భారత్‌కు ఒబామా చివరి కానుక
న్యూఢిల్లీ: అమెరికా తన అతిపెద్ద రక్షణ భాగస్వామిగా భారత్‌ను గుర్తించడం దేశాధ్యక్ష పదవి నుంచి దిగిపోనున్న బరాక్ ఒబామా అధికార యంత్రాంగం భారత్‌కు ఇచ్చిన చివరి కానుక. భారత్‌కు అవసరమైన రక్షణ, సైనిక పరికరాలను ఉదారంగా సరఫరా చేయాలని ఒబామా ప్రభుత్వం రానున్న ట్రంప్ ప్రభుత్వానికి ఎజెండాగా నిర్దేశించింది. అంతేకాకుండా ఆస్ట్రేలియా, జపాన్, భారత్‌తో కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాలని కూడా సూచించింది.
భారత పర్యటనకు వచ్చిన అమెరికా రక్షణ మంత్రి ఆస్టన్ బాల్డ్‌విన్ కార్టర్ గురువారం నాడు భారత రక్షణ మంత్రి మనోహర్ పరీకర్‌ను కలుసుకొన్నప్పుడు ఈ అంశాల గురించి ప్రస్తావించారు. భారీ ఎత్తున భారత్‌కు రక్షణ సాంకేతిక పరిజ్ఞానాన్ని, సైనిక పరికరాలను ఎగుమతి చేయడానికి అమెరికా ప్రభుత్వం లెసైన్స్ నిబంధనలను ఖరారు చేసిందని ఆయన చెప్పారు. అమెరికా తన సన్నిహిత రక్షణ భాగస్వామ్య దేశాల సరసనే భారత్‌ను అతిపెద్ద రక్షణ భాగస్వామి దేశంగా గుర్తిస్తూ గత జూన్ నెలలోనే నిర్ణయం తీసుకున్న విషయాన్ని కార్టర్ ఈ సందర్భంగా అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో గుర్తు చేశారు.
అమెరికా రక్షణ మంత్రిగా పదవి నుంచి దిగిపోనున్న కార్టర్, మనోహర్ పరీకర్‌తో భేటీ అవడం ఇది ఏడోసారి. బహూశా ఇదే ఆఖరి సారి కూడా కావచ్చు. అతిపెద్ద రక్షణ భాగస్వామిగా భారత్‌ను తాము సగౌరవంగా గుర్తిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఈ బంధం ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నామని అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో కార్టర్ వ్యాఖ్యానించారు. అలాగే అఫ్ఘానిస్తాన్ పునర్నిర్మాణంలో భారత్ మరింత చురుకై న పాత్రను నిర్వహిస్తుందని ఆశిస్తున్నామని కూడా ఆయన అన్నారు. అఫ్ఘానిస్తాన్‌లో ఇప్పటికే భారత్ పలు ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుల పేరిట త మ ప్రయోజనాలకు వ్యతిరేకంగా భారత్ చర్యలు తీసుకుంటోందని పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
అయితే ఇది అంత అబద్ధమని అఫ్ఘానిస్తాన్‌లో భారత్ నిర్వహిస్తున్న నిర్మాణాత్మక పాత్రను అమెరికా గుర్తించిందని కూడా కార్టర్ తెలిపారు. టైస్టు సంస్థలను ప్రోత్సహించే చర్యలను స్వస్తి చెప్పాలని కూడా పాకిస్తాన్‌కు గట్టిగా చెప్పామని కార్టర్ అన్నారు.