అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ప్రతి ఒక్కరూ పరిశ్రమలు స్థాపించి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జేసీ–2 ఆర్.సాల్మన్‌రాజ్‌కుమార్ పిలుపునిచ్చారు. స్థానిక పాత జిల్లా పరిషత్ జెడ్పీ సమావేశ మం దిరంలో శనివారం మౌలిక వసతులు, పారిశ్రామిక అభివృద్ధి అనే అంశంపై చ ర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయ న మాట్లాడుతూ అధిక ఉపాధికి బాటలు వేస్తున్న సర్వీసు రంగాలను ప్రోత్సహిం చాల్సిన అవసరం ఉందన్నారు. దీని వల్ల రాష్ట్ర జీడీపీ పెరుగుతుందని తెలి పారు. ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా పరిశ్రమల సాధనకు అనుకూల ప్రాంతమన్నారు. కృష్ణపట్నం రేవు, చెన్నై–కల్‌కత్తా రైలు మార్గం సరుకుల రవాణాలో ఉపయోగపడుతుందన్నారు. మౌలిక వసతులు ఏర్పాటు చేసిన ఎస్‌ఈజెడ్‌లు, ప్రతి నియోజకవర్గంలో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పరిశ్రమలశాఖ స హాయ సంచాలకులు ఎస్‌వీ సురేష్ మా ట్లాడుతూ జిల్లాలో ఉన్న మౌలిక వసతులకు అధనంగా ఖనిజ నిల్వలు, మానవ వనరులు, వ్యవసాయ ఉత్పత్తులు విరివి గా ఉన్నాయని తెలిపారు. రూ.1,719 కోట్లతో 42 భారీ పరిశ్రమలు నడుస్తున్నట్టు, మరో 33 పరిశ్రమలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. ఆయా శాఖల ప్రతినిధులు ప్రమోద్ కుమార్‌రెడ్డి, మోహన్‌బాబు, పి.కల్పన, కె.రమణ, ఇ.మహేశ్వరన్, ఎంఎస్ ప్రసాద్‌లు పాల్గొన్నారు.