parcel service
-
బుడ్డోడు కాదు బిలియనీర్..8వ తరగతి విద్యార్థి వందల కోట్ల వ్యాపారం!
వయస్సు చిన్నదే కావొచ్చు. సరిగ్గా ఆలోచిస్తే లక్షలు పోసి ఖర్చు పెట్టినా రాని బిజినెస్ ఐడియాలు రోజూ వారీ జీవితంలో ఎదురుయ్యే కొన్ని సమస్యల్లో నుంచి పుట్టుకొస్తాయి. అలా తనకు ఎదురైన ఓ ప్రాబ్లమ్ తీసుకొని దాన్నే బిజినెస్‌గా మరల్చుకొని వందల కోట్లు సంపాదిస్తున్నాడు 13ఏళ్ల తిలక్ మెహతా. తిలక్ మెహతా సరదాగా గడిపేందుకు ఓ రోజు తన మేనమామ ఇంటికి వెళ్లాడు. పాఠశాల విద్యార్ధి కావడంతో వెళ్లేటప్పుడు తనతో పాటు బండెడు పుస్తకాల్ని వెంటతీసుకొని వెళ్లాడు. కొన్ని రోజుల పాటు అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత తన ఇంటికి వచ్చాడు. కానీ వచ్చేటప్పుడు మామయ్య ఇంట్లో ఉన్న పుస్తకాల గురించి మరిచిపోయాడు. త్వరలోనే పరీక్షలు. చదవాల్సిన బుక్స్ లేవు. చేసేది లేక బుక్స్ డెలివరీ కోసం కొన్ని ఏజెన్సీలను వెతికాడు. ఈ ప్రయత్నాల్లో భాగంగా డెలివరీ ఖర్చు ఎక్కువగా ఉండడం, మార్కెట్లో డెలివరీ అవసరాల్ని తీర్చే సంస్థలు పెద్దగా అందుబాటులో లేవని గుర్తించాడు. బుక్స్‌ను సైతం ఇంటికి తెప్పించుకోలేకపోయాడు. సమస్యతోనే ఈ సంఘటన తిలక్ మెహతా మనస్సులో ఓ అద్భుతమైన ఆలోచనను రేకెత్తించేలా చేసింది. ముంబై డబ్బావాలా ప్రేరణతో నగరంలో కస్టమర్లకు కావాల్సిన వస్తువుల్ని ఒకే రోజు డెలివరీ చేసేలా ఓ సంస్థను ప్రారంభించారు. ఆ కంపెనీ పేరే ‘పేపర్ అండ్ పార్శిల్స్’. తక్కువ ఖర్చుతో కస్టమర్ల డెలివరీ సమస్యల్ని పరిష్కరించేలా సర్వీసుల్ని ప్రారంభించాడు. అతని తండ్రి ఆర్థిక సహకారం. డబ్బావాలా సహాయంతో సంప్రదాయ పోస్టల్ సేవల కంటే తక్కువ ఖర్చుతో డెలివరీలను అందించడం మొదలు పెట్టాడు. వ్యాపారం పెరిగే కొద్దీ 2018 నాటికి వివిధ వ్యాపార అవసరాలకు అనుగుణంగా షిప్పింగ్, లాజిస్టిక్స్ సేవలను చేర్చడానికి విస్తరించింది. రూ.100 కోట్ల టర్నోవర్‌తో వెరసీ అచంచలమైన అంకితభావం, పట్టుదలతో తిలక్ మెహతా స్థాపించిన ఈ సంస్థ 100 కోట్ల రూపాయలకు పైగా టర్నోవర్‌ను సాధించింది. 2021 నాటికి అతని నికర విలువ రూ. 65 కోట్లు ఉండగా, నెలవారీ ఆదాయం రూ. 2 కోట్లతో ముందుకు సాగుతున్నారు. వినూత్నమైన ఆలోచనలు, దృఢ సంకల్పం ఉంటే వ్యాపార ప్రపంచంలో ఎలా రాణించవచ్చో తిలక్ మెహతా ప్రయాణం ఒక స్పూర్తిదాయకంగా నిలుస్తోంది. అంతేకాదు అవకాశాలను పొందడం, వారి ప్రత్యేక నైపుణ్యాలతో వ్యాపారం చేసేందుకు వయస్సు అడ్డంకి కాదని నిరూపిస్తోంది. -
ఎయిర్‌పోర్ట్‌లో యురేనియం కలకలం
లండన్: లండన్‌లోని అత్యంత రద్దీగా ఉండే హీత్రో అంతర్జాతీయ విమానాశ్రయంలో యురేనియం ఉన్న పార్సిల్ కలకలం సృష్టించింది. రెండు వారాల క్రితం అంటే గత ఏడాది డిసెంబర్ 29న జరిగిన ఈ ఘటనలో ఆలస్యంగా వెలుగుచూసింది. పాకిస్తాన్‌లోని కరాచీ నగరం నుంచి ఈ పార్సిల్ బ్రిటన్‌కు చేరినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. తుక్కు ఖనిజాలకు సంబంధించిన కార్గో పార్సిళ్ల మధ్యలో ఈ యురేనియం నింపిన పార్సిల్ ఒకదానిని ఎయిర్పోర్ట్ కార్గో సిబ్బంది స్కానింగ్ తనిఖీల సమయంలో గుర్తించారు. ఒక ఖనిజం కడ్డీల అడుగున దీనిని దాచి ఉంచినట్లు అధికారులు తెలిపారు. వెంటనే దీనిని బోర్డర్ ఆఫీసర్లకు అప్పగించగా దూరంగా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దేశ ఉగ్రవ్యతిరేక దళాలకు ఇచ్చేశారు. దీనిపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. కరాచీ నుంచి ఒమన్‌లోని మస్కట్‌కు అక్కడి నుంచి ఒమన్ ఎయిర్‌లైన్స్ ద్వారా లండన్‌కు వచ్చినట్లు తేల్చారు. ఇరాన్ జాతీయులకు అందజేసేందుకే దానిని బ్రిటన్‌కు తరలించారని బ్రిటిష్ మీడియాలో వార్తలొచ్చాయి. పాక్, ఒమన్లలో తనిఖీలను దాటించేసి బ్రిటన్‌కు యురేనియంను తరలించడం ఆందోళనకర విషయమని బ్రిటన్ సైన్యంలో రసాయనిక ఆయుధాల విభాగం మాజీ అధిపతి హ్యామిస్ బ్రెటన్ గార్డన్ వ్యాఖ్యానించారు. శిలల నుంచి సేకరించే రేడియోధార్మిక యురేనియంను అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, రియాక్టర్లలో ఇంధనంగా వినియోగిస్తారు. జలాంతర్గామి, అణ్వాయుధాల్లోనూ వాడతారు. లండన్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమైన పార్సిల్‌తో మాకు ఎలాంటి ప్రమేయం లేదని పాకిస్తాన్ తేల్చి చెప్పింది. మీడియాలో వచ్చే వార్తలన్నీ ఊహాత్మకమని పాకిస్తాన్ విదేశాంగ శాఖ స్పష్టంచేసింది. -
లక్కీ ‘పార్సిల్’: దక్షిణ మధ్య రైల్వే రికార్డు
సాక్షి, హైదరాబాద్: పార్సిళ్ల రవాణా విషయంలో చేసిన మార్పు రైల్వేకి కాసుల వర్షం కురిపిస్తోంది. గతంలో సాధారణ ప్రయాణికుల రైళ్లకు ఒకటి రెండు చొప్పున పార్సిల్ బోగీలను జత చేసేవారు. లగేజీ బుక్ చేసుకునేవారు వాటిల్లో తమ పార్సిళ్లను పంపేవారు. వ్యాపారులు బుక్ చేసిన ప్యాక్డ్ సరుకును వాటిల్లో గమ్యం చేర్చేవారు. దీనివల్ల సాలీనా రూ.80 కోట్ల నుంచి 90 కోట్ల వరకు ఆదాయం సమకూరేది. ఇటీవల కోవిడ్ సమయంలో ఇలాంటి సరుకు తరలింపునకు పూర్తి రైళ్లను కేటాయించారు. ఈ మార్పు వ్యాపారులను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలలకే 2.56 లక్షల టన్నుల సరుకు తరలింపుతో ఏకంగా రూ.109.06 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో ఉత్సాహంగా మిగతా కాలానికి మరింత ఆదాయం వచ్చేలా రైల్వే అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈమేరకు తాజాగా లెక్కలు రూపొందించారు. గత ఆర్థిక సంవత్సరం మొత్తం కలిపి రూ.108.35 కోట్ల ఆదాయం సమకూరింది. ఇది దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రికార్డుగా నిలిచింది. ఇప్పుడు దాన్ని కేవలం ఆరు నెలల కాలంలోనే బ్రేక్ చేయటం విశేషం. వేగంగా.. తక్కువ ఖర్చుతో.. కోవిడ్ సమస్య తీవ్రంగా ఉన్న సమయంలో ప్రయాణికుల రైళ్లు చాలాకాలం నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆదాయాన్ని పెంచుకునేందుకు సరుకు రవాణా రైళ్లపై అధికారులు దృష్టి సారించారు. సిమెంటు, బొగ్గు, స్టీల్ వంటి వాటి కోసం పూర్తిస్థాయి గూడ్సు రైళ్లను నడిపినట్టుగానే, ఇతర సరుకు కోసం పూర్తిస్థాయి పార్సిల్ రైళ్లను నడపాలని నిర్ణయించి వ్యాపారులతో సంప్రదింపులు చేపట్టారు. ఇది మంచి ఫలితాన్నిచ్చింది. వేగంగా, తక్కువ ఖర్చుకే గమ్యస్థానం చేరుస్తామని హామీ ఇవ్వటంతో వ్యాపారులు ముందుకొచ్చారు. పండ్లు, ఉల్లిపాయలు, కోడిగుడ్లు, పాలను దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేశారు. ఏప్రిల్ నుంచి సెపె్టంబరు 27 వరకు 343 కిసాన్ రైళ్లను నడిపి ఉల్లిపాయలు, మామిడి పళ్లు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు 1,08,388 టన్నుల మేర సరఫరా చేశారు. దీనివల్ల రూ.49.43 కోట్ల ఆదాయం వచ్చింది. దేశ రాజధానికి దూద్ దురంతో రైళ్ల ద్వారా 3.78 కోట్ల లీటర్ల పాలను సరఫరా చేయటం ద్వారా రూ.8.91 కోట్ల ఆదాయం సమకూరింది. కోడిగుడ్లు, బేబీ డైపర్స్, ఎంఆర్ఎఫ్ టైర్లు ఇలా చాలా పార్సిళ్లను వివిధ ప్రాంతాలకు సరఫరా చేసింది. పార్సిల్ రవాణా ద్వారా రికార్డుస్థాయి ఆదాయం పొందడంలో అధికారులు చూపిన చొరవ అభినందనీయమని, భవిష్యత్తులో మరింత ఆదాయం కోసం కృషి చేయాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా చెప్పారు. -
షాకింగ్ : పార్సిల్లో పాము ప్రత్యక్షం
భువనేశ్వర్ : గృహోపకరణాలతో కూడిన పార్సిల్‌ను ఓపెన్ చేస్తుండగా అందులోంచి పాము ప్రత్యక్షమైన ఘటన ఒడిషాలో చోటుచేసుకుంది. విజయవాడకు చెందిన ముత్తుకుమరన్ ప్రస్తుతం ఒడిషాలోని మయూర్భంజ్లోని రైరంగాపూర్లో ఉంటున్న తన నివాసంలో కొరియర్ నుంచి వచ్చిన పార్సిల్‌ను విప్పుతుండగా అందులోంచి పాము బయటికి రావడంతో విస్తుపోయారు. పార్సిల్లో పాము బయటపడ్డ విషయాన్ని ముత్తుకుమరన్ అటవీ అధికారులకు తెలపగా వారు అక్కడికి చేరుకుని పామును అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. పదిహేను రోజుల కిందట తాను ప్రైవేట్ కొరియర్ ఏజెన్సీ నుంచి పార్సిల్‌ను బుక్ చేశానని ముత్తుకుమరన్ తెలిపారు. ఈనెల 9న గుంటూరు నుంచి ఈ పార్సిల్ తనకు పంపారని చెప్పారు. గృహోపకరణాలతో కూడిన ఈ పార్సిల్‌ను విప్పిచూస్తుండగా అందులో పాము కనిపించడంతో షాక్‌కు గురయ్యానని తెలిపారు. ఒడిషాకు పార్సిల్‌ను తరలించే క్రమంలో పాము ఇందులోకి చేరిఉంటుందని ఆయన చెప్పారు. -
ఆర్టీసీ కార్గోలో దోపిడీ!
సాక్షి, అమరావతి: ఏపీఎస్ ఆర్టీసీ కార్గోలో వినియోగదారుల నుంచి ప్రైవేటు సిబ్బంది ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ ద్వారా పార్శిల్ సేవలు బుక్ చేస్తున్న వారికి చుక్కలు చూపిస్తున్నారు. కార్గో వ్యాపారాన్ని రెండేళ్ల క్రితం ప్రైవేటు సంస్థకు యాజమాన్యం అప్పగించింది. టీడీపీ ఎమ్మెల్యేకు చెందిన ఈ ప్రైవేటు సంస్థకు కార్గో వ్యాపారం మొత్తం కట్టబెట్టారు. కార్గో వ్యాపారం ఏడాదికి రూ.కోటి జరిగితే, ఒప్పందం ప్రకారం 4.95 శాతం కమీషన్ చొప్పున ప్రైవేటు సంస్థకు రూ.4.95 లక్షలు చెల్లించాలి. (ఆర్టీసీని వాడేద్దాం!) గత 25 ఏళ్ల నుంచి ఆర్టీసీ బస్సుల్లో పార్శిల్ వ్యాపారం ఏఎన్ఎల్ సంస్థ నిర్వహించింది. ఆ సంస్థ ఏడాదికి ఆర్టీసీకి రూ.9 కోట్ల వరకు చెల్లించేది. 2017 ఆగస్టులో ఏఎన్ఎల్ నుంచి కార్గో వ్యాపారం మొత్తం ఆర్టీసీ స్వాధీనం చేసుకుంది. పార్శిల్ వ్యాపారాన్ని వోల్వో బస్సుల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. ఒక్క నెలలోనే రూ.13 కోట్ల ఆదాయం వచ్చింది. ఆర్టీసీలో 10,700 బస్సుల్లోనూ పార్శిల్ సేవలను ఆరంభించడంతో ఆదాయం రూ.30 కోట్లకు చేరింది. (యాత్రల పేరిట ఆర్టీసీపై మరో పిడుగు..) పత్తాలేని పర్యవేక్షణ కార్గో వ్యాపారాన్ని ప్రైవేటు సంస్థకు అప్పగించినా ఆర్టీసీ అధికారులే స్వయంగా పర్యవేక్షించాలి. కానీ ప్రైవేటు సంస్థ అధికార పార్టీ ఎమ్మెల్యేకు చెందినది కావడంతో ఆర్టీసీ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. దీంతో వినియోగదారుల నుంచి భారీగా వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పార్శిల్ సేవలకు నిర్ణీత రుసుం కంటే అధికంగా వసూలు చేస్తున్నా పట్టించుకునే వారే లేకపోవడం గమనార్హం. ఆర్టీసీ ద్వారా బుక్ చేసుకునే ప్రతి పార్శిల్‌కు బీమా సౌకర్యం కల్పిస్తామని అధికారులు ఆర్భాటంగా ప్రకటించారు. అయితే, అది ఎక్కడా అమలు కావడం లేదు. -
ఆర్టీసీ... పార్సిల్ సర్వీస్
-
ఆర్టీసీ.. పార్సిల్ సర్వీస్
కొత్తగా కొనే బస్సుల్లో ప్రత్యేక ఏర్పాట్లు తొలుత తేలికపాటి వస్తువులతో ప్రారంభం సత్ఫలితాలిస్తే తదుపరి కార్గో విభాగం ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: అప్పులు, నష్టాలతో సతమతమవుతున్న ఆర్టీసీ ఆదాయం కోసం కొత్త దారులు వెతుకుతోంది. ఇందులో భాగంగా పార్సిల్ సర్వీసు ప్రారంభించాలని నిర్ణయించింది. ప్రైవేటు కొరియర్ సంస్థల తరహాలో బస్సుల్లో పార్సిల్ కవర్లు, తేలికపాటి వస్తువులను సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గత జూన్‌లో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆర్టీసీ సమీక్ష సందర్భంలో సరుకు రవాణాపై దృష్టి సారించాలని ఆదేశించిన నేపథ్యంలో ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో చాలాకాలంగా అక్రమంగా సరుకు రవాణా సాగుతోంది. కమీషన్ల మత్తులో ఉన్న రవాణాశాఖ అధికారులు చూసీ చూడనట్టు పోతుండటంతో వాటిల్లో ప్రైవేటు బస్సుల నిర్వాహకులు యథేచ్ఛగా కార్గో వ్యాపారం సాగిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో తేలికపాటు సరుకుల రవాణా ప్రస్తుతం సాగుతోంది. బస్సు టాప్‌పై వాటిని సరఫరా చేస్తున్నా, ఆ బాధ్యతను ఓ ప్రైవేటు సంస్థకు కట్టబెట్టారు. ఇందులో ఆర్టీసీకి వచ్చే ఆదాయం నామమాత్రంగానే ఉంటోంది. ఈ విషయంలో కూడా కమీషన్ల దందా నడుస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఎట్టకేలకు ప్రయోగాత్మకంగా పార్సిల్ సర్వీసుకు శ్రీకారం చుట్టబోతున్నారు. కొత్త బస్సులతో ప్రారంభం... త్వరలో ఆర్టీసీ దాదాపు వేయి కొత్త బస్సులు సమకూర్చుకుంటోంది. వీటిని తయారు చేసేప్పుడే బస్సులోపల పార్సిళ్లు పెట్టేందుకు వీలుగా ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. ప్రైవేటు సంస్థతో ఉన్న ఒప్పందం ఇంకా పూర్తి కానుందున, తొలుత కొత్త బస్సుల్లోనే ఆర్టీసీ పార్సిల్ సర్వీసు నిర్వహించాలని నిర్ణయించింది. ఆ సంస్థతో ఒప్పందం ముగిసిన తర్వాత పాత బస్సులకూ వర్తింప చేయనుంది. ఏపీ ప్రయోగంతో.... ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ పార్సిల్ సర్వీసును ప్రారంభించింది. మూడు నెలల్లో దాదాపు రూ.19 కోట్ల మేర ఆదాయం సమకూరింది. దీంతో ఈ ప్రయోగం లాభదాయకమేనని టీఎస్ ఆర్టీసీ కూడా నిర్ణయించుకుంది. సరుకులను బస్సుల్లో చేర్చిన తర్వాత వాటి వివరాలను డ్రైవర్‌కు అందజేస్తారు. బస్సు ఆయా బస్టాండ్లకు చేరగానే అక్కడ ప్రత్యేకంగా ఉండే సిబ్బంది వచ్చి ఆ సరుకులను దించి బస్టాండ్‌లోని పార్సిల్ కౌంటర్లోకి చేరుస్తారు. అక్కడ సరిచూసిన తర్వాత సిబ్బంది వాటిని సంబంధిత చిరునామాకు చేరవేస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని తాత్కాలిక పద్ధతిపై నియమించుకోనున్నారు. ఈ ప్రయోగం మంచి ఫలితాలనిస్తే భవిష్యత్తులో కార్గో వ్యవస్థ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.