
న్యూఢిల్లీ: ప్రముఖ ఫోటో జర్నలిస్ట్ పీట్ సౌజాకు ది వే ఐ సీ ఇట్ చిత్రానికి 45 టోరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్ లభించింది. అయితే పీట్ సౌజా గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు వ్యక్తిగత, వైట్ హౌస్ ఫోటోగ్రాఫర్‌గా దశాబ్ద కాలం పాటు పని చేశారు. కాగా పీట్ సౌజా మే 2019 సంవత్సరం హైదరాబాద్ పర్యటనలో అమెరికన్ ఫిల్మ్ మేకర్ డాన్ పోర్టర్ డాక్యుమెంటరీని రూపొందించారు. అయితే గతంలో బ్రాండ్ ఒబామాను మీరు ప్రమోట్ చేశారా అన్న ప్రశ్నకు సౌజా స్పందిసూ ఒబామా పాలనలో రాజకీయ, సామాజిక అంశాలను దృష్య రూపంలో చూపెట్టినట్లు తెలిపాడు. అయితే తాను కేవలం ఫోటోగ్రాఫర్‌ను మాత్రమే కాదని తన కెమెరా పనితనం చారిత్రక అంశాలతో ముడిపడి ఉంటుందని సౌజా పేర్కొన్నాడు.
కానీ ప్రస్తుతం వైట్ హౌస్ జర్నలిస్ట్లుల పై ఏ విధంగా స్పందిస్తుందని సౌజాను అడగగా జర్నలిస్టుందరూ నిరాధార వార్తలు రాస్తున్నారంటూ ప్రస్తుత అమెరికా ప్రెసిడెంట్ ఆరోపిస్తున్నారని పేర్కొన్నాడు. అయితే ది వే ఐ సీ ఇట్ చిత్రంబపై సౌజా స్పందిస్తు ఇందులో బరాక్ ఒబామా ప్రెసిడెంట్‌గా, వ్యక్తిగా విభిన్న కోణాలను ఆవిష్కరించినట్లు తెలిపారు. మరోవైపు ఈ చిత్రంలో సామాజిక, రాజకీయ కోణాలు ఉంటాయని పీట్ సౌజా పేర్కొన్నాడు. (చదవండి: ట్రంప్‌పై ఒబామా సంచలన వ్యాఖ్యలు)
Comments
Please login to add a commentAdd a comment