
శ్వతసౌధంలో ఆ ఫేవరెట్ నైట్స్ ముగిసిపోయాయి!
వాషింగ్టన్: గత ఎనిమిదేళ్లుగా అమెరికా అధ్యక్ష భవనం శ్వతసౌధం.. నిత్యం రాత్రి సంగీత గానాబజానాలో ఓలలాడింది. అమెరికాను ప్రభావితం చేసిన, అమెరికా సంస్కృతిని ప్రతిబింబించిన సంగీత మాధురులెన్నో వైట్‌హౌస్‌లోపలో.. ఆవరణలోని గడ్డి మైదానాలపైనో తరచూ రాత్రుళ్లు అలరించేవి. ఈ మ్యూజికల్ నైట్స్ అంటే తనకు, తన భార్య మిషెల్లీకి ఎంతో ఇష్టమని అధ్యక్షుడు బరాక్ ఒబామా చెప్పారు.
శ్వేతసౌధం ఆవరణలో శుక్రవారం రాత్రి జరిగిన తమ చివరి మ్యూజికల్ నైట్‌లో పాల్గొని.. ఆ సంగీతమాధురిని ఒబామా దంపతులు ఆస్వాదించారు. ఈ సందర్భంగా ఒబామా మాట్లాడుతూ శ్వేతసౌధంలో తాము పాల్గొనే మ్యూజికల్ నైట్స్ ముగిసిసోవడం బాధ కలిగిస్తున్నదని అన్నారు. ఈ సంగీత సంప్రదాయమంటే తమకెంతో ఇష్టమని చెప్పారు. త్వరలో అమెరికా అధ్యక్షుడిగా ఒబామా పదవీకాలం ముగిసిపోతున్న సంగతి తెలిసిందే. ‘లవ్ అండ్ హ్యాపీనెస్’ థీమ్‌తో ఒబామా చివరి మ్యూజికల్ నైట్ జరిగింది. తాను ఎన్నడూ పాటలు పాడలేదని, అయినా తనకు ‘ఆల్ గ్రీన్’ టైటిల్ వచ్చిందని ఒబామా జోక్ వేశాడు. 2012లో అధ్యక్ష అభ్యర్థిగా విరాళాల సేకరణ సందర్భంగా ’ఆల్ గ్రీన్’పాడిన ‘లెట్స్ స్టే టుగెదర్’ పాటలోని ఓపెనింగ్ లైన్స్‌ను ఒబామా పాడగా.. ఆ వీడియో వైరల్ అయింది.