Bill accepted
-
వాతావరణ మార్పుల బిల్లుపై బైడెన్ సంతకం
వాషింగ్టన్: వాతావరణ మార్పులు, ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన కీలక బిల్లుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. దీంతో ఇది చట్టరూపం దాల్చినట్లే. కొత్త బిల్లు ప్రకారంఅమెరికాలో వాతావరణ మార్పుల వల్ల తలెత్తే దుష్పరిణామాలను నివారించడానికి వచ్చే పదేళ్లలో 375 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తారు. వాతావరణ మార్పులపై జరుగుతున్న యుద్ధంలో ఇది అతిపెద్ద పెట్టుబడి అని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆరోగ్య సంరక్షణకు కోసం పెద్ద ఎత్తున నిధులు వెచ్చించనున్నారు. అర్హులకు రాయితీతో ఆరోగ్య బీమా, ఔషధాలు అందిస్తారు. తాము ఎల్లప్పుడూ అమెరికా ప్రజల వెంటే ఉంటామని, ఇతర ప్రయోజనాలు తమకు ముఖ్యం కాదని ఈ సందర్భంగా బైడెన్ వ్యాఖ్యానించారు. కొత్త బిల్లుకు అమెరికా పార్లమెంట్ గత వారమే ఆమోదం తెలిపింది. -
ఉక్రెయిన్‌కు స్పీడుగా సహాయం
వాషింగ్టన్: ఉక్రెయిన్‌తో పాటు తూర్పు యూరప్‌లోని మిత్రదేశాలకు మరింత సాయం వేగంగా అందించేందుకు వీలు కల్పించే బిల్లుకు అమెరికా హౌస్ ఆఫ్ కామన్స్ శుక్రవారం ఆమోదముద్ర వేసింది. దీనికింద రష్యా ఆక్రమణను నిరోధించేందుకు ఈ దేశాలకు అమెరికా ఆయుధ సంపత్తిని అందిస్తారు. తమ మద్దతుతో రష్యాపై ఉక్రెయిన్ గెలుస్తుందని యూఎస్ ప్రతినిధి గ్రెగరీ మీక్స్ చెప్పారు. ఆ దేశానికి మరో 3,000 కోట్ల డాలర్ల సాయమందించేందుకు అమెరికా కాంగ్రెస్ మద్దతు కోరతానని అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. డోన్బాస్‌పైనే ఫోకస్ తూర్పు ఉక్రెయిన్‌లోని డోన్బాస్‌పై రష్యా దాడులను కొనసాగిస్తోంది. వాటిని ఉక్రెయిన్ సమర్థంగా అడ్డుకుంటోందని బ్రిటన్ తెలిపింది. ఐరాస చీఫ్ గుటెరస్ కీవ్‌లో పర్యటిస్తుండగానే ఆ నగరంపై రష్యా తీవ్ర దాడులకు దిగింది. అక్కడి మిలటరీ ఫ్యాక్టరీపై దాడి చేశామని ప్రకటించింది. వరదలతో నిరోధం కీవ్‌ను సమీపించకుండా రష్యా సేనలను నిరోధించేందుకు పరిసర గ్రామాలను ప్రజలు నీటితో ముంచెత్తుతున్నారు. దీనివల్ల మౌలిక వసతులు దెబ్బతింటున్నా పర్లేదంటున్నారు. శత్రువుల ఆక్రమణ ముప్పు కన్నా ఆస్తి నష్టం ఎక్కువేమీ కాదని చెప్పారు. ఇటీవలే దెమిదివ్ గ్రామ ప్రజలు ఇలాగే రష్యా సేనలను నిలువరించారు. ఘోస్ట్ ఆఫ్ కీవ్ మృతి ఉక్రెయిన్ సైన్యం కీలకమైన జవానును కోల్పోయింది. ‘ఘోస్ట్ ఆఫ్ కీవ్’గా పేరు పొందిన మేజర్ స్టెపాన్ టారాబాల్కా(29) గత నెలలో రష్యా బాంబు దాడుల్లో మృతి చెందినట్లు తాజాగా తెలిసింది. అతను 40 రష్యా యుద్ధ విమానాలను నేలకూల్చాడని ఉక్రెయిన్ చెబుతోంది. ‘ఉక్రెయిన్’ వైద్య విద్యార్థులకు సుప్రీం ఊరట న్యూఢిల్లీ: యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి మధ్యలోనే స్వదేశానికి వచ్చిన వైద్య విద్యార్థులకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ఉక్రెయిన్‌తో పాటు ఇతర దేశాల నుంచి మధ్యలో వచ్చిన వాళ్లు స్థానిక కాలేజీల్లో అడ్మిషన్ పొందేందుకు రెండు నెలల్లో పథకం రూపొందించాలని జాతీయ వైద్య కమిషన్‌ను శుక్రవారం ఆదేశించింది. స్వదేశీ కాలేజీల్లో చేరికకు అవసరమైన క్లినికల్ ట్రైనింగ్‌ను ఈ పథకంలో భాగంగా అందిస్తారు. చైనా వర్సిటీకి చెందిన ఓ వైద్య విద్యార్థిని సూత్రప్రాయంగా రిజిస్టర్ చేసుకోవాలంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఎన్ఎంసీ సుప్రీంలో సవాలు చేసింది. మానవాళికి కరోనా కొత్త సవాళ్లు విసిరిందని విచారణ సందర్భంగా ఎన్ఎంసీకి జస్టిస్ గుప్తా, జస్టిస్ రామసుబ్రమణ్యంతో కూడిన ధర్మాసనం పేర్కొంది. చైనా వర్సిటీలో క్లినికల్ శిక్షణ పూర్తి చేసుకోనంత మాత్రాన విద్యార్థి ప్రతిభ వృథా కాకూడదని అభిప్రాయపడింది. వారికి ఒక్క అవకాశం ఇవ్వాలని సూచించింది. ఇలాంటి విద్యార్థులను ఎన్ఎంసీ ఒక నెలలో పరీక్షించవచ్చని, సరైన శిక్షణ పొందారని కమిషన్ భావిస్తే దేశీయంగా 12 నెలల ఇంటర్న్‌షిప్ పూర్తి చేసేందుకు వారికి వీలు కల్పించవచ్చని తెలిపింది. -
గూగుల్, ఫేస్బుక్ వార్తల్ని వాడుకుంటే.. మీడియా సంస్థలకి డబ్బు చెల్లించాలి
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలో ఫేస్బుక్, గూగుల్ వంటి డిజిటల్ ఫ్లాట్‌ఫారమ్‌లు ఏదైనా మీడియా సంస్థకి చెందిన వార్తల్ని వాడుకుంటే వాటికి డబ్బు చెల్లిం చాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆస్ట్రేలియా పార్ల మెంటు ఒక కీలక బిల్లుకు ఆమోదం వేసింది. న్యూస్ మీడియా చట్టానికి చేసిన సవరణల్ని గురువారం ఆస్ట్రేలియా పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆస్ట్రేలియా ట్రెజరర్ జోష్ ఫ్రైడెన్ బెర్గ్, ఫేస్బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్‌బర్గ్ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. మొదట్లో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఫేస్బుక్ తమ ప్లాట్‌ఫారమ్‌పై ఆస్ట్రేలియా వాసులు వార్తల్ని షేర్ చేయడంపై నిషేధాన్ని విధించింది. అయితే ప్రభుత్వం చట్ట సవరణల్లో మార్పులకు అంగీకరించడంతో ఫేస్ బుక్ వార్తల షేరింగ్‌పై నిషే«ధం ఎత్తి వేసింది. మరోవైపు ఫేస్బుక్, గూగుల్ సంస్థలు మీడియా సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకుంటున్నాయి. -
కరోనా ప్యాకేజీపై ట్రంప్ సంతకం
వాషింగ్టన్: కరోనా ప్యాకేజీపై మొండిపట్టు పడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు మొండితనాన్ని వీడారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడమే లక్ష్యంగా తెచ్చిన 2.3 లక్షల కోట్ల డాలర్ల ఉద్దీపన బిల్లుపై సంతకం చేశారు. ఇందులోనే 90వేల కోట్ల డాలర్ల కరోనా రిలీఫ్ ప్యాకేజీ కూడా ఉంది. ట్రంప్ సంతంకంతో ప్రభుత్వ షట్‌డౌన్ ప్రమాదం తప్పింది. ఈ బిల్లుపై సంతకం చేసేది లేదంటూ ట్రంప్ మొండికేయడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమయింది. కానీ చివరకు ఆయన ఎందుకు మనసు మార్చుకొని సంతకం చేశారో వివరాలు తెలియలేదు. -
వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో రైతుల ఆందోళనలకు కారణమైన వ్యవసాయ బిల్లులు చట్టరూపం దాల్చాయి. ఆదివారం విడుదలైన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మూడు బిల్లులను ఆమోదించారు. అవి.. రైతు ఉత్పత్తుల వాణిజ్యం, వ్యాపారం (ప్రోత్సాహం, వసతుల కల్పన) బిల్లు–2020, రైతు(సాధికారత, రక్షణ) ధరల హామీ, వ్యవసాయ సేవల బిల్లు–2020, నిత్యావసరాల(సవరణ) బిల్లు–2020. వీటిలో.. రైతు ఉత్పత్తుల వాణిజ్యం, వ్యాపారం (ప్రోత్సాహం, వసతుల కల్పన) బిల్లు అమల్లోకి వస్తే రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను రాష్ట్రాల ఆధీనంలోని మండీలకు వెలుపల విక్రయించుకునే వెసులుబాటు ఉంటుంది. అదేవిధంగా, రైతు(సాధికారత, రక్షణ) ధరల హామీ, వ్యవసాయ సేవల చట్టంతో కాంట్రాక్టు వ్యవసాయానికి దారులు తెరుచుకుం టాయి. మూడోది.. నిత్యావసరాల(సవరణ) బిల్లు. దీని ద్వారా బంగాళా దుంపలు, ఉల్లిగడ్డలు, వంటనూనెలు, చిరుధాన్యాల సరఫరా, ఉత్పత్తి, పంపిణీపై నియంత్రణలు తొలిగిపోతాయి. ఈ బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సమయంలో కూడా ప్రతిపక్షం నిరసనలు తెలిపింది. ఈ బిల్లులను నిరసిస్తూ అధికార ఎన్డీఏ నుంచి శిరోమణి అకాలీదళ్ పార్టీ బయటకు వచ్చింది. కశ్మీరీ, డోంగ్రీ, హిందీ.. జమ్మూకశ్మీర్‌లో ఉర్దూ, ఇంగ్లిష్‌తోపాటు కశ్మీరీ, డోంగ్రీ, హిందీలకు అధికార భాషల హోదా కల్పించే బిల్లును కూడా రాష్ట్రపతి కోవింద్ ఆమోదించారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలయింది. జమ్మూకశ్మీర్ అధికార భాషల బిల్లు–2020ను ఇటీవలి వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ ఆమోదించింది. బీజేపీని నిలదీయండి: కాంగ్రెస్ వ్యవసాయ రంగం, రైతుల పాలిట కేన్సర్‌లా మారిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించాలనీ, ఈ విషయంలో ఎన్డీఏను వీడి బయటకు రావాలని జేడీయూ, ఎల్జేపీ, జేజేపీ పార్టీలను కాంగ్రెస్ కోరింది. ఇలా ఉండగా, వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్‌లో రైతుల ఆందోళనలు ఆదివారం కూడా కొనసాగాయి. అమృత్సర్– ఢిల్లీ మార్గంలో రైలు పట్టాలపై కూర్చుని నిరసన తెలిపారు. కిసాన్ మజ్దూర్ సంఘర్‡్ష కమిటీ నేతృత్వంలో రైతులు బుధవారం నుంచి రైలు రోకోలు జరుపుతున్న విషయం తెలిసిందే. -
21వ శతాబ్దపు ఆవశ్యకాలు!
న్యూఢిల్లీ: తాజాగా పార్లమెంటు ఆమోదించిన వ్యవసాయ బిల్లులు 21వ శతాబ్దపు భారతదేశానికి అవసరమైనవని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయడం, కనీస మద్దతు ధర వ్యవస్థ కొనసాగుతాయని పునరుద్ఘాటించారు. తాజా సంస్కరణలతో రైతులు తాము కోరుకున్న ధరకు, కోరుకున్న చోట తమ ఉత్పత్తులను అమ్ముకునే వీలు లభిస్తుందన్నారు. వ్యవసాయ బిల్లులు రైతు వ్యతిరేక బిల్లులని, అవి రైతులను నాశనం చేస్తాయని విపక్ష పార్టీలు నిరసిస్తున్న విషయం తెలిసిందే. హరియాణా, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ఈ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ బిల్లులపై విమర్శలను ప్రధాని తిప్పికొడుతూ.. ‘చాన్నాళ్లు వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించిన నిబంధనల సంకెళ్లలో రైతులను ఉంచి, వారికి అన్యాయం చేసి, వారిని దోపిడీ చేసిన కొందరు ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నార’న్నారు. ‘వ్యవసాయ రంగంలో ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పుల వల్ల కొందరు ఆ రంగంపై పట్టు కోల్పోతున్నారు. వాళ్లే ఇప్పుడు కనీస మద్దతు ధరపై రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయకుండా ఏళ్లకేళ్లు గడిపిన వారే ఇప్పుడు మా నిర్ణయాలను విమర్శిస్తున్నారు’ అన్నారు. వ్యవసాయ మార్కెట్లకు తాజా బిల్లులు వ్యతిరేకం కాదని, ఆ మండీల కార్యకలాపాలు కొనసాగుతాయని ప్రధాని స్పష్టం చేశారు. త్వరలో ఎన్నికలు జరగనున్న బిహార్‌లో 9 హైవే ప్రాజెక్టులకు సోమవారం వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. బిహార్‌లోని అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే ఆప్టికల్ ఫైబర్ ఇంటర్నెట్ సర్వీసెస్‌ను కూడా ప్రధాని ప్రారంభించారు. కరోనా మహమ్మారి సమయంలోనూ రికార్డు స్థాయిలో గోధుమలను ప్రభుత్వం సేకరించిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో కన్నా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నూనె ధాన్యాల సేకరణ 24 రెట్లు పెరిగిందని వివరించారు. -
వివాద్ సే విశ్వాస్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: వివాద్ సే విశ్వాస్ బిల్లుకు బుధవారం లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. 2020–21 బడ్జెట్లో ఈ ప్రత్యక్ష పన్ను వివాద పరిష్కార పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టారు. దీని ప్రకారం, ఆదాయపన్ను శాఖ జారీ చేసిన డిమాండ్ నోటీసులను వ్యతిరేకిస్తూ అప్పీల్‌కు వెళ్లిన వారు.. 2020 మార్చి 31 నాటికి బకాయిలను చెల్లిస్తే చాలు. దానిపై వడ్డీ, పెనాల్టీని ప్రభుత్వం రద్దు చేస్తుంది. గడువు నాటికి చెల్లించలేకపోతే, మార్చి తర్వాత జూన్ 30 వరకు మరో విడత గడువు లభిస్తుంది. కానీ, మార్చి 31లోపు చెల్లించాల్సిన దానితో పోలిస్తే ఆ తర్వాత 10 శాతం అదనంగా చెల్లించాలి. 2020 జనవరి 31 నాటికి పలు అప్పిలేట్ ఫోరమ్‌ల వద్ద నమోదై, అపరిష్కృతంగా ఉన్న కేసులు ఈ పథకం పరిధిలోకి వస్తాయి. పన్ను చెల్లింపులు రూ.5 కోట్లలోపు ఉన్న సోదా కేసులకే ఇది వర్తిస్తుంది. -
‘పెస్టిసైడ్స్’ నియంత్రణకు బిల్లు
న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే పురుగు మందుల వ్యాపార నియంత్రణ బిల్లును సభలో ప్రవేశపెట్టనుంది. పురుగుమందుల వ్యాపార క్రమబద్ధీకరణతో పాటు, నకిలీ పురుగుమందుల కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం అందించే ప్రతిపాదనను కూడా బిల్లులో చేర్చారు. ఈ ‘పెస్టిసైడ్స్ మేనేజ్మెంట్ బిల్–2020’ని బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ‘ప్రస్తుతం పురుగుమందుల వ్యాపారం ఇన్సెక్టిసైడ్ యాక్ట్ – 1968 నిబంధనల ప్రకారం జరుగుతోంది. ఆ నిబంధనలకు కాలం చెల్లింది. అందుకే కొత్త బిల్లును రూపొందించాం’ అని సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. రైతుల ప్రయోజనాలే ధ్యేయంగా, వారికి సురక్షితమైన, ప్రభావశీలమైన పురుగుమందులు అందించడం, నకిలీ పురుగుమందులను అరికట్టడం లక్ష్యంగా ఈ బిల్లు రూపొందిందన్నారు. ఆయా పురుగు మందులకు సంబంధించిన సమస్త సమాచారం డీలర్ల నుంచి రైతులకు అందేలా నిబంధనలు రూపొందించామన్నారు. అలాగే, సేంద్రియ పురుగుమందుల వాడకాన్ని ప్రోత్సహించే ప్రతిపాదనలను కూడా తాజా బిల్లులో చేర్చామన్నారు. నకిలీ రసాయన మందుల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు ఒక సెంట్రల్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. పెస్టిసైడ్స్ కంపెనీల నుంచి వసూలు చేసిన జరిమానాకు, అవసరమైతే కొంత కలిపి కేంద్రం ఆ ఫండ్‌ను ఏర్పాటు చేస్తుందన్నారు. పురుగుమందుల ప్రచారాన్ని క్రమబద్ధీకరించే ప్రతిపాదన కూడా తాజా బిల్లులో ఉందన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే పురుగుమందుల తయారీ సంస్థలకు రూ. 25 వేల నుంచి రూ. 50 లక్షల వరకు జరిమానా విధించే ప్రతిపాదనను ఆ ముసాయిదా బిల్లులో చేర్చారు. నిబంధనలను అతిక్రమించేవారికి జైలు శిక్షను ఐదేళ్లవరకు పెంచే ప్రతిపాదనను తాజా బిల్లులో చేర్చారు. -
‘మెడికల్’ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
న్యూఢిల్లీ: వివాదాస్పద నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) బిల్లుకు గురువారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. వైద్య విద్యకు సంబంధించి అతిపెద్ద సంస్కరణగా ప్రభుత్వం అభివర్ణిస్తున్న ఈ బిల్లులో.. అవినీతికి ఆలవాలంగా మారిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదనను పొందుపర్చారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వైద్యులు నిరసన తెలుపుతున్నారు. ఈ బిల్లును ‘ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం 1956’కు ప్రత్యామ్నాయంగా తీసుకువచ్చారు. అన్నాడీఎంకే వాకౌట్ చేయగా మూజువాణి ఓటుతో బిల్లును రాజ్యసభ ఆమోదించింది. లోక్‌సభలో ఇప్పటికే ఈ బిల్లు ఆమోదం పొందినప్పటికీ.. తాజాగా రెండు సవరణలకు లోక్‌సభ ఆమోదం తెలపాల్సి ఉన్న నేపథ్యంలో మరోసారి ఈ బిల్లు లోక్‌సభకు వెళ్లనుంది. బిల్లుపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్.. ‘నకిలీ వైద్యులకు అడ్డుకట్ట వేసేలా ఈ బిల్లు ఉంది. తప్పుడు వైద్య విధానాలకు పాల్పడేవారికి సంవత్సరం జైలుశిక్షతో పాటు, రూ. 5 లక్షల జరిమానా విధించే ప్రతిపాదన బిల్లులో ఉంది. ఇప్పటివరకు అలాంటివారికి ఎంసీఐ నామమాత్రపు జరిమానా మాత్రమే విధించేది’ అని తెలిపారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చిన మూడేళ్లలో నెక్ట్స్(నేషనల్ ఎగ్జిట్ టెస్ట్)ను నిర్వహించడం ప్రారంభిస్తామన్నారు. ఎన్ఎంసీలో రాష్ట్రాలకు సరైన ప్రాతినిధ్యం లేదన్న ఎంపీల విమర్శలపై స్పందిస్తూ.. మొత్తం 25 మంది సభ్యుల్లో 11 మంది రాష్ట్రాల ప్రతినిధులేనన్నారు. నెక్ట్స్గ్ పరీక్షను మెడికల్ పీజీ ఎంట్రన్స్ పరీక్షగా, అలాగే విదేశాల్లో ఎంబీబీఎస్ చేసినవారికి స్క్రీనింగ్ పరీక్షగా పరిగణిస్తామన్నారు. కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్ల(సీహెచ్‌పీ) వ్యవస్థను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిందని, అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఆ వ్యవస్థను అమలు చేస్తున్నాయని, భారత్ కూడా ఆ దిశగా వెళ్తోందని చెప్పారు. ఎన్‌ఎంసీలోని 25 మంది సభ్యుల్లో 21 మంది వైద్యులేనని, వారు సీహెచ్పీల అర్హతలను నిర్ణయిస్తారని హర్షవర్ధన్ వివరించారు. బిల్లును స్థాయీసంఘానికి పంపాలని తృణమూల్ కాంగ్రెస్ సహా పలు పార్టీల సభ్యులు డిమాండ్ చేశారు. వైద్య విద్య అభ్యసించని 3.5 లక్షలమంది నాన్ మెడికల్ సిబ్బందికి ఆధునిక వైద్యం అందించే వైద్యులుగా లైసెన్స్ ఇవ్వాలన్న ప్రతిపాదనను కాంగ్రెస్ సభ్యుడు ఆజాద్ వ్యతిరేకించారు. బిల్లులోని ముఖ్యాంశాలు ► ఇప్పటివరకు అమల్లో ఉన్న ఎంసీఐకి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. వందమందికిపైగా సభ్యులు ఉండే ఇందులో 70 శాతం మందిని ఎన్నుకుంటారు. ఇక కొత్తగా వచ్చిన ఎన్ఎంసీలో 25 మందే సభ్యులుగా ఉంటారు. వారిలో అత్యధికుల్ని కేంద్రమే నామినేట్ చేస్తుంది. ► కేంద్రం నియమించిన ఏడుగురు సభ్యులతో కూడిన సెర్చ్ కమిటీ ఎన్ఎంసీ చైర్ పర్సన్ పేరుని, తాత్కాలిక సభ్యుల పేర్లను సిఫారసు చేస్తుంది. ► కొత్త కమిషన్‌లో 8 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల్లో నలుగురు వైద్య విద్యకు సంబంధించిన వివిధ బోర్డుల అధ్యక్షులు ఉంటారు. మరో ముగ్గురిని ఆరోగ్యం, ఫా ర్మా, హెచ్ఆర్డీ శాఖలే సిఫారసు చేస్తాయి. ► ఎంసీఐ సమావేశం కావాలంటే వందమందికిపైగా ఉన్న సభ్యుల్లో 15 మంది హాజరైతే సరిపోయేది. వారు తీసుకున్న నిర్ణయాలు చెల్లుబాటు అయ్యేవి. జాతీయ వైద్య కమిషన్‌కు సంబంధించి 25 మందిలో 13 మంది హాజరైతేనే కీలక నిర్ణయాలు తీసుకోగలరు. ► ఎన్ఎంసీ సభ్యులందరూ విధిగా తమ ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించాలి. ► ఎంసీఐ కాలపరిమితి అయిదేళ్లయితే ఎన్ఎంసీ కాలపరిమితి నాలుగేళ్లు. తాత్కాలిక సభ్యులు రెండేళ్లకి ఒకసారి మారతారు. ► కమిషన్ చైర్మన్‌ను, అందులో సభ్యుల్ని తొలగించే అధికారం పూర్తిగా కేంద్రానిదే. ► ఎంబీబీఎస్, మెడికల్ పీజీకి సంబంధించి అన్ని ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిట్లీ 50 శాతం సీట్లలో ఫీజుల నియంత్రణ కమిషన్ చేతుల్లోనే ఉంటుంది. ► వైద్య విద్యలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి, మెడికల్ ప్రాక్టీస్ అనుమతికి సంబంధించి ఎంబీబీఎస్ చివరి ఏడాది నిర్వహించే పరీక్షనే అర్హతగా పరిగణిస్తారు. దీనిని నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్ట్స్) పేరుతో నిర్వహిస్తారు. విదేశాల్లో వైద్యవిద్య అభ్యసించిన విద్యార్థులు భారత్‌లో ప్రాక్టీస్ చేయాలంటే స్క్రీనింగ్ టెస్ట్‌కి హాజరుకావాలి. ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో వైద్యవిద్యనభ్యసించాలంటే ఇకపై నీట్‌తో పాటు గా నెక్ట్స్ పరీక్ష కూడా రాయాల్సి ఉంటుంది. ► దేశంలోని హోమియో, యునాని, ఆయుర్వేదం కోర్సులు చదివిన వారు కూడా ఒక బ్రిడ్జ్ కోర్సు ద్వారా అల్లోపతి వైద్యాన్ని చేయవచ్చు. -
‘జల వివాదాల’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: అంతర్ రాష్ట్ర జల వివాదాలను వేగంగా, ఓ క్రమపద్ధతిలో పరిష్కరించేందుకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ బుధవారం ఆమోదించింది. అంతర్ రాష్ట్ర నదీ జల వివాదాల (సవరణ) బిల్లు–2019 బిల్లును లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. బిల్లును కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రవేశపెడుతూ, వివిధ రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదాలను పరిష్కరించడంలో ప్రస్తుతం ఉన్న ట్రిబ్యునళ్లు విఫలమయ్యాయనీ, కాబట్టి పరిష్కార విధా నంలో మార్పు అవసరమన్నారు. ఓ కేసులో అయితే 33 ఏళ్లయినా వివాదాన్ని ట్రిబ్యునల్ పరిష్కరించలేకపోయిందని చెప్పారు. కోర్టులు లేదా ట్రిబ్యునళ్లు నీటిని సృష్టించలేవనీ, అందరూ జల సంరక్షణపై దృష్టిపెట్టాలని మంత్రి పేర్కొన్నారు. ప్రపంచంలోని జనాభాలో 18 శాతం మంది ఇండియాలోనే ఉన్నారనీ, కానీ ప్రపంచంలోని మంచి నీళ్లలో 4 శాతమే మన దేశంలో ఉండటంతో ఇది తీవ్ర సమస్యగా మారనుందని మంత్రి చెప్పారు. సభలో చర్చ సందర్భంగా కావేరీ జల వివాదంపై తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సభ్యులు వాగ్వాదానికి దిగడంతో స్పీకర్ ఓం బిర్లా వారిని సముదాయించారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీల సభ్యులు మాట్లాడుతూ, రాష్ట్రాలను సంప్రదించేలా ఈ బిల్లులో నిబంధనలు లేవనీ, ఇది సమాఖ్య వ్యవస్థపై దాడి అని అన్నారు. బిల్లులో ఏముంది?: అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం–1956ను సవరించేం దుకు కేంద్రం ఈ బిల్లును తెచ్చింది. వేర్వేరు ధర్మాసనాలతో ఒకే ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేయడం, వివాదాలను పరిష్కరించేందుకు ఓ కాలపరిమితి విధించి, కచ్చితంగా ఆ సమయంలోపు సమస్య పరిష్కారమయ్యేలా చూడటం ఈ బిల్లు ప్రత్యేకతలు. సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి ట్రిబ్యునల్‌కు నేతృత్వం వహిస్తారు. అవసరమైనప్పుడు ధర్మాసనాలను ఏర్పాటు చేస్తా రు. వివాదం పరిష్కారమయ్యాక అవి రద్దవుతాయి. గరిష్టంగా రెండేళ్లలోపు వివాదాన్ని ట్రిబ్యునల్ పరిష్కరించాల్సి ఉంటుంది. -
ఎన్ఎంసీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత వైద్య మండలి(ఎంసీఐ) స్థానంలో జాతీయ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ)ను ఏర్పాటు చేసే బిల్లుకు లోక్‌సభ సోమవారం ఆమోదం తెలిపింది. దీనివల్ల వైద్య విద్యారంగంలో పారదర్శకత ఏర్పడుతుందనీ, అనవసరమైన తనిఖీల ప్రహసనం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ బిల్లు ద్వారా దేశవ్యాప్తంగా వైద్యవిద్యలో ఏకీకృత విధానాలను తీసుకురానున్నారు. ఇందులోభాగంగా ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పరీక్షను పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి అర్హత పరీక్షగా పరిగణిస్తారు. అలాగే విదేశాల్లో ఎంబీబీఎస్ చదివి భారత్‌లో పీజీ కోర్సుల్లో చేరే విద్యార్థుల కోసం ఓ స్క్రీనింగ్ టెస్ట్‌ను నిర్వహించనున్నారు. ఈ స్క్రీనింగ్ పరీక్షకు నేషనల్ ఎగ్జిట్ టెస్ట్(నెక్టŠస్)గా నామకరణం చేశారు. ఎన్ఎంసీ చట్టం వల్ల ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాల్లో 50 శాతం సీట్లు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్) విద్యార్థులకు అందుతాయని ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన మూడేళ్ల లో నేషనల్ ఎగ్జిట్ టెస్ట్‌ను నిర్వహిస్తామన్నారు. పోంజి బిల్లుకు ఆమోదం: చిట్‌ఫండ్ పేరుతో జరుగుతున్న మోసాలను అరికట్టే ‘అనియంత్రిత డిపాజిట్ స్కీంల నిషేధ’ బిల్లును సోమవారం పార్లమెంట్ ఆమోదించింది. పేద డిపాజిటర్ల సొమ్ముకు రక్షణ కల్పించడం, వసూలు చేసిన డబ్బును తిరిగిచ్చేలా చూడటం ఈ బిల్లు ఉద్దేశం. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే చట్ట విరుద్ధంగా వసూళ్లకు పాల్పడిన వారికి జరిమానా, జైలుశిక్ష పడనున్నాయి. ఈ విషయమై ఆర్థికమంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ..‘ ‘చట్టంలోని లొసుగుల ఆధారంగా కొందరు వ్యక్తులు నిరుపేదలకు భారీవడ్డీ ఆశచూపి నగదును వసూలుచేస్తున్నారు. తాజా బిల్లులో పోంజి పథకంతో పాటు స్నేహితులు, పరిచయస్తులు, బంధువుల నుంచి వసూలు చేసే రియల్‌ఎస్టేల్ సంస్థలపైనా చర్యలు తీసుకునేలా నిబంధనలు చేర్చాం. సంబంధిత వ్యక్తులకు ఏడా ది నుంచి పదేళ్ల వరకు జైలుశిక్షతో పాటు రూ.2 లక్షల నుంచి రూ.50 కోట్ల వరకు జరిమానా విధించవచ్చు. పోంజి స్కీమ్‌లకు సంబంధించి దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 978 కేసులు నమోదు కాగా, వీటిలో 326 కేసులో పశ్చిమబెంగాల్లోనే నమోదయ్యాయి’ అని తెలిపారు. ఈ బిల్లును లోక్‌సభ జూలై 24న ఆమోదించింది. ‘ఉన్నావ్’ ప్రమాదంపై సభలో రగడ.. ఉన్నావ్ రేప్ బాధితురాలి కారును ఓ లారీ అనుమానాస్పద రీతిలో ఢీకొట్టడంపై ప్రతిపక్షాల ఆందోళనలతో రాజ్యసభ దద్దరిల్లింది. ఎస్పీ నేత రామ్‌గోపాల్ యాదవ్ మాట్లాడుతూ.. బాధితురాలిని చంపే ప్రయత్నం జరిగింద ఆరోపించారు. ప్రతిపక్ష సభ్యులు యాదవ్‌కు మద్దతుగా నినాదాలు చేయడంతో రాజ్యసభ మధ్యాహ్నానికి వాయిదాపడింది. -
‘ఉగ్ర’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న వ్యక్తులను ఉగ్రవాదులుగా నిర్ధారించేలా చట్టానికి సవరణలు చేసేందుకు ప్రభుత్వం తెచ్చిన బిల్లును లోక్‌సభ బుధవారం ఆమోదించింది. ఈ సవరణలపై ప్రతిపక్షాలు వ్యతిరేకత వ్యక్తం చేయగా, ప్రభుత్వ నిర్ణయాన్ని హోం మంత్రి అమిత్ షా గట్టిగా సమర్థించారు. ఉగ్రవాదుల కన్నా దర్యాప్తు సంస్థలు నాలుగడుగులు ముందుండాలంటే ఈ సవరణలు కచ్చితంగా అవసరమేనని ఆయన పేర్కొన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (సవరణ బిల్లు)–2019పై లోక్‌సభలో జరిగిన చర్చలో అమిత్ షా మాట్లాడారు. ఈ బిల్లుపై ఓటింగ్‌లో పాల్గొనకుండా ప్రతిపక్ష కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులంతా బయటకు వెళ్లిపోవడంపై అమిత్ షా స్పందిస్తూ ‘మీ ఓటు బ్యాంకును కాపాడుకోడానికి మీరు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. అందుకే ఓటింగ్‌కు దూరంగా వెళ్లిపోతున్నారు. దీనికి మేం ఏం చేయగలం?’ అన్నారు. సవరణ బిల్లుకు ప్రతిపక్ష సభ్యులు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. ఈ చట్టంతో సమాఖ్య వ్యవస్థను నాశనం చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం అనడంపై అమిత్ షా స్పందిస్తూ ‘సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాన్ని 1967లో నాటి ప్రధాని ఇందిర ప్రభుత్వమే తెచ్చింది. అంటే సమాఖ్య స్ఫూర్తి కాంగ్రెస్ వల్లే, ఆనాడే దెబ్బతిన్నది’ అంటూ ఎదురుదాడి చేశారు. ఈ చట్టానికి తెచ్చిన సవరణలను, చట్టాన్ని తాము దుర్వినియోగం చేయబోమనీ, కేవలం ఉగ్రవాదాన్ని వేళ్లతో సహా పెకలించేందుకే దీనిని ఉపయోగిస్తామని ఆయన తెలిపారు. అలాగే కొంతమంది వ్యక్తులు సిద్ధాంతాల పేరుతో పట్టణ మావోయిజాన్ని ప్రోత్సహిస్తున్నారనీ, అలాంటి వారిపై ప్రభుత్వం ఎంతమాత్రమూ దయ చూపదని అమిత్ షా స్పష్టం చేశారు. ఒవైసీ ఒత్తిడితో నాటకీయ పరిణామాలు సవరణ బిల్లును ఆమోదించడానికి ఓటింగ్ జరపాలంటూ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పట్టుబట్టడంతో సభలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వం తెచ్చిన సవరణలను వ్యతిరేకిస్తూ అప్పటికే వివిధ ప్రతిపక్ష పార్టీలు బయటకు వెళ్లిపోయాయి. ప్రతిపక్ష సభ్యుల్లో చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. ఇలాంటి సమయంలోనూ బిల్లును ఆమోదించడానికి ముందు ఓటింగ్ నిర్వహించాలని ఒవైసీ డిమాండ్ చేశారు. దీంతో ఆయన అనవసరంగా సభా సమయాన్ని వృథా చేస్తున్నారంటూ ఇతర సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఒవైసీ దూకుడుగా సమాధానమిస్తూ ‘ఓటింగ్ కోరడం నా హక్కు. అభ్యంతరం తెలపడానికి, అడ్డుకోవడానికి మీరెవరు?’ అని అన్నారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా ఈ బిల్లుపై ఓటింగ్ నిర్వహించారు. 287 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటేయగా, 8 మంది వ్యతిరేకించారు. ప్రతిపక్ష సభ్యులు ప్రతిపాదించిన సవరణలపై కూడా ఓటింగ్ నిర్వహించాలని ఒవైసీ పట్టుబట్టగా..నిబంధనలను ప్రస్తావిస్తూ సభ్యులను నిల్చోబెట్టి సమర్థిస్తున్న వారెంత మంది, వ్యతిరేకిస్తున్న వారెంత మంది అని స్పీకర్ లెక్కించారు. అనంతరం బిల్లు ఆమోదం పొందింది. అనంతరం ఒవైసీ మాట్లాడుతూ ‘నేను ప్రభుత్వం మొత్తాన్నీ నిల్చొనేలా చేశాను’ అని వ్యాఖ్యానించగా, ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ‘ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడేందుకు మేం సిద్ధమే. ఇప్పుడూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిల్చున్నాం’ అని అన్నారు. సవరణ బిల్లులో ఏముంది? ‘ఉగ్రవాద, వినాశక కార్యకలాపాల నిరోధక చట్టం’ (టాడా), ‘ఉగ్రవాద నిరోధక చట్టం’ (పొటా)లకు మార్పులు చేస్తూ ఈ ‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (సవరణ)’ బిల్లులను కేంద్రం తెచ్చింది. ఈ సవరణలు ఏం చెబుతున్నాయంటే.. ► ఉగ్రవాదానికి పాల్పడిన లేదా ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొన్న, ఉగ్రవాద హింసాకాండకు ఏర్పాట్లు చేసిన, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన, ఉగ్రవాదానికి ఇతరత్రా సహకారం అందించిన వ్యక్తులు, సంస్థలను ఈ చట్టం కింద ఉగ్రవాదులుగా లేదా ఉగ్రవాద సంస్థలుగా కేంద్రం ప్రకటించవచ్చు. ► ప్రస్తుత చట్టం ప్రకారం ఉగ్రవాద కేసులను దర్యాప్తు చేసే అధికారి.. నిందితుల ఆస్తులను జప్తు చేయాలంటే ముందుగా పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) అనుమతి తీసుకోవలసి ఉంది. తాజా సవరణల ప్రకారం.. కేసులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారి దర్యాప్తు చేస్తున్న పక్షంలో ఆస్తుల జప్తుకోసం డీజీపీ అనుమతి కాకుండా, ఎన్ఐఏ డీజీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అదే కేసులను పోలీసులే దర్యాప్తు చేస్తుంటే డీజీపీ అనుమతి అవసరం. ► ప్రస్తుత చట్టం ప్రకారం ఉగ్రవాద కేసులను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ), అసిస్టెంట్ పోలీసు కమిషనర్ (ఏసీపీ), పై స్థాయి అధికారులు మాత్రమే దర్యాప్తు చేయాలి. తాజా సవరణల ప్రకారం ఎన్ఐఏలోని ఇన్స్పెక్టర్ లేదా ఆ పై స్థాయి అధికారులు కూడా దర్యాప్తు చేపట్టవచ్చు. ► ప్రస్తుత చట్టానికి అనుబంధంగా తొమ్మిది అంతర్జాతీయ ఒప్పందాలు ఉన్నాయి. ఆ ఒప్పందాల పరిధిలోకి వచ్చే కార్యకలాపాలను ఉగ్రవాద చర్యలుగా నిర్ణయిస్తున్నారు. ప్రస్తుత సవరణ కింద ఆ ఒప్పందాలతో పాటుమరో ఒప్పందాన్ని(ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఫర్ సప్రెషన్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ న్యూక్లియర్ టెర్రరిజం–2005) కూడా చేర్చారు. ఇక నుంచి ఈ పది ఒప్పందాల పరిధిలోకి వచ్చే కార్యకలాపాలను ఉగ్రవాద కార్యకలాపాలుగా పేర్కొంటారు. నేడు లోక్‌సభకు ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్‌సభలో గురువారం ఆమోదించాల్సిన బిల్లుల జాబితాలో వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లును కూడా కేంద్రం చేర్చింది. ఆ సమయంలో కచ్చితంగా సభలో ఉండాలంటూ తమ ఎంపీలకు అధికార బీజేపీ ఇప్పటికే విప్ కూడా జారీ చేసింది. ఉన్నట్టుండి, ఏకకాలంలో ముమ్మారు తలాక్ చెప్పి భార్యలకు విడాకులిచ్చే ముస్లిం పురుషులను జైలుకు పంపేలా ఈ బిల్లులో నిబంధనలు ఉన్నాయి. కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ తదితర ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ బిల్లును పరిశీలన కోసం పార్లమెంటరీ కమిటీకి పంపాల్సిందేనని పట్టుబడుతున్నాయి. దీంతో తనకున్న భారీ సంఖ్యబలంతో లోక్‌సభలో కేంద్రం ఈ బిల్లును ఆమోదింపజేసుకున్నా, రాజ్యసభలో మాత్రం ప్రభుత్వానికి తిప్పలు తప్పేలా లేవు. పార్లమెంటు సమాచారం ► ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమని న్యాయశాఖ మంత్రి రవి శంకర్‌ప్రసాద్ లోక్‌సభలో తెలిపారు. న్యాయ శాఖ పరిధిలోని టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వరంగ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాత్రమే వీటిని తయారుచేస్తున్నాయని స్పష్టం చేశారు. ► పశ్చిమ బెంగాల్ పేరును ‘బంగ్లా’గా మార్చేందుకు రాజ్యాంగానికి సవరణ చేసే ప్రతిపాదన ఏదీ లేదని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ రాజ్యసభలో చెప్పారు. రాష్ట్రాల పేర్లు మార్చాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని ఆయన అన్నారు. బంగ్లా పేరు బంగ్లాదేశ్‌కు దగ్గరగా ఉన్నందున, పేరు మార్చడాన్ని కేంద్రం తిరస్కరిస్తోందన్నారు. ► కశ్మీర్ యువత ఉగ్రవాదంవైపు వెళ్లడం 40 శాతం తగ్గిందని హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి రాజ్యసభలో వెల్లడించారు. సరిహద్దు చొరబాట్లు 43 శాతం, ఉగ్ర చర్యలు 28 శాతం తగ్గాయన్నారు. యూపీఏ –2లో పోలిస్తే మావోయిస్టుల దాడులు 43 శాతం తగ్గాయని వెల్లడించారు. ► మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి, సంఘపరివార్ నేత శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్‌ల మృతిపై ప్రత్యేక విచారణ జరిపే ఆలోచనేదీ లేదని మంత్రి కిషన్‌రెడ్డి రాజ్యసభలో తెలిపారు. ► భారత్‌తో సరిహద్దు పంచుకుంటున్న చైనా, నేపాల్, భూటాన్ సరిహద్దుల్లో కంచె నిర్మించే ప్రతిపాదనేమీ లేదని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ రాజ్యసభలో తెలిపారు. భద్రతా చర్యలు పక్కాగా తీసుకుంటుండడంతో సరిహద్దు చొరబాట్లు పూర్తిగా తగ్గిపోయాయన్నారు. ఇండో–పాక్ సరిహద్దులో 2069 కిలోమీటర్లకుగాను 2004 కిలోమీటర్ల కంచె పూర్తయిందన్నారు. ఇండో–బంగ్లా సరిహద్దులో 3326 కిలోమీటర్లకుగాను 2803 కిలోమీటర్ల కంచె పూర్తయిందని వెల్లడించారు. ► మూడేళ్లలో ఇస్రో వాణిజ్య విభాగం ద్వారా 239 శాటిలైట్లను ప్రయోగించి, రూ. 6,289 కోట్లు ఆర్జించినట్లు ప్రధానమంత్రి కార్యాలయంలో సహాయమంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో తెలిపారు. ► భారత స్వతంత్ర సమరయోధుడు నేతాజీకి సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని రష్యా వెల్లడించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ లోక్‌సభలో తెలిపారు. 2014 నుంచి ఈ విషయమై రష్యాను అడుగుతూనే ఉన్నామని ఆయన తెలిపారు. ► విదేశాల్లో ఉంటున్న భారతీయుల సమస్యలను తీర్చడానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ లోక్‌సభలో తెలిపారు. విదేశాల్లో ఉంటున్న భారతీయులు 2015 ఫిబ్రవరి నుంచి 2019 జూలై 18 వరకు 50,605 సమస్యలను నమోదు చేసుకోగా 44,360 సమస్యలను (దాదాపు 90 శాతం) తీర్చామన్నారు. అందులో 36,805 సమస్యలు గల్ఫ్ దేశాల నుంచే వచ్చాయన్నారు. ఎమ్‌ఏడీఏడీ పోర్టల్ ద్వారా సమస్యలను నమోదు చేయవచ్చన్నారు. -
ఎన్‌హెచ్చార్సీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: దేశంలో మానవ హక్కులను అనుక్షణం పరిరక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన మానవ హక్కుల పరిరక్షణ(సవరణ)బిల్లు –2019 బిల్లుకు సభ ఆమోదం లభించింది. ఈ సందర్భంగా హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మాట్లాడుతూ.. మానవ హక్కులను అనునిత్యం కాపాడేందుకు అన్ని చర్యలను తీసుకుంటున్నామన్నారు. జాతీయ, రాష్ట్రాల మానవ హక్కుల సంఘాలకు మరిన్ని పరిపాలన, ఆర్థిక అధికారాలను కల్పించినట్లు తెలిపారు. ఈ బిల్లులో ప్రభుత్వం కొన్ని కీలక ప్రతిపాదనలు చేసింది. ఎన్‌హెచ్చార్సీ తోపాటు రాష్ట్ర మానవ హక్కుల సంఘాల చైర్పర్సన్, సభ్యుల పదవీ కాలం ప్రస్తుతమున్న ఐదేళ్లకు బదులు ఇకపై మూడేళ్లకే పరిమితం కానుంది. ఎన్‌హెచ్చార్సీ చైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు రిటైర్డు ప్రధాన న్యాయమూర్తినే నియమించాలనే నిబంధనను ప్రభుత్వం సడలించింది. ఇకపై సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జినీ నియమించవచ్చని ప్రతిపాదించింది. జాతీయ మైనారిటీల కమిషన్ నుంచి ఎన్‌హెచ్చార్సీ చైర్‌పర్సన్‌ను నియమించాలన్న ఏఐఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్‌కు మంత్రి స్పందిస్తూ.. ఓబీసీ జాబితాలో మైనారిటీలను చేర్చే నిబంధన ఈ బిల్లులో ఉందన్నారు. అధికార పార్టీ ఎంపీలను ఎన్‌హెచ్చార్సీలో ఎందుకు నియమించాలని అనుకుంటున్నారని ఒవైసీ ప్రశ్నించారు. ఎన్సీపీ సభ్యురాలు సుప్రియా సూలే మాట్లాడుతూ.. ఒక వైపు శాంతి కావాలంటూనే ఎన్‌హెచ్చార్సీ ఆదేశాలను సవాల్ చేసే పరిస్థితులున్నాయని, ఈ బిల్లుపై సభలో మరోసారి మరింత చర్చ జరగాల్సి ఉందని పేర్కొన్నారు. కర్ణాటకలో ప్రజాస్వామ్యం ఖూనీ కర్ణాటకలో చట్టసభ స్వతంత్రత ప్రమాదంలో పడిందని, ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని కాంగ్రెస్ శుక్రవారం లోక్‌సభలో ఆందోళనకు దిగింది. కర్ణాటకలో రాజకీయ సంక్షోభం, అక్కడి పరిణామాలపై చర్చ జరగాలంటూ కాంగ్రెస్, డీఎంకే సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ప్లకార్డులతో నిరసన తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, న్యాయాన్ని కాపాడాలంటూ వారు నినాదాలు చేశారు. వారి డిమాండ్‌పై స్పీకర్ ఓం బిర్లా సానుకూలంగా స్పందించడంతో ఆందోళన విరమించారు. -
ఉందిలే మంచి కాలం
అమెరికాలో శాశ్వత నివాసం కోసం కలలు కంటూ ఉద్యోగాల ఆధారిత గ్రీన్ కార్డు కోసం దశాబ్దాల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులకు ఇది శుభవార్త. గ్రీన్‌కార్డులను ఒక్కో దేశానికి గరిష్టంగా ఏడు శాతం మాత్రమే మంజూరు చేయాలన్న కోటా పరిమితిని ఎత్తివేసే బిల్లుకి అమెరికా ప్రతినిధుల సభ బుధవారం ఆమోద ముద్ర వేసింది. ‘ఫెయిర్‌నెస్ ఫర్ హై స్కిల్డ్ ఇమిగ్రెంట్స్ యాక్ట్ ఆఫ్ 2019 (హెచ్ఆర్ 1044)’ బిల్లుకు సభలో అనూహ్యమైన మద్దతు లభించింది. మొత్తం 435 మంది సభ్యులకుగాను 365 మంది అనుకూలంగా ఓటు వేస్తే, 65 మంది వ్యతిరేకించారు. జోలాఫ్రెన్, కెన్‌బర్గ్‌లు గత ఫిబ్రవరిలో ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు ద్వారా కుటుంబాల ప్రాతిపదికన వలస వీసా కోటాను ఏడు నుంచి 15శాతానికి పెంచడంతో వలసదారులకు భారీగా ఊరట లభిస్తోంది. సెనేట్‌లోనూ ఈ బిల్లుకి ఆమోద ముద్ర పడాల్సి ఉంది. గ్రీన్ కార్డు బిల్లు కాంగ్రెస్ ఆమోదం పొందితే భారత్ వంటి దేశాల నుంచి తక్కువ వేతనాలకే నిపుణులైన ఉద్యోగుల్ని అమెరికా కంపెనీలు నియమిస్తాయని, దీని వల్ల అమెరికాలో మధ్యతరగతికి ఎక్కువగా నష్టం జరుగుతుందని బిల్లును వ్యతిరేకిస్తున్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనోళ్లకే భారీగా ప్రయోజనం గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో భారతీయులే 6 లక్షల మందికి పైగా నిరీక్షణ జాబితాలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న వలస విధానమే కొనసాగితే ఇండియా వంటి అధిక జనాభా కలిగిన దేశాల వారు గ్రీన్ కార్డు కోసం 151 ఏళ్లు ఎదురు చూడాల్సి వస్తుందని క్యాటో ఇనిస్టిట్యూట్ వంటి సంస్థలు అంచనా వేశాయి. అధికంగా గ్రీన్‌కార్డు లభించిన దేశాల్లో చైనా ముందుంది. బిల్లు చట్టంగా మారితే 3 లక్షల మంది భారతీయులకు ప్రయోజనం చేకూరనుంది. దరఖాస్తు చేసుకున్న భారతీయుల్లో ఇప్పటివరకు ప్రతిఏటా 25శాతం మందికే గ్రీన్‌కార్డులు మంజూరవుతూ వచ్చాయి. ఓ భార్య కల ఫలించిన వేళ రెండేళ్ల క్రితం అమెరికాలోని కన్సాస్‌లో జాతి వివక్షకు బలైపోయిన తెలంగాణ టెక్కీ కూచిభట్ల శ్రీనివాస్ భార్య సునయన గ్రీన్‌కార్డు బిల్లుకి గట్టిగా మద్దతు కూడగట్టడంలో విజయం సాధించారు. 2017 ఫిబ్రవరిలో కన్సాస్ రెస్టారెంట్లో శ్రీనివాస్‌ను కొందరు దుండగులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. భర్త మరణించాక కూడా అమెరికాలోనే ఉండాలనుకున్న సునయన దూమల ఎన్నో కష్టనష్టాలు అనుభవించారు. తాత్కాలిక వీసా మీదే ఆమె ఇన్నాళ్లూ అమెరికాలో ఉంటూ పనిచేస్తున్నారు. ఈ వీసాల కోసం కంపెనీ యాజమాన్యాల దయాదాక్షిణ్యాల మీదే భారతీయులు ఆధారపడాల్సిన పరిస్థితి. దీంతో గ్రీన్‌కార్డు బిల్లు చట్టరూపం దాల్చడానికి సునయన తన వంతు ప్రయత్నాలు చేశారు. పలుమార్లు వాషింగ్టన్ వెళ్లి న్యాయ నిపుణులతో, ప్రవాస భారతీయ సంఘాలతో సంప్రదింపులు జరిపారు. -
ఆర్థిక నేరగాళ్ల బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: బడా ఆర్థిక నేరగాళ్లు దేశం విడిచి పారిపోకుండా అడ్డుకునేందుకు ఉద్దేశించిన బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. ‘పరారీ ఆర్థిక నేరగాళ్ల బిల్లు–2018’ను లోక్‌సభ గత గురువారమే ఆమోదించగా, రాజ్యసభ బుధవారం ఈ బిల్లుకు మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. తాత్కాలిక ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ చట్టాలను తప్పించుకుని దేశాన్ని విడిచి పారిపోతున్న ఆర్థిక నేరగాళ్ల సంఖ్య పెరిగిపోతోందనీ, దీనిని అడ్డుకోవాల్సి ఉందని అన్నారు. ప్రస్తుత చట్టాలతో ఆ పనిని సమర్థంగా చేయలేకపోతున్నామన్నారు. వంద కోట్ల రూపాయల కన్నా ఎక్కువ మొత్తంలో మోసం చేసిన వ్యాపారవేత్తలకే ఈ బిల్లులోని నిబంధనలు వర్తిస్తాయి. ‘నేరగాళ్లు పారిపోకుండా ఆపేందుకు సమర్థమైన, వేగవంతమైన, రాజ్యాంగబద్ధమైన విధానాన్ని ఈ బిల్లు ద్వారా తీసుకొచ్చాం’ అని గోయల్ తెలిపారు. ప్రస్తుత చట్టాల ప్రకారం నేరగాళ్లు కోర్టు ముందు హాజరుకానంత వరకు వారి ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. ఇప్పటికే ఎన్నో చట్టాలు ఉన్నా ప్రభుత్వ సహకారంతోనే విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి ఆర్థిక నేరగాళ్లు దేశాలు దాటి తప్పించుకుపోయారని విపక్షాలు ఆరోపించాయి. ప్రధాని మోదీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌లపై కాంగ్రెస్ సభ్యులు ఇచ్చిన సభా హక్కుల నోటీసులు తన పరిశీలనలో ఉన్నాయని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చెప్పారు. -
‘రియల్’ బిల్లుకు ఆమోదం
ప్రత్యేక ఖాతాలో 70% ప్రాజెక్టు వ్యయం డిపాజిట్ చేయాలన్న నిబంధనకు అంగీకారం కేంద్ర కేబినెట్ నిర్ణయం న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ డెవలపర్లు నిర్మాణ ప్రాజెక్టు వ్యయంలో 70 శాతాన్ని ప్రత్యేక ఎస్క్రొ ఖాతాలో(మూడో వ్యక్తి నియంత్రణలో ఉండే తాత్కాలిక అకౌంట్) డిపాజిట్ చేయాలన్న నిబంధనకు సంబంధించిన ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ మేరకు రియల్ ఎస్టేట్(నియంత్రణ, అభివృద్ధి) బిల్లు, 2015లో సవరణ చేయనున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ బిల్లులో ఈ నిబంధన ఉండాలన్న కాంగ్రెస్, సీపీఎం పార్టీల డిమాండ్‌కు మోదీ ప్రభుత్వం అంగీకరించినట్లైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేబినెట్ రియల్ ఎస్టేట్ బిల్లులోని ఈ ప్రతిపాదనతో పాటు పలు ఇతర ప్రతిపాదనలకు అంగీకారం తెలిపింది. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ, రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో పారదర్శకత, ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో కచ్చితత్వం, వివాదాల పరిష్కారాల్లో వేగం.. మొదలైనవి లక్ష్యాలుగా ఈ ‘రియల్’ బిల్లును రూపొందించారు. ఎస్క్రొ అకౌంట్లో కనీసం 50% ప్రాజెక్టు వ్యయాన్ని డిపాజిట్ చేయాలన్న రాజ్యసభ సెలెక్ట్ కమిటీ సిఫారసు చేయగా, 70% ప్రాజెక్టు వ్యయాన్ని డిపాజిట్ చేయాలని కేబినెట్ నిర్ణయించడం విశేషం. కాంగ్రెస్ డిమాండ్ నెరవేరినందున ఈ సమావేశాల్లోనే ఈ బిల్లు ఆమోదం పొందే అవకాశముంది. నిర్మాణ రంగంలోకి దేశీ, విదేశీ నిధులు తరలివచ్చేందుకు అవకాశం కల్పించే పలు ప్రతిపాదనలకు ఈ బిల్లులో స్థానం కల్పించారు. పెరిగిన ప్రైవేటు భాగస్వామ్యంతో ‘అందరికీ ఇల్లు’ అనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని చేరేందుకు కూడా ఇది దోహదపడుతుంది. గృహనిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి వెంకయ్యనాయుడు నేతృత్వంలో ఈ బిల్లులో సవరణలను రూపొందించారు. కనీసం 500 చదరపు మీటర్లు లేదా 8 ఫ్లాట్ల నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టులను నిర్మాణ రంగ నియంత్రణ సంస్థల వద్ద రిజిస్టర్ చేసుకోవాలన్న ప్రతిపాదన కూడా వాటిలో ఒకటి. గతంలో ఇది వెయ్యి చదరపు మీటర్లు లేదా 12 ఫ్లాట్లుగా ఉండేది. ఈ నిబంధన వల్ల కొనుగోలుదారులకు రక్షణ లభిస్తుంది. ఈ బిల్లు ద్వారా రియల్ ఎస్టేట్ రంగ ఏకీకృత నియంత్రణకు అవకాశం లభిస్తుంది. హ్యాపీనే కానీ.. రియల్ ఎస్టేట్ నియంత్రణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడాన్ని నిర్మాణ రంగ పరిశ్రమ స్వాగతించింది. అయితే, ప్రతిపాదిత చట్టంలో నిర్మాణ రంగ ప్రాజెక్టులకు అనుమతులను ఇచ్చే ప్రభుత్వ విభాగాలను కూడా భాగస్వాములను చేయాలని డిమాండ్ చేసింది. ‘బిల్లులోని కొన్ని సమస్యలను పరిష్కరించాలి. లేదంటే ప్రాజెక్టు పూర్తి కావడంలో మరింత జాప్యం జరిగే అవకాశముంది’ అని క్రెడాయి అధ్యక్షుడు గెతంబర్ ఆనంద్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టులకు ఈ ప్రతిపాదిత చట్టాన్ని వర్తింపచేయకూడదని సూచించారు. ఈ చట్టంతో రియల్ రంగంలో పారదర్శకతకు వీలవుతుందని నేరిడ్కో అధ్యక్షుడు ప్రవీణ్ జైన్ పేర్కొన్నారు. కేబినెట్ తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు.. పప్పు ధాన్యాల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో 1.5 లక్షల టన్నులతో ఈ ఏడాదే ఒక ఆపద్ధర్మ నిల్వ(బఫర్ స్టాక్)ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పప్పు ధాన్యాల రిటైల్ రేట్లను నియంత్రణలో ఉంచేందుకు ఈ బఫర్ స్టాక్ ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) ఈ నిర్ణయం తీసుకుంది. ధరలను అదుపులో ఉంచేందుకు అవసరమైతే, పప్పుధాన్యాలను దిగుమతి చేసుకునేందుకు కూడా సీసీఈఏ అనుమతించింది. ఆహార ధాన్యాలు, పంచదారను ప్యాక్ చేసేందుకు జనపనార బస్తాలను ఉపయోగించాలి. ఈ నిర్ణయం వల్ల 3.7 లక్షల జౌళి మిల్లు కార్మికులకు లబ్ధి చేకూరుతుంది. అదనంగా 106 అంతర్గత జల రవాణా మార్గాలకు జాతీయ జల రవాణా మార్గాలుగా మార్చేందుకు చట్టం చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదం. జాతీయ జలరవాణా మార్గాల బిల్లు-2015లో అధికారిక సవరణలకు అంగీకారం. బిల్లులోని ముఖ్యాంశాలు... వాణిజ్య, గృహ సంబంధ ప్రాజెక్టులకు ఈ బిల్లు వర్తిస్తుంది. రియల్ రంగ లావాదేవీల నియంత్రణ కోసం రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రత్యేక రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలను ఏర్పాటు చేయాలి. ఈ అథారిటీ వద్ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, ఏజెంట్లు రిజిస్టర్ చేసుకోవాలి. {పాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడి చేయాలి. వాటిలో ప్రమోటర్ వివరాలు, లేఔట్ ప్లాన్, భూమి స్థితి, అనుమతులు, ఒప్పందాలు, ఏజెంట్లు, కాంట్రాక్టర్ల వివరాలు ఉండాలి. అప్పిలేట్ ట్రిబ్యునళ్ల ఆదేశాలను ఉల్లంఘిస్తే ప్రమోటర్లకు మూడేళ్ల వరకు, ఏజెంట్లకు ఏడాది వరకు జైలుశిక్ష అప్పిలేట్ ట్రిబ్యునళ్లు 60 రోజుల్లోగా కేసును పరిష్కరించాలి. నియంత్రణ సంస్థలు ఫిర్యాదులను రెండు నెలల్లోగా పరిష్కరించాలి. -
బాలనేరస్థుల బిల్లుకు ఆమోదం
హేయమైన నేరాలకు పాల్పడిన 16-18 ఏళ్ల బాలలకు పెద్దల చట్టాల వర్తింపు జీవితఖైదు, మరణశిక్షల నుంచి మినహాయింపు న్యూఢిల్లీ: పదహారేళ్ల వయసున్న బాలనేరస్థులను వయోజనుల చట్టాల ప్రకారం విచారించేందుకు ఉద్దేశించిన బిల్లుకు గురువారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. 16 నుంచి 18 ఏళ్ల వయసు మధ్యలో ఉండి.. క్రూరమైన నేరాలకు పాల్పడే బాలలు పెద్దలు ఎదుర్కొనే శిక్షలను ఎదుర్కోవలసి ఉంటుంది. దేశరాజధానిలో 2012నాటి నిర్భయ అత్యాచార ఉదంతంలో 16 ఏళ్ల నిందితుడి పాత్ర ఉన్న నేపథ్యంలో ఈ చట్టాన్ని సవరించాలన్న ప్రతిపాదన ముందుకు వచ్చింది. అయితే అమాయక పిల్లల హక్కులకు భంగం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మనేకా గాంధీ సభ్యులకు తెలిపారు. క్రూరమైన నేరగాళ్లకు.. సాధారణ పిల్లలకు మధ్య సంతులనం పాటించామని ఆమె చెప్పారు. ప్రభుత్వం తరపున మొత్తం 42 సవరణలు సభలో ప్రతిపాదించారు. వీటన్నింటినీ లోక్‌సభ ఆమోదించింది. విపక్ష నాయకుడు శశిథరూర్(కాంగ్రెస్) ఎన్కే ప్రేమ్‌చంద్రన్(ఆర్ఎస్పీ) వంటి వారు ప్రతిపాదించిన సవరణలను సభ తిరస్కరించింది. ఈ సందర్భంగా మనేకాగాంధీ మాట్లాడుతూ‘‘దేశ వ్యాప్తంగా 28వేల మంది బాలలు 2013లో రకరకాల నేరాలకు పాల్పడినట్లు జాతీయ నేర రికార్డుల బ్యూరో తెలిపింది. వీరిలో 3887మంది అత్యంత క్రూరమైన నేరాలకు పాల్పడ్డారు. అందుకే చట్టాన్ని సమీక్షించాల్సిన అవసరాన్ని సుప్రీం కోర్టు కూడా నొక్కిచెప్పింది’’ అని అన్నారు. పార్టమెంటరీ స్థాయీసంఘం సిఫార్సులను పట్టించుకోలేదన్న విపక్షాల వాదనను మంత్రి ఖండించారు. స్థాయీ సంఘం చేసిన 13 సిఫార్సులలో 11 సిఫార్సులను ఆమోదించామన్నా రు. పేదలు, ఆదివాసీ బాలల విషయంలో ఈ చట్టం దుర్వినియోగమయ్యే అవకాశముందన్న ఆరోపణల్ని కూడా మనేకా కొట్టిపారేశారు. దేశంలో ఎక్కువ నేరాలు పేదలు, ఆదివాసీలకు వ్యతిరేకంగానే అవుతున్నాయని వారికి న్యాయం చేసేందుకే కృషి చేసామన్నారు. చట్టంలోని ప్రధానాంశాలు.. కొత్త చట్టంలో బాలనేరస్థులకు జీవితఖైదు కానీ, మరణ శిక్ష కానీ ఉండదు. 16-18 ఏళ్ల చేసే బాలలు చేసే నేరాలను సాధారణ, తీవ్రమైన, హేయమైన నేరాలుగా వర్గీకరించారు. వీటి విచారణ విధానాలను కూడా వేర్వేరుగా నిర్వచించారు. హేయమైన నేరాలను పెద్దల చట్టాల ప్రకారం విచారిస్తారు. ఏ బాల నేరస్థుడైనా సరే, వారికి ఎలాంటి శిక్ష పడినా 21ఏళ్ల వయసు వచ్చేంత వరకూ బాలనేరస్థుల శిక్షణాలయం(బోర్స్టల్)లోనే ఉంచుతారు. 21ఏళ్ల తరువాత వారి ప్రవర్తనను అంచనా వేస్తారు. పరివర్తన వచ్చిందని భావిస్తే శిక్షలో మార్పు చేయవచ్చు ప్రవర్తన సరిగా లేకపోతే శిక్షను కొనసాగించవచ్చు. కాలం చెల్లిన చట్టాలకు చెల్లు: 32 కాలం చెల్లిన చట్టాలను రద్దు చేస్తూ కేంద్రం ప్రతిపాదించిన బిల్లుకు గురువారం లోక్‌సభ ఆమో దం తెలిపింది. ఈ బిల్లు గత శీతాకాల సమావేశాల్లోనే లోక్‌సభ, రాజ్యసభల్లో ఆమోదం పొం దింది. అయితే కొన్ని సాంకేతిక సవరణలతో తిరిగి దిగువసభకు వచ్చింది. కేంద్ర న్యాయశాఖమంత్రి డీవీ సదానందగౌడ ప్రతిపాదించిన సవరణలను సభ ఆమోదించింది.