
న్యూఢిల్లీ: జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ పేరు ఇక జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌గా మారనుంది. ఈ ప్రతిపాదనకు సంబంధించి షేర్‌హోల్డర్ల నుంచి అనుమతి తీసుకోనున్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు కంపెనీ తెలియజేసింది.
ఎలక్ట్రానిక్ విధానంలో ఓటింగ్ జులై 29న ప్రారంభమై ఆగస్టు 27న ముగుస్తుందని వివరించింది. హైదరాబాద్, ఢిల్లీ ఎయిర్‌పోర్టులతో పాటు ఫిలిప్పీన్స్‌లోని మక్టాన్ సెబు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను కూడా జీఎంఆర్ గ్రూప్ నిర్వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment