ఒబామా దంపతులకు ఆహ్వానం పంపితే.. | Obama couple reply to woman daughter wedding invitation | Sakshi
Sakshi News home page

ఒబామా దంపతులకు ఆహ్వానం పంపితే..

Published Fri, Aug 4 2017 7:30 PM | Last Updated on Sun, Sep 17 2017 5:10 PM

ఒబామా దంపతులకు ఆహ్వానం పంపితే..

ఒబామా దంపతులకు ఆహ్వానం పంపితే..

వాషింగ్టన్: ప్రజల నేతగా గుర్తింపు పొందిన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నుంచి శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రావడంతో ఓ యువ జంట ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. తన తల్లి రాసిన లేఖతో పాటు ఒబామా పంపిన ప్రత్యుత్తరాన్ని నవ వధువు ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది. ఇప్పటికే 45వేల మంది రీట్వీట్ చేయగా, రెండు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. వివరాల్లోకెళ్తే.. గత మార్చి నెలలో టెక్సాస్‌కు చెందిన లిజ్ వైట్లో అనే మహిళ కూతురు బ్రూక్ అల్లెన్ జరిగింది. అయితే తన కూతురి వివాహానికి హజరు కావాల్సిందిగా ఒబామా దంపతులకు లిజ్ ఆహ్వానం పంపించారు.

దాదాపు నాలుగు నెలల తర్వాత (జూలై 31న) ఒబామా నుంచి వారికి సమాధానం వచ్చింది. 'వివాహం చేసుకున్న జంటకు మా తరఫున శుభాకాంక్షలు. మీ పెళ్లి ఎంతో ఆనందంగా, సన్నిహితుల ప్రేమానుబంధంతో జరిగి ఉంటుంది. ఏళ్లు గడిచేకొద్దీ మీ ప్రేమ రెట్టింపు కావాలి. మీ బంధం జీవితాంతం కొనసాగాలిని ఆకాంక్షిస్తున్నాను. వివాహం తర్వాత మీ లైఫ్ ఎన్నో విశేషాలతో నిండిపోతూ బంధం బలపడాలని' కొత్త జంటను ఆశీర్వదిస్తూ ఒబామా దంపతులు ఈ లేఖ రాశారు.  ఈ సంతోషాన్ని వధువు బ్రూక్ అల్లెన్ తన ట్విట్టర్లో షేర్ చేసుకుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement