మోదీకి ఒబామా ఫోన్ ...
అమెరికా–భారత్ బంధం బలపడిందని వ్యాఖ్య
వాషింగ్టన్ : రెండుసార్లు అమెరికా అధ్యక్షుడి గా సేవలందించిన బరాక్ ఒబామా తన పదవీకాలం ముగిసిన సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. భారత్–అమెరికా మధ్య వ్యూహాత్మక సంబంధాలు, ఆర్థిక, రక్షణ, పౌర అణుశక్తి రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించ డానికి సహకరించినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల మధ్య సం బంధాలు మెరుగయ్యాయన్నారు. భారత్‌కు ఒబామా అందించిన సహకారానికి మోదీ ధన్యవాదాలు తెలిపారని వైట్‌హౌస్ వెల్లడించింది. గత ఏడాది గణతంత్ర దినోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరవ్వడాన్ని గుర్తుచేసుకున్న ఒబామా... రాబోయే 68వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఇద్దరి మధ్య దృఢమైన బంధం ఉందని దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి నిషా దేశాయ్ బిస్వాల్ తెలిపారు. ఇద్దరికీ పరస్పరం గౌరవం ఉందని, ఒకరి విలువ లను ఒకరు గౌరవించుకుంటారని చెప్పా రు. ఇద్దరు నాయకులూ తొలిసారిగా 2014 లో వైట్‌హౌస్‌లో కలిశారు. శుక్రవారంతో ఒబామా పదవీకాలం ముగియనుంది.
అంతా బాగానే...
ఒబామా శ్వేతసౌధం నుంచి చివరి సారిగా మీడియాతో మాట్లాడా రు. అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఒబామా... భావోద్వేగంతో ప్రసంగించారు. ‘మన కంతా మంచే జరుగుతుంది’ అంటూ ప్రజలSకు భరోసానిచ్చారు. అయితే అమెరికా కీలక విలువలను కాపాడుకోవాలని సూచిం చారు. అమెరికాకు భిన్నజాతులు, భిన్న విశ్వాసాల వ్యక్తులు అధ్యక్షులుగా రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ‘అందరికీ అవకాశాలను కల్పించటాన్ని కొనసాగిస్తే భవి ష్యత్తులో మహిళా అధ్యక్షురాలిని మనం చూస్తాం.
ఓ లాటిన్ , ఓ యూదు, ఓ హిందూ అధ్యక్షుడు కూడా రావొచ్చు’ అని అన్నారు. విదేశీ వ్యవహారాలతో పాటు దేశీయ అంశాలకు సంబంధించి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని ట్రంప్‌కు సూచించినట్టు ఒబామా వెల్లడించారు. దేశ ఉన్నతి కోసం ట్రంప్ తన పంథాలో, విలువలతో ముందుకు సాగాలన్నారు. ట్రంప్ రాకతో ఏదో అద్భు తం జరుగుతుందనుకోవడం లేదన్నారు. ఇకపై తన ప్రాధాన్యం రచనలు, భార్య మెషెల్లే, కుమార్తెలకేనని చెప్పారు.