ఆయన్ను నిరూపించుకోనివ్వండి: ఒబామా
వైట్ హౌస్ లో ప్రవేశించడానికి ట్రంప్ అనర్హుడని అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా లాటిన్ అమెరికా పర్యటనలో మాట మార్చారు. రిపబ్లిన్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందిన డోనాల్డ్ ట్రంప్ కు తనను తాను నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. కాగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలవడంపై ప్రపంచం మొత్తం ఆశ్చర్యానికి గురైన విషయం తెలిసిందే. ట్రంప్ గెలుపు అనంతరం ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తులో ఏమౌతుందోననే భయాందోళనలు నెలకొన్నాయి.
ట్రంప్ పై వ్యతిరేకత చూపాల్సిన పనిలేదని, ఆయనకు ఓ అవకాశమివ్వాలని ఒబామా లాటిన్ అమెరికా, ప్రపంచ దేశాలను కోరారు. అధ్యక్ష హోదాలో తన చివరి పర్యటనకు లాటిన్ అమెరికా వెళ్లిన ఒబామా.. గ్రీస్, జర్మనీల్లో కూడా పర్యటిస్తారు. పెరూలో యుకజనంతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో పాల్గొన్న ఒబామా... ట్రంప్ కు అవకాశమిచ్చి చూడాలని చెప్పారు. ఒకేసారి జడ్జిమెంట్ కు వచ్చేయండం సబబు కాదని అన్నారు. సమస్యలను అర్ధం చేసుకుని సరైన పాలసీలను తెచ్చే వరకూ వేచి చూడాలని చెప్పారు. ప్రచారంలో ఎలా పాల్గొన్నారన్న విషయం కంటే ఎలా పరిపాలన చేస్తారనేది కీలకమని అన్నారు.