మహిళా పారిశ్రామికవేత్త 'ఉషా తివా'కు 'క్యూట్‌ స్మైల్‌' టైటిల్‌ | Chennai Woman Entrepreneur Usha Thiva Won Mrs Cute Smile Title | Sakshi
Sakshi News home page

Usha Thiva: మిస్సెస్‌ క్యూట్‌ స్మైల్‌ విజేతగా ఉషా తీవా..

Published Wed, Jan 5 2022 3:09 PM | Last Updated on Wed, Jan 5 2022 3:13 PM

Chennai Woman Entrepreneur Usha Thiva Won Mrs Cute Smile Title - Sakshi

చైన్నై: చెన్నైకు చెందిన ఉషా తీవా క్యూట్‌ స్మైల్‌ కిరీటాన్ని కైవసం చేసుకుంది. వైబ్రెంట్‌ కాన్సెప్ట్స్‌ నిర్వహించిన మిస్సెస్‌ ఇండియా గెలాక్సీ 2021 పోటీలు విజయవంతంగా జరిగాయి. ఈ పోటీల్లో  మిస్సెస్‌ క్యూట్‌ స్మైల్‌  కిరీటాన్ని సామాజిక సేవకురాలు, పారిశ్రామిక వేత్త  ఉషా తీవా గెలుచుకున్నారు. ఈ పోటీల్లో ముఖ్య అతిథిగా సెలబ్రిటీ ఫ్యాషన్‌ కొరియోగ్రాఫర్‌ కరణ్‌ రామన్‌ హాజరయ్యారు. ఉషా తీవా సోమవారం మాట్లాడుతూ లక్షలాది మంది పేద ప్రజలకు దుస్తులను వితరణ చేస్తూ తన వంతుగా సమాజ సేవ చేస్తున్నానని తెలిపారు. 

మరోవైపు తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలకు నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వడం, ఉపాధి అవకాశాలను కల్పిస్తూ మహిళల అభివృద్ధి, సాధికారతకు కృషి చేస్తున్నట్టు ఉషా తీవా పేర్కొన్నారు. గ్రామీణ మహిళల జీవనోపాధికి తోడ్పాటు అందించడం చాలా కీలకమని ఆమె అభిప్రాయపడ్డారు. జీతాలతో పాటు, వివర్ష అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని దాతృత్వానికి కూడా ఖర్చు చేస్తారని వెల్లడించారు. మిస్సెస్‌ క్యూట్‌ స్మైల్‌ కిరీటాన్ని గెలుచుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. తనకు మద్దతునిచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఉషా తీవా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement