్మించింది. దేశ రక్షణలో అత్యంత వ్యూహాత్మకమైన ఈ సొరంగ మార్గాన్ని ప్రారంభించిన మోదీ దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి కన్న కలలు సాకారమయ్యాయని అన్నారు. ఇదే సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం దేశ భద్రతా ప్రయోజనాలపై రాజీ పడిందని దుయ్యబట్టారు. అటల్ సొరంగం, తేజాస్ యుద్ధ విమానాల తయారీ మొదలైన వాటిని గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని అన్నారు. ‘మాకు దేశ భద్రతే అత్యంత ముఖ్యం. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు ఈ స్థాయిలో ఎప్పుడూ జరగలేదు. 26 ఏళ్లలో పూర్తి కావాల్సిన పనిని మా ప్రభుత్వం ఆరేళ్లలో చేసింది. కేవలం సైనిక అవసరాలే కాదు, లేహ్, లద్దాఖ్ ప్రాంత ప్రజల బతుకు అవసరాలు కూడా ఈ సొరంగం తీరుస్తుంది’అని మోదీ అన్నారు. అటల్ టన్నెల్‌గా పేరు మార్పు 2000 సంవత్సరం జూన్ 3న వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఈ సొరంగ మార్గాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. 2002 మే 26న ఈ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆరేళ్లలో దీనిని పూర్తి చెయ్యాలని లక్ష్యంగా నిర్ణయించినప్పటికీ ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఇతర కారణాలతో నిర్మాణం సాగలేదు. మొదట్లో దీనిని రోహ్తాంగ్ సొరంగం అని పిలిచేవారు. 2019లో దీనికి అటల్ సొరంగం అని పేరు మార్చారు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఈ టన్నెల్ నిర్మాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. సొరంగం పూర్తి చేయడానికి పదేళ్లు పట్టింది. సొరంగం విశేషాలు ► సముద్ర మట్టానికి 10వేల అడుగుల ఎత్తున నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే సొరంగమిది. నిర్మాణ వ్యయం రూ.3,300 కోట్లు. ► ఒకటే ట్యూబ్‌లో, డబుల్ లేన్‌తో ఈ సొరంగాన్ని నిర్మించారు. రోజూ 3వేల కార్లు , 1500 లారీలు రాకపోకలు సాగిం చేలా నిర్మించారు. దీంట్లో వాహనాల గరిష్టవేగం గంటకు 80 కి.మీ. ► సరిహద్దుల్లో రక్షణ పరంగా ఇది అత్యంత వ్యూహాత్మకమైనది. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినా మిలటరీ సామగ్రిని తరలించడానికి ఈ సొరంగం బాగా ఉపయోగపడుతుంది. ► భారీగా మంచు కురవడం వల్ల ఏడాదిలో ఆరునెలలు లేహ్ ప్రాంతవాసులకి ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోతాయి. ఈ సొరంగ మార్గంతో అక్కడ ప్రజలు కూడా ప్రయాణించే అవకాశం వచ్చింది. -
ఖరీదైన వయాగ్రా.. ఇప్పుడు ఆ జాబితాలో
డెహ్రాడూన్: లైంగిక ఉద్దీపన కోసం వాడే, హిమాలయన్ వయాగ్రాగా గుర్తింపు పొందిన ‘యార్సాగుంబా’ను ఐయూసీఎన్(ఇంటర్నేషనల్ యూనియన ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్) అంతరించి పోయే జాతుల జాబితాలో చేర్చింది. అత్యంత ఖరీదైన ఈ వన మూలిక త్వరలోనే కనుమరుగయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు జూలై 9న విడుదల చేసిన నివేదికలో అంతరించే పోయే జీవ జాతుల(జంతువులు, మొక్కలు) జాబితాను పొందుపరిచింది. ఇందుకు సంబంధించిన తొమ్మిది కేటగిరీల్లో యార్సాగుంగాను ‘వల్నరబుల్’ కేటగిరీలో చేర్చింది. అధికంగా సేకరిస్తున్న కారణంగా గత 15 ఏళ్లుగా దీని విస్తరణ 30 శాతానికి పడిపోయిందని పేర్కొంది. ఈ విషయం గురించి ఐయూసీఎన్ భారత ప్రతినిధి వివేక్ సక్సేనా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. హిమాలయన్ వయాగ్రా కనుమరుగైపోకుండా ప్రభుత్వం సరైన జాగ్రత్తలు తీసుకునేందుకు ముందుకు రావాలనే ఉద్దేశంతో తాము ఈ వనమూలికను రెడ్ లిస్టులో చేర్చినట్లు తెలిపారు. కాగా ఐయూసీఎన్ తాజా నివేదిక ఉత్తరాఖండ్‌లోని అనేక మంది గ్రామీణ ప్రజలు ఉపాధిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కిలో రూ. 20 లక్షలు గొంగళిపురుగు లాంటి ఓ పురుగు లార్వా తలపై పుట్టగొడుగుల మాదిరిగా పెరిగే ఫంగస్‌ను యార్సాగుంబా అని పిలుస్తారు. శీతాకాలంలో ఇది పురుగులా ఉంటే.. వేసవి వచ్చేసరికి ఫంగస్ కారణంగా చిన్న మొక్క మాదిరిగా మారిపోతుంది. పూర్తిగా తయారైన యార్సాగుంబా ఒక అగ్గిపుల్ల మాదిరిగా.. రెండు నుంచి మూడు సెంటీమీటర్ల పొడువు ఉంటుంది. టిబెట్ పీఠభూమి, నేపాల్, చైనా, భారత్, భూటాన్‌లోని వివిధ ప్రాంతాల్లో ఇది పెరుగుతుంది. ఉత్తరాఖండ్‌లో దీనిని కీడా జాడీగా వ్యవహరిస్తారు. పితోరాఘర్, చమోలీ జిల్లాలో అత్యధిక మంది ప్రజలు జీవనోపాధి కోసం యార్సాగుంబా సేకరణపై ఆధారపడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో కిలో యార్సాగుంబా ధర దాదాపు రూ. 20 లక్షలు పలుకుతుంది. అందుకే బంగారం కన్నా విలువైన ఈ మూలిక కోసం చిన్నాపెద్దా అంతా వేట సాగిస్తారు. ప్రాణాలు పణంగా పెట్టి మరీ యార్సాగుంబా సేకరణలో తలమునకలైపోతారు. ఏప్రిల్ నుంచి జూన్ రెండో వారం వరకు యార్సాగుంబాను సేకరిస్తారు. అయితే ప్రస్తుతం కేడా జాడీని కనుమరుగయ్యే జాబితాలో పెట్టినందున హార్వెస్టింగ్ పీరియడ్‌ను నెల రోజులకు కుదించినట్లు అల్మోరాలోని జీబీ పంత్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ ఎన్విరాన్మెంట్ డైరెక్టర్ ఆర్ఎస్ రావల్ తెలిపారు. ఈ ఏడాది అస్సలు బాలేదు ఈ విషయం గురించి పితోఘర్ జిల్లాలోని గోల్ఫా వాన్ పంచాయతీ ప్రధాన్ మాట్లాడుతూ.. ‘‘ఈ ఏడాది పరిస్థితులు అస్సలు బాగాలేవు. కీడా జాడీని సేకరించేందుకు అనుమతి లభించలేదు. క్యాంపులు ఏర్పాటు చేయలేదు. ఇప్పుడేమో ఈ రెడ్ లిస్టు. దీని వల్ల మా ఆ ఆదాయం దెబ్బతింటుంది. అనేక కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని మూటగట్టుకుంటాయి’’అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా గతేడాది జిల్లా యంత్రాంగాలు ప్రజలకు పాసులు ఇచ్చి.. అటవీ అధికారుల పర్యవేక్షణలో కీడా జాడీని సేకరించే వీలు కల్పించింది. అయితే ఈ ఏడాది కోవిడ్-19 కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ప్రజలు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో వారు ఆర్థికంగా నష్టపోయారు. ఇదిలా ఉండగా.. లాక్‌డౌన్‌తో వల్ల హార్వెస్టింగ్‌కు ఇబ్బంది తలెత్తడం, ఈ ఏడాది తగినంతగా ఫంగస్ ఉత్పత్తి కాకపోవడంతో రానున్న రోజుల్లో డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నందున గ్రోత్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు స్థానిక అటవీ అధికారులు తెలిపారు. కాగా బురదలో పెరిగే ఈ పసుపు రంగు మూలికకు లైంగిక కోరికలు పెంచడం, నపుంసకత్వాన్ని నయం చేయడమే గాక.. కీళ్ల నొప్పులు, ఊబకాయం తగ్గించడంతో పాటుగా కేన్సర్ కణాలను నాశనం చేయగల గుణాలున్న ఔషధం అని చైనా పరిశోధకులు గతంలో పేర్కొన్నారు. -
బిర్ బిల్లింగ్.. చిల్ థ్రిల్లింగ్!
నేల మీద కుర్చీలో కూర్చోవటంలో ఇంకా కంఫర్ట్ కావాలంటే లగ్జరీని చేర్చుకోవచ్చు. కానీ ఆకాశంలో కుర్చీ వేసుకుని కూర్చుంటే ఎలా ఉంటుంది? ఆసలు ఆకాశంలో కుర్చీ వేసుకుని కూర్చోవడం ఎలా సాధ్యం అంటారా....అది పారాగ్లైడింగ్తో మాత్రమే సాధ్యం. విమానం ఎక్కినప్పుడు మనం ఆకాశంలో ప్రయాణిస్తున్న అనుభూతి మాత్రమే లభిస్తుంది. కానీ పక్షిలా ఎగిరిన ఫీలింగ్ మాత్రం ఉండదు. ఈ అనుభూతి సొంతమవ్వాలంటే పారాగ్లైడింగ్ మాత్రమే మార్గం. విభిన్న ఆలోచనలు..అభిరుచులు కలిగిన పర్యాటకులు ఇప్పుడు కేవలం పారాగ్లైడింగ్ అనుభూతి కోసం హిమాచల్ ప్రదేశ్‌లోని ‘బిర్–బిల్లింగ్’ ప్రాంతానికి క్యూ కడుతున్నారు. చలి వేళ సాహసాలకు దిగుతున్నారు. – సాక్షి సిటీబ్యూరో బిర్–బిల్లింగ్ ఆసియాలోనే బెస్ట్ పారాగ్లైడింగ్ సైట్‌గా గుర్తింపు పొందింది. వరల్డ్ కప్ పోటీలు కూడా ఇక్కడ జరిగాయి. పారాగ్లైడింగ్కు కావలసిన సహజమైన ల్యాండింగ్, విండ్ ఉన్న ప్రాంతం కావటంతో దేశంలోనే బెస్ట్ పారాగ్లైడింగ్ సైట్‌గా బిర్–బిల్లింగ్ స్థానం సంపాదించుకుంది. «ధర్మశాల, మెక్లాడ్గంజ్లతో పోలిస్తే బిర్–బిల్లింగ్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. హిమాచల్ ప్రదేశ్‌లోని బిర్ గ్రామానికి 14 కిలోమీటర్లో దూరంలో ఉన్న కొండ మీద ప్రాంతాన్ని బిల్లింగ్ అంటారు. ఇక్కడ నుంచే పారాచ్యూట్ ఫ్లయింగ్ స్టార్ట్ అవుతుంది. సముద్ర మట్టం నుండి 2400 మీటర్ల ఎత్తులో ఉన్న బిల్లింగ్ ప్రపంచంలోనే బెస్ట్ పారాగ్లైడింగ్ టేకాఫ్ పాయింట్. పారాగ్లైడింగ్, ట్రెక్కింగ్ చేయాలనుకునే వారు బిల్లింగ్‌కు కారు, ఇతర వాహనాల్లో గంటసేపు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. బిర్లోని చౌగన్ మైదానం పారాగ్లైడింగ్కు ల్యాండింగ్ ప్రాంతం. ఇక్కడి పారాగ్లైడింగ్ అనుభవాలను కొందరు పర్యాటకులు ఇలా పంచుకున్నారు... ఎలా చేరుకోవాలి... నగరం నుంచి రైలు లేదా విమానంలో ఢిల్లీకి చేరుకోవాలి. ఢిల్లీ నుంచి బిర్ బిల్లింగ్‌కు వెళ్లేందుకు ప్రైవేటు ఏసీ బస్సులు, ప్రభుత్వ బస్సులుంటాయి. ఇక్కడి నుంచి దాదాపు 13 గంటల ప్రయాణం ఉంటుంది. విమానంలో వెళ్తే ముందు ఢిల్లీ, అక్కడి నుంచి కాంగ్డా వరకు నేరుగా వెళ్లవచ్చు. అక్కడి నుంచి క్యాబ్ లేదా బస్ తీసుకోవాల్సి ఉంటుంది. మరికొన్ని ప్రత్యేకతలు.. ► సాహసికుల మనసుదోచే ప్రాంతం హిమాచల్‌ప్రదేశ్. ► బౌద్ధాలయాలు, మానెస్టరీస్ ఇక్కడ ఎన్నో ఉన్నాయి. వాటిలో బౌద్ధ సంస్కృతి అధ్యయన సంస్థ ‘డీర్ పార్క్ ఇన్స్టిట్యూట్’ ముఖ్యమైనది. ఇక్కడ మెడిటేషన్, యోగా, శాంతి తదితర కోర్సులపై శిక్షణ కోర్సులు లభిస్తాయి. ► ట్రెక్కింగ్, సైక్లింగ్, క్యాంపింగ్ చెయ్యడానికి అనుకూలమైన ప్రాంతం. ► దగ్గరల్లో బంగోరు జలపాతం, చారిత్రక బైద్యనాథ్ ఆలయం ఉన్నాయి. ► టాయ్ ట్రెయిన్ ఎక్కాలనే కోరిక ఉన్నావారు ఒక రోజు కేటాయిస్తే అద్భుతమైన అనుభూతులను మూటగట్టుకోవచ్చు. ► బిర్లోని స్థానికులు ఈ ప్రాంతాల్లో మీ పర్యటనకు కావాల్సిన సమాచారం చక్కగా అందిస్తారు. హిమ సమీరాల తాకిడి.. 10–15 నిముషాల పాటు ఆకాశంలో తేలిపోతూ...హిమాలయ పర్వత ప్రాంతాలను చూసే అద్భుతమైన అవకాశం ఈ ఫ్లయింగ్ వల్ల కలుగుతుంది. చల్లటి, స్వచ్ఛమైన హిమ సమీరం అణువణువునూ స్పృశిస్తున్న అనుభూతి జీవితంలో ఒక్కసారైనా అనుభవించాల్సిందే. బిర్ గ్రామంలో అనేక ట్రావెల్ కంపెనీలు ఈ ప్రయాణాన్ని మనకు అందిస్తాయి. అవసరమైన వివరాలు, ఫీజు సేకరించిన తర్వాత వారు వాహనాల్లో బిల్లింగ్‌కు తీసుకువెళ్తారు. అక్కడ పైలట్లు మనల్ని ఫ్లయింగ్కి సిద్ధం చేస్తారు. మన చేతిలో ఒక స్టిక్ కెమెరాని అందించి సెల్ఫీ వీడియో రికార్డు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తారు. ఈ ప్రయాణానికి ఒక్కరికి 1500–2000 వరకూ చార్జి చేస్తారు. అనుభవం ఉన్న వాళ్లు సొంతంగా కూడా ఫ్లై చేస్తుంటారు. – నయీం, ట్రావెలర్, ఓల్డ్‌సిటీ రీచార్జ్ అవుతాం జీవితం నిస్సత్తువగా, నిర్జీవంగా, డిప్రెస్డ్గా ఉన్నప్పుడు ఇలాంటి యాత్రలు చెయ్యటం వల్ల రీచార్జ్ అవుతాం అని ఫ్రెండ్స్ చెప్పారు. ఇక్కడికి వచ్చాక అది నిజమే అనిపించింది. మానసిక అలజడులను శాంత పరిచే ప్రశాంత వాతావరణం హిమాలయాల సొంతం. ఇక పారాచ్యూట్ ఎక్కి భయపడుతున్న నన్ను, నా పైలట్ రాహుల్ కూల్ చేశారు. ఆ ప్రాంతం ప్రత్యేకత గురించి, తన జీవితం గురించి, బిర్, హిమాలయాల్లో పుట్టడం తన అదృష్టంగా చెబుతూ, నా దృష్టి మళ్లించి భయం పోగొట్టాడు. ఆ పర్వతాల మధ్యన ఉన్న బిర్ గ్రామంలోని తన ఇళ్లు, ఆ చుట్టు పక్కన పారే నది, పంటలు, రాజకీయాలు అన్నింటి గురించి ఆకాశంలోనే వివరించాడు. తన మాటల వల్ల నగర జీవితాల్లో మనం ఏం కోల్పోతున్నామో తెలుసుకున్నా. ఈ ఫ్లయింగ్.. సోల్‌కి కొత్త ఎనర్జీనిచ్చింది. – శోభన, ట్రావెలర్, చిక్కడపల్లి పూర్తిగా సేఫ్.. హిమాలయాల్లోని ధౌలాధర్ పర్వత శ్రేణి నుంచి కాంగ్డా లోయలో సాగే పారాగ్లైడింగ్ పూర్తిగా సురక్షితం. వర్షాకాలంలో నాలుగు నెలలు మాత్రం బిర్ బిల్లింగ్‌లో ఈ పారాచ్యూట్ పక్షుల సందడి ఉండదు. మిగతా ఏడాదంతా అంటే చలికాలం, వేసవిలో దేశ విదేశీ సాహసికులు, యాత్రికులు ఇక్కడికి వస్తూనే ఉంటారు. – రాహుల్, పైలట్ (బిర్ బిల్లింగ్) -
అంతులేని విషాదంగా మారిన వీడియో
డెహ్రాడూన్: నందాదేవి పర్వతారోహణకు వెళ్లి మృత్యు ఒడికి చేరుకున్నవారి చివరి వీడియోను ఇండో టిబెటన్ పోలీసులు మంగళవారం విడుదల చేశారు. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో చివరికి విషాదంగా మారింది. సాయంత్రం సూర్యుడు మంచును ముద్దాడుతున్నట్టుగా మనోహరంగా కనిపించే దృశ్యంతో ప్రారంభమవుతుందీ వీడియో. ఇందులో ఎనిమిది మంది సభ్యులు మంచుతో కప్పబడ్డ పర్వతంపై శిఖరాన్ని అధిరోహించడానికి తాడు సహాయంతో ఒకరివెంట ఒకరు నడుస్తున్నారు. చివరిగా నడుస్తున్న వ్యక్తి ఈ వీడియోను చిత్రీకరిస్తున్నాడు. ఇంతలో పెద్ద శబ్దం వినిపించడంతో వీడియో ఆగిపోతుంది. ఈ శబ్దాన్ని హిమపాతం లేదా మంచు తుపానుగా అధికారులు అంచనా వేస్తున్నారు. హిమపాతం వల్లే వారందరూ చనిపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. హిమాలయ శ్రేణుల్లో అత్యంత కష్టతరమైన పర్వతాల్లో ఒకటైన నందాదేవి శిఖరాన్ని అధిరోహించటానికి ఎనిమిది మంది సభ్యులు పూనుకున్నారు. వీరిలో ఏడుగురు అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌కు చెందిన వారు కాగా మరొకరు ఇండియన్ మౌంటనీరింగ్ ఫౌండేషన్ అధికారి. ఉత్తరాఖండ్‌లోని పితోరాఘర్ జిల్లాలో మే 13న మున్సారీ నుంచి పర్వతారోహకుల బృందం బయలుదేరింది. మే 25 నుంచి ఈ బృందం కనిపించకుండా పోయింది. వారిని గుర్తించటం కోసం పర్వత యుద్ధాలకు శిక్షణ పొందిన డేర్‌డెవిల్స్ బృందం ఆపరేషన్ చేపట్టింది. దీనికోసం 500 గంటలు అంటే సుమారు 15 రోజులు శ్రమించి జూలై 3న భూమికి 19 వేల అడుగుల ఎత్తులో మృతదేహాలను వెలికి తీశారు. హెలికాప్టర్ల ద్వారా మృతదేహాలను పితోరాఘర్‌కు తరలించారు. మృతదేహాలు లభ్యమైన ప్రదేశంలో ఒక కెమెరా కూడా లభించింది. ఇందులోని వీడియోను ఇండో టిబెటన్ పోలీసులు వారి ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు. Last visuals of the mountaineers' team near the summit on unnamed peak near the #NandaDevi east. ITBP search team of mountaineers found the memory video device at 19K ft while they were searching the area where bodies were spotted. pic.twitter.com/0BI87MEA8Y — ITBP (@ITBP_official) July 8, 2019 -
ఒకటి నుంచి అమర్నాథ్ యాత్ర
శ్రీనగర్: హిమాలయాల్లో కొలువై ఉన్న అమర్‌నాథుణ్ని దర్శించుకునే వార్షిక యాత్ర జూలై ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు భారీ భద్రత ఏర్పాట్లు చేపట్టారు. బల్తాల్, పహల్గామ్ మీదుగా రెండు మార్గాల్లో సాగే 40 రోజుల అమర్నాథ్ యాత్రకు సీఆర్పీఎఫ్తోపాటు కశ్మీర్ పోలీసులు బందోబస్తులో పాల్గొంటారు. తీర్థయాత్ర సందర్భంగా భద్రతా ప్రమాణాలను తుచ తప్పకుండా పాటించాలని హోం మంత్రి అమిత్ షా అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. -
షాక్ తిన్నారు.. వద్దన్నారు..
సాహసాల చరిత్రలోసిటీ బైకర్లు మరో కొత్త అధ్యాయం లిఖించారు. అత్యంత క్లిష్టమైనవాతావరణంలో మంచుకొండల్లో దూసుకెళ్లి కొత్త ట్రెండ్ సృష్టించారు. సిటీకి చెందిన ముగ్గురు బైకర్లు ప్లాన్ చేసిన ఈ యాత్రలో మరో ముగ్గురు ఢిల్లీ బైకర్స్ కూడాపాల్గొన్నారు. ఫిబ్రవరి నెలాఖరు నుంచి మార్చి నెల ప్రారంభం వరకు కొనసాగిన వీరి రైడ్విజయవంతంగాముగిసింది. సిటీ బై‘కింగ్స్’ జెండా ఎగసింది. సాక్షి, సిటీబ్యూరో: హిమాలయ పర్వత సానువుల మీదుగా సాగే లేహ్ లడఖ్ సాహసయాత్ర సిటీ బైకర్స్ అప్పుడప్పుడు చేసేదే. అయితే ఈసారి సిటీ బైకర్లు చేసిన అదే యాత్ర ఎందుకు ప్రత్యేకమైందంటే..? ఫిబ్రవరిలో ఈ సాహస యాత్ర చేయడమే ఇందుకు కారణం. మండే ఎండల కాలంలోనే అక్కడ హిమపాతాన్ని తట్టుకోవడం కష్టం. అలాంటిది 5 డిగ్రీల నుంచి మైనస్ 24 డిగ్రీల టెంపరేచర్ ఉండే సమయంలో ఈ యాత్రను సుసాధ్యం చేసి సరికొత్త ట్రెండ్ సెట్ చేశారు నగరానికి చెందిన పృదు మెహతా(38), కుశాల్ టక్కర్ (33), విజయ్ పటేల్(46).. ఢిల్లీకి చెందిన మనీష్ దాలి(38), అక్షయ్ జైన్(29), దీపక్ గుప్తా(38). శరీరాన్ని చురకత్తుల్లా కోసే మంచుగాలులు, ప్రమాదకరమైన మలుపులు, మంచుతో నిండిపోయిన రహదారుల మీదుగా అభిరుచి, ఆత్మ విశ్వాసం తోడుగా వీరి జర్నీ సాగింది. దాదాపు 20 రోజుల క్రితం యాత్రను ముగించుకొని ఢిల్లీకి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న ఈ బృందం ‘సాక్షి’తో పంచుకున్న రైడ్ విశేషాలివీ... షాక్ తిన్నారు.. వద్దన్నారు.. ఈ సమయంలో అక్కడి కొండల్లో ఆర్మీ పెట్రోలింగ్ కూడా ఉండదు. ఆ మంచు కొండల్లో ఇరుక్కుంటే దిక్కుమొక్కు లేని పరిస్థితి. అందుకే ఈ ఆలోచన పంచుకున్నప్పుడు మా బంధుమిత్రులు షాక్ అయ్యారు. ఇప్పటిదాకా ఎవరూ చేయలేదు కదా.. వద్దులే అన్నారు. అయినా సరే.. మేం చేయగలం అనుకున్నాం. అయితే గుడ్డిగా వెళ్లిపోకుండా ముందస్తు జాగ్రత్తలన్నీ తీసుకున్నాం. దీని కోసం ఒక బ్యాకప్ వెహికల్ ఏర్పాటు చేసుకున్నాం. దీనిలో లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్, ఫైర్ ఉడ్, కిరోసిన్, స్టవ్, టెంపరెరీ టెంట్స్, సిలిండర్, రెడీమేడ్ పుడ్.. ఇలా అన్నీ తీసుకెళ్లాం. ఆరుగురు రైడర్స్‌లో ఇద్దర్ని స్టాండ్‌బైగా ఉంచాం. ప్రయాణం సాగిందిలా... దీనికి ఎక్స్ట్రీమ్ వింటర్ లఢఖ్ రైడ్ అని పేరు పెట్టాం. ఇప్పటి వరకు ఎవరూ చేయని ఈ యాత్రను మేం ఫిబ్రవరి 24న ప్రారంభించాం. ముందు ఢిల్లీ చేరుకున్నాం. లేహ్ లఢఖ్ వరకు ఈ టైమ్‌లో ఫ్లైట్ తప్ప.. మరే రూట్ ఉండదు. పర్వతాలను క్రాస్ చేస్తూ వెళ్లాలి. అదొక్కటే మార్గం. ఢిల్లీ నుంచి లేహ్ దాకా విమానంలో ప్రయాణించాం. జమ్మూకశ్మీర్‌లోని హైడిజర్ట్ సిటీ లేహ్‌కు చేరుకొని, అక్కడ ఓ రోజు బస చేశాక హాన్లే గ్రామానికి మా రోడ్ రైడ్ స్టార్ట్ చేశాం. అక్కడ ఉష్ణోగ్రత మైనస్ 8 డిగ్రీలుగా ఉంది. విపరీతమైన ఎదురు గాలుల మధ్య, దాదాపు 10గంటల పాటు నిర్విరామంగా ప్రయాణించి 250 కిలోమీటర్ల దూరంలోని చైనా బోర్డర్‌కు దగ్గర్లోని ఆ గ్రామానికి 26న చేరుకున్నాం. హాన్లేలో రెండ్రోజులు కళ్లు తిప్పుకోనివ్వని ల్యాండ్ స్కేప్స్ మధ్య గడిపి హాన్లే అబ్సర్వేటరీ, మోనాస్టరీలు సందర్శించాం. స్థానికంగా ఉన్న కొన్ని ప్రాంతాలను చూశాం. అదే వాతావరణ పరిస్థితుల్లో తిరుగు ప్రయాణం ప్రారంభించాం. లేహ్‌కి 220 కి.మీ దూరంలోని కార్గిల్ వైపుగా రైడ్ స్టార్ట్ చేసి, ఫోట్యులా పాస్, నామిక్లా పాస్ అనే రెండు ఎత్తయిన శిఖరాలను దాటుకుంటూ సాగిపోయాం. దారిలో కొన్ని కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ప్యాంగాగ్ లేక్ ఎదురైంది. అది మైనస్ 22 డిగ్రీల చలికి మొత్తం ఘనీభవించి పోయింది. మంచుతో కప్పబడిపోయిన ఆ లేక్ మీద రైడ్ వర్ణించలేని అనుభూతి. అయితే అది కూడా బాగా ప్రమాదకరమైనదే. అసలు అక్కడ లేక్ ఉండేదంటే నమ్మలేం.. అలా ఉంటుంది. ఆ ప్రాంతంలో చలిని తట్టుకోవచ్చు.. కానీ ఎముకల్ని అమాంతం కోసేస్తున్నట్టు ఉండే చలిగాలులను తట్టుకోలేం. మార్చి 1న ద్రాస్ చేరుకున్నాం. ఆ ప్రాంతం మొత్తం ఒక మంచుదుప్పటి కింద దాక్కుని ఉంది. కనుచూపుమేర తెల్లదనమే. మనుషులు ఉండే ప్రపంచపు రెండో అత్యంత చల్లని ప్రాంతం అది. అక్కడ తినడానికి ఏమీ దొరకలేదు. మ్యాగీ లాంటివి వండుకుని తిన్నాం. దారిలో భారతీయ సైన్యం నిర్మించిన ద్రాస్ వార్ మెమోరియల్ నిర్మాణాన్ని సందర్శించాం. ఏంటీ రైడ్ స్పెషల్? లేహ్ లఢఖ్‌కు బైక్ రైడ్స్‌ను సిటీ రైడర్స్ బాగా ఇష్టపడతారు. అయితే అలా వెళ్లే వారంతా మే చివరి నుంచి అక్టోబర్ వరకు మాత్రమే ఎంచుకుంటారు. ఎందుకంటే ఆ తర్వాత లేహ్ లఢఖ్‌కు ఉన్న రెండు ప్రధాన దారులు మంచుమయంగా మారిపోతాయి. అసలు ఫిబ్రవరి నెలలో ఆ ప్రాంతానికి రైడ్ అనేది కనీసం ఊహించ లేనిదనే చెప్పాలి. అందుకే వీరి రైడ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది బైకర్స్ కమ్యూనిటీ అయింది. కష్టమైన రైడ్... స్వల్ప పరిమాణంలోని ఆహారంతోనే ఇదంతా సాగించాం. ఇది చాలా కష్టమైన రైడ్. ఈ సీజన్లో గ్రామాలు ఉంటాయి. కానీ జనం బాగా పలచగా మాత్రమే ఉంటారు. స్వల్ప పరిమాణంలో మాత్రమే ఫుడ్ లభ్యమవుతుంది. తక్కువ ఆక్సిజన్ స్థాయిల వల్ల ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైంది. హై యాటిట్యూడ్ సిక్నెస్ తీవ్రమైన సమస్యతో ఎదుర్కోవాల్సి వచ్చింది. మా చూపు కూడా బాగా మందగించింది. రోడ్డును స్పష్టంగా చూడలేకపోయాం. – పృదు మెహతా, బైకర్ -
ఏ కోరిక తీరడానికి ఏ ఆరాధన?
►జెన్‌పథం సంపూర్ణ జ్ఞానం అయిదేళ్ళ వయసులో ఒక కుర్రవాడు హిమాలయ పర్వత శిఖరాగ్రాల మీద ఉండే బౌద్ధారామాలకి విద్యాభ్యాసం కోసం పంపబడ్డాడు. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా సంవత్సరాల తరబడి సిద్ధాంత మూలసార జ్ఞానాన్ని సముపార్జించుకున్న తరువాత, ఆ జ్ఞానాన్ని ప్రజలకు పంచమన్న గురువు ఆదేశంతో, ఆ భిక్షువు పర్వతశ్రేణుల మధ్య నుంచి దిగి మొట్ట మొదటిసారి నాగరిక ప్రపంచంలో అడుగుపెట్టాడు. అప్పటి వరకూ ఆశ్రమం దాటి బయటకురాని ఆ పద్దెనిమిదేళ్ళ యువకుడికి అంతా కొత్తగా ఉంది. బౌద్ధసాధువులకు సాంప్రదాయకమైన భిక్షాటన నాశ్రయించి, ఒక ఇంటి ముందు నిలబడి మధుకరం అర్థించాడు. ఇంటి యజమాని యువ సాధువు కాళ్ళు కడిగి సగౌరవంగా లోపలికి ఆహ్వానించి, భిక్ష వేయమని కూతుర్ని ఆదేశించాడు. ఒక పదహారేళ్ళమ్మాయి లోపల్నుంచి ఏడు రోజులకి సరిపడా బియ్యాన్ని తీసుకొచ్చి అతడి జోలెలో నింపింది. ఆమెని చూసి యువకుడు చకితుడయ్యాడు. అప్పటివరకూ పురుషులనే తప్ప ‘స్త్రీ’ని చూడలేదతడు. ఆమె గుండెల కేసి చూపించి తామిద్దరి మధ్య తేడా గురించి గృహస్థుని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకి తండ్రికి కోపం రాలేదు. ఎదుట ఉన్నది మనుష్యుల మధ్యకి తొలిసారి వచ్చిన సన్యాసి అని తెలుసు. స్త్రీ పురుషుల తేడా గురించి చెపుతూ, ‘వివాహం జరిగి తల్లి అయిన తరువాత క్షీరమునిచ్చి పిల్లల్ని పోషించవలసిన బాధ్యత స్త్రీకి ఉన్నది కాబట్టి ప్రకృతి ఆమెకు ఆ విధమైన అవయవాలను సమకూర్చింది’ అని వివరణ ఇచ్చాడు. సుదీర్ఘమైన ఆలోచనలో పడిన యువకుడు, ఆ రోజుకు సరిపడా బియ్యం మాత్రం ఉంచుకొని, మిగతా ఆరు రోజుల దినుసులు వెనక్కి ఇచ్చి తిరిగి తన గురువు దగ్గరకు చేరుకున్నాడు. అలా ఎందుకు చేశావని అడిగాడు గురువు. ‘‘తర్వాతెప్పుడో దశాబ్ద కాలం తరువాత ప్రపంచంలోకి అడుగిడబోయే బిడ్డ కోసం తగు ఏర్పాట్లన్నీ ప్రకృతి ముందే సమకూర్చినప్పుడు, రేపటి ఆహారం గురించి ఈ రోజు తాపత్రయపడటం ఎంత నిష్పయ్రోజనమో నాకు అర్థమయింది స్వామీ..!’’ అన్నాడా భిక్షువు. ‘‘బౌద్ధం గురించీ, బంధం గురించీ సంపూర్ణమయిన జ్ఞానం నీకు లభించింది నాయనా‘ అంటూ శిష్యుణ్ణి కౌగిలించుకొని అభినందించాడు ఆచార్యుడు. ఏ కోరిక తీరడానికి ఏ ఆరాధన? కోర్కెల సాఫల్యం కోసం వివిధ దేవతా పూజలను చేయడమనేది వేదకాలం నుంచి ఉన్న ఆచారమే. ఉదాహరణకు చదువు బాగా రావాలనే కోర్కె సిద్ధించాలంటే సరస్వతీదేవిని, హయగ్రీవుణ్ణీ ఆరాధించాలంటారు ఆర్యులు. పుత్రసంతానాన్ని పొందేందుకు దక్షుడు మొదలైన ప్రజాపతులను ఆరాధించాలి. సంతాన ప్రాప్తికి ఆది దంపతులైన శివపార్వతులలో పార్వతీదేవిని ఆరాధిస్తే దాంపత్య సౌఖ్యం దక్కుతుందట. విద్యాబుద్ధులు రావాలంటే దక్షిణామూర్తి ఆరాధన చేయాలి. సౌందర్యం సిద్ధించాలంటే చంద్రుణ్ణి ఆరాధన చేయాలంటోంది శాస్త్రం. అన్నం కలకాలం ప్రాప్తించాలంటే అదితి, అన్నపూర్ణాదేవిల ఆరాధన చేయాలి. వైభోగ ప్రాప్తికి ఇంద్రుణ్ణి ఆరాధించాలి. కష్టాలు తొలగేందుకు దుర్గాదేవిని, నిత్యసౌభాగ్యాన్ని అందించేందుకు ఆదిముల్తైదువ పార్వతీదేవిని, బలానికి వాయుదేవుణ్ణి, వీర్యపుష్టికి అగ్నిదేవుణ్ణీ, ఆరోగ్యానికి సూర్యభగవానుడినీ, ఆయుర్దాయం కోసం అశ్వినీ దేవతలనీ, పరమశివుణ్ణీ; ధర్మం తప్పకుండా ఉండాలనే కోర్కెను నారాయణమూర్తినీ పూజించాలి. ఈ విధంగా వివిధ కోర్కెలకు వివిధ దేవతా రూపాలను ఆరాధించడం వల్ల శీఘ్రంగా నెరవేరతాయని శాస్త్రోక్తి. పూజలలో కలశం ఎందుకు? మనం ఏ పూజ, నోము లేదా వ్రతం చేసుకున్నా కలశం తప్పనిసరిగా పెడతాం. ఈ కలశంలోని నీటినే మనం పూజించే దైవానికి సమర్పించే అర్ఘ్యపాద్య అభిషేకాదులకు ఉపయోగిస్తాం. ఎందుకంటే భగవంతునికి సమర్పించే నీరు పవిత్రంగా ఉండాలి కాబట్టి పుణ్యతీర్థాల నుంచి తెస్తే మంచిది. లేదంటే మనకు లభించిన నీటినే ఒక పాత్రలో ఉంచి, ఆ కలశానికి పూజ చేసి ఆయా దేవతలను ఆహ్వానించడం ద్వారా ఆ జలాన్ని పవిత్రీకరణ గావించి భగవంతునికి చేసే ఉపచారాలలో వాడటం శ్రేష్ఠం. నిత్యపూజావిధానంలో కలశంలోని జలంలోనికి త్రిమూర్తులను, మాతృగణాలను, సప్తసాగరాలను, సప్తద్వీపాలతో కూడిన భూ మండలాన్ని, చతుర్వేదాలను, వేదాంగాలను ఆహ్వానిస్తారు. కలశాన్ని గంధం, పుష్పాలు, అక్షతలతో అర్చించి, ఈ నీటిని పవిత్రీకరణ గావించి, ఆ జలాన్ని పూజాద్రవ్యాలపైన, తమపైన, దేవతా విగ్రహాలపైనా సంప్రోక్షణ చేసుకుంటారు. ఆ విధంగా చేయడం వల్ల శుద్ధి చేసినట్లేనని శాస్త్రం చెబుతోంది. ⇒ మనం పూజ చేసేటప్పుడు ఆచమనం చేసే పాత్ర, దేవతలకు ఉపచారాలు చేయడం కోసం ఉపయోగించే పాత్ర వేర్వేరుగా ఉండాలి. మనం వాడుకున్న పాత్రలోని నీటిని భగవంతుని కలశానికి వాడరాదు. జపమాలకు108 పూసలేఎందుకు? అష్టోత్తర శతం అని అంటూ ఉంటాం కదా, అష్ట అంటే ఎనిమిది. ఉత్తరం అంటే ఎక్కువయినదని అర్థం. శతం అంటే వంద. ఎనిమిది ఎక్కువైన వంద అంటే నూట ఎనిమిది. వేదంలో 108వ మంత్రం, 116వ మంత్రం పరమేశ్వరుణ్ణి నేరుగా సంబోధించి చెప్పే మంత్రం. ఆ కారణంగా ఆ సంఖ్యలలో 108 పరమేశ్వర సన్నిధానానికి చేర్చగలిగిన శక్తి ఉన్నదని, ఇక 116 అనేది గురువుకి దక్షిణ ఇచ్చే సందర్భంగా చదివే మంత్రం కాబట్టి, నూట పదహారు పండిత దక్షిణ అనీ ఓ పద్ధతి వచ్చింది. 108... పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోగలిగిన మంత్ర సంఖ్య. అలాగే 108 పురాణాలు, 108 ఉపనిషత్తులున్నాయి. గ్రహాల సంఖ్యను రాశుల సంఖ్యతో హెచ్చిస్తే 108. నాడులు 108, శక్తి పీఠాలు 108... ఇలా 108 అంకెకు విశిష్టత ఉంది కాబట్టే జపమాలలో పూసలు 108గా పెద్దలు నిశ్చయించి ఉండవచ్చు. నమస్కారంలోని గొప్పతనం ఏమిటి? అయిదువేళ్లలో మనకి దగ్గరగా ఉండే బొటనవేలు. మన దగ్గరి వాళ్లకి మంచి జరగాలని, కష్టాలు తొలగి, సుఖాలు కలగాలని చెబుతుంది. మనకి మార్గదర్శకులై, విద్యాబుద్ధులు నేర్పి, చక్కటి సలహాలిచ్చిన ఉపాధ్యాయులకి, మన ఆరోగ్యం తప్పుదారి పడితే దాన్ని సక్రమమార్గంలోకి తెచ్చే వైద్యులకు మంచి జరగాలని, వారి కష్టాలు తొలగి, సుఖాలు కలగాలని చూపుడు వేలు చెబుతుంది. తర్వాతి వేలు, అతిపెద్దదైన మధ్యవేలు... మన మతపెద్దలు, నాయకులు మహాత్ములకి మంచి జరగాలని గుర్తు చేస్తుంది. నాలుగోవేలు ఉంగరపు వేలు, అతి బలహీనమైన వేలు. హార్మోని, పియానో వాయించేవారికి ఇది తెలుస్తుంది. ప్రపంచంలోని బలహీనులు, పేదలు, రోగగ్రస్థులు, బాధల్లో ఉన్నవారి కష్టాలు తొలగిపోయి, శుభం చేకూరాలని ప్రార్థిస్తుంది. చివరగా చిటికెనవేలు, దేవుడి ముందు మనం ఎంతో చిన్నవాళ్లమని, అవతలివారికన్నా మనం అల్పులమని, కాబట్టి మనకన్నా ఉన్నతుడైన దేవుణ్ణి ప్రార్థించాలని గుర్తు చేస్తుంది. నమస్కారం ద్వారా మన వేళ్ల చివరలనున్న నాడులు చైతన్యవంతమవుతాయి. అవతలివారి పట్ల గౌరవం, వారు చెప్పేమాటలపై శ్రద్ధ, సావధానమూ కలుగుతాయి. సర్వం సాయిమయం! శిరిడీలో ఒక గజ్జి కుక్క ఉండేది. ఒక రోజు మహల్సాపతి తన ఇంట్లోచి ప్రసాదం తీసుకుని బాబా ఉండే మసీదుకు బయల్దేరాడు. అతని చేతిలోని ఫలహారం పళ్లెం వైపు చూసిన గజ్జికుక్క ఆశగా తోక ఊపుకుంటూ మహల్సాపతి వెంటపడింది. మహల్సాపతి రెండుమూడుసార్లు దానిని అదిలించాడు. అయినా అది వెనుకే రావటంతో విసుగెత్తి కర్రతో కొట్టాడు. ఆ కుక్క దీనంగా రోదిస్తూ వెళ్లిపోయింది. మహల్సాపతి ప్రసాదం తీసుకుని వెళ్లి బాబా ఎదుట పెట్టి భక్తితో రెండు చేతులూ జోడించాడు. బాబా ఆ ప్రసాదం పళ్లెం వైపు కన్నెత్తయినా చూడకుండా ఇలా అన్నారు. ‘మహల్సా!’ పాపం ఆ కుక్క నలుగురిపై ఆధారపడి ఎలాగో బతుకీడుస్తుంది. దానిని కొట్టడానికి మనసెలా వచ్చింది? అంటూ తన వీపుపై తగిలిన దెబ్బను చూపించారు. అన్ని జీవుల్లోనూ తానే ఉన్నాననేది బాబా ఉవాచ. మౌనమేమంచి జ్ఞానసాధనం ⇒ భగవంతుణ్ణి నీ అంతర్నేత్రంలో దర్శించడానికి సరళమైన మార్గం మౌనమే అని తన జీవితం ద్వారా నిరూపించిన ఆధ్యాత్మిక సంపన్నులు భగవాన్ రమణ మహర్షి. ఆయన బోధలు... ⇒ మౌనంలో విశ్రమించు, మనస్సు మూలాల్ని అన్వేషించు. ⇒ ‘నేను’ అనే భావం ఎక్కడినుంచి వస్తుందో చింతన చేస్తూ పరిశీలిస్తే మనస్సు అందులో లీనమైపోతుంది. ⇒ గురువు అనుగ్రహానికి ఉత్తమోత్తమరూపం మౌనమే. అదే అత్యుత్తమ ఉపదేశం కూడా. ⇒ మౌనంలోనే సాధకుని ప్రార్థన సైతం పరాకాష్ఠకు చేరుతుంది. ⇒ అన్ని దీక్షలకంటే మౌనదీక్ష ప్రశస్తమైంది. అదే అన్ని దీక్షలకు మూలం. ⇒ గురువు మౌనంలో ప్రతిష్థితుడైతే, సాధకుని మనస్సు దానంతట అదే విశుద్ధిని పొందుతుంది ఉత్తమమైనదానం అన్నదానానికి మించిన దానం ముల్లోకాల్లోనూ లేనేలేదని ప్రసిద్ధంగా వినిపిస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఏ వస్తువుని దానం చేసినా ‘మరికొంత ఇస్తే బాగుండేది– ఇంకా కొద్ది విలువైనదిస్తే చక్కగా ఉండేది’ అనే అభిప్రాయం కలగవచ్చునేమో కాని అన్నం వడ్డించడం ఆరంభిస్తే ‘ఇంక చాలు, వద్దు వద్దు’ అంటారట. అన్నం వద్దు, పప్పు వెయ్యద్దు, పులుసు చాలు, సరిపోయింది, పెరుగుకి ఖాళీయే లేదు అంటారు. అంటే కడుపు నిండిపోయిన సంతృప్త భావన కలుగుతుంది. మిగిలిన ఏ దానానికీ ఈ విధమైన భావన కలగదు. అందుకే అన్ని దానాలలోకీ అన్నదానమే గొప్పదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆలయాలలోనూ, యాత్రాస్థలాలలోనూ అన్నదానాన్ని ప్రోత్సహిస్తున్నాయి. – యామిజాల జగదీశ్ -
భూకంపాలకు కేంద్రంగా హిమాలయాలు!
జెనీవా: హిమాలయ పర్వతశ్రేణుల్లో భారీ భూకంపాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని ఒక అధ్యయనంలో తేలింది. 2,400 కిలోమీటర్ల మేర ఉన్న పర్వత శ్రేణుల్లో ఈ భూకంపాలు వచ్చే ప్రమాదముందని, భారత్, చైనా సరిహద్దు మధ్యలోనున్న భూటాన్ కూడా భూకంప ప్రభావిత ప్రాంతంలో ఉందని పేర్కొంది. భూటాన్ ప్రాంతం భారీ భూకంపాలు సంభవించేందుకు అనువైన ప్రాంతమని అధ్యయన నివేదిక రచయిత, స్విట్జర్లాండ్‌లోని లాసెన్నె యూనివర్సిటీకి చెందిన గియోర్గి హెతెన్యి తెలిపారు. భారీ భూకంపాలు సంభవించే సామర్థ్యం హిమాలయాలకు ఉందని, దీంతో పెద్ద ఎత్తున విధ్వంసం కూడా చోటు చేసుకునే అవకాశముందని పేర్కొన్నారు. 1714లోనూ భారీ భూకంపం భూటాన్‌లో సంభవించిందని, దీని గురించి పెద్దగా ఎవరికి తెలియదని తెలిపారు. దీనిని బట్టి భూటాన్ భారీ భూకంప ప్రభావిత ప్రాంతమని చెప్పవచ్చని అభిప్రాయపడ్డారు. 2015 ఏప్రిల్‌లో నెపాల్‌లో గోర్ఖా భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. అయితే, 2400 కిలోమీటర్ల మేర విస్తరించిన ఉన్న హిమాలయ పర్వత శ్రేణుల్లోని ప్రతి ప్రాంతంలో భూకంప ప్రమాదం పొంచి ఉందని శాస్త్రీయ అధ్యయనం జరగలేదని, దానికి సంబంధించిన రికార్డులు కూడా అందుబాటులో లేవు. మిగతా ప్రపంచంతో పెద్దగా సంబంధాలులేకుండా భూటాన్ ఒంటరిగా ఉంటుందని, అక్కడికి శాస్త్రవేత్తలను కూడా చాలా అరుదుగా అనుమితిస్తుందని పేర్కొన్నారు.