బాస్‌ సోదరిపై ఆంక్షలా? టైమ్‌వేస్ట్‌! | get packing, North Korea suggests Barack Obama | Sakshi
Sakshi News home page

బాస్‌ సోదరిపై ఆంక్షలా? టైమ్‌వేస్ట్‌!

Published Tue, Jan 17 2017 3:49 PM | Last Updated on Tue, Sep 5 2017 1:26 AM

బాస్‌ సోదరిపై ఆంక్షలా? టైమ్‌వేస్ట్‌!

బాస్‌ సోదరిపై ఆంక్షలా? టైమ్‌వేస్ట్‌!

ప్యోంగ్‌యాంగ్‌: ఫొటోలో కనిపిస్తున్న యువతి పేరు కిమ్‌ జో జాంగ్‌. వయసు 26ఏళ్లు. మీడియాకు కిలోమీటర్ల దూరం ఉండే ఈమె.. ప్రపంచానికి సవాళ్లు విసురుతోన్న ఉత్తరకొరియాలో కీలక నాయకురాలు. అంతేకాదు, ఆ దేశ నియంతనేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌కు చిన్న చెల్లెల్లు కూడా! హైడ్రోజన్‌ బాంబు పరీక్షలని, అణుబాంబులు వేస్తామని అమెరికాకు వ్యతిరేకంగా ఉత్తరకొరియా చేస్తోన్న కవ్విపు చర్యలన్నింటికీ ఈ యంగ్‌ లేడీ జో జాంగే సూత్రధారిఅట!

ఇంకేముంది, మానవహక్కులను కాలరాస్తోందంటూ జో జాంగ్‌పై అమెరికా ఇటీవలే నిషేధం విధించింది. పదవి నుంచి దిగిపోయేముందు ఒబామా ప్రభుత్వం విధించిన ఈ నిషేధాన్ని ఉత్తరకొరియా తీవ్రంగా తప్పుపడుతోంది. అధికారిక వార్త సంస్థ 'కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ'(కేసీఎన్‌ఏ) ఇంకో అడుగు ముందుకేసి తమ బాస్‌ చెల్లెలిపై నిషేధం విధించిన ఒబామాను తూర్పారపట్టింది. 'మిత్రమా ఒబామా.. నువ్వు దిగిపోవడానికి సమయం తక్కువగా ఉంది. మానవహక్కులు, అదీఇదీ అంటూ ఎందుకు టైమ్‌వేస్ట్‌ చేస్తావ్‌? సమాన్లు సర్దుకునే పనుందిగా! తొందరగా కానివ్వు' అని వ్యంగ్యసలహా ఇచ్చింది.

2011లో తండ్రి కిమ్‌జాంగ్‌-2 అంత్యక్రియలప్పుడు మీడియాకు కనిపించిన జో జాంగ్‌.. చాలా కాలంపాటు అజ్ఞాతంలోనే ఉన్నారు. గత ఏడాదిన్నర కలంగా మాత్రం కొరియా రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్నారు. ప్రస్తుతం ఆమె అధికార వర్కర్స్‌పార్టీ ఉపసంచాలకురాలిగా, అన్న కిమ్‌జాంగ్‌ ఉన్‌కు ప్రధాన సలహాదారుగా కొనసాగుతున్నారు. అమెరికా విదేశాంగ శాఖ ఇటీవలే.. ప్రపంచవ్యాప్తంగా మానవహక్కులకు విఘాతం కలిగిస్తోన్న ఏడుగురి పేర్లను ప్రకటించి, ఆక్షలు విధిస్తున్నట్లు తెలిపింది. ఆ జాబితాలో మోస్డ్‌ డేంజరస్‌ లేడీగా జో జాంగ్‌ పేరుకూడా ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement