
చిన్న చిత్రానికి పెద్ద కీర్తి
తెలుగు విద్యార్థి రూపొం దించిన చిన్న చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. సినీ జగత్తులో అత్యున్నత పురస్కారం గా భావించే ఆస్కార్ లైబ్రరీలోకి ‘చేంజ్' అనే షార్ట్‌ఫిల్మ్ చేరింది.
సాక్షి, బెంగళూరు: తెలుగు విద్యార్థి రూపొం దించిన చిన్న చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. సినీ జగత్తులో అత్యున్నత పురస్కారం గా భావించే ఆస్కార్ లైబ్రరీలోకి ‘చేంజ్' అనే షార్ట్‌ఫిల్మ్ చేరింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా హిందూపురం వాసి రాజేంద్ర వి నోద్(23) ఈ షార్ట్ ఫిల్మ్‌ను రూపొందించారు. ప్రస్తుతం బెంగళూరులోని విజ్టూంజ్ కళాశాలలో మల్టీమీడియా విభాగంలో ఎమ్మెస్సీ చదువుతున్న రాజేంద్ర వినోద్ రూపొందించిన షార్ట్ ఫిల్మ్స్ పై ‘సాక్షి' ప్రత్యేక కథనం....
సమాజంలోని దురాచారాలు, మనుషుల మ నస్తత్వంలో రావాల్సిన మార్పులు... ఇలా అం శమేదైనా సరే కేవలం పదినిమిషాల నిడివిలో అందరికీ అర్థమయ్యేలా చూపించగలగడమే షార్ట్ ఫిల్మ్ మేకింగ్. చిత్రం చిన్నగానే ఉన్నా ఆ చిత్రాన్ని అంత తక్కువ నిడివితో రూపొం దించగలగడం మాత్రం చాలా క్లిష్టమైన పని. ఇందుకు ఎంతో ఓర్పుతోపాటు నైపుణ్యం కూ డా చాలా ముఖ్యం. ఇలాంటి ఓర్పు, నేర్పు, నైపుణ్యాలతో అద్భుతమైన షార్ట్ ఫిల్మ్స్‌ను రూపొందిస్తూ వినోద్ ముందుకు సాగుతున్నారు.
ఒకే ఏడాదిలో ఏడు చిన్న చిత్రాలు
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా హిందూపురం గ్రామంలో పుట్టి పెరిగిన రాజేంద్ర వినోద్ అక్కడే బి.టెక్ పూర్తి చేశారు. అనంతరం సిక్కిం మణిపాల్ యూనివర్సిటీ నుంచి ఎంఏ జర్నలిజం చేసిన రాజేంద్ర వినోద్ షార్ట్ ఫిల్మ్ మేకింగ్‌పై ఉన్న ఆసక్తితో ఈ రంగం వైపు దృష్టి సారించారు. ఒకే ఏడాదిలో రాజేంద్ర ఏడు షార్ట్ ఫిల్మ్స్‌ను రూపొందించారు. అంతేకాదు ఏడు చిన్న చిత్రాలతోపాటు ఒక డాక్యుమెంటరీని, ఒక యాడ్ ఫిల్మ్‌ని రాజేంద్ర ఇదే ఏడాదిలో రూపొందించారు. వీటిలో యాజ్ ఫర్ యాజ్, ఫియర్, ఓవర్ రియాక్షన్, ఎగ్జామ్ షార్ట్ ఫిల్మ్‌లు ఎలాంటి సంభాషణలు లేకుండా కేవలం ఆయా సన్నివేశాల భావోద్వేగాలను అనుసరించి సాగిపోతుంటాయి. ఇక పయనం పేరిట తెలుగు భాషలో సైతం ఓ షార్ట్ ఫిల్మ్‌ను రాజేంద్ర రూపొందించారు.
11భాషల్లో ‘చేంజ్'
ఇక రాజేంద్ర రూపొందించిన చిన్న చిత్రాల్లో ‘చేంజ్’ చిత్రం ఆస్కార్ లైబ్రరీ వరకు చేరుకుంది. జీవితంలో మార్పు, సాధారణ జీవితం మధ్య చిన్న పాటి తేడాను వివరిస్తూ సాగే ఏడు నిమిషాల నిడివి గల ఈ చిత్రం ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. దీంతోపా టు అత్యుత్తమ స్క్రీన్‌ప్లేకి ఆస్కార్ లైబ్రరీలో సైతం స్థానం సాధించింది. అంతేకాదు నేషనల్ స్టూడెంట్స్ ఫిల్మ్ అవార్డ్స్-14లో స్పెషల్ జ్యూరీ అవార్డును సైతం ‘చేంజ్’ సొంతం చేసుకుంది. ఈ చిత్రం 11 భాషల్లోకి సైతం అనువాదమవడం మరో విశేషం.
ఈ చిత్రాన్ని 11 భాషల్లోకి అనువదించేందుకు గాను వి జ్టూంట్ కళాశాలలో తనతోపాటు చదువుతు న్న వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులతో వినోద్ సంభాషణలు చెప్పించారు. ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిం దీ, మరాఠీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీతో పాటు ఫ్రెంచ్ భాషలోకి సైతం ఈ చిత్రం అనువాదమైంది. ఇక రాజేంద్ర రూపొందించిన లేపాక్షి డాక్యుమెంటరీ సైతం 11 భాషల్లోకి అనువదించబడింది. లేపాక్షిలోని శిల్ప సౌందర్యాన్ని కళ్లకు కట్టేలా రూపొందించిన ఈ షార్ట్ ఫిల్మ్ ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకుంది.
ఆర్వీ ఫిల్మ్స్ బ్యానర్‌పైనే నిర్మాణం
సినిమాలన్నింటిని సొంత నిర్మాణ సంస్థ పేరిటే రూపొం దించాను. నా స్నేహితులైన రవిగౌడ, ప్రవీణ్ సాగర్, పవన్‌కుమార్, ప్రవీణ్ పై, పరమేష్ కాల్య, రవికుమార్, సంతోష్‌రెడ్డిలతో కలిసి ‘ఆర్వీ ఫిల్మ్స్’ పేరిట ప్రొడక్షన్ హౌస్‌ను ఏర్పాటు చేసుకున్నాం. నాకు చిన్నప్పటి నుంచి సృజనాత్మక రంగంలో పనిచేయాలనే లక్ష్యం ఉండేది. అందుకే ఫిల్మ్‌మేకింగ్‌ని కెరీర్‌గా ఎంచుకున్నాను. ఇక సమాజానికి నా వంతుగా ఏదైనా చేయాలనే భావంతోనే షార్ట్ ఫిల్మ్‌ల రూపకల్పనను ప్రారంభించా ను. నేను రూపొందించిన ‘ఆరణి' మహిళా సాధికారత ఎంత ముఖ్యమో చెబితే, యాజ్ ఫర్ యాజ్, పయనం చిత్రాలు మా నవ సంబంధాల ప్రాముఖ్యతను చెబుతాయి. ఇక రానున్న రోజుల్లో చలనచిత్ర రంగంలో సైతం నన్ను నేను నిరూపించుకోవడమే ముందున్న లక్ష్యం.
- రాజేంద్ర వినోద్