ఫేస్బుక్‌పై ఒబామా ఫైర్ | Facebook creating 'dust cloud of nonsense': Obama | Sakshi
Sakshi News home page

ఫేస్బుక్‌పై ఒబామా ఫైర్

Published Tue, Nov 8 2016 12:09 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

ఫేస్బుక్‌పై ఒబామా ఫైర్ - Sakshi

ఫేస్బుక్‌పై ఒబామా ఫైర్

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్పై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్ర విమర్శలు చేశారు.

న్యూయార్క్: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్పై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా విమర్శలు చేశారు. అమెరికా ఎన్నికలకు సంబంధించి ఫేస్బుక్ ద్వారా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారంటూ ఒబామా మండిపడ్డారు.

అమెరికా ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తరఫున మిచిగాన్లో ఒబామా ప్రచారం చేశారు. ఎన్నికల ర్యాలీలో ఒబామా మాట్లాడుతూ.. ‘తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి. ఇలాంటివాటిని నమ్మితే వరుసగా అదే పనిచేస్తారు. ఫేస్‌ బుక్, ఇతర సోషల్ మీడియాలో చాలా రోజులుగా తప్పుడు వార్తలను పోస్ట్ చేస్తున్నారు. ప్రజలు వాటిని చూస్తారు. ఇలాంటి వార్తలను నమ్మితే గందరగోళం ఏర్పడుతుంది’ అని అన్నారు. అమెరికాలో ఫేస్బుక్లో పోస్ట్ చేసిన రాజకీయ వార్తల్లో 38 శాతం వరకు అసత్యం, తప్పుదోవ పట్టించేవిగా ఉన్నట్టు ఓ విచారణలో తేలింది. కొందరు యువకులు ఫేస్బుక్లో తప్పుడు ఎకౌంట్లు తెరిచి ట్రంప్కు అనుకూలంగా వార్తలు పోస్ట్ చేస్తున్నట్టు గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement