న్యూఢిల్లీ: వివాద్ సే విశ్వాస్ బిల్లుకు బుధవారం లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. 2020–21 బడ్జెట్‌లో ఈ ప్రత్యక్ష పన్ను వివాద పరిష్కార పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టారు. దీని ప్రకారం, ఆదాయపన్ను శాఖ జారీ చేసిన డిమాండ్ నోటీసులను వ్యతిరేకిస్తూ అప్పీల్‌కు వెళ్లిన వారు.. 2020 మార్చి 31 నాటికి బకాయిలను చెల్లిస్తే చాలు. దానిపై వడ్డీ, పెనాల్టీని ప్రభుత్వం రద్దు చేస్తుంది. గడువు నాటికి చెల్లించలేకపోతే, మార్చి తర్వాత జూన్ 30 వరకు మరో విడత గడువు లభిస్తుంది. కానీ, మార్చి 31లోపు చెల్లించాల్సిన దానితో పోలిస్తే ఆ తర్వాత 10 శాతం అదనంగా చెల్లించాలి. 2020 జనవరి 31 నాటికి పలు అప్పిలేట్ ఫోరమ్‌ల వద్ద నమోదై, అపరిష్కృతంగా ఉన్న కేసులు ఈ పథకం పరిధిలోకి వస్తాయి. పన్ను చెల్లింపులు రూ.5 కోట్లలోపు ఉన్న సోదా కేసులకే ఇది వర్తిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment