జీతం ఇవ్వము.. ఉద్యోగంలో చేరండి!.. సీఈఓ పోస్ట్ వైరల్ | Zero Salary No Weekend Offs Gujarat Entrepreneur Post Viral | Sakshi
Sakshi News home page

జీతం ఇవ్వము.. ఉద్యోగంలో చేరండి!.. సీఈఓ పోస్ట్ వైరల్

Aug 8 2024 10:20 AM | Updated on Aug 8 2024 10:58 AM

Zero Salary No Weekend Offs Gujarat Entrepreneur Post Viral

ఉద్యోగంలో చేరాలంటే మంచి జీతం, వారాంతపు సెలవులు కావాలని ఎవరైనా కోరుకుంటారు. కొన్ని సార్లు జీతం తక్కువైనా తప్పకుండా సెలవుల విషయంలో రాజీపడే అవకాశమే లేదు. అయితే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని ఓ సంస్థ సీఈఓ ఓ జాబ్ ఆఫర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతలా వైరల్ అవ్వడానికి.. అంతలా అందులో ఏముందో ఇక్కడ చూసేద్దాం.

అహ్మదాబాద్‌లోని 'బ్యాటరీ ఒకే టెక్నాలజీస్' వ్యవస్థాపకుడు, సీఈఓ శుభమ్ మిశ్రా ఉద్యోగుల కోసం లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేశారు. ఇందులో మా కోర్ టీమ్‌లో చేరడానికి అసాధారణమైన వ్యక్తుల కోసం చూస్తున్నాము. ఉద్యోగులకు ఎలాంటి జీతం ఉండదు, వారాంతపు సెలవులు, సెలవులు (నిజంగా అవసరమైతేనే సెలవు) లేదు. ఎలాంటి బహుమతులు కూడా ఉండవని స్పష్టం చేశారు.

రెడ్డిట్, లింక్డ్‌ఇన్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేసిన ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. దీని గురించి శుభమ్ మిశ్రా స్పందిస్తూ.. మేము దీర్ఘకాలికంగా కంపెనీని నిర్మిస్తున్నాము. మాతో పాటు ఎదగాలని అనుకుంటున్నా వ్యక్తుల కోసం మేము వెతుకుతున్నామని ఆయన అన్నారు. వినూత్న ఏఐ పరిష్కారాల ద్వారా పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే స్టార్టప్ లక్ష్యంగా ఈ విధమైన పోస్ట్ చేసినట్లు మిశ్రా స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement