విశాఖలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. మరో కాశ్మీర్‌ను తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
చింతపల్లి(విశాఖపట్నం జిల్లా): విశాఖలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. మరో కాశ్మీర్‌ను తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం ఉదయం అత్యల్పంగా లంబసింగిలో 7 డిగ్రీలు, చింతపల్లిలో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. లంబసింగిలో ఒక్క రోజే 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు పడిపోవడం గమనర్హం. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశముండవచ్చునని వాతావారణ నిపుణులు పేర్కొంటున్నారు.