సెప్టెంబర్ చివర్లో ఒబామాతో మోడీ భేటీ!
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో మోడీ సెప్టెంబర్ చివరి వారంలో సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు వైట్ హౌస్ నుంచి మోడీకి ఆహ్వానం అందింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 26 వ తేదీన మోడీ అమెరికాకు బయల్దేరే అవకాశం ఉంది.
2002 లో గుజరాత్ అల్లర్లలో భాగంగా అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ అమెరికా వీసా అంశం వివాదాలకు దారి తీసింది. 2005 లో మోడీ వీసాను రద్దు చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ప్రస్తుతం తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించి.. దేశ ప్రధానిగా మోడీ ప్రధాని పగ్గాలు చేపట్టడంతో ఆ వివాదానికి అమెరికా ఫుల్ స్టాప్ పెట్టింది. ప్రధాని పదవి చేపట్టిన అనంతరం మోడీకి ఒబామా అభినందలు తెలియజేసి అమెరికాకు రావాలని ఆహ్వానించారు.