'అన్ఫిట్ అని నిరూపించుకున్నాడు' | Donald Trump Proves Himself Unfit For Presidency : Obama | Sakshi
Sakshi News home page

'అన్ఫిట్ అని నిరూపించుకున్నాడు'

Published Mon, Oct 24 2016 3:12 PM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

'అన్ఫిట్ అని నిరూపించుకున్నాడు' - Sakshi

'అన్ఫిట్ అని నిరూపించుకున్నాడు'

లాస్ వెగాస్: అమెరికా అధ్యక్ష పీఠానికి తాను తగినవాడిని కాదని రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ప్రతి రోజు, ప్రతి చోట నిరూపించుకున్నాడని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా విమర్శించారు. అర్హతలేని వ్యక్తి(ట్రంప్) బాటలో కొద్ది రోజులుగా రిపబ్లికన్ నాయకులు నడుస్తున్నారని ఆరోపించారు. సోమవారం లాస్ వెగాస్లోని నెవెడా వద్ద నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన ఆయన..

'ఇప్పటి వరకు మనం చేయాల్సిన అభివృద్ధంతా చేశాం. వచ్చే 16 రోజులు కూడా మనం కష్టపడి పనిచేయకుంటే ఇప్పటి వరకు సాధించిన పురోగతి అంతా కూడా వెళ్లిపోతుంది. ప్రతిరోజు ప్రతిచోట తాను అమెరికా అధ్యక్ష పదవికి అర్హుడిని కాదని నిరూపించుకున్న వ్యక్తి(ట్రంప్) మీకు(అమెరికా ప్రజలకు) దొరికాడు. అదే సమయంలో అమెరికా అధ్యక్ష పదవిని అలంకరించేందుకు సరైన అర్హత ఉన్న మరో వ్యక్తి (హిల్లరీ క్లింటన్) కూడా మీ ముందు ఉన్నారు. ఈ సమయంలోనే అమెరికా పౌరులు సరిగా వ్యవహరించాలి' అని ఒబామా సూచించారు. గత కొద్ది రోజులుగా రిపబ్లికన్ నాయకులంతా తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని కూడా ఒబామా అన్నారు.

'వాళ్లు (రిపబ్లికన్లు) నేను ఇక్కడ జన్మించలేదని అన్నారు. వాతావరణంలో అనూహ్య మార్పుల గురించి మాట్లాడితే అదంతా మోసమని అంటారు. నేను అమెరికన్ల తుపాకులన్నీ తీసుకెళతానని ఆరోపిస్తారు. మేం సైనిక విన్యాసాలు నిర్వహిస్తుంటే మేం ఎప్పుడూ చేసే పని ఇదొక్కటేనని హేళన చేస్తారు. అంతేకాదు.. మార్షల్ లా విధించే కుట్రలు చేస్తున్నారని కూడా ఆరోపిస్తారు. ఇలాంటి ఆరోపణలు వాళ్లు (రిపబ్లికన్లు) చేయడం ఇది తొలిసారి కాదు ఏళ్ల తరబడి చేస్తున్నారు' అని ఒబామా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement