
వెలుగులోకి ఒబామా ట్రాజెడీ లవ్‌స్టోరీ
ఈ పుస్తకంలో ఆయన పేర్కొన్న ప్రకారం జాగర్ రచయిత డేవిడ్‌కు ఏం చెప్పిందంటే..‘1986 వింటర్ సమయంలో మేం మా తల్లిదండ్రులను కలిసేందుకు వెళ్లినప్పుడు ఒబామా నాకు పెళ్లి ప్రతిపాదన చేశాడు. ఆయనను పెళ్లి చేసుకోవాలని కోరాడు. కానీ మా కలయికను మా అమ్మనాన్నలు అంగీకరించలేదు. ఎందుకంటే నేను ఆ సమయంలో ఒబామాకంటే రెండేళ్లు చిన్నదాన్ని. పైగా ఒబామాకు రాజకీయాలపై ఆలోచన ఉండేది. ఆతడి రాజకీయ ఆలోచనలు గాడిలో పడటం మొదలైంది. క్రమంలో అతడు రాజకీయాల్లోకి జారుకున్నాడు. రాజకీయాలతోపాటు, జాతి వివక్ష అంశం కూడా మా సంబంధంపై నీలినీడల్లా కమ్ముకుని విడిపోయాం. ఒక్క ఏడాదిలోనే మా రిలేషన్‌పై ప్రభావం పడింది. 1987ను నేను ఎప్పటికీ మర్చిపోలేను. అధ్యక్ష పదవి చేజిక్కించుకునే విషయంలో ఒబామాకు అప్పట్లోనే స్పష్టమైన ముందుచూపు, అంచనాలు ఉన్నాయి’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
ఒబామా హార్వార్డ్‌లో విద్యను పూర్తి చేసిన తర్వాత చికాగో తిరిగొచ్చి స్థానిక న్యాయ సంస్థలో ఉద్యోగంలో చేరాడని, అక్కడే ఆయనకు మిషెల్లీ ఒబామా కలిసిందని, వారి సంబంధం అతి తక్కువ కాలంలో ధృడపడి వివాహానికి దారి తీసిందని కూడా వెల్లడించింది. అంతేకాదు, ఆమె హార్వార్డ్‌లో ఫెలోషిప్ టీచింగ్‌కు వచ్చిన సమయంలో కూడా ఒబామా తనను చూసేవాడని తెలిపింది.