
ఒబామా సంచలన వ్యాఖ్యలు!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ నమ్మదగిన వ్యక్తి కాదని ఒబామా అభిప్రాయపడ్డారు. స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను ఆయన ప్రస్తావించారు. పుతిన్ చర్యలపై తమకు ఎప్పుడూ నమ్మకం లేదని పేర్కొన్న ఒబామా.. తోటి అమెరికన్లు ఆయనకు మద్ధతునివ్వడంపై ఆందోళన వ్యక్తంచేశారు. ఆ అమెరికన్లు మరెవరో కాదు రిపబ్లికన్ పార్టీ నేతలు అని తెలిపారు. ఎన్నికల తర్వాత పరిస్థితిపై మాట్లాడుతూ.. అప్పుడు.. ఇప్పుడు మేం అదే విధంగా ఉన్నాం. మాలో ఏ మార్పులేదు. ఇతర దేశాల నేతలపై ఆధారపడటం అమెరికాకు మంచిది కాదన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ప్రతికూఆల ఫలితాలు రావడం పుతిన్ పై ఆగ్రహాన్ని మరింత పెంచినట్లు కనిపిస్తోంది.
పుతిన్ ఎప్పటికీ మా టీమ్ సభ్యుడు కాదని చెప్పారు. తోటి అమెరికన్ మిత్రులమైన మా డెమొక్రటిక్ పార్టీ నేతల కంటే విదేశీ వ్యక్తులను డొనాల్డ్ ట్రంప్ టీమ్ విశ్వసించడం దారుణమైన అంశమన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయించారని ఆరోపించారు. దీనిపై ట్రంప్ స్పందించారు. హ్యాకింగ్ అంశాలు అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఏమాత్రం ప్రభావం చూపలేదని, సరైన ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. తాను బాధ్యతలు స్వీకరించిన మూడు నెలల్లోగా సైబర్ సెక్యూరిటీ టీమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ట్రంప్ తెలిపారు.