కొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన ఒబామా | Barack Obama's Favorite Books and Music of 2017 | Sakshi
Sakshi News home page

కొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన ఒబామా

Published Tue, Jan 2 2018 12:54 PM | Last Updated on Tue, Jan 2 2018 1:15 PM

Barack Obama's Favorite Books and Music of 2017 - Sakshi

వాషింగ్టన్‌ : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేస్తున్నారు. అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనూ ట్రెండింగ్‌గా ఉండేందుకు ఒబామా ప్రయత్నించేవారు. అలాగే అధ్యక్ష పదవినుంచి వైదొలిగిన తరువాత కూడా ఆయన వినూత్నంగా ముందుకు సాగుతున్నారు. ఇతర మాజీ అధ్యక్షులకు భిన్నంగా కొత్త సంప్రదాయానికి తెరతీశారు.

తాజాగా.. 2017లో తనకు నచ్చిన పుస్తకాలు, పాటల టాప్‌-12 జాబితాను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీనికి నెటిజన్ల నుంచి ఊహించని మద్దతు వస్తోంది. ఫిక్షన్‌ రచనలతో పాటు పలు రకాల రచనలు ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. అందులో మొదటి స్థానంలో నయోమి అల్డెర్‌మ్యాన్‌ రచించిన ‘ది పవర్‌’ నిలిచింది.

అలాగే 2017లో తన మనసును చూరగొన్న పాటల జాబితాను ఆయన విడుదల చేశారు. ఇదిలావుండగా.. ఒబామా మనసుకు నచ్చిన పుస్తకాలు, పాటల జాబితాపై పలువురు కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement