favorite books
-
కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన ఒబామా
వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనూ ట్రెండింగ్‌గా ఉండేందుకు ఒబామా ప్రయత్నించేవారు. అలాగే అధ్యక్ష పదవినుంచి వైదొలిగిన తరువాత కూడా ఆయన వినూత్నంగా ముందుకు సాగుతున్నారు. ఇతర మాజీ అధ్యక్షులకు భిన్నంగా కొత్త సంప్రదాయానికి తెరతీశారు. తాజాగా.. 2017లో తనకు నచ్చిన పుస్తకాలు, పాటల టాప్-12 జాబితాను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి నెటిజన్ల నుంచి ఊహించని మద్దతు వస్తోంది. ఫిక్షన్ రచనలతో పాటు పలు రకాల రచనలు ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. అందులో మొదటి స్థానంలో నయోమి అల్డెర్మ్యాన్ రచించిన ‘ది పవర్’ నిలిచింది. అలాగే 2017లో తన మనసును చూరగొన్న పాటల జాబితాను ఆయన విడుదల చేశారు. ఇదిలావుండగా.. ఒబామా మనసుకు నచ్చిన పుస్తకాలు, పాటల జాబితాపై పలువురు కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. I️ CANT BELIEVE OBAMA SAID HAVANA WAS ONE OF HIS FAVORITE SONGS OF THE YEAR I️ AM REALLY CRUYING OH MY GOD DONT LOOKA T ME — camila (@Camila_Cabello) 31 December 2017 Obama posted his favorite songs of ‘17 and one of them was Broken clocks by @sza and since I also love that song i think we should just give this man a third term 🤷🏽♀️ — Lloyd (@unBRE_lievable) 1 January 2018 My goal is to someday have a book that I wrote on Obama’s reading list 🙏 https://t.co/HSVS2hcdjO — Brinley (@brinlliance1) 1 January 2018 -
నాకు నచ్చిన ఐదు పుస్తకాలు
శేషప్రశ్న(శరత్చంద్ర ఛటర్జీ) శరత్ బెంగాలీ నవలకు బొల్లిముంత శివరామకృష్ణ తెలుగు అనువాదం శేషప్రశ్న. తుప్పుపట్టిన సంప్రదాయ ధోరణులను, వ్యక్తి హితానికి ఉపయోగపడని విధానాలను కమల ఖండించే పద్ధతి గొప్పగా ఉంటుంది. సంఘసేవలో చురుకుగా పాల్గొంటూ కమల మన్ననలు కూడా చూరగొన్న రాజేంద్ర ఆలయం తగలబడి పోతున్నప్పుడు అందులో విగ్రహాన్ని కాపాడాలని ప్రయత్నించి తాను ఆహుతైపోతాడు. అక్కడున్న వారందరూ రాజేంద్ర త్యాగాన్ని కీర్తిస్తుంటే కమల మాత్రం మౌనంగా ఉండిపోతుంది. చివరికి అంటుంది: ‘అజ్ఞానం ఎప్పుడూ బలి కోరుతుంది’. ఎప్పటిలాగే ఆమె ఆలోచనాతీరు అందరికీ శేషప్రశ్నే అవుతుంది. జీవితాదర్శం (చలం) జీవితాదర్శం, శాంతి. దానికి అడ్డుగా ఉండే ఏ ఐశ్వర్యం గానీ, శృంగారం గానీ, మరేదైనా గానీ జీవితానికి చాలా విరోధం, అంటాడిందులో చలం. లాలస పాత్ర కడు రమణీయంగా వర్ణించబడింది. ఇందులోని మరో గొప్ప పాత్ర, దేశికాచారి. విడువలేని బంధం వద్దంటాడు. స్వేచ్ఛలో ఉన్న శాంతి, ప్రశాంతి మరెందులోనూ ఉండదనీ, దానికోసం ప్రయత్నిస్తూ సాగిపోవడమే జీవితమనీ ఈ నవల బోధిస్తుంది. పాకుడురాళ్లు (రావూరి భరద్వాజ) ఒక సాధారణ యువతి గొప్ప సినీనటిగా ఎదిగిన క్రమంలో ఆమె జీవనయానంలోని స్థితిగతులు అత్యంత కరుణ రసాత్మకంగా చిత్రీకరించబడ్డ గ్రంథరాజం ఇది. జ్ఞానపీఠ అవార్డుకు నోచుకొని తెలుగు బావుటాను ఎగురవేసిన ఈ నవలలోని మంజరి పాత్ర ఉత్థాన పతనాలను చదువుతుంటే జీవితం పట్ల ఒక చిత్రమైన సానుభూతితో కూడిన అవగాహన ఏర్పడుతుంది. హర్ష విషాదాల నడుమ సాగిపోయే జీవన చిత్రం– చివరికి మిగిలేదేమీ లేదనే సత్యంతో పాటు పాఠకులను ఒక ద్వంద్వాతీత స్థితికి తీసుకువెడుతుంది. ‘ప్రేమించకబడకపోవడం కంటే దుఃఖం, దారిద్య్రం ఏముంది?’ అని మంజరి ప్రశ్నిస్తున్నట్లనిపిస్తుంది. ఒక యోగి ఆత్మకథ (పరమహంస యోగానంద) ‘మనసుకు, ఆత్మకు ఉన్న కిటికీలను తెరిచే పుస్తకం’గా కీర్తింపబడిన ఈ పరమహంస యోగానంద ఆత్మకథ జిజ్ఞాసువులందరూ చదవాల్సిన ఆధ్యాత్మిక పరిమళాల గ్రంథం. చదవినకొద్దీ వశపరుచుకునే మహత్తర పుస్తకం. ఈ అసాధారణమైన కథ మనలో నిద్రాణమైవున్న జ్ఞానతృష్ణను మేలుకొల్పుతుంది. మోరీతో మంగళవారాలు (మిచ్ ఆల్బం) మిచ్ ఆల్బం ఆంగ్లరచన ట్యూజ్‌డేస్ విత్ మోరీకి ఇది తెలుగు అనువాదం. అనువాదకులు డాక్టర్ పద్మిని, ప్రొఫెసర్ నరసింహారావు. జీవించడం తెలియాలంటే మరణించడం ఎలాగో తెలియాలని తెలుసుకున్న మానవతావాది మోరీ. ఈ అద్భుత గురువుకు ఆత్మీయ విద్యార్థి మిచ్ ఆల్బం. గురువుతో అర్థవంతంగా పంచుకున్న మంగళవారాల గాథలను మిచ్ కరుణరసాత్మకంగా చిత్రించిన తీరు అమోఘం! ‘జీవితానికి అర్థం తెలుసుకోవడానికి మార్గం, ఇతరుల్ని ప్రేమించడానికి అంకితమవడం’ అనే వినూత్న సందేశాన్నిచ్చిన ఈ పుస్తకం మళ్లీ మళ్లీ చదివింపజేస్తుంది. - అన్నంరాజు వేణుగోపాల శ్రీనివాసమూర్తి 9989792549 -
నాకు నచ్చిన ఐదు పుస్తకాలు
చిన్నతనంలో ‘చందమామ’ నాలో పఠనాసక్తి పెరగడానికి కారణమైంది. పుస్తకాలు చదవడం అభిరుచి స్థాయిని దాటిపోయి వ్యసనంగా మార్పుచెందింది. వినోదం కావచ్చు– విషాదం కావచ్చు–నా ఆలోచనల్ని ఆక్రమించి ఉక్కిరిబిక్కిరి చేసిన ప్రతి రచనా నాకు ఇష్టమే! చదివిన వందలాది పుస్తకాలలోంచి నాకు నచ్చిన అయిదు పుస్తకాలను మాత్రం ఇక్కడ ప్రస్తావించే సాహసం చేస్తున్నాను. కూనలమ్మ పదాలు: కవిగా నాచేత తొలి అడుగులు వేయించిన పుస్తకం ‘కూనలమ్మ పదాలు’. మకుటం కాకుండా ఒక్కొక్కటీ పదిమాత్రల నిడివి మాత్రమే ఉన్న మూడేమూడు పాదాలతోనూ, అందమైన అంత్య ప్రాసలతోనూ నిండిన ఆ పదాలు నన్ను ఎంత గానో ఆకర్షించాయి. అచ్చమైన దేశీయ ఛందస్సులో ఆరుద్ర ప్రద ర్శించిన ఒడుపూ, చమత్కారమూ గట్టిగా పట్టుకున్నాయి. ఆ ఊపు లోనే ఈ ఛందస్సును అనుసరిస్తూ ‘కోకిలమ్మ పదాలు’ రాశాను. మహాప్రస్థానం: అప్పటి వరకూ జోకర్, బుడుగులాంటి హాస్యపత్రికల ఆస్థాన రచయితగా చలామణీ అవుతున్న నేను ‘మహా ప్రస్థానం’ ప్రభావంతో సీరియస్ కవిగా అవతారమెత్తాను. హైస్కూల్ రోజుల్లో ఆ గీతాలు పూర్తిగా అర్థం కాకపోయినా చదివిన ప్రతిసారీ ఆలోచనలనిండా విద్యుదీకరణ జరిగేది. ‘‘కష్టజీవికి ఇరువైపులా నిలబడ్డవాడే కవి’’ అని ప్రకటించి బూజుపట్టిన పాతభావాలమీద తిరుగుబాటు జెండా ఎగరేసిన సాంస్కృతిక సేనాని శ్రీశ్రీ. మఖ్దూం కవిత: కమ్యూనిస్టులు ప్రేమ భావానికి వ్యతిరేకులనే అపవాదును నిజం చేస్తూ చాలామంది అభ్యుదయ కవులు ప్రేమకవిత్వానికి దూరంగా ఉండేవారు. సున్నితమైన శృంగారాన్నీ, చుర్రుమనిపించే అంగారాన్నీ సుస్పష్టంగా కవిత్వీకరించిన వారిలో ఉర్దూ కవి మఖ్దూం మొహియుద్దీన్ ముందువరుసలో ఉంటాడు. గజ్జెల మల్లారెడ్డి, రాంభట్ల కృష్ణమూర్తి, సినారెలాంటి ప్రతిభావంతులు చేసిన అనువాదాలతో ‘మఖ్దూం కవిత’ తెలుగు పాఠకులకు దగ్గరైంది. ప్రజానాట్యమండలి కళాకారుల గళాలద్వారా మఖ్దూం గీతాలు నిత్యనూతనంగా వినిపిస్తూనే ఉంటాయి. సారస్వత వివేచన: రా.రా.గా ప్రసిద్ధుడైన మార్కి ్సస్టు మేధావి రాచమల్లు రామచంద్రారెడ్డి రచనల్లో ‘సారస్వత వివేచన’ నాకు ఇష్టమైన పుస్తకం. విమర్శ కూడా ఒక అద్భుతమైన రచనా విధానమనీ, కళాత్మకమైన సాహితీ ప్రక్రియ అనీ ఈ పుస్తకం రుజువు చేస్తుంది. సునిశితమైన అవగాహనతోనూ, తుపానువేగంతో విరుచుకుపడే వచనంతోనూ, అసాధారణమైన వాదనాపటిమతోనూ రా.రా. తెలుగులో సాహిత్య విమర్శకు కొత్త అందాలు చేకూర్చాడు. పతంజలి భాష్యం: కె.యన్.వై.పతంజలిగా అందరికీ తెలిసిన కాకర్లపూడి నారసింహ యోగ పతంజలి రచించిన ‘పతంజలి భాష్యం’ అంటే నాకు మహా ఇష్టం. సమాజంలో వివిధ రంగాల్లో విచ్చలవిడిగా బరితెగించి విహరిస్తున్న మేకవన్నె పులుల పీఠాల కింద మందుపాతరలు పేల్చిన అక్షరయోధుడు పతంజలి! పురివిప్పిన విషాదాన్నీ, కట్టలు తెంచుకున్న ఆగ్రహాన్నీ, అనితర సాధ్యమైన వ్యంగ్యవైభవంతో రంగరించి అందించిన పుస్తకం ఇది. - అదృష్టదీపక్ 94405 28155 -
నాకు నచ్చిన 5 పుస్తకాలు
కొత్త శీర్షిక చివరకు మిగిలేది: ఇష్టమైన రచనల గురించి మాట్లాడేటప్పుడు మొదట పేర్కొనవలసినది బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’. మానసిక సంఘర్షణకూ, మానవయత్న వైఫల్యానికీ, మనిషిలో నిరంతరంగా కొనసాగే అన్వేషణకూ ఈ నవల అద్దంపడుతుంది. దయానిధి, కోమలి, అమృతం వంటి పాత్రలన్నీ గుర్తుంచుకోదగినవే. అమృతం పాత్రను మలచిన తీరు, ఆమెకూ దయానిధికీ మధ్య సంబంధాన్ని నడిపించిన విధానం ఎంతో ఆసక్తికరంగా తోస్తాయి. బుచ్చిబాబు శైలిలో ఉండే గాఢత, కథనంలో భాగంగా ఆయన చేసే వ్యాఖ్యల్లో నిండిన తాత్వికత మొదలైన వాటివల్ల ఈ నవలను ఎన్నిసార్లు చదివినా ప్రతి సారి ఏదో ఒక కొత్త కోణాన్ని కనుగొన్న అనుభూతి కలుగుతుంది. చిలకలు వాలిన చెట్టు: కవిత్వం గురించీ, కవితలో వాడే పదచిత్రాల గురించీ, మొత్తంగా కవి ఏర్పరుచుకోవలసిన దృష్టి గురించీ ఒక నూతనమైన అవగాహన ఏర్పడటానికి దోహదపడిన పుస్తకం ఇస్మాయిల్ ‘చిలకలు వాలిన చెట్టు’. నిత్య జీవితంలో జరిగే సంఘటనల్లో కవిత్వాంశను ఎలా చూడాలి, సృష్టిలోని చరాచరాల మీద ఒక దయార్ద్ర దృష్టిని ఎలా అలవరుచుకోవాలి అన్నది ఇందులోని కవితలు చదివి నేర్చుకోవచ్చు. కవిత్వ రచన, అవగాహన గురించి ఇస్మాయిల్ రాసిన వ్యాసాలేవీ చదవక పోయినా, ఆయన కవితాత్మను అర్థం చేసుకోవటానికి ఈ కవితలు సరిపోతాయి. అనేక సందర్భాలలో ఈ కవితలలోని వాక్యాలను పదేపదే తలుచుకొంటూ ఉంటాను. సాహిత్యంలో దృక్పథాలు: సాహిత్య విమర్శను పరిశీలిస్తే, నిక్కచ్చిగా, నిష్పక్షపాతంగా ఒక సమ్యక్ దృష్టితో ఆర్.ఎస్.సుదర్శనం రాసిన ‘సాహిత్యంలో దృక్పథాలు’ ఒక ప్రామాణికమైన విమర్శనా గ్రంథం. ఆయన స్వయంగా కవి, కథ/నవలా రచయిత కావటంతో కవుల, రచయితల అంతరంగాలను అర్థం చేసుకుని, ఆవిష్కరించటం ఆయనకు సాధ్యపడి ఉంటుంది. సాంప్రదాయక, ఆధునిక సాహిత్యంతో బాటు పాశ్చాత్య సాహిత్యం మీద ఆయనకున్న విశేష అవగాహన, సహజసిద్ధంగా ఆయనలో ఉన్న తాత్వికమైన ఆలోచనా ధోరణి ఈ వ్యాసాలకు గాఢతనీ పరిపూర్ణతనూ చేకూర్చాయి. Anna Karenina: నేనిష్టపడే ఇతరభాషా రచనలలో టాల్‌స్టాయ్ Anna Karenina ముఖ్యమైనది. ఈ నవల మొదటి వాక్యం దగ్గరనించి, చివరిలో అన్నా ఆత్మహత్య చేసుకునే సన్నివేశం వరకు ఉదాత్తమైన రచనా విలువలతో సాగుతుంది. ప్రియునిపై ప్రేమ, అనుమానం, కొడుకు మీద ప్రేమ, సమాజంలో తను పొందే అవమానం మొదలైనవాటితో నలిగిపోయే ఆమె మాససిక సంఘర్షణని గొప్పగా ఆవిష్కరిస్తుంది. నవల చదువుతున్నంతసేపూ అయిపోతోందని బాధపడుతూ చదివిన నవల ఇదొక్కటే. Prince of Tides: చివరిగా, ప్రసిద్ధ అమెరికన్ నవలాకారుడు Pat Conroy రాసిన Prince of Tidesఅనే నవల గురించి. కథనంలో, పాత్ర చిత్రణలో, హై డ్రామా నిండిన సన్నివేశాల్ని నిర్వహించటంలో, ఇంగ్లీషు భాషని ఒడుపుగా ఉపయోగించటంలో Conroy చూపించిన ప్రతిభ ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎప్పుడూ వ్యంగ్య సంభాషణలు జరిపే కథానాయకుడు, చండశాసనుడైన అతని తండ్రి, ఆత్మహత్యా ప్రయత్నం విఫలమై mental asylumలో చేర్చబడిన కవయిత్రి చెల్లెలు– ఇలా గుర్తుండిపోయే పాత్రలెన్నో ఇందులో తారసపడతాయి. మేముండే ప్రాంతంలో ఎక్కువగా అభిమానించే southern identityని ప్రతిబింబిస్తుంది. ఈ నవల విజయవంతమైన హాలీవుడ్ సినిమాగా కూడా రూపొందింది. ఈయన అనుభవాలు చదివితే మంచి రచయితే కాదు, మంచి వ్యక్తి కూడాఅని తెలుస్తుంది. విన్నకోట రవిశంకర్ rvinnako@yahoo.com -
ఈ ఐదు పంచప్రాణ ప్రేరణలు
నాకు నచ్చిన 5 పుస్తకాలు పుస్తక పఠనం గొప్ప అనుభవం. అనేక జీవితాల్ని కనుల ముందు నిలుపుతుంది. వివరిస్తుంది. విశ్లేషిస్తుంది. వికసింప జేస్తుంది. మనసును శుభ్రపర్చి ఎప్పటికప్పుడు తాజాకాంతితో పరిమళింప జేస్తుంది. వ్యక్తిత్వంతో, కవిత్వంతో నిలదొక్కు కోవటానికి ప్రేరణ పుస్తకాలే. వేల పుస్తకాల సారం నేను. ఐదు పుస్తకాలు పంచప్రాణ ప్రేరణలు. శిథిల విపంచి: తీగలు తెగిన వీణ స్వరాక్షరాలు. అష్టకాల నరసింహ రామశర్మ పద్య ఖండికల సంపుటి. దుఃఖపు తెరల్ని, ఆర్ద్ర సన్నివేశాల్ని పంచి హృదయాన్ని సున్నితంగా మలిచింది. భావోద్వేగాలు నాలో రేకెత్తించి కవిత్వం వైపు నడిపించింది. మహాప్రస్థానం: కొత్త ప్రపంచపు సింహద్వారం తెరిచింది. మహాకవి శ్రీశ్రీ ఘోష. శ్రమైక జీవన సౌందర్య దృక్పథాన్ని పాదుకొల్పింది. నాలో కవిని కదిలించి, బతికించి, బలమిచ్చి సమాజబాధ్యత వైపు మళ్లించింది. అగ్నిధార: ఉద్యమ ఉద్వేగాలకు ఊపిరి పోసింది. విప్లవాగ్ని, ప్రణయాగ్ని కలెగలిసిన సమర రసధార. మహాకవి దాశరథి ఆవిష్కరించిన బడబానలం. తెలంగాణ పదం, ఉద్యమ పథం పెనవేసిన పేగుబంధం అందమైన పద్యం. కమ్యూనిస్టు ప్రణాళిక: నడిచిన, నడుస్తున్న చరిత్రకు నవదర్శనం. మార్క్స్, ఎంగెల్స్ రూపకల్పనం. మార్క్స్ తత్వాన్ని లోలోపలికి ఎక్కించి మానవత్వాన్ని పదునుపెట్టిన రచన. వర్గస్పృహను పెంచి ప్రజాపోరాటాల వైపు నడిపించిన సమాజశాస్త్రం. ప్రణాళికాశాస్త్రం. రక్తం సూర్యుడు: కవిత్వానికి వచనలయ జోడించిన నేర్పు. కూర్పు. కె.శివారెడ్డి అభివ్యక్తి, భావావేశం నవనవోన్మేషంగా పొడిచిన రక్తగానం. సరికొత్త పదజాల ప్రభంజనాలు సృష్టించి నిత్య కవిత్వమయం చేసి నిరంతర ప్రవాహధారగా మలిచింది. - నందిని సిధారెడ్డి