సీఎం జగన్‌ను కలిసిన ముల్క్‌ హోల్డింగ్స్‌ ఛైర్మన్‌ నవాబ్‌ షహతాజ్‌ షాజీ | Mulk Holdings Chairman Nawab Shaji Ul Mulk Meet AP CM YS Jagan | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ను కలిసిన ముల్క్‌ హోల్డింగ్స్‌ ఛైర్మన్‌ నవాబ్‌ షహతాజ్‌ షాజీ

Published Tue, Mar 29 2022 7:14 PM | Last Updated on Wed, Mar 30 2022 7:21 AM

Mulk Holdings Chairman Nawab Shaji Ul Mulk Meet AP CM YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముల్క్‌ హోల్డింగ్స్‌ ఇంటర్నేషనల్‌ చైర్మన్‌ నవాబ్‌ షహతాజ్‌ షాజీ ఉల్‌ ముల్క్, వైస్‌ ఛైర్మన్‌ నవాబ్‌ అద్నాన్‌ ఉల్‌ ముల్క్‌ కలిశారు. ఏపీలో ముల్క్‌ హోల్డింగ్స్‌ బిజినెస్‌ ప్రణాళికపై సీఎంతో చర్చించారు. వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తి ఈఎంసీలో మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌ ఏర్పాటుచేసేందుకు ముల్క్‌ హోల్డింగ్స్‌ ముందుకొచ్చింది.

చదవండి: ఏపీలో 12 సాగరమాల ప్రాజెక్ట్‌లు: కేంద్రమంత్రి

అల్యుమినియం కాయిల్స్‌ తయారీ, కాయిల్‌ కోటింగ్‌కు ఉపయోగించే హై పర్ఫామెన్స్‌ పెయింట్స్‌ తయారీ, అల్యూమినియం కాయిల్‌ కోటింగ్‌ ప్రొడక్షన్‌ లైన్స్, ఫిల్మ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్, మినరల్‌ కోర్‌స్‌ ప్రొడక్షన్‌ లైన్స్, అల్యూమినియం కాంపోజిట్‌ ప్యానెల్స్, మెటల్‌ కాంపోజిట్‌ మెటీరియల్స్‌ పొడక్షన్‌ లైన్స్‌ ఏర్పాటు చేసేందుకు ముల్క్‌ హోల్డింగ్స్‌ ముందుకొచ్చింది.

ఇటీవల దుబాయ్‌లో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పర్యటనలో ఏపీ ప్రభుత్వంతో ముల్క్‌ హోల్డింగ్స్‌ ఎంవోయూ చేసుకుంది. రూ.1,500 కోట్ల పెట్టుబడితో వెయ్యి మందికి ప్రత్యక్షంగా, రెండు వేలమందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ సమావేశంలో మిడిల్‌ ఈస్ట్, ఫార్‌ ఈస్ట్‌ దేశాలలో ఏపీ ప్రభుత్వ స్పెషల్‌ రెప్రజెంటేటివ్‌ జుల్ఫీ రౌడ్జీ, పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల్‌ వలవెన్, ఏపీఐఐసీ వీసీ అండ్‌ ఎండీ జవ్వాది సుబ్రహ్మణ్యం, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement