
ముందస్తు ఓటు వేసిన ఒబామా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా శనివారం ముందస్తు ఓటు వేశారు. నవంబర్ 8న జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి సొంత నగరం షికాగోలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఎవరికి ఓటేశారన్నది వెల్లడించలేదు. ముందస్తు ఓటేసిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ఒబామా నిలిచారు. ‘ఈ రోజు ముందస్తు ఓటు వేశాను. మీరు కూడా ఓటేస్తారు కదూ’ అని ఒబామా ట్వీట్ చేశారు.