న్యూయార్క్: పారిస్ ఒప్పందానికి భారత్ పచ్చజెండా ఊపడంపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించారు. ఒప్పందంపై ట్విట్టర్ ద్వారా స్పందించిన ఒబామా శాంతిని చాటిన మహనీయుడు మహాత్మాగాంధీ బాటలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భారత ప్రజలు ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారని పోస్టులో రాశారు.
ఇందుకు ప్రకృతిని కాపాడుకోవడం భారతీయుల లక్షణమని మోదీ స్పందించారు. పారిస్ వాతావరణ ఒప్పందపత్రాలను యూఎన్ కు భారత్ అందించిన అనంతరం యూఎన్ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ భారతీయులందరికీ ధన్యవాదాలని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ చారిత్రత్మాక ఒప్పందం భారత్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తుందని అన్నారు. గ్రీన్ హోస్ వాయువులను అత్యధికంగా విడుదల చేస్తున్న దేశాల వరుసలో మూడో స్ధానంలో ఉన్న భారత్ ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ఫ్రాన్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలెండ్ హర్షం వ్యక్తం చేశారు.