వయస్సు చిన్నదే కావొచ్చు. సరిగ్గా ఆలోచిస్తే లక్షలు పోసి ఖర్చు పెట్టినా రాని బిజినెస్ ఐడియాలు రోజూ వారీ జీవితంలో ఎదురుయ్యే కొన్ని సమస్యల్లో నుంచి పుట్టుకొస్తాయి. అలా తనకు ఎదురైన ఓ ప్రాబ్లమ్ తీసుకొని దాన్నే బిజినెస్‌గా మరల్చుకొని వందల కోట్లు సంపాదిస్తున్నాడు 13ఏళ్ల తిలక్ మెహతా.
తిలక్ మెహతా సరదాగా గడిపేందుకు ఓ రోజు తన మేనమామ ఇంటికి వెళ్లాడు. పాఠశాల విద్యార్ధి కావడంతో వెళ్లేటప్పుడు తనతో పాటు బండెడు పుస్తకాల్ని వెంటతీసుకొని వెళ్లాడు. కొన్ని రోజుల పాటు అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత తన ఇంటికి వచ్చాడు. కానీ వచ్చేటప్పుడు మామయ్య ఇంట్లో ఉన్న పుస్తకాల గురించి మరిచిపోయాడు.
త్వరలోనే పరీక్షలు. చదవాల్సిన బుక్స్ లేవు. చేసేది లేక బుక్స్ డెలివరీ కోసం కొన్ని ఏజెన్సీలను వెతికాడు. ఈ ప్రయత్నాల్లో భాగంగా డెలివరీ ఖర్చు ఎక్కువగా ఉండడం, మార్కెట్‌లో డెలివరీ అవసరాల్ని తీర్చే సంస్థలు పెద్దగా అందుబాటులో లేవని గుర్తించాడు. బుక్స్‌ను సైతం ఇంటికి తెప్పించుకోలేకపోయాడు.
సమస్యతోనే
ఈ సంఘటన తిలక్ మెహతా మనస్సులో ఓ అద్భుతమైన ఆలోచనను రేకెత్తించేలా చేసింది. ముంబై డబ్బావాలా ప్రేరణతో నగరంలో కస్టమర్లకు కావాల్సిన వస్తువుల్ని ఒకే రోజు డెలివరీ చేసేలా ఓ సంస్థను ప్రారంభించారు. ఆ కంపెనీ పేరే ‘పేపర్ అండ్ పార్శిల్స్’. తక్కువ ఖర్చుతో కస్టమర్ల డెలివరీ సమస్యల్ని పరిష్కరించేలా సర్వీసుల్ని ప్రారంభించాడు.
అతని తండ్రి ఆర్థిక సహకారం. డబ్బావాలా సహాయంతో సంప్రదాయ పోస్టల్ సేవల కంటే తక్కువ ఖర్చుతో డెలివరీలను అందించడం మొదలు పెట్టాడు. వ్యాపారం పెరిగే కొద్దీ 2018 నాటికి వివిధ వ్యాపార అవసరాలకు అనుగుణంగా షిప్పింగ్, లాజిస్టిక్స్ సేవలను చేర్చడానికి విస్తరించింది.
రూ.100 కోట్ల టర్నోవర్‌తో
వెరసీ అచంచలమైన అంకితభావం, పట్టుదలతో తిలక్ మెహతా స్థాపించిన ఈ సంస్థ 100 కోట్ల రూపాయలకు పైగా టర్నోవర్‌ను సాధించింది. 2021 నాటికి అతని నికర విలువ రూ. 65 కోట్లు ఉండగా, నెలవారీ ఆదాయం రూ. 2 కోట్లతో ముందుకు సాగుతున్నారు. వినూత్నమైన ఆలోచనలు, దృఢ సంకల్పం ఉంటే వ్యాపార ప్రపంచంలో ఎలా రాణించవచ్చో తిలక్ మెహతా ప్రయాణం ఒక స్పూర్తిదాయకంగా నిలుస్తోంది. అంతేకాదు అవకాశాలను పొందడం, వారి ప్రత్యేక నైపుణ్యాలతో వ్యాపారం చేసేందుకు వయస్సు అడ్డంకి కాదని నిరూపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment