
ఒబామాపై కామెంట్స్.. చిక్కుల్లో అధికారి!
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై జాతి వివక్ష పూరితమైన వ్యాఖ్యలు చేసిన కారణంగా ఓ జైలు ఉన్నతాధికారి జాబ్ కోల్పోయారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై జాతి వివక్ష పూరితమైన వ్యాఖ్యలు చేసిన కారణంగా ఓ జైలు ఉన్నతాధికారి జాబ్ కోల్పోయారు. ఫేస్‌బుక్‌లో పెట్టిన ఓ పోస్ట్ దీనికి కారమైంది. ఆ వివరాలిలా ఉన్నాయి... డేవిడ్ బార్బర్ అనే వ్యక్తి షెల్బీ కౌంటీ కరెక్షన్స్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్‌గా గత పదిహేడేళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. అయితే తరచుగా వివాదాస్పదమైన విషయాలను సోషల్ మీడియా వెబ్‌సైట్లలో పోస్ట్ చేసేవాడు. అందులోనూ అతడి ఫేస్‌బుక్ అప్‌డేట్స్ ఎవరైనా సరే చూడవచ్చు.
నిరసనలో భాగంగా ఓ వ్యక్తి కు క్లక్స్ క్లాన్ మాస్క్ ధరించి వచ్చాడు. అతడికి కేకేకే అని పేరు పెట్టిన అధికారి డేవిబ్ బార్బర్.. ఇల్లీగల్ (చట్టవ్యతిరేకంగా) అధ్యక్షుడు బరాక్ ఒబామా కంటే కూడా ఆ మాస్క్ ధరించిన వ్యక్తే ఓవరాల్ అమెరికన్ అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. దీనిపై వివాదం చెలరేగింది. దేశ అధ్యక్షుడిపైనే జాతివివక్ష వ్యాఖ్యలు చేశాడని ఒబామా కుటుంబం ఆరోపించింది. 'కు క్లక్స్ క్లాన్' నూతన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మద్ధతుదారుడు.
ఈ వివాదంపై తీవ్ర వ్యతిరేకత, ఒత్తిడి ఎదుర్కొన్న డేవిడ్ బార్బర్ తన ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ద ఫ్రీ పాట్రియట్ అనే ఫేస్‌బుక్ పేజీలో బార్బర్ విద్వేషపూరిత వ్యాఖ్యలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. షెల్బీ కౌంటీ కరెక్షన్స్ సెంటర్ బార్బర్‌ను ఉద్యోగం నుంచి తప్పుకోవాలని సూచించగా ఆయన జాబ్ మానేసినట్లు సమాచారం. ఇటీవల మిషెల్లీ ఒబామాపై జాతివివక్ష వ్యాఖ్యలు చేసిన టేలర్ కూడా జాబ్ కోల్పోయిన విషయం తెలిసిందే.