
ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ బోట్ సహ వ్యవస్థాపకుడు అమన్ గుప్తా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిశారు. రెడ్ కార్పెట్ మీద భార్య ప్రియా దాగర్‌తో కలిసి అడుగులు వేశారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇలా రెడ్ కార్పెట్‌పై నడిచిన మొదటి భారతీయ పారిశ్రామిక వేత్త ఆయనే. అమన్ గుప్తా తొలిసారిగా కేన్స్ ప్రదర్శన కోసం భార్య ప్రియా దాగర్‌తో కలిసి వచ్చారు.
ఈ మేరకు అమన్ గుప్తా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ఫొటోలను షేర్ చేశారు. ‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్‌పై నడిచిన తొలి భారతీయ పారిశ్రామికవేత్తను నేనే కావడం గర్వంగా ఉంది’ అని పేర్కొన్నారు.
మరోవైపు బాలీవుడ్ తారలు సారా అలీ ఖాన్, మానుషి చిల్లర్, ఈషా గుప్తా, మృణాల్ ఠాకూర్ వంటి వారు ఈ సంవత్సరం కేన్స్‌లోకి అడుగుపెట్టారు. కేన్స్ వెటరన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ లోరియల్ బ్రాండ్ అంబాసిడర్‌గా 21వ సారి ఫెస్టివల్‌లో ప్రదర్శన ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment