
మీకూ చిల్లర కావాలా: హీరోయిన్
అమృత్ సర్: పెద్ద నోట్ల రద్దుతో చిల్లర దొరక్క గత కొన్ని రోజులుగా పడుతున్న ఇబ్బందులను చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా డిసెంబర్ నెల ప్రారంభమవడంతో ఈ కష్టాలు మరీ పెరిగిపోయాయి. బ్యాంకులో డబ్బున్నా చేతిలో చిల్లిగవ్వలేక సామాన్యులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఏటీఎం క్యూలలో గంటల తరబడి ప్రయత్నించి డబ్బు(రూ. 2000) దొరికినా వాటిని విడిపించడం మరో సాహసమే అవుతోంది.
ఇలాంటి సమయంలోనే దక్షిణాది హీరోయిన్ లక్ష్మీ రాయ్, తన స్నేహితురాలుతో కలిసి పంజాబ్లోని అమృత్ సర్లో చక్కర్లు కొడుతోంది. అంతేనా ఏకంగా రూ.10 నోట్లతో చేసిన దండలను లక్ష్మీరాయ్, తన స్నేహితురాలు హారంగా ధరించి.. మనీ హై తో హనీ హై అంటూ ఓ క్యాప్షన్ కూడా పెట్టేసింది. ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పు తీసుకు వచ్చే నోట్ల రద్దు నిర్ణయంతో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నా చిల్లరలో మాత్రం ఎలాంటి మార్పు లేదని నటి లక్ష్మీరాయ్ పేర్కొంది. అంతేనా చిన్న నోట్ల దండలతో అలంకరించుకుని మరీ మీకూ చిల్లర కావాలా అంటూ...సరదాగా తన ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టింది.