సమావేశానికి హాజరైన జేసీ రాంకిషన్, డీఆర్వో భాస్కర్
రాష్ట్రంలో మహబూబ్‌నగర్ రెవెన్యూ శాఖ పనితీరు పూర్తిగా అధ్వానంగా ఉందని, ఎన్నిసార్లు చెప్పినా పనితీరులో మార్పు రావడం లేదని, ఇక లాభం లేదని, తేదీలు ఖరారు చేసి తానే స్వయంగా తహసీల్దార్లతో సమీక్షిస్తానని భూపరిపాలన శాఖ కమిషనర్ రేమండ్ పీటర్ అసహనం, అసంతప్తి వ్యక్తంచేశారు.
-
రెవెన్యూశాఖ అధికారులపై సీసీఎల్‌ఏ
-
కమిషనర్ రేమండ్ పీటర్ ఆగ్రహం
మహబూబ్‌నగర్ న్యూటౌన్: రాష్ట్రంలో మహబూబ్‌నగర్ రెవెన్యూ శాఖ పనితీరు పూర్తిగా అధ్వానంగా ఉందని, ఎన్నిసార్లు చెప్పినా పనితీరులో మార్పు రావడం లేదని, ఇక లాభం లేదని, తేదీలు ఖరారు చేసి తానే స్వయంగా తహసీల్దార్లతో సమీక్షిస్తానని భూపరిపాలన శాఖ కమిషనర్ రేమండ్ పీటర్ అసహనం, అసంతప్తి వ్యక్తంచేశారు. బుధవారం ఆయన హైదరాబాద్ నుంచి వీడియాకాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులతో సమీక్షించారు. రెక్టిఫికేషన్ మాడ్యూల్‌లో 7528 దరఖాస్తులకు మాత్రమే పరిష్కరించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. విషయంపై ప్రతిసారి చర్చిస్తున్నా పట్టించుకోవడం లేదని, తానే మండలాలకు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జేసీ వెబ్‌ల్యాండ్ సమస్య ఉందని జేసీ చెప్పడంపై.. ఎక్కడా లేని సమస్య మీకే వస్తుందా? అని ప్రశ్నించారు.
రుణఅర్హత కార్డుల దరఖాస్తులను వ్యవసాయశాఖ అధికారుల సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు. త్వరలో వ్యవసాయ శాఖ వెబ్‌సైట్‌ను వెబ్‌ల్యాండ్‌తో అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. ఇకనుంచి పంటరుణాలను వెబ్‌ల్యాండ్ ద్వారా సరిచూసుకుని ఇచ్చే విధంగా డీఎల్‌బీసీ సమావేశంలో బ్యాంకర్లకు సూచించాలని కోరారు. గ్రామాల్లో అవసరానికి మించి వీఆర్వోలను ఎందుకు ఉంచారని సీసీఎల్ కమిషనర్ రేమండ్ పీటర్ అధికారులపై మండిపడ్డారు. జిల్లాలో నందిగామ, మహబూబ్‌నగర్, ఆమనగల్లు, గద్వాల, పెబ్బేరు, కోస్గిలో అవసరానికి మించి ఎందుకు కేటాయించారని ప్రశ్నించారు. జిల్లాలో 30 శాతం వీఆర్వోల ఖాళీలు చూపిస్తూ అనవసరమైన చోట ఎక్కుమంది వీఆర్వోలను కేటాయించడంపై అసంతప్తి వ్యక్తంచేశారు. మాడ్గుల మండలం ఇర్విన్‌లో ఇద్దరు వీఆర్వోలు ఏం అవసరం ఉందని, వెంటనే ఒకరిని బదిలీచేయాలని సూచించారు. అదేవిధంగా గద్వాలలో ఇద్దరిని ఉంచి మిగతా ఇద్దరిని ఇతర గ్రామాలకు కేటాయించాలని సూచించారు. సమావేశంలో జేసీ ఎం.రాంకిషన్, డీఆర్వో భాస్కర్, సర్వే ల్యాండ్ ఏడీ శ్యాంసుందర్‌రెడ్డి, తహసీల్దార్ సువర్ణరాజు, మీసేవా సూపరింటెండెంట్ బక్క శ్రీనివాసులు పాల్గొన్నారు.