వాషింగ్టన్: అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త చార్లెస్ చక్ ఫ్రీనీ (89) తనకున్న యావదాస్తి 8 బిలియన్ల డాలర్ల (దాదాపు రూ.58 వేల కోట్ల)ను గుట్టుచప్పుడు కాకుండా ప్రపంచంలోని పలు ఫౌండేషన్లకు, విశ్వవిద్యాలయాలకు దానం చేశారు. ఇంత భారీ మొత్తంలో చేసిన దానం ఇటీవల బయటకు రావడంతో ధనవంతు లంతా అవాక్కయ్యారు. 2012లో తన భార్యకు ఇచ్చేందుకు కేవలం 20 లక్షల డాలర్లు అట్టిపెట్టారు. దానం చేసిన మొత్తంలో దాదాపు సగ భాగాన్ని ఇతరులకు విద్య అందించడానికే సాయం చేశారు. మానవ హక్కులు, సామాజిక మార్పులు, ఆరోగ్య సమస్యలు వంటి అంశాల్లో తోడ్పడేం దుకు దానం చేశారు. అంతా దానం చేయాలనే ఆలోచనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఆయన ఈ త్యాగం చేశారని బిల్ గేట్స్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment