కోపంతో నా ఫ్రెండ్‌ ముక్కు పగులగొట్టా: ఒబామా | Barack Obama Reveals Secret About One Incident With His Schoolmate | Sakshi
Sakshi News home page

Obama: కోపంతో నా ఫ్రెండ్‌ ముక్కు పగులగొట్టా

Published Wed, Feb 24 2021 11:37 AM | Last Updated on Wed, Feb 24 2021 1:46 PM

Barack Obama Reveals Secret About One Incident With His Schoolmate - Sakshi

న్యూయార్క్‌ : చిన్నతనంలో తనపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన ఓ స్నేహితుడి ముక్కు పగులగొట్టానన్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా. బ్రూస్‌ స్ప్రింగ్స్‌టీన్‌తో జరిగిన ఆడియో ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ఎపిసోడ్‌ మంగళవారం విడుదలైంది. 13 నిమిషాల ఆ ఆడియో ఇంటర్వ్యూ ఎపిసోడ్‌లో స్నేహితుడితో జరిగిన గొడవ గురించి ఒబామా మాట్లాడుతూ.. ‘‘ నేను స్కూల్లో చదువుతున్న సయమంలో నాకో ఫ్రెండ్‌ ఉండేవాడు. మేమిద్దరం కలిసి ఫుట్‌బాల్‌ ఆడేవాళ్లం. ఓ రోజు మా ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. ఆ సమయంలో అతడు నాపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు. 

ఓ పదం అంటూ నన్ను కించపరిచేలా మాట్లాడాడు. అసలతడికి ఆ పదానికి అర్థం కూడా తెలియదు. ఆ పదం ప్రయోగించి నన్ను బాధపెట్టాలనే ఉద్ధేశ్యం తప్ప. దీంతో నాకు విపరీతమైన కోపం వచ్చింది. మూతి మీద గట్టిగా కొట్టాను. అతడి ముక్కు పగిలిపోయింది. ఇంకోసారి నన్నలా పిలవొద్దని గట్టిగా వార్నింగ్‌ ఇచ్చాను.’’ అని చెప్పుకొచ్చారు.

చదవండి : నేపాల్‌ ప్రధానికి సుప్రీం షాక్‌

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. టైగర్‌ వుడ్స్‌కు తీవ్ర గాయాలు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement