
చేపకు ఒబామా పేరు
వాషింగ్టన్: పసిఫిక్ మహాసముద్రంలోని క్యూర్ అటోల్ ద్వీపంలో కనుగొన్న అరుదైన చేపకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పేరు పెట్టారు. పసుపు, గులాబీ రంగులో ఉన్న ఈ కోరల్ రీఫ్ చేపలను హవాయ్‌లోని పపహనౌముకాకియా మెరైన్ నేషనల్ మాన్యుమెం ట్‌లో గత జూన్ లో గుర్తించిన విషయం తెలిసిందే. వీటికి ‘టొసానాయిడ్స్ ఒబామా’అనే పేరు పెట్టారు.
మగ చేపలపైన ఒబామా ప్రచార లోగోను పోలిన గుర్తు ఉండటంతో వీటికి ఆయన పేరు పెట్టారు. పపహనౌముకాకియా విస్తీర్ణం పెంచడంతో పాటు ప్రకృతిని రక్షించడానికి ఒబామా తీసుకున్న పలు నిర్ణయానికి గుర్తుగా ఈ నిర్ణయం తీసుకున్నామని బిషప్ మ్యూజియంకు చెందిన శా్రçస్తవేత్త రిచర్డ్ పైల్ తెలిపారు.