కాంక్రీట్ ప్రపంచం.. ఉరుకులు.. పరుగుల జీవితాలు.. తెల్లారింది మొదలు పొద్దుగూకే వరకూ హడావిడి. ప్రతిరోజూ ఒకేలా సాగుతున్న పనితో బోర్ కొట్టేస్తోందా? ఉద్యోగంలోనూ కొత్తదనం కనిపించడం లేదా? వర్క్ మీద ధ్యాస పెట్టలేక పోతున్నారా? అటువంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే కొత్త విషయాలను తెలుసుకోవడం ఎంతో అవసరం.
అందుకు ఒక్కటే మార్గం అని చెప్తున్నారు. ప్రముఖ ఫ్రీలాన్స్ ఫిల్మ్ మేకర్... బాతుల్ కాప్సీ. ఆయన సృష్టించి యూట్యూబ్ లో పోస్ట్ చేసిన వీడియో చూస్తే చాలట. అందులో మీకు అద్భుతం ఏమీ కనిపించకపోయినా జీవితం పట్ల మీ అవగాహనే పూర్తిగా మారిపోతుందని చెప్తున్నారు. మరి మీరూ ఆ మార్పును కోరుకునేవారైతే ఇంకెందుకాలస్యం... ఆ వీడియో చూసేయ్యండి.