కోవిడ్ ఫస్ట్ వేవ్ అనంతరం ప్రకటించిన ఆత్మనిర్బర్ భారత్ రోజ్‌గార్ యోజనా పథకాన్ని 2021 జూన్ 30 నుంచి 2022 మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ పథకం ద్వారా 58.50 లక్షల మందికి రూ. 22,810 కోట్ల రూపాయల లబ్ధికి చేకూరుతుందన్నారు.
ఈపీఎఫ్‌వో వాటా
వెయ్యిలోపు ఉద్యోగులు ఉన్న సంస్థల్లో ఎంప్లాయి, ఎంప్లాయిర్‌లకు సంబంధించిన ఈపీఎఫ్‌వో వాటాను పూర్తిగా కేంద్రమే చెల్లిస్తుందన్నారు. వెయ్యికి పైగా ఉద్యోగులు ఉన్న సంస్థలకు సంబంధించి కేవలం ఎంప్లాయి వాటాను కేంద్రం చెల్లిస్తుందన్నారు. ఇప్పటికే ఈ పథకం ద్వారా 21.42 కోట్ల మంది లబ్ధిదారులకు రూ. 902 కోట్లు చెల్లించినట్టు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment